మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
Is this blog?
భారతీయులం
1993 ముంబై పేలుళ్లపై సుప్రీం కోర్టు మార్చి 21న అంతిమతీర్పునిచ్చింది. ఈ దాడులకు కుట్రపన్నిన యాకూబ్ అబ్దుల్ రజాక్ మెమెన్‌కు కోర్టు మరణ శిక్షను ఖరారు చేసింది. మరో పది మంది నిందితులకు టాడా కోర్టు విధించిన మరణశిక్షను యూవజ్జీవ శిక్షగా మార్పు చేసింది. మరో 25 మందికి యావజ్జీవ శిక్షను ఖరారు చేసింది. అక్రమంగా ఆయుధాలను కలిగి ఉన్నాడనే కేసులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు టాడా కోర్టు విధించిన ఆరేళ్ల జైలు శిక్షను కోర్టు ఐదేళ్లకు తగ్గించింది. ఈ కేసులో సంజయ్‌దత్ ఇప్పటికే ఏడాదిన్నరపాటు శిక్ష అనుభవించారు. పేలుళ్లకు తెప్పించిన ఆయుధాల కన్‌సైన్‌మెంట్‌లోని ఆయుధాలనే సంజయ్‌దత్ అక్రమంగా పొందాడని కోర్టు నిర్థారించింది. 1993 ముంబై పేలుళ్లలో 257 మంది మరణించగా, 713 మంది గాయపడ్డారు.
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
అత్యాచార నిరోధక బిల్లుకు మార్చి 19న లోక్‌సభ ఆమోదం తెలిపింది. 'క్రిమినల్ చట్టాల సవరణ బిల్లు -2013' పేరుతో ఈ బిల్లును తీసుకువచ్చారు. ఈ బిల్లు ప్రకారం అత్యాచారాలు, సామూహిక అత్యాచారాలకు పాల్పడితే దోషికి కనీసం 20 ఏళ్ల జైలుశిక్ష, అవసరమైతే చనిపోయేంత వరకు జైలుశిక్ష విధిస్తారు. రెండోసారి అదే నేరానికి పాల్పడితే మరణశిక్ష విధిస్తారు. పరస్పర ఆమోదంతో శంగారానికి వయోపరిమితిని 18 ఏళ్లుగా నిర్ణయించారు. మహిళలను వెంటాడటం, శంగారంలో ఉన్న వారిని చూడటం వంటి వాటిని శిక్షార్హమైన నేరాలుగా ప్రకటించారు. యాసిడ్ దాడులకు పాల్పడితే 10 సంవత్సరాల జైలు శిక్ష వంటివి బిల్లులోని ప్రధానాంశాలు.
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
ఫెమీనా మిస్ ఇండియా -2013గా నవనీత్ కౌర్ ధిల్లాన్ (చండీఘడ్) ఎంపికైంది. ఈ పోటీలో తొలి రన్నరప్‌గా విశాఖపట్నంకు చెందిన శోభితా ధూళిపాళ నిలిచింది. ఈమెను మిస్ ఇండియా ఎర్త్ 2013గా, రెండో రన్నరప్‌గా నిలిచిన జోయా అఫ్రోజ్(లక్నో)ను మిస్ ఇండియా ఇంటర్నేషనల్ 2013గా ప్రకటించారు.
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
హైదరాబాద్ మెట్రో రైలు (హెచ్‌ఎంఆర్)కు 'బెస్ట్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ ఆఫ్ ది ఇయర్' అవార్డు లభించింది. ఈ పురస్కారాన్ని హెచ్‌ఎంఆర్ ఎండీ ఏవీఎస్ రెడ్డి న్యూయార్క్‌లో జరిగిన ఆరో వార్షిక 'గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫోరమ్' కాన్ఫరెన్స్‌లో ఫిబ్రవరి 28న అందుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 100 ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌ల నుంచి హెచ్‌ఎంఆర్‌ను గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫోరమ్ ఎంపిక చేసింది.
