మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
Is this blog?
భారతీయులం
కోర్సులో ప్రవేశించిన దగ్గర్నుంచీ డిగ్రీ చేతికందేలోపు మూడు/నాలుగు సంవత్సరాల కాలం తక్కువేమీ కాదు. ఈ వ్యవధిని ఎంత ప్రయోజనకరంగా మల్చుకోగలం అన్నదానిపైనే కెరియర్, భావి జీవిత గమనం ఆధారపడివుంటాయి. ప్రవేశపరీక్ష వరకూ బాగా కష్టపడి చదివి కఠినమైన పోటీలో సీటు సంపాదించిన ప్రతిభావంతులైన విద్యార్థులే తర్వాత నిర్లక్ష్యధోరణితో ఫెయిలవుతున్న ఉదంతాలు ఐఐటీల్లో కూడా గమనించవచ్చు. ఈ పరిస్థితిలోకి జారిపోకుండా విద్యార్థులు జాగ్రత్త వహించాలి.
విదేశాల్లో ఉద్యోగం సంపాదించాలంటే అర్హతలూ, నైపుణ్యాలూ మెరుగైన స్థాయిలో ఉండాల్సిందే కదా! వేరే దేశంలో భిన్న సంస్కృతుల నేపథ్యం ఉన్నవారితో కలిసి పనిచేస్తే అది వృత్తిపరమైన ఎదుగుదలకూ, వ్యక్తిగత వికాసానికీ కూడా ఉపయోగపడుతుంది. తాత్కాలికంగా కావొచ్చు; శాశ్వతంగా కావొచ్చు- విదేశాల్లో విధుల నిర్వహణ విశిష్ట అనుభవాన్ని సంపాదించిపెడుతుందని అక్కడ ఉద్యోగాల్లో కొనసాగుతున్న నిన్నటి ఇంజినీరింగ్ విద్యార్థులు ఘంటాపథంగా చెపుతున్నారు.
విదేశాల్లో రాణించటానికి తోడ్పడే లక్షణాలేమిటి?
కమ్యూనికేషన్ సామర్థ్యాలు
మనది ఆంగ్లం మాతృభాషగా ఉన్న దేశం కాదు. మన నిత్యవ్యవహారాలన్నీ మాతృభాష సాయంతోనే సజావుగా నడిచిపోతుంటాయి. ఇంగ్లిష్ పరీక్షలో చాలామంచి మార్కులు తెచ్చుకున్నప్పటికీ మన విద్యార్థుల్లో చాలామంది ఆంగ్లభాషా వాగ్ధాటి చాలా తక్కువ. ఇంగ్లిష్ అంతర్జాతీయ భాష కాబట్టి మనం ఏ దేశం వెళ్ళాలన్నా ఈ భాషపై పట్టు ఉండటం అవసరం.
కళాశాల విద్య కోసమే కాదు, దైనందిన జీవితంలో కూడా దీని ఆవశ్యకత ఎక్కువని తెలిసిందే. కాబట్టి స్వదేశంలో విద్యాభ్యాసం పూర్తికాకముందే ఆంగ్ల భాషా వ్యక్తీకరణలో నైపుణ్యం పెంచుకోవటానికి కృషి చేయటం ముఖ్యం.
సబ్జెక్టు పరిజ్ఞానం, కోర్సులు
మనదేశంలోని విధానానికి భిన్నంగా విదేశాల్లో విద్యావ్యవస్థ ఉంటుంది. ఇక్కడ సిద్ధాంతపరమైన దృష్టి అధికం. కానీ విదేశాల్లో ప్రయోగ అనుభవానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి ఈ లోపం సవరించుకునేందుకు అదనంగా మన విద్యార్థులు కృషి చేయాల్సిందే.
ప్రధానంగా కంప్యూటర్ సైన్స్, ఐటీ బ్రాంచిల విద్యార్థులు విదేశాల్లోని ఈ కోర్సుల స్థాయి అందుకోవటానికి తమ అవగాహన సామర్థ్యాలను పెంచుకోకతప్పదు. అదనపు కోర్సుల, లాంగ్వేజెస్ పరిజ్ఞానం సాధించగలిగితే ఎల్లప్పుడూ ఉపయోగమే. విదేశాల్లో ఈ కోర్సుల నిర్మాణం ఇక్కడి కోర్సుల మాదిరి ఉండదు. ఎక్కడ చదివినా ఈ కోర్సులకు సంబంధించిన అదనపు పరిజ్ఞానం మాత్రం పెంపొందించుకోవాలి.
సరైన కోర్సు ఎంపిక
తమ స్నేహితుల, కుటుంబసభ్యులిచ్చిన సమాచారం, సలహాలపై ఆధారపడే ఎక్కువమంది కోర్సు/ బ్రాంచిలను ఎంచుకుంటుంటారు. ఇది సరైన ఎంపిక కాకపోయే ప్రమాదముంది. దీనికంటే తన ఆసక్తి, అభిరుచులకు ప్రాధాన్యం ఇస్తూ నిర్ణయం తీసుకోవటానికి ప్రయత్నించటం మేలు.
చదవబోయే కోర్సులో ఏమేం నేర్చుకోవాల్సివుంటుంది, కళాశాల తీరు ఎలా ఉంటుందీ... ఇవన్నీ పూర్తిగా తెలుసుకుని చేరటం వల్ల తర్వాతకాలంలో ఇబ్బందులు తలెత్తవు. పూర్తిగా కోర్సుమీద మనసు కేంద్రీకృతం చేయగలుగుతారు.
కోర్సు అంశాలు తన అవగాహనకూ, ధోరణికీ సరిపోవని భావిస్తే ఇతర బ్రాంచిలను ఎంచుకోవచ్చు. ఎందుకంటే... ఇష్టమైన సబ్జెక్టులోనే ఏ విద్యార్థి అయినా విశేషంగా రాణించే అవకాశం ఉంటుంది. మెరుగైన కెరియర్‌కైనా, విదేశాలకు వెళ్ళటానికైనా ఇది పునాదిగా ఉపకరిస్తుంది.
విదేశాల్లో పరిస్థితులు
డిగ్రీ తర్వాత విదేశాల్లో కోర్సు/ఉద్యోగంలో ప్రవేశించదలిచినవారు తాము లక్ష్యంగా పెట్టుకున్న దేశంలోని పరిస్థితులను తెలుసుకోవాలి. వాతావరణ పరిస్థితులపై అవగాహన కూడా అవసరమే. చాలామంది విద్యార్థులు పరాయి దేశాలకు చేరుకున్నాక అక్కడి వాతావరణం సరిపడక వివిధ రుగ్మతలతో ఇబ్బందిపడుతుంటారు. చదువు/ విధినిర్వహణపై ఈ ప్రభావం తప్పకుండా పడుతుంది. ఈ సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటం విస్మరించరానిది.
ఇతరదేశాల్లోని జీవన పరిస్థితులూ, వారి జీవన శైలి మనకంటే భిన్నంగా ఉంటుందని గుర్తించాలి. మనదేశంలో బయట కూడా బిగ్గరగా మాట్లాడుకుంటుంటాం కదా? చాలా దేశాల్లో బహిరంగ ప్రదేశాల్లో మౌనంగా ఉండటం సాధారణం. వీటిని గమనించి అక్కడి పరిస్థితులకు తగ్గట్టుగా తమను మల్చుకోవాలి. విద్యార్థులకు ఆ దేశంలో బంధువులూ, స్నేహితులూ ఉంటే సాపేక్షంగా కొంత ఉపయోగకరం.
