Is this blog?

భారతీయులం

భారతీయులం |protest of indians, we are indians
Home » April 2012
ప్రపంచ దేశాలకి అత్యదిక సంఖ్య లో డాక్టర్స్ ని ఎగుమతి చేసే దేశం మన భారత దేశం .అదే మన ఇండియా విషయానికి వస్తే ?? @ భారతీయులం

ప్రపంచ దేశాలకి అత్యదిక సంఖ్య లో డాక్టర్స్ ని ఎగుమతి చేసే దేశం మన భారత దేశం .
U.K లో 40,000 మంది కి పైగా మన మన డాక్టర్స్ మంది వర్క్చచేస్తున్నారు అంటే సగం మంది U.Kప్రజలకి మన వాళ్ళు వైద్యం చేస్తున్నారు .
U.S.A లో మన డాక్టర్స్ 50,000మంది వర్క్ చేస్తున్నారు అంటే ప్రతి 1325 మందికి ఒక ఇండియన్ డాక్టర్ వర్క్ చేస్తున్నారు .
అదే మన ఇండియా విషయానికి వస్తే ప్రతి 2400 మందికి ఒక ఇండియన్ డాక్టర్ వర్క్ చేస్తున్నారు .
ఒక్క సారి ఆలోచించడి ఇండియన్ డాక్టర్స్ ..........@ భారతీయులం | www.facebook.com/bharatiyulam 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

చరిత్రలో ఈ రోజు - May 1, మే దినోత్సవం లేదా మే డే,మహారాష్ట్ర దినోత్సవం ,వృద్ధుల దినోత్సవం,ఉత్తర ప్రదేశ్ గవర్నర్‌గా బెజవాడ గోపాలరెడ్డి పదవీబాధ్యతలు చేపట్టాడు.@ భారతీయులం

చరిత్రలో ఈ రోజు - May 1
1906: మే డే కోసం జరుపుతున్న ఆందోళనలో, పారిస్ దళలు చాలామందిని నిర్బంధించాయి (ఆరెస్టు).
మే దినోత్సవం లేదా మే డే (May Day) ప్రతి సంవత్సరం మే 1 వ తేదీన జరుపుకునే స్మారక దినం. పబ్లిక్ శెలవుదినం.చాలా దేశాలలో మే దినం, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం లేదా కార్మిక దినోత్సవం తో ఏకీభవిస్తాయి. ఇవి అన్నీ కూడా కార్మికుల పోరాటం మరియు కార్మికుల ఐక్యతను గర్తిస్తాయి. 

1960: మహారాష్ట్ర దినోత్సవం 
1947లో స్వాతంత్ర్యం తరువాత బొంబాయి ప్రెసిడెన్సీలో మహారాష్ట్ర ప్రాంతం, విదర్భ, నాగపూర్, వాటితో మరికొన్ని రాజ సంస్థానాలు విలీనం చేసి 1950లో బొంబాయి రాష్ట్రం ఏర్పాటు చేశారు. 1960 మే 1న బొంబాయి రాష్ట్రాన్ని విభజించి మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలను ఏర్పాటు చేశారు. 
భారతదేశంలో వైశాల్యపరంగా మూడవ పెద్దరాష్ట్రం, జనాభా పరంగా రెండవ పెద్ద రాష్ట్రం (ఉత్తరప్రదేశ్ తరవాతి స్థానం).  


