Is this blog?

భారతీయులం

భారతీయులం |protest of indians, we are indians
Home » June 2012
ఇన్నేల్ల స్వాతంత్ర్య సమ్రాజ్యం లొ మనం సంపదిచుకున్న గణత….? ఓటు కోసమే నోటి మాటలు, గెలిచె వరకె నీతి మాటలు. ప్రజాధనం కొల్లగోట్టే దోపిడిదొంగలు, ప్రజలకేమో చేస్తారు ఒంగిదండాలు.

ఇన్నేల్ల స్వాతంత్ర్య సమ్రాజ్యం లొ మనం సంపదిచుకున్న గణత….?
మా దగ్గర ఎంత ఒర్పు వుందొ చూడండి సున్నలను మాత్రమె పెచుతున్నాం అక్కెలను కాదు
మా దగ్గర ఎంత ఒర్పు వుందొ చూడండి సున్నలను మాత్రమె పెచుతున్నాం అక్కెలను కాదు
అవసరమయితె ఇంక్క ఓర్పుతొ ఇ సున్నల్ని పెంచూతం దినికి మీందరి మద్దతు కవాలి.....
ఓటు కోసమే నోటి మాటలు, గెలిచె వరకె నీతి మాటలు. ప్రజాధనం కొల్లగోట్టే దోపిడిదొంగలు, ప్రజలకేమో చేస్తారు ఒంగిదండాలు.
అతివినయం చూపించే రాక్ససరాబంధువులు పదవుల కోసమే ఈ పకడ్బందీలు రోజుకోకటి పుట్టుకచ్చె పార్టీ జెండాలు, ప్రజాసంపధ కాజేయడామే వారి ఎజెండాలు.
పదవి చేతికిప్పించే ప్రజలు అమాయకులు, పెదవిమాట దాటేసే రాజకీయ నాయకులు. మార్పుకోసమే ఎదురుచూసే పిచ్ఛిజనాలు, ఏనాటికి జరగవవి, ఇవి పచ్ఛినిజాలు.
Jai ho india....HAM KHABI NAHI AGE JAENGE! 
@ భారతీయులం | SathishRaj Garu
 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

మేము ఇ భరతమాత ఒడిలొ పురుడుపొసుకున్నందుకు మాజన్మ పుణ్నితం..ప్రతి మనిషి బ్రతికెది జానెడు కడుపుకొసం అంట్టారె మారి మాకడుపులు మాత్రమె ఎందుకు ఎండుతున్నవి

మేము ఇ భరతమాత ఒడిలొ పురుడుపొసుకున్నందుకు మాజన్మ పుణ్నితం
ప్రతి మనిషి బ్రతికెది జానెడు కడుపుకొసం అంట్టారె మారి మాకడుపులు మాత్రమె ఎందుకు ఎండుతున్నవి
మేము అనాదలుగా పుట్టడమెన మేము చెసిన పాపం
బుక్కెడు బువ్వకు నోచుకోని మా బాల హ్రుదయానికి దిక్కెవ...్వరు 
నా అనెవాల్లు లెకున్న ఇ పుణ్యభూమె మాకు ఒడి అయ్యింది
ఆకలెస్తె అన్నం పెట్టడానికి చెత్తకుప్ప మాకు అమ్మ అయింది
అక్షరాలు నేర్చుకునె వయ్యస్సులొ మనిషిలా జీవించరా అని …. 
నీకొరకు ఎ మనిషి రాడనీ కష్టమె నీ జీవితానికి అయిదం అని జీవితాక్సరం నేర్పి మాకు బడి అయ్యింది
కాని ఎనాడు మరువలెదు మేము ఇ భరతమాత బిడ్డలమని
ఎందుకంట్టె మాకు ఇంత స్వేచ్చస్వాతంత్ర్యం ఇచ్చిన అమ్మ ఒడిని ఎవరయినమరుస్తార….?
అమ్మ భరతమాత మాకు మల్లిగనుక జన్మంటువుంట్టె నీబిడ్డలుగానె పుట్టాలని దీవించ్చమ్మ
ఎటువంట్టి ఆదరం లెకున్న మెము బ్రతికేల్లదిస్త్తున్నమే 
మీలొ ఎందరొ మహొన్నత చదువులు చదివి ఎందరొ మహనుబావులయ్యరే 
భారతధేషం అబివ్రుది చేందుతున్న దేషం అంట్టరే అవినితిలొ తప్పమరి ఎందులొఅబివ్రుది చెందింది ఈ ధెషం 
రాబొయె తారనికి రాబొయె తారనికి అని ఇక్కెన్ని తారలు ఇలగె కాలాన్నిగడిపెస్త్తారు....? 
జై హింద్...... జైభారత్.......
@ భారతీయులం | SathishRaj Garu 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

మన షత్రుదెషమయిన పాకిస్తాన్లొ ఒక అమ్మయిని మానబంగ్గం చెసారని ఐదుగురిని నడి రొడ్డు పై వురి తీసారు...

మన షత్రుదెషమయిన పాకిస్తాన్లొ ఒక అమ్మయిని మానబంగ్గం చెసారని ఐదుగురిని నడి రొడ్డు పై వురి తీసారు
మన భారతధేషంలొ ఎందరొ అమయకులను పొట్టన పెట్టుకున్న కసబుని ఇంత వరకు మన న్యాయస్తనం ఎంచెసింది ఇదెన మనం కొరుకునె న్యాయవ్యవస్థ ఇదెన మన ధెషన్యాయవ్యవస్థ ఒక్కసారి అలొచించండి ఇంత పెద్ద తప్పుచెసిన వాడిని ఇంక్క ఎందుకు షిక్షించకుండ మన ప్రబుత్వం కొట్లు కర్చుపెట్టి వాడిని పొషిస్తుంది వీడివెనుక ఎవరి హస్తం వుండివుంట్టది @ భారతీయులం | SathishRaj Garu 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

నీరు నాగరికత నేర్పుతుంది... మరి కరువు ? బతుకు చిత్రాన్ని మార్చేస్తుంది !! ముసలి వయసు లో కుడా తప్పని తిప్పలు...కూటి కోసం కోటి తిప్పలు అంటే ఇదేనేమో ?

నీరు నాగరికత నేర్పుతుంది...
మరి కరువు ? బతుకు చిత్రాన్ని మార్చేస్తుంది !!
ముసలి వయసు లో కుడా తప్పని తిప్పలు...కూటి కోసం కోటి తిప్పలు అంటే ఇదేనేమో ?
నమ్ముకున్న పొలం ని వదిలి ఇలా పట్టణాలకు వలస వస్తున్న రైతులు ఎందఱో ?
సెక్యూరిటీ గా అవతారం ఎత్తారు పెంటయ్య ! తన పొలం వృత్తి ని వదులుకొని.
అసలు ఆ కుర్చీ చూడండి .. ఒక కాలు విరిగిన దాన్ని బండ రాలతో చేసుకున్న వైనం. ఇది ఓహ్ సెక్యూరిటీ కి ఇచ్చే సదుపాయాలు ? 12 గంటలు పని చేసి తిరిగి తనకోసం ఎదురు చూస్తూ ఉండే తన భార్య కోసం ఇంటికి పయనం పడతాడు పెంటయ్య.
ఆకాలి ఏ పనినినైనా చేయ నిస్తుంది...!
ఆత్మా హత్య చేసుకునే రైతులకు ఈయన ఒక నిదర్శనం...చావు ఒక్కటే మార్గం కాదు. మనసు తో ప్రయత్నిస్తే ఏ పని ఐనా దొరుకు తుంది.@ భారతీయులం 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

భాష అంటే ఏంటి? అది ఎలా పుట్టింది? తెలుగు భాష ఎలా ఆవిర్భవించిందీ ? మన తెలుగు భాష వయసెంత?

నేను చదివిన మంచి విషయం....! భవాని గారి బ్లాగ్ లోనిది.
సాహిత్యం లోకి ప్రవేశించేముందు భాష అంటే ఏంటి? అది ఎలా పుట్టింది? వంటి విషయాలు కూడా తెలుసుకుని ఆ తర్వాత సాహిత్యంలోకి ప్రవేశించడం ఎంతైనా అవసరం. దాంతోపాటు మన మాతృభాష పుట్టు పూర్వోత్తరాల గురించి తెలుసుకోవలసిన ఆవశ్యకత కూడా మనకుంది కాబట్టి తెలుగు భాష ఎలా ఆవిర్భవించిందీ వంటి విషయాలను కూడ తెలుసుకుని ఆ తర్వాత అసలైన సాహిత్యంలోకి అడుగుపెడదాం. ముందుగా….

భాష అంటే ఏంటి?
మనసులోని భావనను బహిర్గతపరచే సాధనం భాష. స్పష్టమైన ఉఛ్చారణతో అభిప్రాయాన్ని ఎదుటి వ్యక్తికి అర్ధమయ్యేట్లు చెప్పగలగడమే భాషకు నిర్వచనం. భాషకు మాటలతో అవసరం లేదు. సైగల ద్వారా అభిప్రాయాన్ని తెలియజేయడం కూడా భాషే అవుతుంది. ఐతే మానవ జాతి ఆవిర్భావం నాటికీ, ఆధునిక మానవుని ఆవిర్భావం నాటికీ మనిషి అవసరాలలో పెరిగిన మార్పులు, అభిప్రాయ వ్యక్తీకరణలో చోటుచేసుకున్న ఉత్సాహం, ఉత్సుకత, భావోద్వేగాల సమ్మేళనం మాటల ఆవిర్భావానికి కారణభూతమయ్యింది.విశ్వావిర్భావ క్రమంలో ఇదో అద్భుతం. భాష పుట్టకముందున్న మనిషి మనుగడకీ,భాషల ఏర్పాటు తర్వాత మనిషి మనుగడకీ చేతల్లో కొలవలేనంత వ్యత్యాసముంది. అది ఆధునిక మానవునిచే అత్యద్భుత విన్యాసాలు చేయించింది. సరికొత్త ప్రపంచం ఏర్పాటుకు కారణమయ్యింది.

భాష ఎలా పుట్టింది?
భాష ఎలా పుట్టిందనడానికి సరియైన నిర్వచనం లేదు. సమగ్రమైన సిద్ధాంతం కూడా లేదు. కాని ప్రపంచంలో ఇప్పటివరకు దాదాపు 2900 భాషల వరకు ఉన్నాయి. ఒక్క భారతదేశంలోనే 200 వరకు భాషలున్నాయి. వాటిలో ఉత్తర భారత దేశంలోని భాషలను ఆర్య భాషలనీ, దక్షిణ భారతదేశంలోని భాషలను ద్రావిడ భాషలనీ అంటారు.

