


మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
నేను మెచ్చినవి నాకు నచ్చినవి...బలే చిత్రాలు విచిత్రాలు. చూసారా. అన్ని ఆ రచయితలవే ఎటు వంటి హక్కులు నేను,ఈ బ్లాగ్ వి కాదు. అందరితో పంచుకోవడం కోసం ఈ నా చిన్న ప్రయత్నం.m&k
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
దేశ సమగ్రత కోసం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన వద్దని చెబుతున్న సీమాంధ్ర ప్రజాప్రతినిధులు అదే సమగ్రత కోసం తమిళనాడులో కలవాలని తెలంగాణ రాష్ట్ర సమితి వరంగల్ జిల్లా మాజీ పార్లమెంటు సభ్యులు వినోద్ కుమార్ సూచించారు. తమిళనాడు నుండి వారు ప్రత్యేక రాష్ట్రాన్ని ఎందుకు డిమాండ్ చేశారో చెప్పాలని ప్రశ్నించారు. వారు డిమాండ్ చేసిన తరహాలోనే మేమూ డిమాండ్ చేస్తున్నామని అందులో తప్పేముందన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా రాష్ట్రాలు ఏర్పడినాయని చెప్పారు. చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యం అన్నారు.
పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. దేశంలో గోవా వంటి కృష్ణా జిల్లా కంటే చిన్న రాష్ట్రాలు ఉన్నాయన్నారు. కృష్ణా జిల్లాను ప్రత్యేక రాష్ట్రంగా చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. తెలంగాణ నేతల మాదిరి కృష్ణా జిల్లా నేతలమంతా రాజీనామాలు చేస్తే ప్రత్యేక కృష్ణా రాష్ట్రాన్ని ప్రకటిస్తారా అని కావూరి హేళన చేయడం సరికాదన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అనేది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష అన్నారు.
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
బ్రహ్మంగారిమఠం, మార్చి 10 : కాలజ్ఞాన కర్త శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సజీవ సమాధి అయిన కడప జిల్లా బ్రహ్మంగారిమఠంలో గురువారం ఓ వింత జరిగింది. సాధువుగా జీవనం సాగిస్తూ మూడేళ్ల క్రితం చనిపోయిన వెంకటయ్య మృతదేహం సమాధిలో మూడేళ్ల తర్వాత కూడా చెక్కు చెదరలేదు. ఆయన నిర్మించిన ఆశ్రమంలోనే మూడేళ్ల క్రితం సమాధి చేశారు. ఆయన చనిపోయిన తర్వాత బంధువులు ఆశ్రమాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు విక్రయించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆశ్రమాన్ని కూలదోస్తూ ఎక్స్‌కవేటర్‌తో చదరం చేస్తున్నపుడు గురువారం సాధువు వెంకటయ్య మృతదేహం సమాధి నుంచి బయటపడింది.
మృతదేహాన్ని బద్వేలు ప్రాంతానికి బంధువులు తరలిస్తుండగా గమనించిన నర్సన్నపల్లె గ్రామస్థులు ఆశ్రమాన్ని కూల్చివేసిన వారికి దేహశుద్ధి చేసి స్థానిక పోలీసులకు అప్పచెప్పారు. మూడేళ్లయినా మృతదేహం చెక్కు చెదరకుండా ఉండడంతో స్థానిక ప్రజలు పూజలు నిర్వహించడం మొదలు పెట్టారు. ఈ విషయం చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించడంతో ప్రజలు భారీగా సంఘటనా స్థలానికి తరలి వచ్చి వెంకటయ్య మృతదేహాన్ని చూసి పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక తహసీల్దారు సాయినాథ్ , బి.మఠం ఎస్ఐ రామచంద్రయ్య గ్రామస్తులతో చర్చించి సాధువు వెంకటయ్య మృతదేహాన్ని యధా స్థానంలోనే మళ్లీ సమాధి చేశారు.
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!