1993 ముంబై పేలుళ్లపై సుప్రీం కోర్టు తీర్పు
1993 ముంబై పేలుళ్లపై సుప్రీం కోర్టు మార్చి 21న అంతిమతీర్పునిచ్చింది. ఈ దాడులకు కుట్రపన్నిన యాకూబ్ అబ్దుల్ రజాక్ మెమెన్‌కు కోర్టు మరణ శిక్షను ఖరారు చేసింది. మరో పది మంది నిందితులకు టాడా కోర్టు విధించిన మరణశిక్షను యూవజ్జీవ శిక్షగా మార్పు చేసింది. మరో 25 మందికి యావజ్జీవ శిక్షను ఖరారు చేసింది. అక్రమంగా ఆయుధాలను కలిగి ఉన్నాడనే కేసులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు టాడా కోర్టు విధించిన ఆరేళ్ల జైలు శిక్షను కోర్టు ఐదేళ్లకు తగ్గించింది. ఈ కేసులో సంజయ్‌దత్ ఇప్పటికే ఏడాదిన్నరపాటు శిక్ష అనుభవించారు. పేలుళ్లకు తెప్పించిన ఆయుధాల కన్‌సైన్‌మెంట్‌లోని ఆయుధాలనే సంజయ్‌దత్ అక్రమంగా పొందాడని కోర్టు నిర్థారించింది. 1993 ముంబై పేలుళ్లలో 257 మంది మరణించగా, 713 మంది గాయపడ్డారు.
--