తెలుగు భాష ఎలా పుట్టింది?
సంస్కృత త్రిలింగ శబ్దభవమైన ప్రాక్రుత తిరిలింగ నుండి లేదా సంస్కృత త్రికళింగ శబ్దభవమైన తి అలింగ (ప్రాక్రుతం) పదం నుండిగానీ లేదా రెండు విధాలుగానూ వచ్చి ఏకరూపతనొందడంవలన కాని "తెలుగు" శబ్దం ఏర్పడి ఉండవచ్చని సొమయాజి గారు తెలిపారు. "తెలుగు" దిగ్వాచి అని వీరు నిరూపించారు. తెలుగు శబ్దమునుండి తెనుగు శబ్దంగాని, తెనుగు శబ్దం నుంది తెలుగు శబ్దం గానీ ఏర్పడి ఉండవచ్చని భాషా వికాసకర్తలు తెలిపారు.
"తలైంగు" జాతి వారి భాష కాబట్టి తెలుంగు అని కొందరి అభిప్రాయం. "తలైంగు" అంటే తల స్థానాన్ని ఆక్రమించినవారు అనగా నాయకులు అని అర్థం.
"తెలుంగు" అంటే తెల్లగా, స్పష్టంగా ఉండే భాష అని మరో భావన ఉంది. "తెన్ను" అంటే దారి కాబట్టి తెనుంగు అంటే దారిలో ఉండే వారి భాష; దారి అంటే ఆర్యులు దక్షిణాపథం అని వ్యవహరించే ప్రాంతం.
"తెన్" నుంచి తెనుగు వచ్చిందని కొందరి అభిప్రాయం. "తెన్" అంటే దక్షిణ దిక్కు. దక్షిణ ప్రాంతానికి చెందిన భాష కాబట్టి "తెనుగు" అయ్యిందని ఎక్కువమంది అంగీకరిస్తున్నారు.
ఐతే "త్రినగ" నుంచి తెనుగు ఏర్పడిందని మరికొందరంటారు. శ్రీకాళహస్తి, శ్రీశైలం, మహేంద్రగిరి అనే మూదు కొండలు గల ప్రదేశంగా "త్రినగ" శబ్దం ఏర్పడిందంటారు.
మరికొందరు మన ప్రాంతనికి పూర్వం త్రిలింగ దేశం అనే పేరుండేదనీ, శ్రీశైలం, శ్రీకాళహస్తి, దక్షారామం అనే మూడు పుణ్య క్షేత్రాల్లో గల మూడు శివ లింగాల ఆధారంగా త్రిలింగ-తి అలింగ-తెలింగ, తెలుగు అయ్యిందని చెబుతారు.
విద్యానాధుడు అను సంస్కృత కవి మొట్టమొదటిసారిగా "త్రిలింగ" పదాన్ని వాడారు. త్రికళింగ నుంచి తెలుగు పదం వచ్చిందని చిలుకూరి నారాయణరావు గరు అనగా తేనె + అగు = తెనుగు అని గ్రియర్సన్, తలైంగ్ జాతినుంచి తెలుగు ఏర్పడిందని ఖండవల్లి లక్ష్మీరంజనం, తెలుగు శబ్దమే త్రిలింగగా సంస్కృతీకరణకు లోనైందని కొమర్రాజు లక్ష్మణరావు పేర్కొన్నారు. తెళ్+గు = తెలుగు అనే అభిప్రాయం కూడా ఉంది. నన్నెచోడుడు, పాల్కురికి సోమనలు తెనుగును భాషాపరంగా వాడారు.
ఐతే తెలుగు శబ్దం తెనుగు శబ్దానికి రూపాంతరమే అనీ ఈ తెలుగు శబ్దం త్రిలింగ లేదా త్రికళింగ శబ్ద భాగం కాదనీ జి.ఎన్. రెడ్డి నిరూపించారు.
పొర్చుగీసు వాళ్ళు 16, 17 శతాబ్దాలలో హిందువును జెంతూ అని పిలిచేవారు. జెంతూ అంటే అన్య మతస్థుడు. అంటే క్రైస్తవేతరుడు అని అర్ధం. మొట్టమొదట్లో వీళ్ళ వ్యాపారాలు ఎక్కువగా తెలుగువాళ్ళతోనే జరిగేవి కాబట్టి జెంతూలంటే తెలుగు వారు అని స్థిరపడిపోయింది. తెలుగుభాషను వాళ్ళు జెంతూ భాష అని పిలిచేవారు. తమిళ, కన్నడ పుస్తకాల్లోనూ, శాశనాల్లోనూ "వడుగ", "వడగ", "తెలింగ", తెలుంగు" అనే విధంగా పేర్లు కనిపిస్తాయి. ఐతే ఎక్కువగా వాడే పేర్లు మాత్రం ఆంధ్ర, తెలుగు, తెనుగు.

మన తెలుగు భాష వయసెంత?
క్రీ.శ. 1వ శతాబ్దం నాటి శాతవాహన రాజైన హాలుని "గాధా సప్తశతిలో తెలుగు పదాలున్నాయి. కాబట్టి 1వ శతాబ్దం నాటికే తెలుగు ప్రచారంలో ఉన్నట్లు తెలుస్తోంది. అంటే తెలుగు భాషకు రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉందన్నమాట. నన్నయకు ముందు వెయ్యి సంవత్సరాలనాటికే తెలుగు ఒక స్వతంత్ర భాషగా విరాజిల్లిందనడానికి శాసనాధారాలున్నాయి. ఐతే నన్నయ ఆ వ్యవహార భాషను సంస్కరించి తెలుగు భాషకు ఓ రూపాన్ని ఇవ్వగలిగాడు.
క్రీ.శ. 200 లోని అమరావతి శిలాశాసనంలోని "నాగబు" పదంలోని "బు" ప్రత్యయాన్ని మొట్టమొదటి తెలుగు అక్షరంగా భాషా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కడప జిల్లా కమలాపురం మండలంలోని ఎర్రగుడిపాడులో చెన్నకేశవస్వామి ఆలయంలో రేనాటి చోళుడైన ధనుంజయుడు వేయించిన శాసనం (క్రీ.శ.575-600) , కలమళ్ళ (క్రీ.శ.575-600) శాసనాలు మొట్టమొదటి శిలాశాసనాలుగా భావింపబడుతున్నాయి. అదేవిధంగా క్రీ.శ. 848లోని పండరంగని అద్దంకి శాసనం, యుద్ధమల్లుని బెజవాడ శిలాశాసనాల్లో పద్యాలున్నాయి.
తెలుగు సాహిత్యంలో శ్రీకృష్ణదేవరాయల కాలమైన 16వ శతాబ్దం స్వర్ణయుగం.
సంస్కృత భాష ప్రాబల్యం నుండి బయటపడేందుకు తెలుగు భాష ఏళ్ళ తరబడి పోరాటం చేయాల్సి వచ్చింది. వైదిక భాషల్నీ, వైదిక భావజాలాన్నీ ప్రతిఘతించడంలో ద్రవిడ జాతులందరికంటే తెలుగువారే ప్రముఖ పాత్ర వహించారు. ఎట్టకేలకు వాడుక భాషను సాధించారు. ప్రస్తుతం వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యం మనకు లభ్యమవుతోంది.
"తెలుగదేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
ఎల్ల నృపుల గొలువ నెరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స" అని శ్రీకృష్ణదేవరాయలు తన స్వీయ గ్రంధమైన ఆముక్త మాల్యదలో తెలుగు భాష గొప్పతనాన్ని కీర్తించాడు.
చోళులు, చాళుక్యుల యుగం నుండి తెలుగు అన్న మాటను పలికించడం, తెలుగు పద్యం కనిపించడం, తెలుగు పాట వినిపించడం జరిగింది.
తెలుగులో 20వ శతాబ్దంలోనే ఎక్కువ సాహిత్యం వచ్చింది. ఇంతకుముందులేని సాహిత్య ప్రక్రియలెన్నో ఈ శతాబ్దంలో వికసించాయి. అన్ని వర్గాలకు, అన్ని రంగాలకు చెందినవారు రచయితలయ్యారు.
అనేకమంది కవుల కృతులతో ఆంధ్ర భాష అలరారింది. ఆచార్య భద్రిరాజు క్రుష్ణమూర్తి ఆధ్వర్యంలో 1,08,330 పదాలతో కూడిన తెలుగు వ్యుత్పత్తి పదకోశం 8 సంపుటాలుగా ఆంధ్ర యూనివర్సిటిచే ప్రచురించబడింది. ఇంగ్లీషు తరువాత తెలుగు భాషకే ఇంతటి కోశ సంపద ఉంది.
అచ్చ తెలుగు :
అచ్చిక తెలుగు అచ్చ తెలుగు అయ్యింది. తెలుగు మాటల్లో తత్సమాలు, తద్భవాలు ఉంటాయి. తత్సమాలలో సంస్కృత సమాలు, ప్రాకృత సమాలు ఉంటాయి. సంస్కృత సమాలుకాని ఇతర పదాలను అచ్చ తెలుగు పదాలు అంటారు. అంటే ప్రాకృత సమాలు, తద్భవాలు, దేశ్యాలు కలిసి అచ్చ తెలుగు అవుతుంది.
జాను తెనుగు :
ఈ పద బంధాన్ని మొట్టమొదటగా తన కుమార సంభవంలో ప్రయోగించినవాడు నన్నెచోడుడు. జానుతెనుగనగా తేట తెలుగు, స్పష్టంగా తెలిసెడి తెలుగు అని నిఘంటుకారుల అభిప్రాయం. మధురమైన తెలుగు అని జాను తెలుగు గురించి బ్రౌన్ నిఘంటువు వివరించింది. జాను అను పదాన్ని స్పష్టము అనే అర్ధంలో తిక్కన ప్రయోగించాడు. డా.సి. నారాయణ రెడ్డి "ఏది ఒకానొక దుర్బోధక విషయముని కూడా సామాన్య జనులకు సైతం సుబోధకంగా, సుప్రసన్నంగా అందించునో అది జాను తెనుగు" అని వివరించారు.
లిపి :భావాన్ని వ్యక్తం చేయడానికి భాష అవసరం. భాష నాగరికతతోపాటు వృద్ధి చెందుతుంది. ఐతే భాష పుట్టిన చాలా కాలం వరకు ఆ భాషకు లిపి ఉండదు.లిపి ముందుగా రాజ్య వ్యవహారాలకోసం పుడుతుందిగానీ వాజ్ఞ్మయం కోసం కాదు. మాట్లాడే భాషని లిఖితపూర్వకంగా గుర్తించడాన్ని "లిపి" అంటారు. ఒక్కొ భాషకు ఒక్కో లిపి ఉంటుంది. లిపి లేని భాషలూ ఉన్నాయి. మన దేశంలోని భాషా లిపులన్నీ కూడా క్రీ.పూ.250 నాటి "బ్రాహ్మీ" లిపి నుంచి పుట్టినవే. 15వ శతాబ్దందాకా తెలుగు, కన్నడ భాషలకు ఒకే లిపి ఉండేదని తెలుస్తోంది.
ప్రకృతి నుంచి వచ్చిన పదాలు :
మనిషికీ, ప్రకృతికీ సంబంధం ఉంది. అలాగే ప్రకృతికీ మనిషి మాట్లాడే భాషకీ సంబంధం ఉంది. మనిషి తన భావ ప్రకటన కోసం ప్రకృతిని సహజంగా వాడుకుంటాడు. భాషని శక్తివంతంగా మలుచుకోవడానికి ప్రకృతిలోని చెట్లనూ, చేమల్నీ, జంతువులనీ, పక్షుల్నీ ఇలా అన్నింటినీ వాడుకుంటాడు.
ఉదా:
నత్త నడక, వేపకాయంత వెర్రి, చిలక పలుకులు, సొరకాయలు కోయడం మొదలైనవి.
భారతదేశంలో హింది తరువాత ఎక్కువమంది ప్రజలు మాట్లాడే భాష తెలుగు. ద్వితీయ స్థానంలో ఈ అద్వితీయ భాష ఉందంటే కారణం భాషలోని తీయదనం తప్ప మరోటి లేదు.  

