


మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
నేను మెచ్చినవి నాకు నచ్చినవి...బలే చిత్రాలు విచిత్రాలు. చూసారా. అన్ని ఆ రచయితలవే ఎటు వంటి హక్కులు నేను,ఈ బ్లాగ్ వి కాదు. అందరితో పంచుకోవడం కోసం ఈ నా చిన్న ప్రయత్నం.m&k
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
చరిత్ర జ్ఞానం లేని వాడు చరిత్ర హీనుడవుతాడు. అందుకే అందరికీ చారిత్రకాధ్యాయనం అవసరం.
పదిహేను కోట్ల మంది తెలుగువారి చేత రెండువేల ఏండ్ల చరిత్ర గల తెలంగాణా సంస్కృతిని తప్పనిసరిగా నేర్పేటట్లు విద్యాశాఖామాత్యులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
ప్రపంచానికి బృహత్కథను అందించిన పైశాచీ ప్రాకృత మహాకవి గుణాఢ్యుడు కరీంనగర్ జిల్లాకు చెందినవాడు. శ్రీకృష్ణుని భార్య రుక్మిణీ దేవి కూడా ఉత్తర తెలంగాణాకు చెందిన మహనీయురాలు. శాతవాహనుల రాజధానులలో కరీంనగర్ ప్రాంతం కూడా ఉన్నట్లు కొందరి అభిప్రాయం. తెలివాహపై కొన్ని పరిశోధనలు జరిగాయి. ఆ విషయం మరీ విస్తరించటం లేదు. గాథాసప్తశతిలోని చాలా శర్లకాలు గోదావరి తీర ప్రాంతంలోనే పుట్టాయి. ఆంధ్రప్రదేశ్‌కు త్రిలింగదేశం అనిపిలిచేవారు. అందులో ఒక సరిహద్దు కరీంనగర్ జిల్లాలో ఉంది. ఇవన్నీ చారిత్రక సత్యాలే. మార్కోపోలో భారతదేశ పర్యటన చేస్తూ వరంగల్లు వచ్చారు. అప్పుడు రుద్రమదేవి పరిపాలిస్తున్నది. ఈమె రాజ్యంలో రత్నాలు, వజ్రాలు వీధులలో కుప్పలు పోసి అమ్ముతున్నారని వర్ణించారు. ఐతే అంతటి వైభవం కూడా రెండవ ప్రతాప రుద్రునితో అంతరించింది. అందుకు కారణం మాలిక్ కాఫర్ పరాక్రమంతో బాటు తెలంగాణాలోని అంత: కలహాలు. గోనగన్నారెడ్డి వంటి వీరులను కాకతీయులు ఆదరించారు. రెడ్లకు ప్రాధాన్యత నీయటం వెలమ దొరలకు నచ్చలేదు. అందువల్ల వారు మాలిక్ కాఫర్‌తో కాకతీయులు చేసిన యుద్ధంలో సహకారం అందించలేదు. ఫలితంగా కాకతీయ సామ్రాజ్యం కూలిపోయింది.
ఆ తర్వాత కాపీయ నాయకుడు ప్రోలయ నాయకుడు అనే ఇద్దరు కమ్మ ప్రభువులు తిరిగి తెలంగాణాను శత్రువుల నుండి విముక్తం చేసి కాకతీయ సామ్రాజ్యలక్ష్మికి తిరిగి మామిడాకు తోరణాలు కట్టారు. ఐతే తెలంగాణా తిరిగి ఏడు వందల సంవత్సరాలు ముస్లిముల చేతనే పరిపాలింపబడింది. బానిసను దొరా -నీ కాళ్లకు మొక్కుతా -అని అట్టడుగు వర్గాలకు చెందిన సామాన్యులను ఈ ప్రభువులు బానిసతనాన్ని నేర్పారు. రాచకొండకు చెందిన సర్వజ్ఞ సింగభూపాలుడు పోతనగారు రచించిన భాగవతాన్ని చెరబట్టాడు. ఫలితంగా నేటికీ పోతన భాగవతంలో చాలా అధ్యాయాలు మనకు దొరకటం లేదు. ఈ దొరగారి కథ తెలుగువారందరికీ తెలుసు.