ఇలాంటి అంశాలపై అవగాహన పెంచుకోవటం కష్టమేమీ కాదు. ఆపై విదేశాల్లో పీజీ చేసినా, కొలువులో చేరినా ఆ ప్రస్థానం సాఫీగా విజయవంతంగా మారుతుంది.
కీలక నైపుణ్యాలు ముఖ్యం
విదేశీ విద్య, ఉద్యోగాలకు ఉపకరించే కొన్ని ప్రధాన నైపుణ్యాలపై విద్యార్థులు దృష్టిపెట్టటం మేలు. తాము ఎంచుకున్న రంగాన్ని బట్టి అవసరమైనవాటిని పెంపొందించుకోవటానికి ప్రయత్నించాలి.
భాష: స్పోకెన్, రిటన్ ఇంగ్లిష్‌లో చెప్పుకోదగ్గ ప్రావీణ్యం పెంచుకోవటం.
లేఖనం: బిజినెస్ లేఖలు, ఎజెండాలు, మినిట్స్ రాసే ప్రతిభను సానపెట్టుకోవటం.
కంప్యూటర్: వర్డ్‌ప్రాసెసింగ్, స్ప్రెడ్ షీట్లు, డేటాబేసెస్ ఉపయోగించటం, పవర్ పాయింట్, వెబ్ పరిశోధన.
నిర్వహణ:to-do lists తయారీ, ఎగ్జిక్యూటివ్ సమ్మరీ, ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ ప్రణాళికలు
భావ వ్యక్తీకరణ: స్పష్టంగా, సమర్థంగా భావాలను తెలియజేసే నేర్పు, మార్కెటింగ్ వ్యూహాల పరిజ్ఞానం.
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీలోని మొదటి పేపర్ పోటీపరీక్షలన్నిటిలోనూ సాధారణంగా కనపడేదే. ఈ సర్వీసుకు తగిన అభిరుచి అభ్యర్థుల్లో ఎంతమేరకు ఉన్నదో పరీక్షించేది రెండో పేపర్. ప్రిలిమినరీ విజయసాధనలో ఈ పేపర్ పాత్ర కీలకంగా మారింది. ఈ పేపర్ స్వభావం, తీరులను విశ్లేషిద్దాం!
విభిన్న పరిస్థితుల్లో అభ్యర్థుల ప్రతిభా సామర్థ్యాలను అంచనా వేసే రెండో పేపర్‌కు పకడ్బందీగా సిద్ధమవటం తప్పనిసరి. లేకపోతే మంచి స్కోరు సాధ్యం కాదు. ఏడు రకాల విభాగాలుండే ఈ పేపర్‌లో మొత్తం ప్రశ్నలు 80. ప్రతి సరైన జవాబుకూ రెండున్నర మార్కులు.
ఒక్కో విభాగాన్ని ఏ లక్ష్యంతో ప్రవేశపెట్టారో, సంసిద్ధమెలా అవాలో పరిశీలిద్దాం.
కాంప్రహెన్షన్
పాలనలో భాగస్వామిగా ఉండే అధికారి తన విధులు సక్రమంగా నిర్వర్తించాలంటే అవగాహన శక్తి ముఖ్యం. ఒక నిర్దిష్ట పరిస్థితిలోని ముఖ్యాంశాలను గుర్తించి విశ్లేషించగల సత్తా, తగిన నిర్థారణకు వచ్చే విజ్ఞతా ఉండాలి. నివేదికలూ, సమాచారం పరిశీలిస్తూనే కార్యాచరణకు ప్రణాళిక రూపొందించుకోవాలి.
రీడింగ్ కాంప్రహెన్షన్ విభాగం ఈ నైపుణ్యాలను పరీక్షిస్తుంది. అభ్యర్థులకు 2-3 పేరాగ్రాఫులు ఇచ్చి బహుళైచ్ఛిక (మల్టిపుల్ చాయిస్) ప్రశ్నలకు జవాబులు రాయమంటారు.
ఇంటర్ పర్సనల్, కమ్యూనికేషన్ స్కిల్స్
పాలనాధికారుల విధుల్లో భావ ప్రసారానికి (కమ్యూనికేషన్) ప్రాముఖ్యం ఉంది. బృందంలో పనిచేయటం పెరిగిన ప్రస్తుత కాలంలో ఈ నైపుణ్యాలు పెంచుకుంటేనే విజయానికి దగ్గరవుతాము. ఉద్యోగుల్లో నిబద్ధత, పని సామర్థ్యం మెరుగుపరచటానికి సమర్థమైన భావప్రసారం చేయగలగాలి. ఆత్మవిశ్వాసం, సంబంధాల మెరుగుదల, ఇతరులకు ఆమోదయోగ్యమవటం... ఇవన్నీ సమర్థ కమ్యూనికేషన్ వల్లనే సాధ్యం. సివిల్ సర్వెంటుకు ఇది చాలా కీలకం.
ఇద్దరు వ్యక్తుల మధ్య పరస్పరం జరిగే భావాల ప్రసారాన్నే ఇంటర్ పర్సనల్ నైపుణ్యాలంటారు. భిన్న పరిస్థితుల్లో రకరకాల వ్యక్తులతో తగిన విధంగా వ్యవహరించి ప్రజలు నిశ్చింతగా ఉండేలా చేయగలగాలి. ఆలకించటం, మాట్లాడటం, ఘర్షణను నివారించటం- ఇవి ఈ నైపుణ్యాలతో సాధించే సాధారణ ఫలితాలు.
ఈ విభాగంలో ప్రశ్నలకు నెగిటివ్ మార్కింగ్ ఉండదు.
ఉదా:1. How would you best console a bereaved person?
a) Do not talk about the dead person for fear of causing pain. b) Give him a sedative on a regular basis after consulting a doctor. c) Instead of speaking give him a sympathetic touch. d) Offer help with the practical tasks and be prepared to listen. (Answer)
లాజికల్ రీజనింగ్, ఎనలిటికల్ ఎబిలిటీ
ఆలోచనల పనితీరుపై ఆధారపడి మనుషులను మూడు రకాలుగా వర్గీకరించొచ్చు. 1) సరిగా, పొందికగా ఆలోచించలేనివారు 2) లోకజ్ఞానం, అనుభవం, తెలివితేటలు ఉపయోగించి నెగ్గుకువచ్చేవారు 3) దృఢంగా, తార్కికంగా ఆలోచించి ఇతరులకంటే శక్తిమంతంగా నిర్వహణ చేయగలిగేవారు. ఈ మూడో లక్షణమున్నవారే పాలనాధికారులుగా నేటి అవసరం.
ఈ నైపుణ్యాలను పరీక్షించేలాగానే ప్రశ్నలుంటాయి.
ఉదా:All big dams involve displacement of people and risk of serious harm to the ecology of the region. The claims of pro-big dam enthusiast cannot be sustained in terms of costs and benefits.
Assuming the truth of the passage, one can conclude from it that :
a) No big dam should ever be constructed whatever be the benefits arising out of it. b) All big dams from the very nature of its 'highness'destroy ecology or displace people. c) Big dam should only be undertaken provided it displaces the minimum number of people causes negligible damage to ecology and provide substantial benefits when completed. (Answer ) d) There are abundant alternatives to each water in scarcity areas such a way that , what big dams can offer, the alternatives can provide more efficiently at lesser cost.
