ప్రపంచం మొత్తం మౌనం పాటించే సమయం అది...ఒక్కసారిగా మన చేతులారా చేసుకున్న ఈ  కాలుష్యం ఊభి లోంచి కొంత కాపాడుకునేందుకు ..చేసే చిన్న ప్రయత్నం ఈ "ఎర్త్‌ అవర్‌"  పర్యావరణాన్ని నాశనం చేస్తున్న మనమే దానిని రక్షించాల్సిన అవసరం కూడా ఉంది.  సమిష్టిగా అందరూ స్వచ్ఛందంగా వాతావరణ రక్షణకు పాటుపడినప్పుడే ఈ భూగోళాన్ని రక్షించుకోగలుగుతాము.  భారతదేశంలో ఢిల్లీ, ముంబాయి, చెనై్న, బెంగుళూరు, కోల్‌కతా, హైదరాబాద్‌ నగరాలు పోటీపడుతున్నాయని ఇప్పటివరకు.
ఎర్త్ అవర్ గురించి మీకు తెలుసా? ప్రతి సంవత్సరం మార్చ్ ఆఖరి శనివారం రాత్రిపూట ఒక గంట విద్యుత్ ఉపకరణాలు అన్నింటినీ ఆపివేయటం ద్వారా ప్రపంచవ్యాప్తంగా దీనిని  జరుపుకుంటారు. దీని ముఖ్య ఉద్దేశం వాతావరణంలో జరిగే మార్పుల పట్ల ప్రజలలో అవగాహన కలిగించడమే.  ఈ నెల అంటే మార్చ్ 31వ తారీఖు రాత్రిపూట 8.30 నుండి 9.30 వరకు ఎర్త్ అవర్ జరుగుతుంది. 
ఎర్త్ అవర్ని సక్రమంగా జరిపి మన భూమికి, పర్యావరణానికి కొంతఅయినా మేలు చేద్దాం. @ {భారతీయులం} 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam
URL: HTML link code: BB (forum) link code:
ధన్యవాదనములు | ®“భారతీయులం”®