పాల్కురికి సోమనాథుడు వీరశైవుడు. తెలంగాణా తురుష్కమయం కాబోతున్నది అని తెలిసి కర్నాటకకు వెళ్లి కల్వ అనే ప్రాంతంలో పరమపదించాడు. ఇప్పుడు కన్నడిగులు పాల్కురికి సోమనాధుడు, బసవేశ్వరుడు మావాళ్లు అని చెప్పుకుంటున్నారు. ఇది నిజం కాదు, పాల్కురికి సోమనాథుడు తెలంగాణా ప్రాంతంవారు. బసవేశ్వరుని పూర్వీకులు గుంటూరు జిల్లాకు చెందినవారు.
అసఫ్ జాహీలు కళాప్రియులు. ఎన్నో గొప్ప గొప్ప కట్టడాలు నిర్మించారు. హైదరాబాద్ -నగరం ముస్లింలు ముస్లింల కోసం నిర్మించుకున్నారు. మాసాబ్‌టాంక్ (అంటే రాణీగారు త్రవ్వించిన చెరువు). రాణిగంజ్, అంటే రాణీగారి ప్రదేశం, బీగం బజార్ వంటివి ముస్లిం రాణుల షాపింగ్ ప్రాంతాలు. చూడీబజార్ అంటే గాజులు అమ్మే ప్రాంతం. కోఠీ అంటే ఇంగ్లీషు దొరగారి నివాసస్థానం. తెలంగాణాలో దేవాలయాలు చాలా అధ్వాన్నదశలో ఉండేవి. తెలుగు మాట్లాడితే తప్పు. రామాయణ, భారత నాటకాలు ప్రదర్శిస్తే అరెస్టు చేసేవారు. రోషనారా నాటకాన్ని నిషేధించారు. ఈ వివరాలేవీ ఈతరం వారికి తెలియవు. 1947 లో రజాకార్లు స్థానిక హిందువులను చిత్రహింసలకు గురి చేశారు. అప్పుడు ప్రాణరక్షణకై బాపట్ల, పందిళ్లపల్లి, విజయవాడ వంటి ప్రాంతాలకు వలసపోయారు. నిజాం ఉస్మాన్ ఆలీఖాన్, కాశింరజ్వీల ఈ చరిత్రను పాఠ్యాంశాలుగా చేర్చాలని కెసిఆర్ కోరటం నిజంగా సంతోషింపదగ్గ విషయం. ప్రజలకు తప్పనిసరిగా చారిత్రక జ్ఞానం ఉండాలి. మా పూర్వీకులకు కాకతీయ మహారుద్ర దేవరాజు ముదిగొండ గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చాడు. అది దేవరకొండ (నల్గొండ) జిల్లాలో నేటికీ ఉంది. ఐతే మాలిక్ కాఫర్ దండయాత్రల తర్వాత ఇక్కడి నంది విగ్రహాల మూతులు పగలగొట్టారు. ఆలయాలు నేలమట్టమైనాయి. అబుల్ హసన్ తానీషా వంటి మతసహనం గల కొందరు రాజులు భద్రాద్రి రామునికి తర్వాతి కాలంలో కైంకర్యం చేయించినట్లు, కూచిపూడి నర్తకులకు అగ్రహారాలు ఇచ్చినట్లు తెలుస్తున్నది. స్థానికంగా షియా -సున్నీ శాఖల మధ్య అంత:కలహాలు ఉండేవి. కాకతీయుల కాలంలో తెలంగాణ సరిహద్దులు కాంచీపురం (తమిళనాడు) వరకు వ్యాపించాయి. ముస్లిం పాలకులకు గుంటూరు, కర్నూలు ప్రాంతాలవారు గోల్కొండ వచ్చి కప్పం కట్టిపోయేవారు. స్థానిక పటేల్, పట్వారీలు, దొరలు సాగించిన పరిపాలనా వైభవం తెలుసుకోవాలంటే దాశరథి రంగాచార్య గారి చిల్లర దేవుళ్లు జనపదం చదవండి -రజాకార్ల చరిత్ర తెలుసుకోవాలంటే వందేమాతరం వీరభద్రరావు, రామచంద్రరావు గార్ల గ్రంథాలు అధ్యయనం చేయండి. ఇంకా ఆదిరాజు వీరభద్రరావు, బి.