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

ప్రెషర్ కుక్కర్ అసలు ఎలా పనిచేస్తుంది ? కుక్కర్లో ఏం జరుగుతుంది ? అన్నం ఎలా ఉడుకుతుంది ? మీకు తెలుసా ?

ప్రెషర్ కుక్కర్ అసలు ఎలా పనిచేస్తుంది ? కుక్కర్లో ఏం జరుగుతుంది  ?
అన్నం ఎలా ఉడుకుతుంది ? మీకు తెలుసా ?

కుక్కర్ (Cooker) అన్నం, కూరగాయలు, పప్పులు ఉడికించి వండే వంటింటి పరికరం. మామూలుగా పొయ్యి మీద నేరుగా చేసేదాని కంటే దీనితో వంట త్వరగా పూర్తవుతుంది. నీటి ఆవిరి యొక్క వత్తిడి (ప్రెషర్ ) తో పనిచేసే కుక్కర్ ను ప్రెషర్ కుక్కర్  అంటారు. ఒక్క అన్నం (బియ్యం) ఉడికించడానికి మాత్రమే ఉపయోగించే ప్రత్యేకమైన కుక్కర్ ను రైస్ కుక్కర్  అంటారు.
ఆహారం ఉడకడం అంటే ఆ పదార్థాల్లో పెద్ద పెద్ద అణువులు తమ బంధాలు తెంచుకుని నీటితో చర్య జరపడం ద్వారా చిన్న చిన్న అణువులుగా మారడమే. ఇలా జరగడానికి ఎక్కువ శక్తి కావాలి. అది వంటకి వాడే వేడి ద్వారా సమకూరుతుంది. వేడి ఎంత ఎక్కువ ఉంటే అంత తొందరగా వంట అవుతుంది. అయితే మామూలు పరిస్థితుల్లో సాధారణ వాతావరణ పీడనం దగ్గర మనం 100 డిగ్రీల సెంటిగ్రేడుకి మించి ఉష్ణోగ్రతను అందించలేం. ఎందుకంటే ఆ ఉష్ణోగ్రత దగ్గరకు వచ్చేసరికి నీరు ఆవిరైపోతుంది. అయితే అధిక పీడనంలో ఉంచితే నీరు 100 డిగ్రీల సెంటిగ్రేడు వద్ద ఆవిరి కాదు. దాని భాష్పీభవన ఉష్ణోగ్రత పెరుగుతుంది. అంటే నీరు ఆవిరై పోకుండానే 110 లేదా 120 డిగ్రీల సెంటిగ్రేడు వరకూ కూడా ఉష్ణోగ్రతను అందించగలుగుతాం. ప్రెషర్‌ కుక్కర్‌లో జరిగేదిదే. ఎక్కువ వేడి అందుతుంది కాబట్టి త్వరగా అన్నం ఉడుకుతుంది.@ భారతీయులం  

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

వేసవిలో చేతిగోళ్ళు వేగంగా పెరుగుతాయా ? మన కాలి గోళ్ళ కన్నా చేతి గోళ్ళు వేగంగా పెరగటాన్ని మీరు గమనించారా ?

వేసవిలో చేతిగోళ్ళు వేగంగా పెరుగుతాయా?
మన కాలి గోళ్ళ కన్నా చేతి గోళ్ళు వేగంగా పెరగటాన్ని మీరు గమనించే ఉంటారు.మనం తెలుసుకోవలసిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మన చేతి గోళ్ళు చలి కాలం లో కన్నా ఎండాకాలం లో వేగంగా పెరుగుతాయి. అంతేకాదు మన రెండు చేతి గోళ్ళు ఒకేరకంగా పెరగవు. ఏ చేత్తో ఎక్కువ పని చేస్తామో, ఆచేతిగోళ్ళు కొంచెం వేగంగా పెరుగుతాయి. అంటే మనం కుడి చేతి వాటం వాళ్ళమయితే కుడిచేతి గోళ్ళు ఎడంచేతి వాటం వాళ్ళయితే ఎడం చేతిగోళ్ళు కొంచెం వేగంగా పెరుగుతాయన్నమాట. 

ఇలా ఎందుకు జరుగుతుంది? అన్న ప్రశ్నకు ఇంకా కచ్చితమైన సమాధానం లభించనప్పటికీ ఇప్పటికి అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా శాస్త్రజ్ఞులు ఇలా చెప్తున్నారు.కాలి గోళ్ళ కన్నా చేతిగోళ్ళకు రక్త ప్రసరణ మెరుగ్గా జరిగి వాటికి సాపేక్షికంగా ఎక్కువ ఆక్సిజన్ లభించటం వల్ల వేగంగా పెరుగుతాయట.అదే్విధంగా చలికాలంలో మన శరీరంలో జరిగే వివిధ కార్యకలాపాలు అంతం చురుకుగా జరగకపోవటం వల్ల ఆరుతువులో గోళ్ళ పెరుగుదల వేగం మందగిస్తుంది.వేసవిలో దీనికి భిన్నంగా జరగటం వలన వేగం పెరుగుతుందని వారు చెబుతున్నారు. మనం ఏచెత్తో ఎక్కువ పని చేస్తామో ఆ చేతి గోళ్ళు వేగంగా పెరగతానికి కూడా ఇదే కారణం అంటున్నారు. చలికాలంలో సూర్యరశ్మి తగినంతగా అందుబాటులో లేకపోవటం కూడ గోళ్ళు పెరుగుదల మందగించటానికి ఒక కారణం కావచ్చని ఊహిస్తున్నారు.ఏదేమైనా గోళ్ళ పెరుగుదలలో ఇలా తేడాలు రావటానికి ఇతరత్రా కారణాలు కూడా కొన్ని ఉండవచ్చని వాటిని త్వరలోనే కనిపెట్టగలమని శాస్త్రజ్ఞులు భావిస్తున్నరు.@ భారతీయులం  

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

ఐకమత్యం అనగానే ముందు చీమలే గుర్తుకొస్తాయి. వాటి గొప్పతనం అలాంటివి.ఒకే పుట్టలో కొద్దీ కలిసి ఉండడమే కాదు. వాటి పని అవి క్రమం తప్పక చేసుకోవడంలో ఎంతో క్రమశిక్షణ పాటిస్తాయి

చీమ
ఐకమత్యం అనగానే ముందు చీమలే గుర్తుకొస్తాయి. వాటి గొప్పతనం అలాంటివి.ఒకే పుట్టలో కొద్దీ కలిసి ఉండడమే కాదు. వాటి పని అవి క్రమం తప్పక చేసుకోవడంలో ఎంతో క్రమశిక్షణ పాటిస్తాయి కూడా. చీమలు పుట్టుకొచ్చింది కందిరీగల నుంచే అంటే నమ్ముతారా? ఇవి సుమారు 10 కోట్ల ఏళ్ళ కిందట కందిరీగలతో విడిపోయి, ప్రత్యేక జీవులుగా రూపొందాయి. సుమారు 11,880 జాతులుగా ఉన్న వీటిల్లో ఇటీవల కొత్తరకం చీమను శాస్త్రవేత్తలు కనిపెట్టారు. అన్నట్టు.. ప్రపంచంలో మొత్తం చీమలను కలిపితే వాటి బరువు, మనుషుల బరువు కన్నా ఎక్కువ ఉంటుంది తెలుసా! 

మనలాగా చీమలకు ఊపిరితిత్తులు, గుండె లేవు. రక్తానికి రంగు కుడా ఉండదు. అయినా, తమ కన్నా 20 రెట్ల బరువునైనా ఇట్టే మోస్తాయి. ఇది మనం 1000 కిలోల బరువు మోయడంతో సమానం మరి. శరీరం పై కవచానికి ఉండే సన్నని రంధ్రాల ద్వారా శ్వాస తీసుకుంటాయి. బయటకు కనబడేవి రెండు కళ్ళే అయినా, వాటిల్లోనే చిన్నచిన్న కళ్ళు బోలెడన్ని కలిసి ఉంటాయి! ఈగలకు ఉన్నట్టుగా అన్నమాట. తల మీద అటూ ఇటూ కదిలే కొమ్ముల్లాంటి అంటెన్నాలతో, తాము విడుదల చేసే రసాయనాల వాసనను పసిగట్టి మాట్లాడేసుకుంటాయి. ఇక చీమల కోరలు బలం అంతా ఇంతా కాదు.