1963: సీనియర్ సిటిజన్స్ డే (వృద్ధుల దినోత్సవం) (మసాఛుసెట్స్) 
ప్రతీ జీవికీ చావు పుట్టుకలు ఎంత సహజమో భూమ్మీద నూకలు బాగా ఉండి బతికితే ముసలితనం కూడా అంతే సహజం. జరామరణాలు, వ్యాధులు, బాధలు అంటేచాలు బెంగపడి మంచాలెక్కేవాళ్ళెందరో...!వయసు 60వ యేటికి చేరుతుంటే ప్రతీ ఒక్కరికీ మనసులో బాధ. ప్రభుత్వ సర్వీసులో ఉన్న వాళ్ళకు, పెద్దపెద్ద కంపెనీలలో ఉద్యోగాలు చేసే వారికి అది రిటైర్మెంట్‌ను తెచ్చిపెట్టే వయసు. 60యేళ్ళు వస్తేయేం ఇంకా పనిచేయగల సత్తా ఉన్నా ఎందుకు రిటైర్‌ చేయించేస్తారు అని అమాయకంగా అడిగేవారు, వయసు సాకుగా చూపించి అనుభవాన్ని వదులుకుంటారా? వృద్ధులను సీనియర్లు అని పిలిచే సంప్రదాయం అమెరికాలోనూ యూరోప్‌లోనూ ఉంది. అలాగే ఆ దేశాలలోనే 65 సంవత్సరాలు దాటిన వారిని సీనియర్లు అని పిలవడాన్ని సంప్రదాయంగా పెట్టుకున్నారు. రిటైరయ్యే వారికి దిగులులేకుండా బతకడానికి అవసరమైన అన్ని రక్షణ చర్యలు తీసుకున్నారక్కడి పాలకులు. కనుక అక్కడ రిటైరైన వారు గాలిలో దీపాలమైపోయామని దిగులుపడనక్కర్లేదు. ముసలితనం ముసలితనం అనడమేకాని చాలా మంది వయసు మీద పడ్డాకే చురుకు పాలు పెరిగి బ్రహ్మాండంగా పనిచేస్తుంటారు. 

1967: ఉత్తర ప్రదేశ్ గవర్నర్‌గా బెజవాడ గోపాలరెడ్డి పదవీబాధ్యతలు చేపట్టాడు. 
స్వాతంత్ర్య సమర యోధుడు, బహుభాషావేత్త, ఆంధ్ర రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రి, డా.బెజవాడ గోపాలరెడ్డి. పదకొండు భాషల్లో పండితుడైన గోపాలరెడ్డి అనేక రచనలు కూడా చేసాడు. పరిపాలనాదక్షుడుగా, కేంద్ర, రాష్ట్రాల్లో మంత్రిపదవులు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిత్వమే కాక, ఉత్తర ప్రదేశ్ కు గవర్నరు గా కూడా పనిచేసాడు. 
.........................
మే దినోత్సవం:
ఎప్పుడైతే బ్రిటన్ లో ఆవిరి యంత్రం కనిపెట్టబడి, అది పారిశ్రామిక విప్లవానికి దారి తీసిందో, అప్పుడే కార్మిక వర్గం పురుడుపోసుకుంది భూస్వామ్యంలో కార్మికులు లేరు. వ్యవసాయానికి అనుబంధంగా వృత్తి. పనివారలు ఉండేవారు అంతే! కాని పెద్దపెద్ద పరిశ్రమలు స్థాపించబడి, నిరంతరాయంగా ఉత్పత్తి జరిగిన క్రమంలో కార్మికులు అదే స్థాయిలో పెరిగారు కాని విపరీతమైన పనిగంటలు , దుర్భరమైన పరిస్థితులు మళ్ళీ వారిలో స్పార్టకస్ ని మేల్కొలిపాయి.
బానిసతిరుగుబాట్లు జరిగినట్టుగానే , అమెరికాలో జరిగిన కార్మికవర్గ తిరుగుబాటు నుంచే 'మే డే' ఆవిర్భవించింది. 8 గంటలు పనిదినం, 8 గంట నిద్ర , 8 విశ్రాంతి కావాలంటూ అటు యూరప్ లోను, ఇటు అమెరికాలోని కార్మికులు ఉద్యమించారు. ఆ పోరాటం నుంచే ప్రపంచ కార్మిక వర్గం యొక్క భూమికను కర్తవ్యాల్ని ప్రకటిస్తూ 'మేడే 'ఇప్పటికీ తన వునికిని చాటుకుంటూనే వుంది.

