మేలు చేద్దాం అని ముందుకి వచ్చే కొందరికి తప్పని ఆటు పాట్లు. అతను కలెక్టర్ సరే ప్రజల కోసం కొంత సాయం చేద్దాం అని అనుకోని ఫోన్ ఇన్ అనే ఒక ఫోన్ నెంబర్ (221966) తో మొదలు పెట్టారు. తమ ఫిర్యాదులను మాకు ఫోన్ చేసి చెప్పగలరు అని అంటూ మొదలు పెట్టారు ఐతే మొదటి రోజు మోగిన రింగ్ రోజు రోజు కి దిగ జారి పోతూ ఉంది...చివరికి సున్యం.
ఎంత సేపు వాడు చేయడు వీడు చేయడు అంటూ ఒకరిని వెక్కిరించటం తోనే సరిపోతుంది కాని ఎవరి కి వారు ఎదురు కుంటేనే కానీ అది సమస్య అని తెలుసు కోలేక పోతున్నారు ?
ఎవడికో కదా మన కి కాదు కదా అంటూ వదిలేసే పని మరియు ఇది బాగా లేదు అది బాగా లేదు అంటూ చెప్పే మాటలు ప్రతీ చోటా వింటాము.
కానీ వారికి తెలిసి కుడా చెత్త ని సరిగ్గా సరైన స్థలం లో పడేయ కుండా గోడ పక్కన పోసే వారు ఎందఱో... అదేంటి అని అని అడిగితే మన స్థలము కాదు కదా అంటూ చెప్పే మాటలు.
ప్రభుత్వ కార్యాలయాల్లో అసలు పనులెవరు చేయరు అంటూ చెప్పే మాటలు కూడా విన్న్టాము చాలా సార్లు ....ఐతే మరి ఎందుకు ఫిర్యాదు ఇవ్వలేదు అని అడిగితే మాత్రం ...మాకెందుకు అంటూ వచ్చే సమాదానం.
ఇదే మనలో ఉన్న మొదటి నిర్లక్షం. ఈరోజు మనకి జరగక పోవచ్చు కానీ ఒకరోజు అందరం బాదపడతాం ...ఒక చిన్న నిర్లక్షం పెద్ద నష్టానికి దారి తీస్తుంది. !
ఒక మంచి పనికి ప్రోత్సహించక పోయినా పర్లేదు కాని చెడుని మాత్రం తెలిసినంత వరకు సాగనివ్వకుండా చూసుకోవాల్సిన బాద్యత మన అందరిది.
మంచి విషయాలను తెలిసిన వారికీ తెలియ జేయండి ...అందరికి అన్నీ తెలియవు ...అన్నీ తెలుసు కో లేక పోయినా కొంతవరకు కలిసి కృషి చేద్దాం. ! @ భారతీయులం  

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam
URL: HTML link code: BB (forum) link code:
ధన్యవాదనములు | ®“భారతీయులం”®