ఎన్.రెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి గార్ల గ్రంథాలూ పాఠ్యాంశాలుగా పెట్టాలి. ఈ చిన్న వ్యాసాన్ని విద్యార్థులు రాజకీయ నాయకులూ అందరూ అధ్యయనం చేయండి. ''మా నిజాము రాజు తరతరాల బూజు'' అన్న దాశరథి కృష్ణమాచార్యుల వారి అగ్నిధార, రుద్రవీణ పాఠ్య గ్రంథాలుగా పెట్టండి. ఎందుకంటే ఇవి చారిత్రక పరిశోధనా విషయాలను తెలియజేస్తాయి. నేటి ప్రత్యేక తెలంగాణా సమైక్యాంధ్ర ఉద్యమాలలో ఈ వ్యాసానికి ఎట్టి సంబంధమూ లేదు. వానమామలై వరదాచార్యులవారు రచించిన మేఘవలయము తెలంగాణా ప్రాంతం వారే కాక మొత్తం ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు పాఠ్యగ్రంథంగా పెట్టించండి. తెలంగాణా శబ్దం త్రిలింగ శబ్దోద్భవం. కాకతీయులను త్రిలింగ దేశాధిపతులు అని పిలిచేవారు. ఈ త్రిలింగములలో ఒకటి కరీంనగర్ జిల్లాలోను, రెండవది తూర్పు గోదావరి జిల్లాలోను, మూడవది కర్నూలు జిల్లాలోను ఉన్నాయి. కాకతీయులు మొదట జైనులు తర్వాత శైవులు. ప్రతాపరుద్ర యశోభూషణము రచించిన విద్యానాథుడు అప్పకవీయము (ఛందోగ్రంథము) రచించిన అప్పకవి తెలంగాణా ప్రాంతంవారే. తెలగాణ్యులు, గోల్కొండ వ్యాపారులు అనే శాఖలు నేటికీ బ్రాహ్మణులలో ఉన్నాయి.
నిజాం కాలేజీని రాజుగారు తమ కోసం, రాజోద్యోగుల బిడ్డలకోసం ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగరం 3 లక్షల మంది కోసం ప్లాన్ చేయబడింది. 200 సంవత్సరాల క్రితం హైదరాబాద్ ఎలా ఉండేదో తెలుసుకోవాలంటే ఏనుగుల వీరాస్వామిగారి ''కాశీయాత్ర'' చదవండి. ఆ రోజుల్లో వనపర్తి, దోమకొండ, గద్వాల వంటి సంస్థానాలుండేవి. వారు ప్రజలను కన్నబిడ్డలవలె చూసుకున్నారు. వారి కళాసాంస్కృతిక సేవ కూడా గణనీయమైనదే. చరిత్ర కాలగర్భంలో కలిసిపోయింది. అందువల్ల ఉస్మాన్ ఆలీఖాన్, కాశింరజ్వీ, షాబుల్లాఖాన్, దాశరథి కృష్ణమాచార్య, కాళోజీ నారాయణరావు, రావి నారాయణరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, పాల్కురికి సోమనాథుడు, అబుల్ హసన్ తానీషా, కంచెర్ల గోపన్న, కులీకుతుబ్‌షా, చెర్విరాల నాగయ్య, కొమరం భీం వంటి వారిపై పాఠ్యాంశాలు పెట్టాలి.
