హైదరాబాద్ కూడా ఒక ప్రత్యేక రాష్ట్రము ఒక్కప్పుడు, ముగ్హల్ వారి పాలన లో హైదరాబాద్ ని ప్రత్యేకంగా చేయాలన్నదే వారి ఆకాంక్ష ! అందుకోసం వారు చాలా నియమాలు అమలుపరిచారు.
మరి ఈనాడు విదిపోదాము అని చేస్తున్న కొన్ని రాజకీయనాయకుల మాటలు విన్నాక, చార్మినార్ దెగ్గర ఉన్న ఒక పార్టీ అందరు ఏకం అయ్యి మరి హైదరాబాద్ ని కూడా ప్రత్యేక రాష్ట్రము చేయండి విడిపోయే ఉద్దేశం ఉంటె అని కోరారు శ్రీ కృష్ణ కమిటీ కి వినతి పత్రం కూడా అందచేసారు అంట.
అయినా ఇప్పుడు మన చుట్టూ ఉన్న రాజకీయనాయకులు ఎందుకు హైదరాబాద్ మాకు కావలి అంటూ ఒకరిమీద ఒకరు గొడవలకు దిగుతున్నారు ?
హైదరాబాద్, ఇది ఒక భారి పెట్టుబడుల స్థలం మరియు రాబడి కూడా ఎక్కువే,ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకట్టుకున్తున్నది హైదరాబాద్ వివిధ కంపెనీలు బారి పెట్టుబడులు పెట్టడానికి సిద్దంగా ఉన్నారు మరి ఇలాంటి బంగారు బాతు గుడ్డు పెట్టె హైదరాబాద్ ఎవరికీ వొద్దు. అటు అభివ్రుది మరియు బోలెడు డబ్బులు తెచిపెట్టే ఈ హైదరాబాద్ అందరికి కావలి కదా అదే ఇప్పుడు అసలు సమస్య ఇటు అన్ని రాజకీయ పార్టీల అందరి గొడవ భాతు గుడ్డు ని వదులు కోలేక మరియు తమ పెట్టుబడులు లో పెట్టిన డబ్బులు పోతాయి అని మరి కొందరు.
యూనియన్ టెర్రిటరీ చేయడానికి హైదరాబాద్ ని చేయడం తప్ప మరో ఆలోచన ఇప్పటి ప్రభుత్వం దెగ్గర లేదు. అటు ఒక ప్రాంతం వారిని కించపరచకుండా ఒకరు తక్కువ కాదు మరొకరు ఎక్కువ కాదు...ఈ రాజకీయనాయకులు తమ స్వార్ద ప్రయోజనాల కోసం చేసే ప్రయత్నాలకు ఎదురు చెప్పేలా.
జనాలకి ఉపయోగ పడే పనులు చేసి రాజకేయనాయకులు అనే పదానికి విలువ పెంచండి. నాయకుడి లక్షణాలు అంటే ఏంటో తెలుసుకోండి మరియు జనాల్లో నమ్మకాన్ని పెంచండి డబ్బులు కోసం నమ్మకాని తాకట్టుపెట్టుకోకండి మరియు అమ్ముడుపోకండి.