క్షయ వ్యాధి
టి.బి. (క్షయ) అంటే ఏమిటి?
ఇది మైక్రో బాక్టీరియా టుబరంక్యులోసిన్ అనే బాక్టీరియా వలన వచ్చే అంటువ్యాధి. ఈ క్షయ క్రిములు ముఖ్యంగా ఊపిరితిత్తులలో ప్రవేశించి శ్వాసకోశ క్షయవ్యాధిని కలుగచేస్తాయి. ఈ శ్వాసకోశ క్షయ చాలా తీవ్రమైన అంటువ్యాధి. శరీరంలోని ఇతర భాగాలకి కూడా క్షయ వ్యాధి రావచ్చు. అనగా శ్వాసకోశేతర భాగాలు ఎముకలు, కీళ్ళు, లింపు గ్రంధులు, మెదటు పొరలు, మూత్ర పిండాలు, గర్భ సంచి మొదలైనవి.
వ్యాధి లక్షణాలు :
- మూడు వారాలకి పైగా దగ్గు, కఫం
- సాయంత్రం, రాత్రి సమయాలలో జ్వరం
- బరువు తగ్గుట, ఆకలి తగ్గుట
- దగ్గు కఫంతోపాటు రక్తంపడుతుంది
- క్షయ క్రిములు గాలి ద్వారా వ్యాపించుతాయి
- క్షయ వ్యాధి గ్రస్తుడు దగ్గినపుడు, అతని ఊపిరితిత్తుల నుండి వచ్చే కఫం ద్వారా ఈ బాక్టీరియా గాలిలో చేరి, దగ్గరలో ఉన్న ఆరోగ్యవంతమైన మనిషి పీల్చే గాలితోపాటు అతని ఊపిరితిత్తుల లోనికి ప్రవేశించి జబ్బుకి పునాది వేస్తుంది.
నిరోధక చర్యలు :
- క్షయరోగి దగ్గినప్పుడు నోటికి అడ్డుపెట్టుకోవాలి.
- దగ్గినపుడు వచ్చే కఫం ఒక పాత్రలోనికి పట్టి కాల్చివేయాలి. ఎక్కడ పడితే అక్కడ ఉమ్మకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
- నిరోధక చర్యగా చిన్న పిల్లలకి బి.సి.జి. టీకా ఇప్పించాలి.
- గ్రామంలో గుర్తించబడిన రోగులను తరచూ పరామర్శిస్తూ వారు పూర్తిగా మందులు వాడేటట్లు సమ్మతింపచేయాలి.
- రెండు నెలలు వాడిన తరువాత వ్యాధి లక్షణాలు తక్కువయితే, వ్యాధినయమైందని మందులు ఆపకుండా చూడాలి. దీనివలన వ్యాధి తీవ్రతరం అవుతుందని హెచ్చరించాలి.
- పి.హెచ్.సి. సిబ్బంది కాని డిస్ర్టిక్ట్ ట్యూబర్ క్యులోసిస్ సెంటర్ సిబ్బంది కాని అందరు క్షయవ్యాధి రోగులు తమతమ గ్రామం నుంచి క్రమంగా చికిత్స పొందుతున్నారో లేదో కనిపెట్టి ఉండాలి. వీరితో సహకరించాలి.
- రోగికి పూర్తిగా నయం అయ్యేవరకు నిర్ణయించిన సమయంలో తప్పకుండా కఫం పరీక్ష జరిగేలా చూడాలి.
- ప్రతి టి.బి. పేషంటు ను రిజిష్టరు చేయించడం, అతని సంబంధిత కుటుంబ సభ్యులకి కఫం పరీక్ష చేయించి ఈ రిజల్ట్స్ కార్డులో నమోదు చేయించాలి.
క్షయవ్యాధి చికిత్స, వైద్య సేవలు, ప్రాథమిక ఆరోగ్య కార్యక్రమాలలో భాగంగా ఆరోగ్య కేంద్రాలలోనే అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం రివైజ్డ్ టి.బి. కంట్రోలు ప్రోగ్రాంని ప్రభుత్వం అమలు పరుస్తోంది
క్షయవ్యాధి రావడానికి గల కారణము ఏమిటి?
క్షయవ్యాధి వంశపారంపర్యంగా సంక్రమించదు. ఇది ఒక అంటువ్యాధి. ఏ వ్యక్తికైనా క్షయవ్యాధిసోకే ప్రమాదం ఉంది. క్షయవ్యాధి సోకిన రోగి, ముఖ్యంగా వ్యాధి చుఱకైన దశలో వున్నవారు బహిరంగంగా దగ్గినా, తుమ్మినా వ్యాధికి కారణమైన సూక్ష్మక్రిములు గాలిలో వ్యాపిస్తాయి. చుట్టుప్రక్కల ఉన్న ఏ వ్యక్తులైన ఈ క్రిములను శ్వాసద్వారా పీల్చుకోవడం సంభవిస్తే వారికివ్యాధి సోకే అవకాశాలు అధికంగా వుంటాయి. ఈవ్యాధి లో కనబడే లక్షణాలు ఏమిటి?
|