ప్రియమైన మిత్రులారా అన్ని జన్మలలోకి మానవ జన్మ ఉత్తమమైనది. ఈ సృష్టిలోని 84 లక్షల జీవరాశులలో ఏ జీవరాశికి లేనిది మానవునికి మాత్రమే ఉన్నది జ్ఞానం మాత్రమే. అన్ని జీవరాశులలో ఆత్మ ఒక్కటే ఐనప్పటికి మానవ శరీరానికి మాత్రమే ఆలోచన జ్ఞానం ఉంది. ఆలోచన వేరు ఆలోచన జ్ఞానం వేరు. సృష్టిలో ప్రతి జీవి ఆలోచిస్తుంది కాని వాటి ఆలోచనలకు పరిమితి ఉంది. ఆహరం కోసం పులులు, సింహాలు మొదలైన జంతువులు ఎంతో నేర్పుతో వేటాడతాయి, మరి కొన్ని మగ ప్రాణులు ఆడ ప్రణులతో సంభోగం జరపడానికి వాటిని ఆకర్షించడానికి ఎన్నో విన్యాసాలు వేరే ప్రాణులతో పోరాటాలు కూడా చేస్తూ ఉంటాయి, వేటాడటం పోరాటాలు చేయడం కూడా ఆలోచనే మరి అప్పుడు జంతువులు కూడా ఆలోచిస్తున్నయి కదా మరి. నిజమే ఆలోచిస్తున్నాయి కాని వాటి ఆలోచనలకు పరిమితి ఉంది ప్రతి జీవి ఆహరం, నిద్ర, మైదునం(సంభోగం) కోసమే ఆలోచిస్తుంది అంతకు మించి అది ఆలోచించలేదు కాని మనిషి అలా కాదు దేని గురించైనా ఆలోచించగలడు. ఆ ఆలోచన శక్తితో  మానవుడు మాదవుడుగా ఎదగడం కోసమే భగవంతుడు అన్ని జన్మలలోకి చివరిది ఐన మానవ శరీరానికి ఆ శక్తిని ఇచ్చాడు. కాని మిత్రులారా మనిషి తన శక్తిని తెలుసుకోకుండా జంతువులలాగే ఆహరం, నిద్ర, మైదునం కోసమే తన ఆలోచన శక్తిని ఉపయోగిస్తిన్నాడు ప్రాశ్చాత్య సంసృతి మోజులో పడి విచ్చలవిడి తనం, విలువలులేని జీవితాన్ని గడుపుతున్నాడు. మన పూర్వ మహర్షులు వారి జీవితాలను దారపోసి మనిషి ఉన్నతి కోసం ఏర్పరిచిన ఆచారాలను, జీవన విదానాన్ని నాశనం చేసి తన పతనానికి తానే బాట వేసుకొంటున్నాడు. తను గడిపిన విచ్చలవిడి జీవితం వల్ల తిరిగి మళ్ళీ నీచ జన్మలు పొందుతున్నాడు. ఎంతో మంది గొప్ప గొప్ప మహర్షులు, ఋషులు జన్మించిన మన దేశంలో ప్రస్తుతం ఎలాంటి జీవనాన్ని మనం గడుపుతున్నామో ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. వీళ్ళను చూడండి ప్రశ్చాత్య సంసృతిలో పుట్టినా జీవిత సత్యాన్ని గ్రహించి ఇంత చిన్న వయసులో ఎంత ఆదర్శ జీవితాన్ని గడుపుతున్నారో.కాబట్టి మిత్రులారా మీరు అందరు కూడా తిరిగి మన భారతీయ సంసృతికి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి కృషి చేసి మీ జన్మ సార్దకం చేసుకోవడంతో పాటు మన తరవాతి తరాలకి కూడా మన సంసృతిని సజీవంగా అందిచే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. By rajesh thunuguntla @ భారతీయులం 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam
URL: HTML link code: BB (forum) link code:
ధన్యవాదనములు | ®“భారతీయులం”®