బతుకమ్మలతో నగరానికి కొత్త శోభ
బతుకమ్మ సంబురాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణ ఆడపడచులంతా బతుకమ్మలతో సాగర తీరం వైపు అడుగులేస్తున్నారు. బతుకమ్మ పాటలతో నగరమంతా సందడిగా మారింది. ఉయ్యాల, కొలాటం పాటలతో నృత్యాలు చేస్తూ, డప్పు వాయిద్యాలతో ట్యాంక్‌బండ్ మార్మోగుతోంది. విద్యుత్ కాంతులతో సాగర తీరం మిరుమిట్లు గొలిపేలా ప్రకాశిస్తుంది.
బతుకమ్మశుభాకాంక్షలు...