భలే ఇళ్ళు!
ఇళ్ళు. అదే పుట్టలను కట్టుకోవడంలో చీమల తెలివి అంతా ఇంతా కాదు. వాసలు కురిసినా పడిపోకుండాఆ గోడలు బలంగా ఉండేందుకు మట్టి, ఇసుకల్లో పుల్లలను కలిపేస్తాయి. లోపల ఎన్ని అరలు ఉంటాయో! ఒకో అవసరానికి ఒకో అర. కొన్నింటిలో ఆహారం దాచుకుంటే.. మరికొన్నింటిలో పిల్లల పెంపకం. ఇంకొన్ని గదుల విశ్రాంతి కోసం. అయితే, అన్ని గదులను కలిపేలా దారులు ఏర్పాటు చేసుకోవడం మాత్రం మరచిపోవు. కొన్నిరకాల చీమలు చెట్ల కాండంలో ఇళ్ళను ఏర్పాటుచేసుకుంటాయి కూడా.

చిత్రమైన పద్ధతులు!
కలిసికట్టుగా జీవించడంలో, పనులను విభజించుకోవడంలో చీమలను మించినవి లేవు. ఒకో పుట్టలో 80 లక్షల దాకా నివసిస్తాయి. రాణి చీమలు, శ్రామిక చీమలు, సైనిక చీమలు, కాపలా చీమలు. ఇలా వేటి పని వాటిదే. రెక్కలు ఉండే రాణి చీమ గుడ్లు పెట్టడంతప్ప మరేపని చేయదు. మగ చీమలు రాణి చీమలతో జత కలిశాక వెంటనే చనిపోతాయి. పాపం ఇక రాణి గారికి సేవలు చేసేవేమో శ్రామిక చీమలు. ఇవి రాణి చీమ శరీరం నుంచి వచ్చే రసాయనాన్ని రుచి చూసి, దాని ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకుంటాయి. గుడ్లను కాపాడడం, అవి లార్వా దశ నుంచి పిల్లలుగా మారి పెద్దయ్యే వరకు కనిపెట్టుకొని ఉంటాయి. పుట్టను కాపాడే పని సైనిక చీమలది. శత్రువులు దాడి చేశారని తెలియగానే కాపలా చీమలు ఒక రకమైన రసాయనాన్ని విడుదల చేస్తాయి. వాటిని పసిగట్టగానే సైనిక చీమలు ఒక్క పెట్టున దాడికి దిగుతాయి.

సమాచార విప్లవం!
చీమల మాటలను ఒక రకంగా రసాయనిక భాష అనుకోవచ్చు. ఎందుకంటే.. ఏ విషయాన్ని అయినా తమలోంచి వచ్చే ' పెరోమోన్స్ ' ద్వారా తెలియజేస్తాయి. ఉదాహరణకు ఏ చీమకైనా ఆహారం కనబడిందనుకోండి. వెంటనే అది ' ఫెరోమోన్ 'ను దారి అంతటా విడుదల చేసుకుంటూ తమ ఇంటికి వస్తుంది. తిరిగి తన వారిని వెంటేసుకొని ఆ వాసనను బట్టి అక్కడికి చేరుకుంటుంది. ఇక చీమలు తమ స్థావరాన్ని ఎలా కనుక్కుంటాయో తెలుసా? దారిలో ఉన్న కొండ గుర్తులతో పాటు సూర్యుడి దిశను గుర్తుపెట్టుకొని! చీమలు ఇళ్ళు కట్టుకోవడం, కట్టుబాట్లు ఏర్పరచుకోవడం,వాటిని పాటించడం వంటివి చూస్తుంటే... అవెంత పద్ధతిగా జీవిస్తున్నాయో తెలియడం లేదూ! @ భారతీయులం  

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

అబద్దాన్ని అందంగా చూపిస్తే నిజం కుడా దాని వెంట పడుతుంది, కాని నిజమైన అందం మనసును తాకుతుంది కంటిని కాదు...!

అబద్దాన్ని అందంగా చూపిస్తే నిజం కుడా దాని వెంట పడుతుంది,
కాని నిజమైన అందం మనసును తాకుతుంది కంటిని కాదు...! @ భారతీయులం | Karthik Garu 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రొజూ లీటర్ల కొద్దీ నీళ్ళు తాగాలనడం నిజమేనా ?

ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రొజూ లీటర్ల కొద్దీ నీళ్ళు తాగాలనడం నిజమేనా ? @ భారతీయులం  

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

ఇన్సులిన్ వల్ల ఏ సైడ్ ఎఫ్ఫెక్ట్స్ ఉండవు.

ఇన్సులిన్ వల్ల ఏ సైడ్ ఎఫ్ఫెక్ట్స్ ఉండవు. @ భారతీయులం  

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

చెత్తకుప్పలో ఓటరు కార్డులు , సికింద్రాబాద్ పార్లమెంట్ ...చెందిన ఓటరు గుర్తింపు కార్డులను ఇలా చెత్త కుప్పలో...!.

చెత్తకుప్పలో ఓటరు కార్డులు ,
సికింద్రాబాద్ పార్లమెంట్ ...చెందిన ఓటరు గుర్తింపు కార్డులను ఇలా చెత్త కుప్పలో...!.@ భారతీయులం  

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

దుక్కుల దుఃఖం. రుతు పవనాల మందగమనం, కొందామంటే విత్తనాలు భారం.@ భారతీయులం

దుక్కుల దుఃఖం.
రుతు పవనాల మందగమనం, కొందామంటే విత్తనాలు భారం.@ భారతీయులం  

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

మిత్రులారా ! మాకు చిన్న సాయం కావాలి ? ఈ నెల 13th తారీకు, అన్నా హజారే మన హైద్రాబాద్ కి వస్తున్నారు ! మాకు వాలంటీర్స్ కావాలని మీకు సందేశం పంపుతున్నాము. Need Volunteers for India Against Corruption Hyderabad, if you are interested contact by email or mo

మిత్రులారా ! మాకు చిన్న సాయం కావాలి ?
ఈ నెల 13th తారీకు, అన్నా హజారే మన హైద్రాబాద్ కి వస్తున్నారు ! 
అవినీతి మరియు విదేశి డబ్బు మరియు లోక్ పాల్ బిల్ గురుంచి ప్రసంగిస్తారు. మీరు మీ వంతు సాయం చేయాలనీ ఆలోచిస్తే మాకు ఈమెయిలు లేదా మొబైల్ ద్వారా సంప్రదించగలరు. 
ఈ కార్యక్రమం కొరకు మాకు వాలంటీర్స్ కావాలని మీకు సందేశం పంపుతున్నాము.

We take this opportunity to inform you about the visit of Shri.Arvind Kejriwal., along with Shri.Gopal Rai and Smt.Kiran Bedi (Team Anna Members) on June the 13th 5.00pm to Hyderabad, to address the citizens of Hyderabad, Andhra Pradesh.

Wesley College Grounds,Opp Anand Theatre.Secunderabad. (3km from Station and 2km from Jubilee Bus station,Sec-bad. 

For information of the public any details regarding the event can be had on the following Numbers of IAC – Hyderabad (for public information - 8977236880 / 8520046111.)

The meeting will address the current situation prevailing in the country, keeping issue of corruption and the Jan Lokpal bill as the main agenda.

Looking forward to your participation in the same and soliciting your co-operation towards making the event a grand success.

regards,
India against Corruption – Hyderabad Chapter.

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

ప్రతి గ్రామానికి ఈ గ్రామం ఆదర్శం కావాలి !! By SathishRaj Patel @ భారతీయులం

ప్రతి గ్రామానికి ఈ గ్రామం ఆదర్శం కావాలి !! By SathishRaj Patel @ భారతీయులం 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

అన్ని జన్మలలోకి మానవ జన్మ ఉత్తమమైనది. ఈ సృష్టిలోని 84 లక్షల జీవరాశులలో ఏ జీవరాశికి లేనిది మానవునికి మాత్రమే ఉన్నది జ్ఞానం మాత్రమే.

ప్రియమైన మిత్రులారా అన్ని జన్మలలోకి మానవ జన్మ ఉత్తమమైనది. ఈ సృష్టిలోని 84 లక్షల జీవరాశులలో ఏ జీవరాశికి లేనిది మానవునికి మాత్రమే ఉన్నది జ్ఞానం మాత్రమే. అన్ని జీవరాశులలో ఆత్మ ఒక్కటే ఐనప్పటికి మానవ శరీరానికి మాత్రమే ఆలోచన జ్ఞానం ఉంది. ఆలోచన వేరు ఆలోచన జ్ఞానం వేరు. సృష్టిలో ప్రతి జీవి ఆలోచిస్తుంది కాని వాటి ఆలోచనలకు పరిమితి ఉంది. ఆహరం కోసం పులులు, సింహాలు మొదలైన జంతువులు ఎంతో నేర్పుతో వేటాడతాయి, మరి కొన్ని మగ ప్రాణులు ఆడ ప్రణులతో సంభోగం జరపడానికి వాటిని ఆకర్షించడానికి ఎన్నో విన్యాసాలు వేరే ప్రాణులతో పోరాటాలు కూడా చేస్తూ ఉంటాయి, వేటాడటం పోరాటాలు చేయడం కూడా ఆలోచనే మరి అప్పుడు జంతువులు కూడా ఆలోచిస్తున్నయి కదా మరి. నిజమే ఆలోచిస్తున్నాయి కాని వాటి ఆలోచనలకు పరిమితి ఉంది ప్రతి జీవి ఆహరం, నిద్ర, మైదునం(సంభోగం) కోసమే ఆలోచిస్తుంది అంతకు మించి అది ఆలోచించలేదు కాని మనిషి అలా కాదు దేని గురించైనా ఆలోచించగలడు. ఆ ఆలోచన శక్తితో  మానవుడు మాదవుడుగా ఎదగడం కోసమే భగవంతుడు అన్ని జన్మలలోకి చివరిది ఐన మానవ శరీరానికి ఆ శక్తిని ఇచ్చాడు. కాని మిత్రులారా మనిషి తన శక్తిని తెలుసుకోకుండా జంతువులలాగే ఆహరం, నిద్ర, మైదునం కోసమే తన ఆలోచన శక్తిని ఉపయోగిస్తిన్నాడు ప్రాశ్చాత్య సంసృతి మోజులో పడి విచ్చలవిడి తనం, విలువలులేని జీవితాన్ని గడుపుతున్నాడు. మన పూర్వ మహర్షులు వారి జీవితాలను దారపోసి మనిషి ఉన్నతి కోసం ఏర్పరిచిన ఆచారాలను, జీవన విదానాన్ని నాశనం చేసి తన పతనానికి తానే బాట వేసుకొంటున్నాడు. తను గడిపిన విచ్చలవిడి జీవితం వల్ల తిరిగి మళ్ళీ నీచ జన్మలు పొందుతున్నాడు. ఎంతో మంది గొప్ప గొప్ప మహర్షులు, ఋషులు జన్మించిన మన దేశంలో ప్రస్తుతం ఎలాంటి జీవనాన్ని మనం గడుపుతున్నామో ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. వీళ్ళను చూడండి ప్రశ్చాత్య సంసృతిలో పుట్టినా జీవిత సత్యాన్ని గ్రహించి ఇంత చిన్న వయసులో ఎంత ఆదర్శ జీవితాన్ని గడుపుతున్నారో.కాబట్టి మిత్రులారా మీరు అందరు కూడా తిరిగి మన భారతీయ సంసృతికి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి కృషి చేసి మీ జన్మ సార్దకం చేసుకోవడంతో పాటు మన తరవాతి తరాలకి కూడా మన సంసృతిని సజీవంగా అందిచే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. By rajesh thunuguntla @ భారతీయులం 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

ప్రమాదం కోన అంచున ! ఏంటి ఈ మహాప్రళయం ? మహాప్రళయం అంటే మనకు మహా ఆసక్తి.!