డెసిషన్ మేకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్
ప్రైవేటురంగంలోని ఉద్యోగి తీసుకునే నిర్ణయం కంటే సివిల్ సర్వెంట్ తీసుకునే నిర్ణయాలు ఎక్కువమంది ప్రజలపై ప్రభావం చూపిస్తాయి. పరిస్థితుల మంచి చెడులను బేరీజు వేసి, సత్వర నిర్ణయాలు తీసుకోగలగాలి. వీరు తీసుకునే నిర్ణయాలన్నీ ప్రజలకు ఉపయోగపడాలి. ఇలాంటివారిని గుర్తించటం సివిల్స్ నియామకాల లక్ష్యం.
డెసిషన్ మేకింగ్‌కు సన్నిహితంగా అనుసంధానమైవుండేది ప్రాబ్లమ్ సాల్వింగ్. సివిల్ సర్వెంట్లందరూ ఈ నైపుణ్యాలనుపెంపొందించుకునివుండాలి. సమస్యను దాని ఆనుపానులు గ్రహించి, అందులో భాగమైవున్నవారి సహకారంతో పరిష్కరించాలి.
పరీక్షలో ఊహాత్మక సందర్భాలను ఇచ్చి ఈ నైపుణ్యాలను పరిశీలిస్తారు. అత్యుత్తమ నిర్ణయాన్ని ఎంచుకుని, సమాధానంగా గుర్తించాల్సివుంటుంది. నెగిటివ్ మార్కులుండవు.
ఉదా:1. You are having dinner with your colleagues. Suddenly one of your colleagues starts choking. What would be your first reaction?
a) Reach for his throat around the voice box with your thumb and forefinger. b) Ask him 'are you choking' and see if he is able to reply. (Answer ) c) Ask him to leave the dining area immediately and go to the rest room. d) Try to help him cough so that the obstruction is cleared.
జనరల్ మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ
అందుబాటులో ఉన్న గణాంక సమాచారం ఆధారంగా పాలనాధికారులు ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్నారు. డేటా విశ్లేషణ ఆధారంగా సరైన సమాచారాన్ని ఉన్నతాధికారులకు నివేదించాల్సివుంటుంది.
ఈ విభాగంలో ప్రశ్నలు గ్రాఫులు, డయాగ్రమ్‌లు, సంకేతాలతో నిండివుంటాయి. యూపీఎస్‌సీ ప్రకారం మెంటల్ ఎబిలిటీ అనేది ఇంటలెక్చువల్ ఎబిలిటీ అని గ్రహించాలి.
ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ స్కిల్స్
సివిల్ సర్వెంట్లకు 'ఫంక్షనల్ ఇంగ్లిష్' పరిజ్ఞానం తగినంత అవసరమని అందరూ అంగీకరిస్తారు. అభ్యర్థి ఆంగ్ల భాషా నైపుణ్యాలను ఈ విభాగం పరీక్షిస్తుంది. కొన్ని పేరాలు ఇచ్చి మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు రాయమని అడుగుతారు. దీనికి సంబంధించి అభ్యాసాలకు పనికొచ్చే మెటీరియల్ విస్తృతంగానే లభ్యమవుతోంది.
పాత ప్రశ్నపత్రాలను విశ్లేషించి, తగిన వ్యూహం తయారుచేసుకోవాలి. దాన్ని దీక్షగా అమలుచేయాలి.
- గోపాలకృష్ణ (డైరెక్టర్ , బ్రెయిన్ ట్రీ)
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
Can you tell me how to disassociate a phone number with a Google email address?
On Tuesday, December 25, 2012 9:14:39 AM UTC-8, Manam Bharatiyulam wrote:
Your Gmail account's password isn't just for Gmail. Gmail's password is shared by all the other Gmail applications such as Google Docs, youtube etc. So when it comes to secure your Gmail password extra concern must be taken. Gmail provides you a unique password verification feature that makes your Gmail password more robust and hack proof. This feature is known as "Two-Step Verification." This feature allows you to enable two step account verification process before your login to your Gmail account. Once you login to your Gmail account using this feature, Gmail enables you to login with the same PC for next 30 days without any verification. (this feature is optional). Two-Step Verification allows you to login from selected PCs into your Gmail account.
As per Google, 2-step verification adds an extra layer of security to your Google Account. Besides, your username and password, you'll have enter an unique code to sign in to your Gmail account. This uniques code will be generated to your cell phone via text or a voice message once you initiate signing process.
Let us learn how to secure your Gmail account and add Two-Step Verification
How to Set up Two-Step Verification:
- Login to your Gmail account.
- Go to your Google Account Settings.
- On the Account Settings page, search for "2-Step Verification" and click "edit" option to turn it on.
- Before you proceed further, please have your cell phone/mobile with you and ready.
- You need to set up your mobile phone to receive unique codes via SMS text message or through a voice call over your mobile phone. You can also download the app and use over your cell phone, if you have a smart-phone (app enabled cell phone).
- Complete the next few steps to register your mobile phone for Two-Step Verification. Gmail will verify your mobile phone by sending SMS text message. Enter the code to verify your mobile phone.
Once this feature is enabled, to access your Gmail you will always require the password, and Gmail unique code that will be delivered to you via your cell phone. If you wish Gmail to remember your computer for login, (so that it doesn't asks u to verify Two Step Verification for next consecutive 30 days) check the option that says "remember me for 30 days on this device"
Even if you lost your cell phone or you don't have your cell phone with you, you can use Two Step Verification and easily login to your Gmail account. Google offers multiple ways to generate Two Step Verification codes. You can add a secondary backup phone or you can print the single-use verification codes.