మంచి -చెడూ అన్నీ చారిత్రక ప్రామాణ్యాలతో పాఠకులకు పరిశోధక విద్యార్థులను అందించాలి. 1830లో ఏనుగుల వీరాస్వామి అనే మద్రాసు వాసి ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగి కాశీవెళ్తూ హైదరాబాద్ వచ్చాడు. అంటే నేటికీ 200 సంవత్సరాల నాటి గోల్కొండ రాజుల పాలన ఎలా ఉండేదో దానిని బట్టి అర్థం చేసుకోవచ్చు. పీర్లపండుగ వైభవంగా జరిగినట్లు వర్ణించాడు. హిందువులు ఇవ్వాళ హైదరాబాద్‌లో గణశ్ ఉత్సవాలు దేశంలో ఎక్కడా కనీ వినీ ఎరుగని రీతిలో జరుపుకుంటున్నారు. కానీ ఆ రోజుల్లో హిందువులు పండుగలను రహస్యంగా నేలమాళిగ (అండర్ గ్రౌండ్)లలో గణశ, హనుమాన్ విగ్రహాలు పెట్టి జరుపుకునేవారు. నేటికీ పాతబస్తీలో కొన్ని దేవాలయాలు భూగర్భంలో ఉండటం గమనార్హం. ఇదీ ఆనాటి తెలంగాణా.
--మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
మొత్తానికి అనుకున్నదే జరగబోతుంది....ఆ మానవ మృగాలకు..కెమికల్ క్యాస్త్రేషణ్ చేయాలి అని కాయం అవ్వబోతుంది.
కెమికల్ క్యాస్త్రేషణ్...ఇది అమలు లోకి వస్తే మన దేశం లో మృగాలకు సరైన గుణపాటం జరుగుతుంది.
కెమికల్ క్యాస్త్రేషణ్ వల్ల కొన్ని లాబాలు మరి కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి.
ఈ కెమికల్ వల్ల వాళ్ళ శరీరం లో కొన్ని కణాలు చనిపోతాయి ....సెక్స్ కణాలు లాంటివి.
మరియు ప్రాణాలు హరించే లాగా కూడా జరగవచ్చు ఒక్కొకసారి..యముకల డెన్సిటీ తగ్గి మరియు బరువు పెరిగి కొవ్వు ఎక్కువవుతుంది దానివల్ల వాళ్ళకి చాలా రొగాలకి గురి అయ్యేలా చేస్తుంది కుడా..! మెల్లగా చంపడం అంటే ఇదేనేమో.
అసలు కెమికల్ క్యాస్త్రేషణ్ అంటే ఏంటి తెలుసుకోవడానికి ఇక్కడ చూడండి. http://goo.gl/8gJ2a
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
With 2.4B global Internet users in 2012, KPCB (Kleiner Perkins Caufield Byers) expects the growth to increase a t the rate of 8% (Year on Year Growth Rate), driven by emerging markets such as India, Indonesia, Iran, Russia and Philippines.
What Stats Says About Internet
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
Your Gmail account's password isn't just for Gmail. Gmail's password is shared by all the other Gmail applications such as Google Docs, youtube etc. So when it comes to secure your Gmail password extra concern must be taken. Gmail provides you a unique password verification feature that makes your Gmail password more robust and hack proof. This feature is known as "Two-Step Verification." This feature allows you to enable two step account verification process before your login to your Gmail account. Once you login to your Gmail account using this feature, Gmail enables you to login with the same PC for next 30 days without any verification. (this feature is optional). Two-Step Verification allows you to login from selected PCs into your Gmail account.