ప్రమాదం కోన అంచున ! ఏంటి ఈ మహాప్రళయం ? మహాప్రళయం అంటే మనకు మహా ఆసక్తి.! @ భారతీయులం 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

అవసరమా ? ఈ పార్టీలు మనకి అవసరమా ? Zero, None Of The Above నీ వోటర్ రసీదు లేదా ఎన్నిక జాబితా లో చేర్చడం గురుంచి తెలుసుకుందాం మరియు తెలియజేద్దాం.

అవసరమా ? ఈ పార్టీలు మనకి అవసరమా ?
ఒక మంచి పని చేయడానికి ఒక రాజకీయనాయకుడే కావాలా ? నిజమైన నాయకుడు ఐతే సరిపోదా ?
నాయకుడికి ఈ రాజకీయ అండ అవసరమా ? ఏ రాజకీయ పార్టీ గెలిచినా అయ్యేది సున్యం ? మరి ఎందుకు ఈ రాజకీయ అండ ?
ఈ రాజకీనాయకులు మారరు, మనము మారము ...ప్రతి చోటా ఒకటే లక్షం ? ఎంత దోచుకున్నాము ఎంత దాచిపెట్టాము ?
గెలిచిన వాడు చెప్పిన వాక్కులు మరిచిన నాడు ఎందుకు ఈ ఎన్నికలు.
సరైన నాయకుడు లేని నాడు వోటు హక్కు వినియోగించ కూడదా ? లేక ఉన్న మంద లో గుడ్డిగా ఎవరో ఒకరికి వేసి రావాలా ?
అందుకే ఈ చెత్త రాజకీయ పార్టీలను దూరంగా ఉంచేందుకు మన వంతు సాయం చేద్దాం ! Zero, None Of The Above నీ వోటర్ రసీదు లేదా ఎన్నిక జాబితా లో చేర్చడం గురుంచి తెలుసుకుందాం మరియు తెలియజేద్దాం.
మనకి కావాల్సింది నిజమైన నాయకుడు ! ధన ధాహం ఉన్నవాడు కాదు .. జన జీవితాల్లో మార్పు కోరేవాడు, మార్పు కోసం పోరాటం చేసే వాడు.
కదిలి రండి నేటి రాజకీయ ఎన్నికాల్లో మార్పుని తిసుకోద్దము...విదానము లో. ఈ విదానాన్ని ౨౦౦౯ (2009) లో సుప్రీమ్ కోర్ట్ దృష్టికి ఎలెక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ( Election Commission Of India )  వారు తీసుకొచ్చారు, అప్పటి ప్రభుత్వం ప్రతిఘటించారు. 
Be A Patriot, Not A Pawn - Yes To Country, No To Political Parties.@ భారతీయులం  

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

ప్రేమానురాగాలకు నిలయం భారతదేశం.ఓహ్ వృద్దురాలు ఎలుకుల కోసం చేస్తున్న పని. ఒకటి కాదు రెండు కాదు ఎన్నో వరుసగా వచ్చి తృప్తిగా తమ పొట్ట నిండా తాగుతున్న ఎలుకలు.

ప్రేమానురాగాలకు నిలయం భారతదేశం.
ఒకరికి సాయపడటం తప్పు అని అనే రోజుల్లో...ఒకరి ఆకలి తీర్చడం తప్పు అని భావించే నేటి రోజుల్లో.
ఎలుక సైతం కనిపిస్తే బయపడి మరియు భయం తో చంపడమో లేక పోతే మందు తెచ్చి పెట్టి చచ్చేలా చేయడమో చేస్తాం ?
ఐతే ఇది చూడండి..ఓహ్ వృద్దురాలు ఎలుకుల కోసం చేస్తున్న పని.
ఒకటి కాదు రెండు కాదు ఎన్నో వరుసగా వచ్చి తృప్తిగా తమ పొట్ట నిండా తాగుతున్న ఎలుకలు. ఓహ్ వృద్దురాలు వాటి పొట్ట నింపుతున్న వైనం.@ భారతీయులం  

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

భారతీయులం ఎక్కడెక్కడ ఉన్నాము ఈ ప్రపంచం లో ? అసలు మన వాళ్ళు ప్రముక మైన సంస్థ లో ఎంత శాతం మంది పనిచేస్తున్నారు ? ఒక్కసారి భారతీయులం అందరం మాతృ భూమి కి తిరిగి వస్తే ?

భారతీయులం ఎక్కడెక్కడ ఉన్నాము ఈ ప్రపంచం లో ?
అసలు మన వాళ్ళు ప్రముక మైన సంస్థ లో ఎంత శాతం మంది పనిచేస్తున్నారు ?
ఒక్కసారి భారతీయులం అందరం మాతృ భూమి కి తిరిగి వస్తే ? వలస వెళ్ళిన వాళందరూ ? సాద్యం కాని పనే కాని ఎప్పటికైనా పక్షి గూటికి చెరక పోదా ?
కొందరు అంటారు ..ఉద్యోగం మేము తెచ్చుకున్నాము అని కాని ఎక్కడికి వెళ్ళిన ఎంత సంపాదించినా భారతీయులు  అని అంటారు అందరు అని మరిచారు ? @ భారతీయులం  

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

గర్భిణీగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన ఆహారము...తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉండటానికి గర్భిణీ సమయంలో సరైన పోషణ చాలా అవసరం.

గర్భిణీగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన ఆహారము
     సురక్షిత మాతృత్వం అంటే ఒక స్త్రీ ఎలాంటి అవాంతరాలు లేకుండా గర్భసమయంలో, ప్రసవ సమయంలోను, ప్రసవానంతరం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా తన కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలి. తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉండటానికి గర్భిణీ సమయంలో సరైన పోషణ చాలా అవసరం.
     గర్భిణీ స్త్రీలు అన్ని రకాల ఆహార పదార్ధాలు అంటే ధాన్యాలు, పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పాలు, పాలతో చేసిన పదార్ధాలు, మాంసం మొదలైనవి తగిన మోతాదులో తీసుకోవాలి.@ భారతీయులం  

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

ఇంకా కొన్ని చోట్ల సరైన వైధ్య సదుపాయాలు లేని ఊర్లు ఉన్నాయి...వైధ్యం కోసం కిలోమీటర్లు వెళ్ళవలసిన పరిస్థితి. కాన్పుచేసే సమయంలో పాటించవలసిన ఐదు శుభ్రతలు.

ఇంకా కొన్ని చోట్ల సరైన వైధ్య సదుపాయాలు లేని ఊర్లు ఉన్నాయి...వైధ్యం కోసం కిలోమీటర్లు వెళ్ళవలసిన పరిస్థితి. ఐతే అలాంటి వారికోసం, ఈ చిన్న చిన్న విషయాలు తెలుసుకోండి.@ భారతీయులం
పోషకాహార విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే గర్భిణీ విషయంలో సురక్షితమైన కాన్పు కోసం కుటుంబ సభ్యులు క్రింద పేర్కొన్న సన్నాహాలు చేసుకోవాలి. ప్రసూతి ఇంట్లో జరగాలా లేక ఆరోగ్య కేంద్రం / ఆసుపత్రిలో చేయించాలా అనే విషయం గురించి ఆలోచించాలి.

కాన్పుచేసే సమయంలో పాటించవలసిన ఐదు శుభ్రతలు

               గర్భిణీ స్త్రీ వీలయినంతవరకు కాన్పు ఆసుపత్రిలోనే చేయించుకోవాలి. దీని వలన తల్లీబిడ్డలు సురక్షితంగా ఉంటారు. అలాగే కాన్పు తరువాత ఏమైనా అత్యవసర పరిస్ధితులను గుర్తించినట్లయితే వెంటనే చికిత్స చేస్తారు. కాని కొన్ని పరిస్ధితులు లేదా అనుకోకుండా ఇంటి దగ్గరే కాన్పు చేయించవలసి వస్తుంది. ఇలాంటి సందర్భాలలో ......
    .శిక్షణ పొందిన దాయిని గుర్తించి ఆమె సహాయంతో పురుడు పోసుకోవాలి.   
    .ఇంటి దగ్గర కాన్పు చేసేటపుడు దాయి 5 శుభ్రతలు పాటించాలి.
    .కాన్పు సమయంలో తగిన శుభ్రతలు పాటించకపోవటం వలన, పుట్టిన బిడ్డ అంటువ్యాధులు కలిగించే సూక్ష్మజీవుల బారిన పడవచ్చు.@ భారతీయులం  

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

చేతులు శుభ్రంగా కడగటం ఎలానో తెలుసా మీకు ? ఏదన్నా తినే ముందు లేదా భోజనం చేసే ముందు ప్రతిసారి చేతులు శుభ్రంగా కడగటం మంచి అలవాటు.

చేతులు శుభ్రంగా కడగటం ఎలానో తెలుసా మీకు ?
ఏదన్నా తినే ముందు లేదా భోజనం చేసే ముందు ప్రతిసారి చేతులు శుభ్రంగా కడగటం మంచి అలవాటు.@ భారతీయులం  

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

జనాభా నియంత్రణ, భారత దేశంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న జనాభా శాతం.జనాభా పెరుగుదలను నియంత్రించే విధానాన్ని జనాభా నియంత్రణ అంటారు.