--
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
తల్లిదం డ్రులన్న దైవసన్నిభులు
తల్లిదండ్రులన్న దైవసన్నిభులురా అన్నది కవులు చెప్పినమాట. ప్రతీచోటా దేవుడు కనబడలేక అమ్మానాన్నలను అందించాడన్నది పెద్దలు చెప్పిన మాట. ఈ రెండు నిజమే! దేవుడు అభవుడు అని వేదాలు చెబుతున్నాయి. అంటే పుట్టుకే లేనివాడు అని అర్ధం. అలాంటి పుట్టుకలేనివాడు కూడా భూలోకానికి వచ్చి అమ్మానాన్నలను ఎంచుకుని మరీ పుడుతున్నాడు. వాళ్ల చల్లని ఒడిలో సేదతీరుతున్నాడు. ముద్దు, మురిపెం, అచ్చటా ముచ్చట తీర్చుకుంటున్నాడు. నా అన్నవాడు లేక మొహంవాచిపోయే దేవుడు తనకంటూ ఒక వర్గాన్ని సృష్టించుకోడానికి యుగానికొకసారి పుడుతున్నాడు. దశావతారాలలో మత్స, కూర్మ, వరాహ, నారసింహ అవతారాలకు తల్లిదండ్రుల అవసరమే లేకుండా పోయింది. ఆ తరువాత వచ్చిన వామనుని అవతారం మనిషి అవతారానికి ప్రాథమిక రూపం. ఈ పొట్టి బాపడు పుట్టడానికి అమ్మానాన్నలు కావలసి వచ్చారు. అందుకు కశ్యప ప్రజాపతి, అదితి యోగ్యత సంపాదించారు. వారి కడుపున పుట్టిన బుడతకిశోరుడు వామనుడు. వచ్చిన పని చాలా చిన్నది కావడంతో ఆయనకు పెరిగి పెద్దయ్యేవరకు అమ్మానాన్నల దగ్గర ముద్దులు గునిసేంత సమయం లేకపోయింది. ఆ లోటు తీర్చుకోడానికేనా అన్నట్టు నారాయణుడు రాముని అవతారం ఎత్తాడు. కౌసల్యతో పెళ్ళయినా ఎప్పటికీ ప్లిలలు పుటలేదు. ముగ్గురు భార్యలున్నా సంతానలేమి ఆయనను వదలలేదు. వయసుమళ్ళిపోతున్న దశలో పుత్రకామేష్టి యాగం చేశాడు దశరథుడు.యజ్ఞసంభవుడిగా పుట్టిన రాముడిని ప్రాణాధికంగా పెంచుకున్నారు కౌసల్యా దశరథులు. ఒకేసారి దశరథుడికి నలుగురు పిల్లలు పుట్టినా రాముడంటే దశరథుడికి ఎంతో అభిమానం. అలా అని మిగిలిన పిల్లల మీద అభిమానం లేదని కాదు. అయ్యకు పెద్దపిల్లవాడిమీద, అమ్మకు చిన్న పిల్లవాడిమీద మమకారం చాలా సహజంగా ఉంటుందని పెద్దలు చెబుతారు. అదే నీతి దశరథుని విషయంలోనూ పనిచేసింది. రాముడు నాన్నచాటు పిల్లవాడు అనే పేరుంది. అందుకే ఆయనను దాశరథి అని పిలుస్తారు. కానీ విశ్వామిత్రుడు ఆయనను కౌసల్యసుప్రజారామా అని పిలిచాడు. అంటే కొసల్య కుమారా అని అర్ధం. అంటే రాముని ఆయన అమ్మచాటు పిల్లవాడిగా చూశాడు. ఇప్పటికీ మనం కౌసల్యాసుప్రజారామా అనే రాముడిని మేలుకొలుపుతున్నాం. ఈ రెండు కీర్తులను సమన్వయ పరచుకుంటే అర్థమయ్యేదేమిటి ఆయన అమ్మానాన్నలిద్దరికీ ప్రియమైన కుమారుడనేకదా రాముడు చిన్నపðడు ఆకాశంలో దగదగ మెరిసే చందమామ కావాలని ఏడిస్తే కౌసల్య దశరథుడు ఇద్దరూ కంగారు పడ్డారు. భూమ్మీద దొరికే అవకాశంలేని చందమామను తీసుకురమ్మంటే తెచ్చేది ఎలా పెద్దకొడుకు..కోరక కోరిన కోరిక అది. ఆ భావన ఇద్దరినీ గిలగిలలాడేలా చేసింది. రాముడు ఏడిస్తే భరించలేని వాళ్ళు ఆయనను ఎలాగైనా ఓదార్చేందుకు అద్దం తెచ్చి అందులో ప్రతిబింబం చూపించి రాముడితో ఏడుపు మానిపించారు. అక్కడితో హమ్మయ్య అనుకున్నారు. విశ్వామిత్రుడు రాముడిని అడవికి పంపమన్నపðడు ఇద్దరి గుండెలు అదిరాయి. అయితే విశ్వామిత్రుని గురుత్వంలో రాముడు బాణవిద్యలో ఆరితేరి దివ్యాస్త్ర సంపన్నుడయ్యాడని, రాక్షసలోకాన్ని నాశనం చేశాడని తెలిసి బ్రహ్మానంద పడ్డారు. అలాగే తమకంటికి ఇంకా చిన్నపిల్లవాడే అనిపించిన రాముడు శివుడి విల్లు విరిచి సీతను చేపట్టి జగదభిరాముడయ్యాడని తెలిసి వారి ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. రాముడికి రాజ్యాన్ని అప్పగించి విశ్రాంతి తీసుకోవాలనుకున్న దశరథుని కోరిక కైకేయి వల్ల వమ్మవడం దశరథుడు తట్టుకోలేకపోయాడు. రాముడి వియోగం భరించలేక గుండెలు బద్దలైన దశరథుడు కన్నుమూశాడు. తండ్రిని కోల్పోయిన రాముడు పరమభక్తితో శ్రాద్ధకర్మలు నిర్వహించి మానవజాతికి తల్లిదండ్రుల రుణం తీర్చుకునే పద్ధతిని, మర్యాదను, నాగరికతను నేర్పాడు. అందుకే రాముడు మర్యాదాపురుషోత్తముడయ్యాడు.
రాముని భార్యగా విఖ్యాతి గడించిన సీత తండ్రిచాటు బిడ్డ. అందుకే ఆమెకు జానకి అనే పేరు వచ్చింది. అమ్మ రత్నమాల అంటే గౌరవం ఉన్నా ఆడపిల్లలు సహజంగా తండ్రినీడనే కోరుకుంటారు. సీత కూడా అదే చేసింది.
ఇదే రామాయణంలో తల్లిదండ్రులను కావడిలో పెట్టుకుని తీర్థయాత్రలు చేయిస్తూ అమ్మానాన్నల రుణం తీర్చుకున్న శ్రవణకుమారుడు కనిపిస్తాడు. అమ్మానాన్నల కోసం మంచినీటిని తీసుకురావడానికి చెరువుకు వెళ్ళిన శ్రవణకుమారుడు ముంత ముంచుతున్న చపðడు విని అదేదో అడవిజంతువు అనుకుని దశరథుడు బాణం వేస్తాడు. అది తగిలి అమ్మా అని కేకపెడతాడు. ఆ కేక విన్నవెంటనే దశరథుడికి ముచ్చెమటలు పోస్తాయి. తన బాణాహతికి ప్రాణం కడగట్టిన శ్రవణకుమారుడిని చూసి బ్రహ్మహత్య చేశానే అని పరితపించిపోతాడు. ఆ కుమారుడి కోరిక మేరకు మంచినీటి ముంతను తీసుకుని శ్రవణుని తల్లిదండ్రులకు అందిస్తాడు. వచ్చిన వాడు తమ పిల్లవాడు కాదని ఆయన అలికిడి ద్వారా గ్రహించిన ఆ ముసలి దంపతులు దశరథుడి ద్వారా జరిగిన విషయం తెలిసి పెను దుఃఖంతో ప్రాణాలు విడుస్తారు. అమ్మానాన్నలకు పిల్లలకు ఉండే బంధం అంత సున్నితమైంది.
ఇదే రామాయణంలో పరశురాముడు కనబడతాడు. తండ్రి జమదగ్ని గొప్ప తపశ్శాలి. తల్లి రేణుక పరమపతివ్రత. ఇసుకతో కుండచేసి పచ్చి ఆరకుండానే నీళ్ళు తేగలిగిన మాహాత్మ్యం ఆమెది. ఒకరోజున ఆమె నీళ్ళు తేవడానికి వెళ్తే ఇసుక కుండ నిలువలేదు. నీళ్ళు తేవడానికి కుదరలేదు. ఆమె మనసులో అన్య చింతన వచ్చి మనసు మలిన పడిందని ఆమెకు మరణశిక్ష విధించాడు జమదగ్ని. దాన్ని అమలుచేయాలంటూ కొడుకులను ఆదేశించాడు. కానీ కొడుకులు అమ్మను చంపేందుకు ఒపðకోలేదు. అది తన ఆజ్ఞాధిక్కారమేనని జమదగ్ని వారినందరినీ భస్మం చేసి పారేశాడు. చిన్న కొడుకు పరశురాముడు తండ్రి మాటను నిరాకరించలేక, అమ్మను దూరం చేసుకోలేక ఒక్క క్షణం సతమతమయ్యాడు. సృష్టికి ప్రతిసృష్టి చేయగల శక్తి గల తండ్రిమాట తలదాల్చి తల్లిని నరికేశాడు. జమదగ్ని శాంతించి వరం కోరుకోమన్నాడు. అడిగిందే తడవుగా అమ్మ ప్రాణాలు కావాలన్నాడు పరశురాముడు. ఆ విధంగా అమ్మానాన్నలను మెప్పించడమే కాదు రాముడికన్నా ముందుగా పితృవాక్యపరిపాలకుడన్న పేరు పొందాడు. విష్ణువు ధరించిన దశావతారాలలో ఒకడిగా పూజలందు కున్నాడు.