As per Google, 2-step verification adds an extra layer of security to your Google Account. Besides, your username and password, you'll have enter an unique code to sign in to your Gmail account. This uniques code will be generated to your cell phone via text or a voice message once you initiate signing process.
Let us learn how to secure your Gmail account and add Two-Step Verification
How to Set up Two-Step Verification:
Once this feature is enabled, to access your Gmail you will always require the password, and Gmail unique code that will be delivered to you via your cell phone. If you wish Gmail to remember your computer for login, (so that it doesn't asks u to verify Two Step Verification for next consecutive 30 days) check the option that says "remember me for 30 days on this device"
Even if you lost your cell phone or you don't have your cell phone with you, you can use Two Step Verification and easily login to your Gmail account. Google offers multiple ways to generate Two Step Verification codes. You can add a secondary backup phone or you can print the single-use verification codes.
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
ఆడపిల్ల పుడుతుందంటే గుండెల్లో వణుకు. ఆడపిల్లను పెంచలేమని, చదివించలేమనీ, కట్నాలుపోసి పెళ్లి చేయలేమనీ, జాగ్రత్తగా కాపాడలేమనీ ఇలా ఆడబిడ్డను పురిట్లోనే హతమార్చడానికి ఎన్నో కారణాలు. స్త్రీని దేవతగా, ఆకాశంలో సగభాగంగా కొలిచే నేటి భారతంలోనే ఈ ఘాతుకాలు జరగడం సిగ్గుపడాల్సిన విషయం. అతివ అడుగు ముందుకేస్తున్న కొద్దీ అణిచివేయడం గర్హించదగిన అంశం.
ఈ మధ్య కాలంలో రాజకీయ నాయకులకు అత్యాచారాలపై మాట్లాడటం ఫ్యాషన్‌గా మారిపోయింది. ఒక పక్క దేశంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. వాటిని ఎలా నివారించాలో అలోచించలేక 'ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్లు' అంతా ఒకే మాట.
అమ్మాయిలకు స్వేచ్ఛ ఎక్కువ అవటం వలననే అత్యాచారాలు పెరిగిపోతున్నాయి అని స్వయాన పశ్చిమబెంగాల్ మహిళ ముఖ్యమంత్రి మమతబెనర్జీ అనటం సిగ్గుచేటు. అధికార పార్టీ ప్రతినిధి రేణుకాచౌదరి అత్యాచారాలు శాంతి భద్రతల సమస్య కాదని అన్నారు. హర్యానా ముఖ్యమంత్రి అయితే ఏకంగా 16సం||లకే అమ్మాయిలకు పెళ్ళి చేయడం వలన అత్యాచారాలను నియంత్రించవచ్చని బాల్యవివాహాలను ప్రోత్సహించే విధంగా మాట్లాడారు. వీటిని బట్టి అమ్మాయిలపై రాజకీయ నాయకులలో ఎలాంటి దృక్పథం ఉందో అర్ధం చేసుకోవచ్చు.
పశ్చిమబెంగాల్, హర్యానాలలో ఒక్క నెలలోనే 30 కేసులకు పైగా నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2011లో అమ్మాయిలతో అనైతిక వ్యాపారం ఎక్కువగా జరుగుతుందని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. మన రాష్ట్ర పోలీస్ లెక్కలు కూడా ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి. ఇటీవల భారత ప్రభుత్వం చిల్డ్రన్స్ ఇన్ ఇండియా 2012 నివేదికను విడుదల చేసింది. దీనిలో దేశంలో అమ్మాయిలపై జరుగుతున్న అకృత్యాలను (పోలీస్ స్టేషన్‌లో నమోదయిన కేసులు మాత్రమే) నివేదించారు. ఈ నివేదికలో ఇవి కొన్ని అంశాలు మాత్రమే..