19వ శాతబ్దంలో పెట్టుబడిదారులు కార్మికులను చేస్తున్న దోపిడిని గ్రహించి మార్క్సిస్టు మూల పురుషుడు  కార్ల్‌ మార్క్స్‌  ప్రపంచ కార్మికులారా ఏకం కండి... పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప... అని ఇచ్చిన నినాదానికి కార్మికుల నుంచి ఉవ్వెత్తున స్పందిన వచ్చింది.  ఇంగ్లాండ్‌ యురోపియన్ దేశాల్లో పారిశ్రామిక రంగం వేగంగా అభివృద్ది చెందుతున్న సమయంలో అటు కార్మిక రంగం అంతే స్పీడుగా పెరిగింది. ఈ పారిశ్రామిక విప్లవం ప్రారంభ దినాల్లో శ్రామికులను యాజమాన్యాలు, బానిసల్లా పనిచేయించుకునే వారు. కార్మికులకు కనీస సౌకర్యాలు, తగిన వేతనం, కల్పించకపోగా... రోజుకు 18- 20 గంటలు పనిచేయించే వారు. దీంతో కార్మికులు మొదటిసారిగా  1806లో తిరుగుబాటుకు చేశారు.  బ్రిటన్‌లో ప్రారంభమైన ఈ తిరుగుబాటు ఆమెరికా సంయుక్త రాష్ట్రాలతో పాటు యూరప్‌, ప్రాన్స్‌, జర్మనీ తదితర దేశాలకు పాకింది. ఈ తిరుగుబాటు మొత్తానికి అమెరికా ఫెడరేషన్‌ ఆఫ్‌ లేబర్స్‌ యూనియన్‌ నాయకత్వం వహించింది. చికాగో నగరంలో 1886మే 1న హే మార్కెట్‌ ప్రాంతంలో కార్మికుల హక్కుల కోసం భారీ నిరసన ప్రదర్శన జరిపారు. ఈ ర్యాలీని చెదరగోట్టేందుకు అమెరికా ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పింది. దీంతో రెచ్చిపొయిన పోలీసులు ప్రదర్శనపై కాల్పులు జరిపారు. నలుగురు కార్మికులు తుపాకి తుటాలకు బలయ్యారు.  కాల్పులకు వ్యతిరేకంగా మే 4న మరో నిరసన సభ ఏర్పాటు చేశారు. ఈ సభనూ చెదరగోట్టే  ప్రయత్నంలో భాగంగా పోలీసులు మరో సారి తన ప్రతాపాన్ని చూపారు. స్వైర విహరం చేశారు.  చికాగో లోని హే మార్కేట్‌ రక్తంతో పూర్తిగా తడిసి ముద్దైంది. అక్కడే అవర్బవించింది ఈ అరుణపతాకం అ విధంగా 1856 మే 1 ప్రపంచ కార్మిక వర్గ విప్లవపోరాట ఉద్య మ చరరిత్రలు రక్తాక్షారాలతో లిఖించదగింది. ఆనాటి పోరాటాలు ఒక్క చికాగో నగరమే కాక ప్రపంచం నలుమూలల వ్యాపించాయి. ఆ రకంగా 156 సంవత్సరాల క్రీతం మొదలైన మే డే దాదాపు 113 ఏళ్ల నుంచి మన దేశంలో వామపక్షాల ఆధ్వర్యంలోని కార్మికులు, ఉత్సవాలను జరుపుతున్నారు. నాటి నుంచి నేటి వరకు అనేక రూపాల్లో కార్మికులు తమ పోరాటాలను కొనసాగిస్తూనే ఉన్నారు. @ భారతీయులం | www.facebook.com/bharatiyulam 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

చరిత్రలో ఈ రోజు - April 30 ప్రముఖ తెలుగుకవి శ్రీశ్రీ జన్మించిన దినం,మద్రాసు ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు పదవి చేపట్టాడు.@ భారతీయులం

చరిత్రలో ఈ రోజు - April 30
1.ప్రముఖ తెలుగుకవి శ్రీశ్రీ జన్మించిన దినం.
2.దాదా సాహేబ్ పాల్కే జయంతి.

సంఘటనలు
1946: మద్రాసు ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు పదవి చేపట్టాడు.
1986: ఐ.ఎన్.ఎస్. సింధుఘోష్ (జలాంతర్గామి పేరు) భారతీయ నౌకాదళం లో చేరిన రోజు.@ భారతీయులం | www.facebook.com/bharatiyulam 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

ప్రతిష్ఠాత్మకమైన 'ఆల్ ఇండియా ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (ఏఐఈఈఈ).దేశ వ్యాప్తంగా దాదాపు 11.64 లక్షల మంది అభ్యర్థులు హాజరు.@ భారతీయులం