ఆ తరువాత ప్రజలలో బాగా పేరుపడిన వాడు శ్రీకృష్ణుడు. పుట్టింది దేవకీ వసుదేవులకు. పెరిగింది యశోదానందుల వద్ద. ఈ విధంగా కృష్ణుడు ఇద్దరు అమ్మానాన్నల మద్దుల కొడుకయ్యాడు. నిజానికి దేవకికి గర్భశోకమే తప్ప పిల్లవాడిని గట్టిగా కన్నారా చూసిందేలేదు. అర్థరాత్రివేళ రహస్యంగా జైలు దాటించి యమునానదిని దాటి గోపల్లెకు చేర్చే అతి కీలకమైన కార్యభారాన్ని గుండెలు గుప్పిట్లో పెట్టుకుని నిర్వహించిన వాడు వసుదేవుడు. జైలు తలుపులు దాటగానే గాడిద రూపంలో ఉన్న రాక్షసుడు గట్టిగా ఓండ్రపెట్టాడు. రహస్యం ఎక్కడ బట్టబయలవుతుందో అని వసుదేవుడు కొడుకు కోసం గాడిద కాళ్లు గడ్డం పట్టుకుని బతిమాలుకున్నాడు. అందుకే వసుదేవుడంతటివాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడనే సామెత వచ్చింది. కృష్ణుడు గోకులానికి చేరిన దగ్గర్నుంచి ఆయనను కాపాడవలసిన బాధ్యత యశోదానందులపైన పడింది. పసికందులు కంటపడితే నరికేయాలన్న కంస హింసాత్మక చట్టం చాలా బలంగా అమలవుతున్న రోజులవి. పైగా యశోద ఉండే గోకులంపై ప్రత్యేకంగా కన్నువేసి ఉంచాడు కంసుడు. ఆ పరిస్థితిలో కృష్ణుడిని కాపాడడం బ్రహ్మప్రళయంతో సమానం. పైగా కృష్ణుడు మామూలుగా పెరిగాడా ఎప్పటికపðడు ఎక్కడికక్కడ మాయలుచేస్తూ మంత్రాలు చేస్తూ లీలామానుష విగ్రహుడిగా వార్తలకెక్కుతూ తన ఉనికిని చాటుకుంటూ ఉండేవాడు. కృష్ణుడు లీల చేసిన ప్రతీసారి యశోద గుండెల్లో రాళ్ళు పడేవి. బలరాముడు ఎంత నియంత్రించినా కృష్ణుడు ఆగేవాడు కాడు. మట్టితినే కృష్ణుని మందలించడమేకాదు పితూరీలు చెప్పే ఇరుగుపొరుగు వారికి అక్షింతలు వేయడం వరకు యశోద చేసిన పనులు ఇన్నీ అన్నీ కావు. తన పనులతో ఎన్ని ఇబ్బందులు పెట్టినా తన చల్లని నవ్వుతో యశోదను మాయచేసేవాడు. వాడు చేసే పనులు కలయో వైష్ణవమాయయో అనిపించేవి. అలా కంటికి రెప్పకన్నా ఎక్కువగా కాపాడుకుంటే కృష్ణుడు పెద్దవాడై రాచనగరుకు వెళ్ళి కంసుని చంపాక అక్కడే ఉండిపోయాడు. ఎనిమిది వివాహాలు చేసుకున్నా ఒక్క పెళ్ళికీ యశోదను పిలవలేదు. సంక్లిష్టమైన బాల్యాన్నంతా యశోదమీదికి నెట్టి వైభోగాలకు నెలవైన ప్రాయాన్ని దేవకీ వసుదేవులకు ఇచ్చాడు. యశోదానందులు పెద్ద కృష్ణుడి ఎడబాటుతో కుమిలిపోతే, చిలిపి కృష్ణుని చిన్నారి చేష్టలు చూసే భాగ్యానికి దేవకీవసుదేవులు దూరమయ్యారు. ఇద్దరూ అలా కొంత ఆనందాన్ని, కొంత బాధను పొందినవారే! అయినా శ్రీకృష్ణుడు యశోదాకృష్ణుడిగా, నందనందనుడిగా, వాసుదేవుడిగా, దేవకీపరమానందంగా వాసికెక్కాడు. అమ్మానాన్నలందరికీ సమానస్థాయిలో న్యాయం చేసిన శ్రీకృష్ణుడు అమ్మానాన్నల కూచిగానే మిగిలిపోయాడు.
భారతంలో విషాదకరమైన బాధను అనుభవించిన వాడు కర్ణుడు. దివ్యుడైన తండ్రి సూర్యభగవానుడు సహజ కవచకుండలాలు కలిగిన తన కుమారుడిని వంచించి వాటిని కాజేసేందుకు ఇంద్రుడు వస్తున్నాడని తెలిసి ముందస్తు హెచ్చరిక చేసి కన్నతండ్రిలోని కడుపుతీపి ఆరాటం ఎంతటిదో నిరూపించాడు. కుంతి ప్రాయంలో ఉన్నపðడు ఏ దేవుడినైనా పిలిచి ఆయన ద్వారా సంతానాన్ని పొందే వరం ఇచ్చాడు. దాన్ని పరీక్షించాలనే చాపల్యంతో కుంతి సూర్యభగవానుని పిలిచింది. ఫలితంగా కర్ణుడు జన్మించాడు. కన్నెగా ఉండి బిడ్డతల్లి అయిందంటే లోకం ఆడిపోసుకుంటుందన్న భయంతో ఆ వరప్రసాదిని గంగపాలు చేసింది. అమ్మగా కళంకాన్ని మూటకట్టుకున్నా వివాహానంతరం పుట్టిన బిడ్డలను జాగ్రత్తగా కాపాడుకుంది. తన సవతి మాద్రి కొడుకులు నకుల, సహదేవులను తన బిడ్డల కన్నా ఎక్కువగా చూసుకుని అమ్మలేని లోటు రానీయకుండా కాపాడు కొచ్చింది.
దుర్యోధనుడు ఎంతటి అధార్మికుడని పేరు పొందినా అమ్మానాన్నల మీద ఈగ వాలనీయకుండా కాపాడాడు. కంఠంలో ప్రాణమున్నంత వరకు తన తోడ పుట్టిన వారికి రక్షాకవచంలా, కొండంత అండగా ఉన్నాడు. ప్రహ్లాదుడు తండ్రి హిరణ్యకశ్యపుడు పెట్టే రాక్షస పరీక్షలను సహనంతో భరించినా తల్లిదండ్రుల క్షేమాన్నే చివరిదాకా కోరుకున్నాడు. పరమవిధేయుడన్న పేరు తెచ్చుకున్నాడు.