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
గోదావరి నదిపై మహారాష్ట్ర నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు ఫిబ్రవరి 28న తీర్పునిచ్చింది. బాబ్లీని కూల్చివేసేలా ఆదేశాలివ్వాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. బాబ్లీ ప్రాజెక్టు నుంచి 2.74 టీఎంసీల నీటిని మాత్రమే మహారాష్ట్ర వినియోగించుకోవాలని సూచించింది. వర్షాకాలమంతా ప్రాజెక్టు గేట్లు తెరిచే ఉంచాలని, వర్షాకాలంలో నదీ ప్రవాహానికి అడ్డంకి కల్పించరాదని కోర్టు పేర్కొంది. అంతేకాకుండా నీటి పంపకాన్ని పర్యవేక్షించేందుకు ఒకకమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల నుంచి ఒక్కొక్కరు, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నుంచి మరొకరు సభ్యులుగా ఉంటారని తెలిపింది. కమిటీ చైర్మన్‌గా సీడబ్ల్యూసీ సభ్యుడు వ్యవహరిస్తారని చెప్పింది. ప్రాజెక్టు నిర్వహణపై కమిటీకి దిశానిర్దేశం చేసింది. 1975లో ఇరు రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు 60 టీఎంసీల పరిమితికి లోబడే మహారాష్ట్ర నీటిని వాడుకుంటోందని అభిప్రాయపడింది. పోచంపాడు రిజర్వాయర్ పరిధిలో 0.6 టీఎంసీల నీటిని వాడుకుంటున్నందున, అంతే పరిమాణంలో నీటిని మహారాష్ట్ర మార్చి 1న ఏపీకి విడుదల చేయాలని ఆదేశాలిచ్చింది. శ్రీరాంసాగర్ ముంపు ప్రాంతంలో మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని 2005లో చేపట్టింది. దీన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2006లో పిటిషన్ దాఖలు చేసింది.
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
జాతీయ పర్యాటక అవార్డుల్లో భాగంగా 2011-12 ఏడాదికిగాను ఉత్తమ వారసత్వ నగరం విభాగంలో వరంగల్ నగరానికి అవార్డు దక్కింది. ఈ విషయాన్ని కేంద్ర పర్యాటక శాఖ ప్రకటించింది. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం, వారసత్వ సంపదను కాపాడటం, పర్యాటకరంగ ఉద్యోగులకు నైపుణ్యం పెంచడం, పర్యాటకులకు ఆతిథ్య సేవల విస్తరణ, భద్రతను కల్పించేందుకు టూరిజం, పోలీస్ వ్యవస్థను పటిష్ట పరచడం వంటి అంశాలాధారంగా వరంగల్‌కు ఈ పురస్కారం దక్కింది.
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
తెలుగు భాష, సంస్కతిని పరిరక్షిస్తూ, భావితరాలకు అందించేందుకుగాను ప్రపంచ తెలుగు మహాసభల్లో చేసిన తీర్మానాల మేరకు 2013ను 'తెలుగు భాష, సాంస్కతిక వికాస సంవత్సరం'గా అమలు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మార్చి 14న సాంస్కతికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
క్షయ వ్యాధి
టి.బి. (క్షయ) అంటే ఏమిటి?
ఇది మైక్రో బాక్టీరియా టుబరంక్యులోసిన్ అనే బాక్టీరియా వలన వచ్చే అంటువ్యాధి. ఈ క్షయ క్రిములు ముఖ్యంగా ఊపిరితిత్తులలో ప్రవేశించి శ్వాసకోశ క్షయవ్యాధిని కలుగచేస్తాయి. ఈ శ్వాసకోశ క్షయ చాలా తీవ్రమైన అంటువ్యాధి. శరీరంలోని ఇతర భాగాలకి కూడా క్షయ వ్యాధి రావచ్చు. అనగా శ్వాసకోశేతర భాగాలు ఎముకలు, కీళ్ళు, లింపు గ్రంధులు, మెదటు పొరలు, మూత్ర పిండాలు, గర్భ సంచి మొదలైనవి.
వ్యాధి లక్షణాలు :
- మూడు వారాలకి పైగా దగ్గు, కఫం
- సాయంత్రం, రాత్రి సమయాలలో జ్వరం
- బరువు తగ్గుట, ఆకలి తగ్గుట
- దగ్గు కఫంతోపాటు రక్తంపడుతుంది
- క్షయ క్రిములు గాలి ద్వారా వ్యాపించుతాయి
- క్షయ వ్యాధి గ్రస్తుడు దగ్గినపుడు, అతని ఊపిరితిత్తుల నుండి వచ్చే కఫం ద్వారా ఈ బాక్టీరియా గాలిలో చేరి, దగ్గరలో ఉన్న ఆరోగ్యవంతమైన మనిషి పీల్చే గాలితోపాటు అతని ఊపిరితిత్తుల లోనికి ప్రవేశించి జబ్బుకి పునాది వేస్తుంది.
