గర్భిణీగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన ఆహారము
సురక్షిత మాతృత్వం అంటే ఒక స్త్రీ ఎలాంటి అవాంతరాలు లేకుండా గర్భసమయంలో, ప్రసవ సమయంలోను, ప్రసవానంతరం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా తన కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలి. తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉండటానికి గర్భిణీ సమయంలో సరైన పోషణ చాలా అవసరం.
గర్భిణీ స్త్రీలు అన్ని రకాల ఆహార పదార్ధాలు అంటే ధాన్యాలు, పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పాలు, పాలతో చేసిన పదార్ధాలు, మాంసం మొదలైనవి తగిన మోతాదులో తీసుకోవాలి.@ భారతీయులం