ఇలా మహానుభావులు అయిన వారందరూ అమ్మానాన్నల మన్ననలు పొందినవారే! తల్లిదండ్రులన్న దైవసన్నిభులురా అని లోకానికి ఎలుగెత్తి చాటినవారే! వారి అడుగుజాడలే మనకూ ఆదర్శం కావాలి. మనమూ బుద్ధిమంతులమనే పేరు తెచ్చుకోవాలి.
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
నువ్వు, బెల్లం, గుమ్మడికాయలు వంటి వాటిని దానం చేయడంతో పాటు పితృదేవతలకు తర్పణాలను వదిలితే మంచిది. ఈ రోజున దానాలకు విశేష ప్రాధాన్యం ఉంది. ఆ దాన మహిమను తెలిపే కథేంటో తెలుసా?
ద్రోణాచార్యుని భార్య కృపి. ఒక రోజు ద్రోణాచార్యుడు బయటకు వెళ్ళగా, ఆశ్రమంలో కృప్తి ఒక్కర్తే కూర్చుని వుందియ ఆ సమయంలో సమిధల కోసం వెదుక్కుంటూ వచ్చిన దుర్వాస మహాముని ద్రోణుని ఆశ్రమానికి వచ్చాడు. ఆ మునిని తమ ఆశ్రమంలోకి స్వాగతించిన కృపి, తమ పేదరికాన్ని ఒప్పుకుని , తమకు ఈ ప్రపంచంలో ఒక ముసలి ఆవు తప్ప ఏమీ లేదని, పిల్లలు కూడా కలుగలేదని వేడుకుంది.
ఆమె మాటలు విని దయార్ద్ర హృదయుడైన దుర్వాసుడు సంక్రాంతినాడు, గంగానదిలో స్నానం చేసి, ఓ బ్రహ్మణుని పెరుగును దానం చేస్తే ఫలితం ఉంటుందని, ఆ రోజే సంక్రాంతి కనుక వెంటనే ఆవ్రతాన్ని చేయమని సలహా ఇచ్చాడు. ఆయన మాటల ప్రకారం కృపి దగ్గర్లో ఉన్న నదిలో స్నానం చేసి, దుర్వాసునికే పెరుగును దానం చేసింది. ఫలితంగా ఆమెకు ఓ చక్కని కొడుకు కలిగాడు. అతడే అశ్వత్థామ. అశ్వత్థామ పుట్టినప్పటి నుంచి కృపికి ఎటువంటి కష్టాలు ఎదురుకాలేదు.
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
భోగి గురుంచి.
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
పేరు | : | స్వామి వివేకానంద ( నరేంద్రనాథ్ దత్తా ). |
తండ్రి పేరు | : | విశ్వనాథ్ దత్తా. |
తల్లి పేరు | : | భువనేశ్వరి దేవి. |
పుట్టిన తేది | : | 12-1-1863. |
పుట్టిన ప్రదేశం | : | కలకత్తా. |
చదివిన ప్రదేశం | : | కలకత్తాలో. |
స్వర్గస్తుడైన తేది | : | 4-7-1902. |
ఒకాసారి జాగ్రఫీ మాస్టారు అడిగిన ప్రశ్నకు వివేకానంద సరియైన సమాధానాన్ని చెప్పి కూడా శిక్షను అనుభవించాడు. తాను తప్పుగా భావించి దానికి శిక్ష విధించారు. క్లాసులోనే అందరి ముందు 'సార్ మీరు ఏ శిక్ష వేసినా సరే, నేను చెప్పిన సమాధానం సరైనదే. నేను ఏ తప్పూ చేయలేదు.' అంటూ బిగ్గరగా చెప్పాడు. బాలుడుగా వివేకానంద చెప్పిన ఆ మాటలకు, ధైర్యానికి, ఒక్కసారిగా ఆ మాష్టారు ఆశ్చర్యపోయారు. వివేకానంద స్కూలు అయిన వెంటనే ఇంటికి వచ్చి ఏడుస్తూ అమ్మతో జరిగిన విషయాన్ని చెప్పాడు. దానికి తల్లి భువనేశ్వరి దేవి 'బాబూ నువ్వు చెప్పించి నిజమేనని నీ మనసుకు పూర్తిగా తెలుసు. నిజానికి ఎంత శక్తి అయితే ఉందో, దానివలన అన్ని కష్టాలూ, సమస్యలూ కూడా వస్తాయి. వాటికి భయపడకూడదు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా నిజాన్నే నమ్ముకో' అంటూ ఓదార్చింది. స్వామి వివేకానంద తన ఉపన్యాసాలతో మొత్తం ప్రపంచాన్నే ప్రభావితం చేశారు. అయితే చిన్నతనం నుంచే వివేకానందుడు ఎంతో బాగా మాట్లాడేవాడు అనడానికి ఒక చక్కని ఉదాహరణ ఏమిటంటే ఒకసారి వివేకానందుడు క్లాసులో మాష్టారు లేని సమయంలో చుట్టూ ఉన్న స్నేహితులకు ఏదో ఒక విషయం గురించి వివరిస్తున్నాడు. అంతలో మాష్టారు పాఠం చెప్పడానికి వచ్చి, అంతా వివేకానందుడు చెప్పేది శ్రద్దగా వినటం గమనించారు. వివేకానంద మాష్టారు వచ్చిన విషయాన్ని గమనించలేదు. ఆ మాష్టారు వివేకానందుడు ఏం చెబుతున్నాడని ప్రతి పిల్లవాడిని అడగగా వాళ్ళు ఒక్క విషయం కూడా వదలకుండా మాష్టారుకి వివరించేసరికి ఆయన ఆశ్చర్యపోయారట. దానితో వివేకానందలో ఉన్న వాక్పటిమను మాష్టారు గమనించటమే కాదు, వివేకానందుని మాటల్లో అయస్కాంత శక్తి ఉందని ప్రశంసించారు. 1877-1879 తండ్రితో రాయపూరులో ఉన్నాడు. తర్వాత బ్రహ్మ సమాజంలో సభ్యత్వం తీసుకొని వదిలిపెట్టాడు. దక్షిణేశ్వరం - కాళికాలయంలో పూజారి శ్రీ రామకృష్ణుని కలుసుకోవడం, ప్రియశిష్యునిగా మారడం జరిగింది. 1897 మే1 న శ్రీ రామకృష్ణ మిషన్ స్థాపన చేశాడు. 1891లో భారతయాత్ర చేశాడు. 1893లో చికాగో విశ్వమాత మహాసభలో ఉపన్యసించి విశ్వ విఖ్యాతి చెందాడు.
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
చాలా బాగా చెప్పారు...మహేశ్వర్ గారు.
అందరికి జాతీయ యువజన దినోత్సవం శుభాకాంక్షలు.
యువతకు భవితేదీ?
నేడు జాతీయ యువజన దినోత్సవం?! ఈ విషయం ఎంత మంది యువజనులకు తెలుసు? తెలిసినా వారిలో ఉత్సవాలు జరుపు కునే వారెందరు? అని ఆలోచిస్తే కొంత మంది రాజకీయ నాయకులు 'యువజన దినోత్సవ శుభాకాంక్షలు' అంటూ తమ ఫొటోలు పెట్టుకుని వ్యక్తిగత ప్రచారం పెంచుకోవడానికి తప్ప నిజంగా యువజనులు అన్ని విధాలా సంతోషకరమైన జీవితాన్ని అనుభ విస్తూ ఉత్సవాలు జరుపుకునేంత పరిస్థితి లేదు అనేది జగమెరిగిన సత్యం.
