ముందుగా ఉగాది శుభాకాంక్షలు అందరికి.
ఉగాది అంటే గుర్తువచ్చేది ఉగాది పచ్చడి.
మరి ఉగాది పచ్చడి చేయడం ఎలా ?
ఉగాది పచ్చడి
తీపి, వగరు, చేదు, కారం, ఉప్పు, పులుపు... ఇలా షడ్రసోపేతమైనదే ఉగాది పచ్చడి... జీవితంలో... ప్రతి మనిషికీ అన్ని సుఖాలతో పాటు బాధలు, ఆనందం, కన్నీళ్ళు ఉంటాయని తెలియజేసేదే ఉగాది పచ్చడి.
కావలసిన పదార్థాలు...
మామిడి ముక్కలు - తగినన్ని
వేప పువ్వు - 2 టీ స్పూన్లు
కొత్త చింతపండు - 100 గ్రా
బెల్లం - 30 గ్రా
మిరియాల పొడి - టీ స్పూన్
ఉప్పు - తగినంత
అరటిపండు ముక్కలు - 2
తయారు చేసే విధానం...
ముందుగా కొత్త చింతపండుని ఓ గ్లాసు నీళ్లలో వేసి నానబెట్టాలి. ఆ తర్వాత చింతపండు పులుసు పిండి ఓ గిన్నెలో వేయాలి. ఈ పు లుసులో సన్నగా తరిగిన మామిడి ముక్కలు, వేప పువ్వు, మిరియాల పొడి, ఉప్పు కల పాలి. ఆ తర్వాత దానికి బెల్లం, అరటి పండు ముక్కలు కలిపితే ఉగాది పచ్చడి రెడీ.
నందన నామ ఉగాది శుభాకాంక్షలు Mar 23,2012 @ {భారతీయులం}