మైనర్ బాలికలపై జరుగుతున్న అకృత్యాలలో ఎ.పిలో అధికం
* అమ్మాయిలపై జరుగుతున్న అకృత్యాలలో అత్యధికంగా 605 కేసులు నమోదు కాగా అనైతికంగా అమ్మాయిలతో వ్యాపారం చేయించే కేసులు 497 అత్యధికంగా కేసులు ఉండటం ఆంధ్రప్రదేశ్‌లో అమ్మాయిలకు భద్రత ఏ విధంగా ఉందో అర్ధమవుతుంది.
* మైనర్ బాలికలను బంధించడం కేసులలో 27% పెరిగాయి. వీటిలో పశ్చిమ బెంగాల్ (298)లో 34.6%తో అగ్రస్ధానంలో ఉంది. తర్వాతి స్ధానాల్లో బీహర్(183), అస్సాం(142), ఆంధ్రప్రదేశ్‌్(106) ఉన్నాయి.
* బాల్యవివాహాలలో దేశం మొత్తం మీద 113 కేసులు నమోదు కాగా అధికంగా పశ్చిమబెంగాల్ (25) తర్వాతి స్ధానాల్లో మహారాష్ట్ర(19), ఆంధ్రప్రదేశ్(15), గుజరాత్(13), కర్ణాటక(12) ఉన్నవి.
పశ్చిమబెంగాల్‌లో అధికారం మారిన తర్వాత అమ్మాయిలపై అకృత్యాలు బాగా పెరిగాయి. మహిళ ముఖ్యమంత్రి అయినా ఆమ్మాయిలపై నేరాలు పెరిగాయే కాని తగ్గలేదు. అయినా ఆమ్మాయిలదే నేరం అన్నట్లు ముఖ్యమంత్రి మాట్లాడటం శోచనీయం.
* వ్యభిచార వత్తిలో దింపేందుకు అడపిల్లలను కొనడం, అమ్మడం నేటికీ పలు రాష్ట్రాల్లో యధేచ్ఛగా కొనసాగుతోంది. 2010 సం||తో పోల్చితే 2011లో వ్యభిచార వృత్తిలోకి దింపేందుకు అమ్మాయిలను కొనడం 65%, అమ్మడం 13% పెరిగింది.
* ఈ తరహా నేరాల్లో అడపిల్లలను కొనడంలో అధికంగా మహారాష్ట్రలో 74% కేసులు నమోదయ్యాయి. అడపిల్లలను అమ్మడంలో అధికంగా పశ్చిమబెంగాల్‌లో 77% కేసులు నమోదయ్యాయి.
>అత్యాచార కేసులలో...
* 2010-11 అత్యాచార కేసులు 30%, అమ్మాయిలను బంధించడం 27% కేసులు పెరిగాయి. 2011 సం|| బాలికలపై అత్యాచారాలలో ముందు స్ధానంలో మధ్యప్రదేశ్ తర్వాతి స్ధానాల్లో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ఉన్నాయి. ఈ 3 రాష్ట్రాలలోనే 44.5% కేసులు నమోదయ్యాయి.
భ్రూణహత్యలలో...
* ఆడపిల్ల పుడుతుందని తెలిసి భ్రూణహత్యలకు పాల్పడుతున్న కేసులు కూడా పెరిగాయి. దేశం మొత్తం మీద 132 కేసులు నమోదు కాగా అధికంగా మధ్యప్రదేశ్‌లో నమోదవ్వగా, చత్తీస్‌గడ్, పంజాబ్ ఆ తర్వాతి స్ధానాల్లో ఉన్నాయి.ఈ మూడు రాష్ట్రాల్లోనే 56% కేసులు నమోదయ్యాయి.నమోదయిన కేసులలో న్యాయస్ధానాలకు వెళ్ళి శిక్షలు పడుతున్నవి అతి తక్కువగా ఉంది.