నిరోధక చర్యలు :
- క్షయరోగి దగ్గినప్పుడు నోటికి అడ్డుపెట్టుకోవాలి.
- దగ్గినపుడు వచ్చే కఫం ఒక పాత్రలోనికి పట్టి కాల్చివేయాలి. ఎక్కడ పడితే అక్కడ ఉమ్మకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
- నిరోధక చర్యగా చిన్న పిల్లలకి బి.సి.జి. టీకా ఇప్పించాలి.
- గ్రామంలో గుర్తించబడిన రోగులను తరచూ పరామర్శిస్తూ వారు పూర్తిగా మందులు వాడేటట్లు సమ్మతింపచేయాలి.
- రెండు నెలలు వాడిన తరువాత వ్యాధి లక్షణాలు తక్కువయితే, వ్యాధినయమైందని మందులు ఆపకుండా చూడాలి. దీనివలన వ్యాధి తీవ్రతరం అవుతుందని హెచ్చరించాలి.
- పి.హెచ్.సి. సిబ్బంది కాని డిస్ర్టిక్ట్ ట్యూబర్ క్యులోసిస్ సెంటర్ సిబ్బంది కాని అందరు క్షయవ్యాధి రోగులు తమతమ గ్రామం నుంచి క్రమంగా చికిత్స పొందుతున్నారో లేదో కనిపెట్టి ఉండాలి. వీరితో సహకరించాలి.
- రోగికి పూర్తిగా నయం అయ్యేవరకు నిర్ణయించిన సమయంలో తప్పకుండా కఫం పరీక్ష జరిగేలా చూడాలి.
- ప్రతి టి.బి. పేషంటు ను రిజిష్టరు చేయించడం, అతని సంబంధిత కుటుంబ సభ్యులకి కఫం పరీక్ష చేయించి ఈ రిజల్ట్స్ కార్డులో నమోదు చేయించాలి.
క్షయవ్యాధి చికిత్స, వైద్య సేవలు, ప్రాథమిక ఆరోగ్య కార్యక్రమాలలో భాగంగా ఆరోగ్య కేంద్రాలలోనే అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం రివైజ్డ్ టి.బి. కంట్రోలు ప్రోగ్రాంని ప్రభుత్వం అమలు పరుస్తోంది
క్షయవ్యాధి రావడానికి గల కారణము ఏమిటి?
క్షయవ్యాధి వంశపారంపర్యంగా సంక్రమించదు. ఇది ఒక అంటువ్యాధి. ఏ వ్యక్తికైనా క్షయవ్యాధిసోకే ప్రమాదం ఉంది. క్షయవ్యాధి సోకిన రోగి, ముఖ్యంగా వ్యాధి చుఱకైన దశలో వున్నవారు బహిరంగంగా దగ్గినా, తుమ్మినా వ్యాధికి కారణమైన సూక్ష్మక్రిములు గాలిలో వ్యాపిస్తాయి. చుట్టుప్రక్కల ఉన్న ఏ వ్యక్తులైన ఈ క్రిములను శ్వాసద్వారా పీల్చుకోవడం సంభవిస్తే వారికివ్యాధి సోకే అవకాశాలు అధికంగా వుంటాయి. ఈవ్యాధి లో కనబడే లక్షణాలు ఏమిటి?
|
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
క్షయ వ్యాధి : అవగాహన |
నేడు ప్రపంచ క్షయ వ్యాధి దినం మన దేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద ప్రజారోగ్య ప్రాణాంతక సమస్య క్షయ. ఈ వ్యాధి మైకోబ్యాక్టీరియం ట్యుబర్‌క్యులోసిస్ అనే సూక్షక్రిమి ద్వారా వ్యాపిస్తుంది. వయస్సు, లింగభేదం లేకుండా ఈ వ్యాధి ఎరికైనా రావచ్చు. క్షయక్రిమికి ఆక్సిజన్ అవసరం కనుక ఇది సాధారణంగా ఆక్సిజన్ ఎక్కువగా లభించే ఊపిరితిత్తులకు సోకుతుంది. దీనిని శ్వాసకోశ క్షయ లేదా పల్మొనరీ టి.బి. అంటారు. Very good Article from Vaartha. |
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
Archives
-
▼
2013
(185)
-
▼
March
(16)
- endhaka nee payanam ?