జనాభా నియంత్రణ
భారత దేశంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న జనాభా శాతం.
జనాభా పెరుగుదలను నియంత్రించే విధానాన్ని జనాభా నియంత్రణ అంటారు. పురాతన గ్రీస్ దేశంలో తమ అధిక జనాభా ఆవాసాలకోసం వారు సుదూర ప్రాంతాలలో వలస కేంద్రాలను స్థాపించారు. ఆధునిక కాలంలో భారత దేశంలో కుటుంబ నియంత్రణ విధానాన్ని చాలా విధాలుగా ప్రోత్సహిస్తున్నారు. చైనాలో ఒకే బిడ్డ విధానాన్ని అధికారికంగా అమలు చేశారు. జనాభా పెరుగుదలను నియంత్రించే కారకాళను రెండు విధాలుగా విభజింపవచ్చును - (1) సాంద్రతా పరతంత్ర కారకాలు జనాభా సాంద్రతపై ఆధారపడి ఉంటాయి - ఉదా హరణకు జీవుల మధ్య పోటీ, వలసలు, వ్యాధులు, అధిక జనాభా, జీవుల ప్రవర్తన వంటివి (2) సాంద్రతా స్వతంత్ర కారకాలు - వీటికి జనాభా సాంద్రతతో సంబంధం లేదు. ఉదాహరణకు ఆహారం కొరత, సూర్యరశ్మి, ఉష్ణోగ్రత, ప్రకృతి విపత్తులు వంటివి. ప్రభుత్వాల ద్వారా ప్రోత్సహింపబడే (లేదా వత్తిడి చేయబడే) జనాభా నియంత్రణకూ, వ్యక్తులు తమ ఇష్టానుసారం అమలు చేసుకొనే నియంత్రణకూ భేదాన్ని గమనించవలసి ఉన్నది. వ్యక్తులు తమకు బిడ్డలు కావాలనుకొనే సమయాన్ని తాము నిర్ణయించుకోవడం స్వచ్ఛంద నియంత్రణలో ముఖ్యమైన అంశం. ఈ విషయంలో అధికంగా కోట్ చేయబడిన ఆన్స్‌లీ కోలే విశ్లేషణ ప్రకారం జనాభా పెరుగుదల తరగడానికి మూడు మౌలికమైన కారణాలున్నాయి. (1) సంతానోత్పత్తి కేవలం 'చాన్స్' లేదా 'భగవదనుగ్రహం' కారణంగా మాత్రమే కాక వ్యక్తుల ఇష్టాయిష్టాల ప్రకారం కూడా మారే అవకాశం ఉన్నదని గ్రహించడం. (2) పరిమిత సంతానం వల్ల ప్రయోజనాలున్నాయని అభిప్రాయపడడం.(3) నియంత్రణకు అవుసరమైన విధానాల గురించి మరింత అవగాహన. 

కేవల ప్రకృతి సహజమైన సంతానోత్పత్తి రేటుకు అనుగుణంగా ఉన్న సమాజంలో కంటే నియంత్రణ పాటించే సమాజంలో పాటించే ముఖ్య విధానాలు: (1) పిల్లలను కనడం ఆలస్యం చేయవచ్చును. (2) బిడ్డకూ బిడ్డకూ మధ్య ఎక్కువకాలం ఆగవచ్చును. (3) అసలు బిడ్డలను కనకపోవచ్చును. స్త్రీల విద్య, ఆర్ధిక స్వావలంబన పెరిగిన సమాజాలలో ఈ లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అయితే కొంత నియంత్రణ పాటించినంతలో సంతానోత్పత్తి రేటులు తగ్గుతాయన్న మాట వాస్తవం కాదు.
వ్యక్తులు స్వచ్ఛందంగా పాటించే నియంత్రణ కంటే ప్రభుత్వాలు అమలు చేసే లేదా ప్రోత్సహించే నియంత్రణ భిన్నమైనది. ఇది కేవలం సంతానోత్పత్తి నిరోధించడానికే పరిమితం కానక్కరలేదు. వలసల ప్రోత్సాహం, పన్ను రాయితీలు, సెలవు దినాలు వంటి ప్రోత్సాహక అవకాశాల ద్వారా ప్రభుత్వాలు జనాభాను పెంచేందుకు కూడా ప్రయత్నిస్తాయి.@ భారతీయులం  

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

మన దేశ జనాబా లెక్కలు ? జనాబా పెరిగితే ఏంటి మనకొచ్చే నష్టం మీకు తెలుసా ? జనాబా నియంత్రించటం అవసరమా ? ఎందుకు ? 2011 జనాభా గణన మానవాళి చరిత్రలో అతిపెద్ద జనాభా గణన కానుంది.

భారత దేశము, చైనా  తరువాత ప్రపంచంలోని రెండో అత్యధిక జనాభా గల దేశం. ఎన్నో భిన్నత్వాలు గల జనాభా యొక్క సామాజిక, రాజకీయ వర్గీకరణలో భాష, మతం, కులం అనే మూడు ప్రముఖ పాత్ర వహిస్తాయి.  

ఒక జనాభాలో సభ్యుల గురించి సమాచారాన్ని క్రమపద్ధతిలో సేకరించే మరియు నమోదు చేసే ప్రక్రియను జనాభా గణన  అంటారు. ఇది ఒక నిర్దిష్ట జనాభాకు సంబంధించి జరిగే నియతకాలిక మరియు అధికారిక గణన.జాతీయ జనాభా మరియు గృహ గణనలకు సంబంధించి ఈ పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు; వ్యవసాయ, వ్యాపార మరియు ట్రాఫిక్ గణనలను ఇతర సాధారణ గణనలుగా చెప్పవచ్చు. ఇటువంటి గణనల్లో "జనాభా"కు సంబంధించిన అంశాలు ప్రజలకు బదులుగా మొక్కలు, వ్యాపారాలను సూచిస్తాయి. జనాభా మరియు గృహ గణనలకు సంబంధించిన ముఖ్యమైన లక్షణాలను ఐక్యరాజ్యసమితి "ఒక గుర్తించిన భూభాగంలో వ్యక్తిగత గణనం, సాధారణత, సమకాలికత్వం మరియు నిర్ణీత నియతకాలికత"గా గుర్తించింది, మరియు కనీసం 10 ఏళ్లకు ఒకసారి జనాభా గణనలు సేకరించాలని సిఫార్సు చేసింది.సెన్సస్ (జనాభా గణన) అనే పదాన్ని లాటిన్ నుంచి స్వీకరించారు: రోమన్ రిపబ్లిక్ సమయంలో జనాభా గణన అనేది సైనిక సేవలకు యోగ్యమైన యువకులను గుర్తించే ఒక జాబితాగా ఉండేది.
ప్రతిచయనానికి జనాభా గణన భిన్నంగా ఉంటుంది, ప్రతిచయనంలో సమాచారాన్ని ఒక జనాభా యొక్క ఉపసమితి నుంచి సేకరిస్తారు, కొన్నిసార్లు ఒక జనాభా అంతర అంచనాగా దీనిని సేకరించడం జరుగుతుంది. జనాభా గణన సమాచారాన్ని సాధారణంగా పరిశోధన, వ్యాపార మార్కెటింగ్ మరియు ప్రణాళికా రచనలతోపాటు ప్రతిచయన అధ్యయనాలకు ప్రాతిపదికగా ఉపయోగిస్తారు. 

2011 జనాభా గణన మానవాళి చరిత్రలో అతిపెద్ద జనాభా గణన కానుంది.భారతదేశంలో ఆధునిక కాలంలో మొట్టమొదటి జనాభా గణనను 1872లో నిర్వహించారు. మొదటి నియతకాలిక జనాభా గణనను 1881లో లార్డ్ రిప్పాన్ ప్రారంభించారు.అప్పటి నుంచి, జనాభా గణనను ప్రతి 10 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తున్నారు. తాజా జనాభా గణన మే 1, 2010న ప్రారంభమైంది. ఈ జనాభా గణనలో దేశంలో ప్రతి పౌరుడి ఛాయాచిత్రం మరియు వేలిముద్రలతో ఒక జాతీయ జనాభా రిజిస్టర్‌ను తయారు చేస్తారు. భారతీయ పౌరులందరికీ ఒక్కో విశేష గుర్తింపు (యునీక్ ID) సంఖ్యలు మరియు జాతీయ గుర్తింపు కార్డులు అందిస్తారు. జనాభా గణనను ఢిల్లీలోని రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా కార్యాలయం నిర్వహిస్తుంది, ఇది భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది, ఈ కార్యాలయాన్ని 1948 భారతదేశ జనాభా గణన చట్టం కింద ఏర్పాటు చేశారు. ఈ చట్టం కేంద్ర ప్రభుత్వానికి జనాభా గణనకు తేదీని నిర్ణయించే, జనాభా గణన పనికి ఏ పౌరుడి సేవలనైనా కోరే అధికారాలను కల్పించింది. అంతేకాకుండా ఈ చట్టం జనాభా గణనకు సంబంధించి ప్రశ్నలకు ప్రతి పౌరుడు నిజాయితీగా సమాధానం ఇవ్వడాన్ని తప్పనిసరి చేసింది. జనాభా గణన ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలకు తప్పుడు సమాధానాలు ఇచ్చినవారికి లేదా సమాధానాలు ఇవ్వనివారికి జరిమానాలు విధించే అధికారాన్ని ఈ చట్టం కల్పించింది. ఈ చట్టం యొక్క అత్యంత ముఖ్యమైన నిబంధనల్లో జనాభా గణన ద్వారా సేకరించిన ప్రతి వ్యక్తి సమాచారాన్ని గోప్యంగా ఉంచడం ఒకటి. జనాభా గణన పత్రాల్లో సమాచారాన్ని తనిఖీ చేయడం మరియు ఈ సమాచారాన్ని సాక్ష్యంగా స్వీకరించడం నిషేధించబడింది.
జనాభా గణనను రెండు దశల్లో నిర్వహిస్తారు: మొదటి దశలో, గృహాల నమోదు మరియు గృహాల సంఖ్యను గుర్తిస్తారు, రెండో దశలో అసలు జనాభా గణన జరుగుతుంది. జనాభా గణనను ప్రచార పద్ధతిలో నిర్వహిస్తారు. ఈ పద్ధతిలో, దేశంలోని ప్రతి ఇంటిని సంబంధిత సిబ్బంది సందర్శిస్తారు, ప్రత్యేకంగా శిక్షణ పొందిన పరిగణకులు సమాచారాన్ని సేకరిస్తారు. వారు గృహాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తారు, ఉదాహరణకు సభ్యుల సంఖ్య, నీరు మరియు విద్యుత్ సరఫరా, భూమి, వాహనాలు, కంప్యూటర్‌లు మరియు ఇతర ఆస్తులు మరియు సేవల వినియోగానికి సంబంధించిన సమాచారాన్ని దీనిలో సేకరించడం జరుగుతుంది. రెండో దశలో, మొత్తం జనాభాను లెక్కిస్తారు మరియు వ్యక్తులకు సంబంధించిన గణాంకాలను సేకరిస్తారు.