శిక్ష విధించడంలో అలసత్వం
* పిల్లలపై నేరాలు పెరుగుతున్నప్పటికి వాటిపై కేసులు నమోదు చేయడంలో నిర్లక్ష్యం కనబడుతుంది. నమోదైన కేసులలో శిక్షలు పడిన వారు తక్కువే. కేవలం 34.6% కేసుల్లోనే నిందితులకు శిక్షలు పడుతున్నవి.
* చిన్నారుల హత్యలకు 45.5%, భ్రూణహత్యలకు 46.9% కేసుల్లో శిక్షలు పడినట్లు నివేదికలో పొందుపరిచారు. అమ్మాయిల క్రయవిక్రయాలలో 65% కేసులు నమోదయ్యాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్‌లో 20.4% కేసులు 2011సం||లో నమోదయ్యాయి.122.2% కేసులు అమ్మాయిల ఎగుమతులపై నమోదు కాగా వాటిలో 56% కేసులు మధ్యప్రదేశ్‌లో నమోదవడం విశేషం.
* కేసులు నమోదుచేసి వాటిపై చార్జీషీటు నమోదు చేయడంలో మాత్రం వెనుకడుగే. 2011 సం||లో 82.5% కేసులకు మాత్రమే చార్జీషీటు నమోదు చేశారు. అతి తక్కువగా భ్రూణహత్యలపై నమోదు కావటం శోచనీయం.
...పై వివరాలను బట్టి దేశంలో అమ్మాయిలకు ఎలాంటి భద్రత ఉందో అర్ధం అవుతుంది. అందుకే మొట్టమొదటి సారిగా యునెస్కో, యు.ఎన్.ఓ ప్రపంచ బాలికల దినోత్సవాన్ని జరపాలని డిసెంబర్ 2011న నిర్ణయించాయి. అక్టోబర్ 11న ఈ దినోత్సవాన్ని జరపాలని ప్రపంచానికి చాటిచెప్పింది. ఈ వెడుకను అన్ని దేశాలు ఏదోఒక రూపంలో జరుపుకున్నాయి. భారతదేశంలో కూడా ఈ సందర్భాన్ని ఉపయోగించుకొన్నారు. యునెస్కో భారతదేశానికి బాల్యవివాహాలను రద్దుచేయడానికి పూనుకోవాలని సందేశం పంపింది. ఇదే అక్టోబర్ 11న హర్యానా ముఖ్యమంత్రి 16 యేళ్ళలోపే బాలికలకు వివాహాలు చేయాలని ప్రకటించారు. హర్యానాలోని పంచాయితీ పెద్దలు కూడా బాల్య వివాహాలను జరపడం వలననే అమ్మాయిలపై అత్యాచారాలను అరికట్టగలమని ప్రకటించాయి.ఈ రాష్ట్రంలో ఒక్క నెలలోనే 15 అత్యాచార కేసులు నమోదయ్యాయి అంటే పరిస్ధితి అదుపు తప్పుతుందని అర్ధం అవుతుంది.. మన ఆంధ్రప్రదేశ్ బాల్యవివాహాలలో మూడవ స్ధానంలో ఉంది. జనాభాలో అమ్మాయిల శాతం తగ్గటం వలన ఇలాంటి అకృత్యాలు పెరుగుతున్నాయని ఐద్వావంటి మహిళా సంఘాలు చెబుతున్నా భూృణహత్యలను అరికట్టడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది.
సమాజంలో అమ్మాయిలపై ఉన్న దృక్పథంలో మార్పు రావాలి. అధునిక కాలంలో ఆమ్మాయిలు మేము సైతం అని అన్ని రంగాలలో అభివృద్ధి అవుతున్న దశలో ఇలాంటి చేష్టలు తిరోగమనానికి ఆనవాళ్లు. కాబట్టి మన ఉనికిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. పెచ్చరిల్లుతున్న ఈ విషసంస్కృతికి వ్యతిరేకంగా పోరాడాల్సిన ఆవశ్యకత నేడు ఆసన్నమైనది.
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!