- 1993 mumbai pellulapai supreme court teerpu
- atyachaara nirodhaka billuku loksabha aamodam
- miss india 2013ga navaneeth koir
- cheppukoleni baada aa pillalidi..idhi mana rastram...
- manchi samethalu telugu lo
- హైదరాబాద్ మెట్రోకు అవార్డు
- బాబ్లీ ప్రాజెక్టుపై సుప్రీం కోర్టు తీర్పు
- వరంగల్‌కు ఉత్తమ వారసత్వ నగరం అవార్డు
- ‘తెలుగు భాష, సాంస్కతిక వికాస సంవత్సరం’గా 2013
- తొలి మిహళా తపాలా కార్యాలయం
- T.B ante enti ? vaati vivaraalu .. టి.బి. (క్షయ) అ...
- world tb day ప్రపంచ క్షయ వ్యాధి దినం
- Prapancha Neeti Dinochhavam ప్రపంచ నీటి దినోత్సవం
- Aksharaalanni kudabetti ...rasaam rastaam raastune...
- vaanaku tadichina puvvokati raalipadindi baavilo..!
-
▼
March
(16)
Total Pageviews
Followers
ప్రచారం
Popular Posts
-
వరకట్న నిషేధం సమాజంలో వరకట్నమనేది సామాజిక దురాచారం. దీని వలన స్త్రీలపై ఊహకందని రీతిలో చిత్రహింసలు, నేరాలు జరుగుతున్నాయి. సమాజంలోగల అన్నివర...
-
చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కాని ఒక మంచి పుస్తకం కొనుక్కో : కందుకూరి వేరేశలింగం. @ భారతీయులం
-
మీరు ఇంటర్నెట్ లో డబ్బులు ఎలా సంపాదించాలి అంటూ ఆలోచిస్తున్నారా ? రోజు రోజు ఇంటర్నెట్ వినియోగం ఎక్కువగా ఉంది ఈరోజుల్లో...ఐతే తొలి ఇండియన్ వె...
-
రైతు లేనిదే ప్రపంచం లేదు - జగమెరిగిన సత్యం. కాని వారిపైనే చిన్న చూపు, రైతు ఆత్మహత్యలు చేసుకునే దాకా దిగజారిన పరిస్థితులు.
-
భారతీయులం ఇక్కడ క్లిక్ చేసి మొదలు పెట్టండి మీ సంపాదన ఇంటర్నెట్ లో. మిత్రులారా మీకు తెలుసా ? ఇంటర్నెట్ ద్వారా డబ్బులు ఎలా సంపాదించ వచ్చు ...
-
పుట్టిన వాడు మరణించక తప్పదు అలాగే మరణించినవాడు తిరిగి జన్మించకా తప్పదు, అనివార్యమగు ఈ విషయమును గూర్చి చింతించుట అనవసరం. - గీత(భగవద్గీత) గీతల...
-
యోగ విద్య నభ్యసించుటకు వయో పరిమితి లేదు. ఏ వయస్సు వారైనను యోగ విద్య నభ్యసించ వచ్చును. కాన స్త్రీ, పురుషులెల్లరు వయోభేదము లేక, యోగ విద్య నభ్య...
-
జూన్ 5వ తేదీని "ప్రపంచ పర్యావరణ దినోత్సవం"గా పాటిస్తున్నారు. ఈ పర్యావరణ దినోత్సవం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీచే 1972, జూన్ 5వ తే...
-
చరిత్రలో ఈ రోజు - May 1 1906: మే డే కోసం జరుపుతున్న ఆందోళనలో, పారిస్ దళలు చాలామందిని నిర్బంధించాయి (ఆరెస్టు). మే దినోత్సవం లేదా మే డే (May D...
-
శుభోదయం నేస్తం !@ "భారతీయులం" " భారతీయులం " |.:: bharatiyulam.blogspot.in ::.