గత దశాబ్దంతో పోల్చుకుంటే ఈ దశాబ్దంలో (2001-2011) దేశంలో జనాభా పెరుగుదల రేటు 2.5 శాతం తగ్గింది. తాజా జనగణన ప్రకారం 121.02 కోట్లతో చైనా తర్వాతి స్థానంలో భారత్‌ కొనసాగుతోంది. సంఖ్యపరంగా దేశంలో ఉత్తరప్రదేశ్‌ తొలిస్థానంలో ఉంటే, లక్షద్వీప్‌ చివరి స్థానంలో నిలిచింది. జనసాంద్రతలో (చదరపు కిలో మీటర్‌కు) 37,346 మందితో ఢిల్లీ ఈశాన్య జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఈ దశాబ్ద కాలంలో అక్షరాస్యత శాతం కొంతమేరకు పెరిగింది. పురుషుల్లో ఇది 75.26 నుండి 82.14 శాతానికి, మహిళల్లో 53.67 శాతం నుండి 65.46 శాతానికి ఎగబాకింది. 2001తో పోల్చుకుంటే అక్షరాస్యతలో స్త్రీ, పురుషుల మధ్య భేదం 21.59 నుండి 16.58 శాతానికి తగ్గింది. అక్షరాస్యత విషయంలో కేరళ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది. 93.91 శాతంతో ఇది నెంబర్‌వన్‌ స్థానంలో ఉంది. జనాభాలో పురుష-స్త్రీ నిష్పత్తి మాత్రం 1000 : 940గా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర జనాభా 8.46 కోట్లకు చేరింది.@ భారతీయులం  

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

మేలు చేద్దాం అని ముందుకి వచ్చే కొందరికి తప్పని ఆటు పాట్లు. అతను కలెక్టర్ సరే ప్రజల కోసం కొంత సాయం చేద్దాం అని అనుకోని ఫోన్ ఇన్ అనే ఒక ఫోన్ నెంబర్ తో మొదలు పెట్టారు. తమ ఫిర్యాదులను మాకు ఫోన్ చేసి చెప్పగలరు అని అంటూ !

మేలు చేద్దాం అని ముందుకి వచ్చే కొందరికి తప్పని ఆటు పాట్లు. అతను కలెక్టర్ సరే ప్రజల కోసం కొంత సాయం చేద్దాం అని అనుకోని ఫోన్ ఇన్ అనే ఒక ఫోన్ నెంబర్ (221966) తో మొదలు పెట్టారు. తమ ఫిర్యాదులను మాకు ఫోన్ చేసి చెప్పగలరు అని అంటూ మొదలు పెట్టారు ఐతే మొదటి రోజు మోగిన రింగ్ రోజు రోజు కి దిగ జారి పోతూ ఉంది...చివరికి సున్యం.
ఎంత సేపు వాడు చేయడు వీడు చేయడు అంటూ ఒకరిని వెక్కిరించటం తోనే సరిపోతుంది కాని ఎవరి కి వారు ఎదురు కుంటేనే కానీ అది సమస్య అని తెలుసు కోలేక పోతున్నారు ?
ఎవడికో కదా మన కి కాదు కదా అంటూ వదిలేసే పని మరియు ఇది బాగా లేదు అది బాగా లేదు అంటూ చెప్పే మాటలు ప్రతీ చోటా వింటాము.
కానీ వారికి తెలిసి కుడా చెత్త ని సరిగ్గా సరైన స్థలం లో పడేయ కుండా గోడ పక్కన పోసే వారు ఎందఱో... అదేంటి అని అని అడిగితే మన స్థలము కాదు కదా అంటూ చెప్పే మాటలు.
ప్రభుత్వ కార్యాలయాల్లో అసలు పనులెవరు చేయరు అంటూ చెప్పే మాటలు కూడా విన్న్టాము చాలా సార్లు ....ఐతే మరి ఎందుకు ఫిర్యాదు ఇవ్వలేదు అని అడిగితే మాత్రం ...మాకెందుకు అంటూ వచ్చే సమాదానం.
ఇదే మనలో ఉన్న మొదటి నిర్లక్షం. ఈరోజు మనకి జరగక పోవచ్చు కానీ ఒకరోజు అందరం బాదపడతాం ...ఒక చిన్న నిర్లక్షం పెద్ద నష్టానికి దారి తీస్తుంది. !
ఒక మంచి పనికి ప్రోత్సహించక పోయినా పర్లేదు కాని చెడుని మాత్రం తెలిసినంత వరకు సాగనివ్వకుండా చూసుకోవాల్సిన బాద్యత మన అందరిది.
మంచి విషయాలను తెలిసిన వారికీ తెలియ జేయండి ...అందరికి అన్నీ తెలియవు ...అన్నీ తెలుసు కో లేక పోయినా కొంతవరకు కలిసి కృషి చేద్దాం. ! @ భారతీయులం  

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

చరిత్రలో ఈ రోజు - జూన్ 8 / june 8, భారతదేశపు సివిల్ రేడియో నెట్‌వర్కుకు ఆలిండియా రేడియోగా నామకరణం చేశారు.భారత ఇంగ్లాండు మధ్య విమాన రాకపోకలు

చరిత్రలో ఈ రోజు - జూన్ 8 / june 8
1936: భారతదేశపు సివిల్ రేడియో నెట్‌వర్కుకు ఆలిండియా రేడియోగా నామకరణం చేశారు.
1948: భారత ఇంగ్లాండు మధ్య విమాన రాకపోకలు ప్రారంభమైనవి. భారతదేశము నుండి విదేశాలకు విమాన ప్రయాణాలకు ఇదే నాంది.@ భారతీయులం  

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

అనాధ విద్యార్ధులకు స్వాగతం ! మీకోసం సాయపడే AVG.@ భారతీయులం

అనాధ విద్యార్ధులకు స్వాగతం ! మీకోసం సాయపడే AVG.@ భారతీయులం  

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

వోటు వేస్తున్నారా ? మీకు నచ్చిన నాయకుడు వున్నాడా ? సరైన నాయకుడు లేడా ? మరి ఎం చేయాలి ? బహుశా పరీక్షల్లో ఉన్నటు ఎన్నికల్లో కుడా ఈ ఆప్షన్ ఉంటె బాగుంటుందా ? ఏమంటారు ?

వోటు వేస్తున్నారా ? మీకు నచ్చిన నాయకుడు వున్నాడా ?
సరైన నాయకుడు లేడా ? మరి ఎం చేయాలి ?
బహుశా పరీక్షల్లో ఉన్నటు ఎన్నికల్లో కుడా   ఆప్షన్ ఉంటె బాగుంటుందా ? ఏమంటారు ?@ భారతీయులం  | SatishRaj Patel

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

మన పాత లెక్కల ప్రకారం ? ఏ రాష్ట్ర జనాబా ఎంత ? మన రాష్ట్రం ది ఎన్నో స్థానం ?

మన పాత లెక్కల ప్రకారం ? ఏ రాష్ట్ర జనాబా ఎంత ? మన రాష్ట్రం ది ఎన్నో స్థానం ? @ భారతీయులం  

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

గుండమ్మ కథ. అప్పటిలో ఇది అగ్రశ్రేణి నటులతో నిర్మించిన మల్టీ స్టారర్,.కాని "గుండమ్మ కధ" అని సూర్యకాంతం పాత్ర పేరుమీద సినిమా పేరు పెట్టడమే గొప్ప వైవిధ్యం

విజయా సంస్థ నిర్మించిన చిత్రలలో ఆఖరి విజయవంతమైన చిత్రం గుండమ్మ కథ. అప్పటిలో ఇది అగ్రశ్రేణి నటులతో నిర్మించిన మల్టీ స్టారర్, కాని "గుండమ్మ కధ" అని సూర్యకాంతం పాత్ర పేరుమీద సినిమా పేరు పెట్టడమే గొప్ప వైవిధ్యం. హాస్యం, సంగీతం ఈ చిత్రానికి అద్భుత విజయాన్ని సమకూర్చాయి.
గుండమ్మ (సుర్యకాంతం) ఒక గయ్యాళి గృహిణి. ఆమె స్వంత కూతురు సరోజగా జమున, సవతి కూతురు జమునగా సావిత్రి నటించారు. ఇంటెడు చాకిరీ సవతి కూతురు మీద పడుతుంది. స్వంత కూతురు మాత్రం పెంకిగా తయారవుతుంది. గుండమ్మగారి గతించిన భర్తకు స్నేహితుడైన ఒక జమీందారు రామ భద్రయ్య (ఎస్.వి.రంగారావు) పెళ్ళి సంబంధం కుదుర్చుకోవడానికి వచ్చి అ యింటి పరిస్థితి అర్ధం చేసుకొంటాడు. ఇద్దరు పిల్లలనూ తన కోడళ్ళుగా చేసుకొని చనిపోయిన తన స్నేహితుని ఆత్మకు శాతి కలిగించాలనుకొంటాడు.

వారి పధకం ప్రకారం పెద్దకొడుకు అంజి (ఎన్.టి.ఆర్.) గుండమ్మగారి ఇంట్లో పనివాడిగా చేరతాడు. పొగరున్న పనిమంతుడుగా గుండమ్మ విశ్వాసాన్ని, తోటి పనివాడిగా లక్ష్మి మనసును చేజిక్కించుకుంటాడు. ఇంట్లోనే ఉండి చాకిరీ చేస్తాడని గుండమ్మ అంజికి సవతికూతురునిచ్చి పెళ్ళి చేస్తుంది. ఇక రామ భద్రయ్య రెండవ కొడుకు రాజా (ఏ.ఎన్.ఆర్.) సరోజను పెళ్ళి చేసుకొని కాస్త కటువుగా ప్రవర్తించి ఆమె పెంకి తనాన్ని అదుపులో పెడతాడు.@ భారతీయులం 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

చరిత్ర మరచిన మనుషులు...త్యాగం విలువ తెలియని మన నాయకులు. స్వార్ధం తో చేసే రాజకీయం ...కష్టాలు తీరని పేదోడి జీవితం. ఎందుకయ్యా మాకు ఈ స్వార్ధ స్వాతంత్రము....ఎందుకు ఈ అభివృద్ధి !

