వేసవిలో చేతిగోళ్ళు వేగంగా పెరుగుతాయా?
మన కాలి గోళ్ళ కన్నా చేతి గోళ్ళు వేగంగా పెరగటాన్ని మీరు గమనించే ఉంటారు.మనం తెలుసుకోవలసిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మన చేతి గోళ్ళు చలి కాలం లో కన్నా ఎండాకాలం లో వేగంగా పెరుగుతాయి. అంతేకాదు మన రెండు చేతి గోళ్ళు ఒకేరకంగా పెరగవు. ఏ చేత్తో ఎక్కువ పని చేస్తామో, ఆచేతిగోళ్ళు కొంచెం వేగంగా పెరుగుతాయి. అంటే మనం కుడి చేతి వాటం వాళ్ళమయితే కుడిచేతి గోళ్ళు ఎడంచేతి వాటం వాళ్ళయితే ఎడం చేతిగోళ్ళు కొంచెం వేగంగా పెరుగుతాయన్నమాట.
ఇలా ఎందుకు జరుగుతుంది? అన్న ప్రశ్నకు ఇంకా కచ్చితమైన సమాధానం లభించనప్పటికీ ఇప్పటికి అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా శాస్త్రజ్ఞులు ఇలా చెప్తున్నారు.కాలి గోళ్ళ కన్నా చేతిగోళ్ళకు రక్త ప్రసరణ మెరుగ్గా జరిగి వాటికి సాపేక్షికంగా ఎక్కువ ఆక్సిజన్ లభించటం వల్ల వేగంగా పెరుగుతాయట.అదే్విధంగా చలికాలంలో మన శరీరంలో జరిగే వివిధ కార్యకలాపాలు అంతం చురుకుగా జరగకపోవటం వల్ల ఆరుతువులో గోళ్ళ పెరుగుదల వేగం మందగిస్తుంది.వేసవిలో దీనికి భిన్నంగా జరగటం వలన వేగం పెరుగుతుందని వారు చెబుతున్నారు. మనం ఏచెత్తో ఎక్కువ పని చేస్తామో ఆ చేతి గోళ్ళు వేగంగా పెరగతానికి కూడా ఇదే కారణం అంటున్నారు. చలికాలంలో సూర్యరశ్మి తగినంతగా అందుబాటులో లేకపోవటం కూడ గోళ్ళు పెరుగుదల మందగించటానికి ఒక కారణం కావచ్చని ఊహిస్తున్నారు.ఏదేమైనా గోళ్ళ పెరుగుదలలో ఇలా తేడాలు రావటానికి ఇతరత్రా కారణాలు కూడా కొన్ని ఉండవచ్చని వాటిని త్వరలోనే కనిపెట్టగలమని శాస్త్రజ్ఞులు భావిస్తున్నరు.@ భారతీయులం