అనుభవాలు:
ప్రీతిషెనాయ్ పుస్తకం: టీ ఫర్ టూ అండ్ ఏ పీస్ ఆఫ్ కేక్ప్రచురణ సంస్థ: ర్యాండమ్ హౌస్ ఇండియాకేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో చదువుతూ దేశమంతా తిరిగింది ప్రీతి. అన్ని రాష్ట్రాల సంస్కృతులు, పరిస్థితులు ఆకళింపు చేసుకుంది. తను గమనించిన అంశాలను మొదటిసారి బ్లాగులో రాసింది. లక్షల క్లిక్స్ వచ్చాయి. ఇది గమనించి ఓ ప్రముఖ పత్రిక ప్రత్యేక కాలమ్ నిర్వహించమంది. అక్కడా హిట్టే. ఆ ఉత్సాహంతో 2008లో తొలిసారి నవలకి శ్రీకారం చుట్టింది. ఇప్పటికి నాలుగు రాసింది. అన్నీ బెస్ట్ సెల్లర్సే. తాజా రచన లక్ష కాపీలు అమ్ముడైంది. ఆమె ప్రతి రచనలో కథాంశం యువతకి నచ్చే ప్రేమ, రొమాన్స్, స్నేహం, కెరీర్, కష్టాల్ని ఎదిరించి గెలిచిన అమ్మాయి ధీరత్వం ఉంటాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రీతిని 'ఎక్సలెంట్ స్టోరీ టెల్లింగ్ స్కిల్స్ ఉన్న రచయిత్రి'గా పొగిడితే, అభిమానులు ఆమెని మాటల మ్యాజిక్‌గా అభి వర్ణిస్తారు.