చరిత్ర మరచిన మనుషులు...త్యాగం విలువ తెలియని మన నాయకులు.
స్వార్ధం తో చేసే రాజకీయం ...కష్టాలు తీరని పేదోడి జీవితం.
ఎందుకయ్యా మాకు ఈ స్వార్ధ స్వాతంత్రము....ఎందుకు ఈ అభివృద్ధి ! @ భారతీయులం 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

మేరా భారత్ మహాన్...@ భారతీయులం By SathishRaj

మేరా భారత్ మహాన్...@ భారతీయులం By SathishRaj 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

ఏంటి ఈ ఆకాశం లో అద్భుతం ..ఈరోజు సూర్యుడిలో నల్ల చుక్కలా కనిపిస్తున్న గ్రహం ఏంటది ? @ భారతీయులం

ఏంటి ఈ ఆకాశం లో అద్భుతం ..ఈరోజు సూర్యుడిలో నల్ల చుక్కలా కనిపిస్తున్న గ్రహం ఏంటది ? @ భారతీయులం  

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

మీకు తెలుసా ? మీరు బరువు తగ్గాలంటే ? మామిడి ని తొక్కు తో తినమని చెప్తున్నారు ...!

మీకు తెలుసా ? 
మీరు బరువు తగ్గాలంటే ? మామిడి ని తొక్కు తో తినమని చెప్తున్నారు ...! @ భారతీయులం 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

మీరు బ్లాగ్స్ రాస్తున్నారా ? మీకు తెలుసా మీరు రాసే మీ బ్లాగ్ మీకు కొంత సాయం చేయగలదు కొంత సొమ్ముని ఇవ్వగలదు.మీరు యాడ్స్ చేయాలను కుంటే ఈ ఫోటో ని లేదా ఇక్కడ క్లిక్ చేయండి.

మీరు బ్లాగ్స్ రాస్తున్నారా ? 
మీకు తెలుసా మీరు రాసే మీ బ్లాగ్ మీకు కొంత సాయం చేయగలదు కొంత సొమ్ముని ఇవ్వగలదు. అవును మీర్ రాసే బ్లాగ్ వళ్ళ మీకు కొంత డబ్బులు కూడా వస్తాయి.
మీరు చేయాల్సింది యాడ్స్ ఇచ్చే వెబ్సైటు వాళ్ళు ఇచ్చే కోడ్ ని మన బ్లాగ్ లో పెడితే సరి.
యాడ్స్ ని పెట్టినందుకు ( మనీ ) డబ్బులు ఇచ్చే మొదటి మరియు గొప్ప సంస్థ గూగుల్.
ఐతే గూగుల్ అందరికి ఆ అవకాసం ఇవ్వదు...ఈ మద్య వాళ్ళు కొత్తగా తెలుగు బ్లోగ్గేర్స్ కి యాడ్స్ కి డబ్బులు ఇవ్వము అని చెప్పేశారు.
అందుకే తెలుగు బ్లోగ్గేర్స్ మీరు గూగుల్ యాడ్స్ లేదని చింతించ కండి మనకి యాడ్స్ కోసం వేరే కొన్ని  సంస్థలు ఉన్నాయి గూగుల్ ఒక్కటే కాకుండా.
ఈరోజు మీకు ఒక  సంస్థ యాడ్స్ ని ఇస్తున్న వివరాలు చెప్తాను.
ఇది అమెరికా కి చెందినా  వెబ్ సైట్ ఐతే మనము ఒక పబ్లిషేర్ ఎకౌంటు ని ఓపెన్ చేయాలి తరువాత మనము మా బ్లాగ్ లేదా వెబ్ సైట్ వివరాలు ఇవ్వాలి అప్పుడు స్మోషన్ వారు చెక్ చేసి మనకు ఈమెయిలు పంపుతారు. అపుడు మనము సెట్ అఫ్ యాడ్స్ అని క్లిక్ చేసి మన బ్లాగ్ లేదా వెబ్ సైట్ కి కోడ్ ని ఇస్తారు అది పెడితే సరి.  మీరు ఎంత సంపాదించింది అనేది వివరాలు ఉంటాయి మరియు కష్టమేర్ కేర్ ఎల్లపుడు ఉంది.
మీరు యాడ్స్ చేయాలను కుంటే ఈ ఫోటో ని లేదా ఇక్కడ క్లిక్ చేయండి.
తెలుగు లేదా ఇంగ్లీష్ బ్లాగ్  లేదా వెబ్సైటు రాస్తున్నారా ? గూగుల్ యాడ్స్ లేదని ఎలా యాడ్స్ అని అనుకుంటున్నారా ? ఇదిగో Create Account  > Show Ads > Earn Money 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

మీకు తెలుసా ? అస్తమిస్తున్న సూర్యడు ఎర్రగా ఎందుకు కనిపిస్తాడు?

మీకు తెలుసా ?
           అస్తమిస్తున్న సూర్యడు ఎర్రగా ఎందుకు కనిపిస్తాడు?
సాయంత్రం పూట ఎర్రగా ఉన్న సూర్యుడు కొండల్లోకి దిగిపోతున్నట్లు కనిపించే దృశ్యాన్ని సాధారణంగా అందరూ ఇష్టపడతారు. మరి సూర్యుడు అస్తమిస్తున్నపుడు ఎర్రగా ఎందుకు కనిపిస్తాడో తెలుసుకుందాం. సాయంత్రం వేళ సుర్యకిరణాలు ఏటవాలుగా పడుతుండటం వల్ల అవి చాలా దూరం ప్రయాణించవలసి ఉంటుంది.

అలా ప్రయాణించేటప్పుడు సూర్యకిరణాలలో ఎరుపురంగు తప్ప మిగిలిన అన్ని వర్ణాలు ధూళి కణాల వల్ల చెల్లా చెదురయిపోతాయి. కాంతిలో ఉండే మిగతావర్ణాల కంటే ఎరుపు రంగుకి తరం ధైర్ఘ్యం ఎక్కువు కావడమే దీనికి కారణం. దాంతో ఎక్కువ తరం ధైర్ఘ్యం వున్న ఎరుపు రంగు మాత్రమే మిగిలి ఉండటం వల్ల అస్తమిస్తున్న సూర్యుడు ఎర్రగా కనిపిస్తాడు. 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

జూన్ 5వ తేదీని "ప్రపంచ పర్యావరణ దినోత్సవం"గా పాటిస్తున్నారు. ఈ పర్యావరణ దినోత్సవం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీచే 1972, జూన్ 5వ తేదీన స్థాపించబడింది.

జూన్ 5వ తేదీని "ప్రపంచ పర్యావరణ దినోత్సవం"గా పాటిస్తున్నారు. ఈ పర్యావరణ దినోత్సవం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీచే 1972, జూన్ 5వ తేదీన స్థాపించబడింది. పర్యావరణ దినం సందర్భంగా, ప్రతి సంవత్సరం జూన్ 5న ఏదేని ఒక నిర్ణీత నగరంలో పర్యావరణానికి సంబంధించిన అంతర్జాతీయ సమావేశం జరుగుతుంది.

ఈ అంతర్జాతీయ సమావేశంలో పర్యావరణానికి సంబంధించిన పలు కీలకమైన అంశాలను చర్చించటమేగాకుండా, పర్యావరణాన్ని కాపాడుకునేందుకు పలు మార్గదర్శక సూత్రాలను రూపొందిస్తుంటారు. 1972వ సంవత్సరంలోనే స్థాపించబడిన "ఐక్యరాజ్యసమితి పర్యావరణ పథకం", ఇదే వేదికను ఉపయోగించుకుని పర్యావరణానికి సంబంధించి.. రాజకీయాల్లోని వారికి, ప్రజలకు అప్రమత్తతను పెంచే దిశగా తగు చర్యలను చేపడుతుంది.

1972వ సంవత్సరం నుంచి క్రమం తప్పకుండా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పాటిస్తున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 2005, జూన్ 5న శాన్ ఫ్రాన్సిస్కోలో అంతర్జాతీయ సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో గ్రీన్ సిటీస్, "ప్లాన్ ఫర్ ది ప్లానెట్" అనే అంశాలపై విస్తృతంగా చర్చించారు.

జూన్ 5, 2006లో అల్గేరియా దేశంలో, "డోంట్ డెజర్ట్ డ్రైల్యాండ్స్" అనే నినాదంతోనూ... జూన్ 5, 2007లో నార్వేలో "మెల్టింగ్ ఐస్ ఎ హాట్ టాపిక్" అనే నినాదంతో... జూన్, 2008 న్యూజిలాండ్‌లో "కార్బన్‌డయాక్సైడ్, కిక్ ద హాబిట్ టు వర్డ్స్ ఎ లా కార్బన్ ఎకానమీ" అనే నినాదంతోనూ... పర్యావరణ దినోత్సవం సందర్భంగా అంతర్జాతీయ సమావేశాలను నిర్వహించారు.

ఇదిలా ఉంటే... నేడు మానవుడు తన మేధో సంపత్తితో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుని, ప్రపంచవ్యాప్తంగా పలు పరిశ్రమలను నెలకొల్పుతున్నాడు. ఈ పరిశ్రమలు వెదజల్లే కాలుష్యంతో కోలుకోలేనంతగా వాతావరణం కలుషితమై... పీల్చే గాలి, త్రాగే నీరు, తినే ఆహారం.. అన్నీ కలుషితమవుతున్నాయి. మానవుడు తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రకృతి ప్రసాదించిన వనరులను అవసరానికి మించి వాడుకుంటున్నాడు.

అంతేగాకుండా, మానవుడు తన వేగవంతమైన జీవితంలో వాహన వేగం పెంచుతూ, ఇంధన కొరతకు కారణమవుతున్నాడు. కార్బన్‌ మోనాక్సైడ్, కార్బన్ డై ఆక్సైడ్ లాంటి విషపూరిత వాయువులు వాతావరణంలో పరిమితికి మించి పెరగడం వల్ల క్రమంగా భూమండలం వేడెక్కుతోంది. అడవులు, జల వనరులు క్రమేపీ తగ్గిపోతున్నాయి. ఈ రకంగా, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో సాధించిన పురోగతి కూడా ప్రకృతి కాలుష్యానికి కారణమవుతోంది.@ భారతీయులం 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

భారతీయులం |bharatiyulam, bharatiyulam.blogspot.com
Related Posts Plugin for WordPress, Blogger...