విజయా సంస్థ నిర్మించిన చిత్రలలో ఆఖరి విజయవంతమైన చిత్రం గుండమ్మ కథ. అప్పటిలో ఇది అగ్రశ్రేణి నటులతో నిర్మించిన మల్టీ స్టారర్, కాని "గుండమ్మ కధ" అని సూర్యకాంతం పాత్ర పేరుమీద సినిమా పేరు పెట్టడమే గొప్ప వైవిధ్యం. హాస్యం, సంగీతం ఈ చిత్రానికి అద్భుత విజయాన్ని సమకూర్చాయి.
గుండమ్మ (సుర్యకాంతం) ఒక గయ్యాళి గృహిణి. ఆమె స్వంత కూతురు సరోజగా జమున, సవతి కూతురు జమునగా సావిత్రి నటించారు. ఇంటెడు చాకిరీ సవతి కూతురు మీద పడుతుంది. స్వంత కూతురు మాత్రం పెంకిగా తయారవుతుంది. గుండమ్మగారి గతించిన భర్తకు స్నేహితుడైన ఒక జమీందారు రామ భద్రయ్య (ఎస్.వి.రంగారావు) పెళ్ళి సంబంధం కుదుర్చుకోవడానికి వచ్చి అ యింటి పరిస్థితి అర్ధం చేసుకొంటాడు. ఇద్దరు పిల్లలనూ తన కోడళ్ళుగా చేసుకొని చనిపోయిన తన స్నేహితుని ఆత్మకు శాతి కలిగించాలనుకొంటాడు.

వారి పధకం ప్రకారం పెద్దకొడుకు అంజి (ఎన్.టి.ఆర్.) గుండమ్మగారి ఇంట్లో పనివాడిగా చేరతాడు. పొగరున్న పనిమంతుడుగా గుండమ్మ విశ్వాసాన్ని, తోటి పనివాడిగా లక్ష్మి మనసును చేజిక్కించుకుంటాడు. ఇంట్లోనే ఉండి చాకిరీ చేస్తాడని గుండమ్మ అంజికి సవతికూతురునిచ్చి పెళ్ళి చేస్తుంది. ఇక రామ భద్రయ్య రెండవ కొడుకు రాజా (ఏ.ఎన్.ఆర్.) సరోజను పెళ్ళి చేసుకొని కాస్త కటువుగా ప్రవర్తించి ఆమె పెంకి తనాన్ని అదుపులో పెడతాడు.@ భారతీయులం 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam
URL: HTML link code: BB (forum) link code:
ధన్యవాదనములు | ®“భారతీయులం”®