ఈ రోజుకు ఇంకో ప్రత్యేకత ఉంది. స్వామి వివేకానంద జయంతి రోజును జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారు. వివేకానందుడు బాల్యావస్థలోనే జాతీయతా భావాలను పెంపొందిం చుకున్నారు. యువకునిగా భారత జాతీయతను, భారతీయ సంస్కృతి గొప్పదనాన్ని అనేక దేశాల్లో సభలు నిర్వహించి చాటి చెప్పిన గొప్ప వక్త. విదేశీ తత్వవేత్తల మన్ననలందుకున్న మహనీయుడు.
మహనీయుల జయంతులు, వర్ధంతులు జరుపుకుంటున్నప్పుడు వారేం చేశారు? వారెంత గొప్పవారు అని సమీక్షించుకోవడం కంటే వారాశించిందేమిటి? వారున్నంత కాలం పోరాడి తర్వాత సమాజంపై అంటే మనకు అప్పగించిన కర్తవ్యమేమిటి? అని గుర్తించి ఆ కర్తవ్య సాధనకై పోరాడితే వారి ఆత్మకు శాంతి కలుగుతుంది. లేకుంటే వారి ఆశయాలకు అర్థం లేకుండా పోతుంది. నాడు పరదేశీయుల పాలనలో కొట్టుమిట్టాడిన భారత సమాజం నేడు స్వదేశీ పాలకుల కుట్ర, కుతంత్రాలలో నలిగిపోతోంది. సామ్రాజ్యవాదుల చేతుల్లో మాడిపోతోంది.
ప్రైవేటీకరణ-యువతపై ప్రభావం
1980వ దశకంలో రాజీవ్‌గాంధీ ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ ఆర్థిక విధానాలకు ఆజ్యం పోశారు. వాటిని పివి నరసింహారావు సంపూర్ణంగా అమల్లోకి తేచ్చారు. ఆ విధానాలనే నేటి మన పాలకులు మరింత దుడుకుగా అమలు చేస్తున్నారు. విదేశీ పెట్టుబడులు, విదేశీ రుణాలు, అమెరికా సామ్రాజ్యవాదుల ప్రాబల్యం విపరీతంగా పెరిగిపోయింది. ఆర్థిక వనరులన్నీ ప్రైవేట్ వారి హస్తగతమవుతున్నాయి. పాలకులు, పాలక పార్టీలూ (వామపక్షాలు మినహాయించి) బూర్జువా నియంతృత్వ శక్తులకు, సామ్రాజ్యవాద ఆంక్షలకు లొంగిపోతున్నాయి. జాతి సంపదను, సంస్కృతిని కొల్లగొట్టుతున్నాయి. అధికార గర్వంతో ప్రజల హక్కులను కాలరాస్తున్నాయి. ప్రశ్నించే ప్రజలను అణగ దొక్కుతున్నాయి. దీంతో సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా యువకులతోపాటు అన్ని రంగాల ప్రజలూ దుర్భర పరిస్థితుల్లోకి నెట్టబడ్డారు. ప్రపంచీకరణలో భాగంగా సరళీకరణ ఆర్థిక విధానాలతో నిరుద్యోగ సమస్య ఒక వైపు, అధిక ధరలు మరోవైపు సగటు మనిషి నడ్డి విరుస్తున్నాయి. దీంతో యువత పెడదారి పడుతోంది. తీవ్రవాదులుగానూ, ఉగ్రవాదులుగానూ, సంఘ వ్యతిరేక శక్తులుగానూ మారిపోతున్నారు. దొంగతనాలు, అక్రమాలు, అవినీతికి పాల్పడుతున్నారు. అనేక దురలవాట్లు, దుర్వ్యసనాలకు గురవుతున్నారు. కుల, మత విద్వేషాలు, ప్రాంతీయ విభేదాలు పెచ్చరిల్లి పోతున్నాయి. కుటిల రాజకీయాలు యువతను క్షీణింపజేస్తున్నాయి. లింగ విద్వేష భావాలు సర్వసాధారణమవుతున్నాయి. వీటన్నింటినీ అరికట్టి సమాజ శ్రేయస్సును కాపాడవలసిన పాలక వర్గం చూసీ చూడనట్టు వ్యవహరించడం దాని నిర్లక్ష్యానికి, అసమర్థతకు అద్దం పడుతోంది.
గత రెండు దశాబ్దాల కాలంగా అత్యంత ఆధునికి టెక్నాలజీ ఆవిర్భవించడంతో అనేక కొత్త రంగాలు, వాటికనుగుణంగా వృత్తి విద్యా కోర్సులు ఉద్భవించాయి. ఈ పరిణామం యువతకు కొంతైనా చేరువవుతుంది, కొన్నయినా ఉద్యోగాలు పెరుగుతాయి అన్న ఆశ అనతి కాలంలోనే నిరాశను మిగిల్చింది. అది తాత్కాలిక 'బూమ్'గా మారింది. ఆ తరువాత లక్షలాది మంది యువత వీధులపాలయ్యారు. పారిశ్రామిక రంగంతోపాటు వ్యవసాయ రంగంలో కూడా టెక్నాలజీ అభివృద్ధి కావడం, అది కాస్తా ప్రైవేటు వారి చేతుల్లో చిక్కడంతో 90 శాతం ప్రజానీకానికి కనీస కూలి దొరకక దారిద్య్ర రేఖ దిగువకు చేరగా, 10 శాతం మంది మరింత సంపన్నులుగా మారారు. అదే సందర్భంలో ప్రసార మాద్యమాల టెక్నాలజీతో యువతతోపాటు పూర్తి సమాజాన్నే వినిమయదారీతత్వం వైపు మళ్ళిస్తోంది. మరో వైపు మహిళలకు డబ్బు ఎరజూపి అంగట్లో బొమ్మలుగా చిత్రీకరించి యువతను పెడదారి పట్టిస్తోంది. ఇటువంటి అనేక సమస్యలతో సతమతమవుతున్న యువతరాన్ని ఒక సక్రమమైన గాడిలో పెట్టాలంటే ఉత్పత్తి రంగాల్లోకి వచ్చిన నూతన టెక్నాలజీని కార్మికులకు అందుబాటులోకి తేవాలి, ప్రైవేటు రంగంలోని సంస్థలను జాతీయం చేయాలి. వృత్తి విద్యా కోర్సులు అందరికీ అందుబాటులోకి తేవాలి. నిరుద్యోగ సమస్యను అరికట్టే విధంగా అర్హులైన వారందరికీ వృత్తి లోన్లు ఇచ్చి ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే భారత సమాజం గొప్ప సమాజంగా, భారత సంస్కృతి గొప్ప సంస్కృతిగా వికసిస్తుంది, విరాజిల్లుతుంది. అలా జరిగినప్పుడే వివేకానందుని ఆశయాలు నెరవేరుతాయి. ఆయన శ్రమ ఫలిస్తుంది. ఆ దిశగా వామపక్షవాదులు, యువజన సంఘాలు, నిరుద్యోగులూ ఇప్పటికే పోరాడుతున్నారు. ఇటువంటి పోరాటాల్లో అందరూ కలిసి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ బాధ్యతను ప్రతి ఒక్కరూ నిర్వర్తించాల్సిన అవసరం ఉంది.
