అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియనీ మమతల మూట
దేవుడే లేడనే మనిషున్నాడు, అమ్మే లేదనువాడు అసలే లేడు
తల్లిప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు, ఆ తల్లిసేవ చేసుకొనే బ్రతుకే బ్రతుకు
అమ్మంటే అంతులేని సొమ్మురా, అది యేనాటికి తరగని భాగ్యమ్మురా
అమ్మ మనసు అమృతమే చిందురా అమ్మ ఒడిలోన స్వర్గమే ఉందిరా
అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే, అందరకీ ఇలవేలుపు అమ్మ ఒక్కటే
అమ్మ ఉన్న ఇంటిలో లేనిది ఏదీ ! @ {భారతీయులం} 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam
URL: HTML link code: BB (forum) link code:
ధన్యవాదనములు | ®“భారతీయులం”®