(నేడు జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా)
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
Archives
-
▼
2013
(185)
-
▼
January
(68)
- తినవలసిన వ్యక్తులు నలుగురుండి ముగ్గురికి సరిపడా భో...
- Republic Day Special, National Anthem,National Son...
- videshallo vidyaa, udyogaalaku melukuvalu....విదేశ...
- Civil's samaraaniki vibinna astraalu...సివిల్స్ స...
- Re: Make Your Gmail Hack Proof & Robust Using Two-...
- modati prapancha telugu mahaasabha vivaraalu
- tallidandrulanna daivasannibuluraa ani elugetti ch...
- know about your rights in banking account.మీ హక్కు...
- sankranthi dhana mahimanu telipe kadento telusa me...
- muggulu mariyu ratham muggu gurunchi..ముగ్గులు మరి...
- kothi sneham chirakaala sneham variddaridi...frien...
- mitrudu anandanga unnapudu ahvanistene vellali kas...
- gaalipatam jaade ledhu prastutham, chinna pillalak...
- Bhogi Gurunchi Bhogi Mantalu Konchum em chestaru e...
- sankranti shubakankshalu andariki.
- urelutunnaraa jagrathalu telusa meeku...
- sankranthi shubhakankshalu telugu lo...
- vidividiga kalividiga samajika seva facebook lo.
- saayaniki padi rupayilu ! entha ichhamannadi kaadu.
- Swami Vivekananda gurunchi telusa meeku. meekosam ...
- yuvathaku bhavitedi ? nedu jateeya yuvajana dinosc...
- Baby Gorilla's Expression when stethoscope get's i...
- Divide into Three states is going to be solution f...
- Neethi Vaakyam Telusukundam నీతి వాక్యం :
- pakistan armypai prince prathikaaram terchukuntaad...
- shavaala pottalo bambulu pettina mavoistulu.
- Neethi Vaakyam నీతి వాక్యం : రోజుకో నీతి వాక్యం తె...
- Neethi Vaakyam నీతి వాక్యం : రోజుకో నీతి వాక్యం తె...
- Neethi Vaakyam నీతి వాక్యం : రోజుకో నీతి వాక్యం తె...
- sri sri gaari abhimatham telugu jateeya basha kaav...
- kotta gmail lo telugu lo type cheyadam ela. తెలుగు...
- Pakistan Soldiers killed two Indian Soldiers and t...
- Fwd: update your facebook page by email its very e...
- nenu mechhina nachhina chitraalu ivi.
- Bhumilo neeru nilvachesukunenduku vaananeeti samra...
- puttina vaadu chaavaka tappadu gita (bhagavadgita)...
- prathi 10 atyachaarallo aaru baalikalapaine..idhi ...
- Prati 7 minutes ki oka neram....vavvi varasalu chi...
- blog post via email in telugu to understand with i...
- blog post via email in telugu to understand with i...
- naaku batakaalani undi ! ade chivari maatalu .. ka...
- ayantha vidvansa puritha akasmikha aapadalu mana d...
- alanaati aata paatalaku jeevam maarutunna yuvatha ...
- avamaana baaram tho baalika atmahatya, phone vedim...
- nannu vadileyandi chachhi pothanu antunna vruddhur...
- need a pet dog for dog lovers contact these people.
- vyabhicharam nundi endarino kapadina prajwala guru...
- earn money for telugu blogs just you need to copy ...
- parya varana parirakshana chaala manchi pani.
- I am ready for rape if you guarantee further rapes...
- supreme court has no right to do it ! teluskondi i...
- safety in E hands of today's life for women in tel...
- garbastashishuvu bashaabyasam..pottalo unnapude ba...
- effect on eyes...ekkuvaga upayogisthe tappavu tippalu
- smashanam ni kudaa vadalaru mana badaa babulu.
- Chala bagundi ee chitram...manchi kalakaarundu ves...
- kannatandre kuturi paina atyacharam ...narikina talli
- keechakulaku uri kastame ...idhi mana prabhutvam e...
- ee ardhanagna nirasana avasaramaa .. denigurinchi ...
- need help to a blood cancer girl.. they can't affo...
- Rape Laws and Acts according to Indian Penal Code ...
- iam damini india know about the Delhi Case in wiki...
- Delhi GangRape All six accused were from a Delhi s...
- 28 yr old software engineer who was with JAGRUTHI ...
- 20 horrific cases up to december 2012 Chusara ? Ki...
- wouldn't it be great if you needed to water it jus...
- mana fridge lo unde challa danam ento telusa meeku ?
- mouna poratam tho tama nirasana teluputunaaru andaru
-
▼
January
(68)
Total Pageviews
Followers
ప్రచారం
Popular Posts
-
వరకట్న నిషేధం సమాజంలో వరకట్నమనేది సామాజిక దురాచారం. దీని వలన స్త్రీలపై ఊహకందని రీతిలో చిత్రహింసలు, నేరాలు జరుగుతున్నాయి. సమాజంలోగల అన్నివర...
-
చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కాని ఒక మంచి పుస్తకం కొనుక్కో : కందుకూరి వేరేశలింగం. @ భారతీయులం
-
మీరు ఇంటర్నెట్ లో డబ్బులు ఎలా సంపాదించాలి అంటూ ఆలోచిస్తున్నారా ? రోజు రోజు ఇంటర్నెట్ వినియోగం ఎక్కువగా ఉంది ఈరోజుల్లో...ఐతే తొలి ఇండియన్ వె...
-
రైతు లేనిదే ప్రపంచం లేదు - జగమెరిగిన సత్యం. కాని వారిపైనే చిన్న చూపు, రైతు ఆత్మహత్యలు చేసుకునే దాకా దిగజారిన పరిస్థితులు.
-
భారతీయులం ఇక్కడ క్లిక్ చేసి మొదలు పెట్టండి మీ సంపాదన ఇంటర్నెట్ లో. మిత్రులారా మీకు తెలుసా ? ఇంటర్నెట్ ద్వారా డబ్బులు ఎలా సంపాదించ వచ్చు ...
-
పుట్టిన వాడు మరణించక తప్పదు అలాగే మరణించినవాడు తిరిగి జన్మించకా తప్పదు, అనివార్యమగు ఈ విషయమును గూర్చి చింతించుట అనవసరం. - గీత(భగవద్గీత) గీతల...
-
యోగ విద్య నభ్యసించుటకు వయో పరిమితి లేదు. ఏ వయస్సు వారైనను యోగ విద్య నభ్యసించ వచ్చును. కాన స్త్రీ, పురుషులెల్లరు వయోభేదము లేక, యోగ విద్య నభ్య...
-
జూన్ 5వ తేదీని "ప్రపంచ పర్యావరణ దినోత్సవం"గా పాటిస్తున్నారు. ఈ పర్యావరణ దినోత్సవం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీచే 1972, జూన్ 5వ తే...
-
చరిత్రలో ఈ రోజు - May 1 1906: మే డే కోసం జరుపుతున్న ఆందోళనలో, పారిస్ దళలు చాలామందిని నిర్బంధించాయి (ఆరెస్టు). మే దినోత్సవం లేదా మే డే (May D...
-
శుభోదయం నేస్తం !@ "భారతీయులం" " భారతీయులం " |.:: bharatiyulam.blogspot.in ::.