ప్రతిష్ఠాత్మకమైన 'ఆల్ ఇండియా ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (ఏఐఈఈఈ).ఆఫ్‌లైన్‌లో నిర్వహించే పరీక్షకు దేశ వ్యాప్తంగా దాదాపు 10 లక్షల మం ది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో మన రాష్ట్ర విద్యార్థులు లక్ష మందికి పైగానే ఉంటారు. ఆఫ్‌లైన్ పరీక్ష గుంటూరు, తిరుపతి, వరంగల్ నగరాల్లో జరుగుతుంది. పేపర్-1 పరీక్ష ఉదయం 9.30 నుంచి 12.30 గంటల వరకు, పేపర్-2 పరీక్ష సాయంత్రం 2 నుంచి 5 గంటల వరకు జరగనుంది.

హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో నాలుగు విడతలుగా నిర్వహిస్తున్నా రు. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లలో కలిపి దేశ వ్యాప్తంగా దాదాపు 11.64 లక్షల మంది అభ్యర్థులు హాజరు కానున్న ఈ పరీక్షకు మన రాష్ట్రం నుంచి సుమారు లక్షన్నర మంది పోటీ పడుతున్నారు.@ భారతీయులం | www.facebook.com/bharatiyulam 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

చూయింగ్ గమ్ ! నములుతూ ఉండటం..స్టైల్ గా మారింది.అసలేంటి ఈ చూయింగ్ గమ్ ? చూయింగ్ గమ్ మింగితే ? తిప్పలు తప్పవా ? @ భారతీయులం

చూయింగ్ గమ్ ! ఇది ఇప్పుడు ఒకరకమైన స్టైల్ గా మారింది.

ప్రతినిత్యం చూయింగ్ గమ్ ను నములుతూ ఉండటం..! ఐతే అసలేంటి చూయింగ్ గమ్ ? ఒకవేళ పొరపాటున మింగితే ఏంటి సంగతి ? మీ అపోహలకు ఇదిగో సమాదానం.

చూయింగ్ గమ్:

చూయింగ్ గమ్ కృత్రిమ రబ్బర్ తో తయారు చేసే ఒక తినే పదార్థం.

చూయింగ్‌ గమ్‌ చరిత్ర 1866 సంవత్సరంతో ముడిపడి వుందిమెక్సికో దేశపు సైనిక నియంత సాంటా అన్నాతో జతపడి వుంది. 1866నాటి తన దేశపు అంతర్యుద్ధ్యం సందర్భంగా సాంటా అన్నా అజ్ఞాతంలోకి వెళుతూ దళసరిగా తెల్లగా వున్న జిగురు ముక్కను తన వెంట పట్టుకునిపోయాడు. మెక్సికోలోని ఒక తరహా చెట్టు బెరడు నుండి స్రవించే ఈ జిగురును ప్రతికూల పరిస్థితుల్లో చప్పరించడం అక్కడి వారికి ఆనవాయితీగా వస్తోంది. సాంటా న్యూయార్క్‌లోని స్టేటన్‌ దీవిలో తలదాచుకున్నాడు.

కొన్ని నెలల తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చాడు సాంటా. తను వుపయోగించగా మిగిలిన జిగురు ముక్కను తన టేబుల్‌ సొరుగులో వదిలేసాడు. అదే దీవిలో వున్న థామస్‌ ఆడంస్‌ అనే శాస్త్రవేత్త ఆ జిగురు ముక్కను చేజిక్కించుకున్నాడు. సాంటా ఆ జిగురు ముక్కను నములుతూ వుండేవాడని థామస్‌ తెలుసుకున్నాడు. సాగుతున్న పదార్థంలో ఏం రుచి వుందో ఆయనకు అర్థం కాలేదు. జిగురును సేకరించి ఒకరకమైన రబ్బరును రూపొందించాలనుకున్నాడు కానీ అది తయారవ్వలేదు. కృత్రిమ దంతాలు అమర్చడానికి ఆ జిగురు ఉపయోగపడుతుందేమోనని ప్రయోగం చేశాడు. కానీ అది సాథ్యం కాలేదు.

చివరకు థామస్‌ ఆ జిగురును ఉడకబెట్టి చిన్న చిన్న పుల్లలు తీసుకుని వాటి చివరన ఈ ఉడికించిన జిగురును అతికించి పంచదార బిళ్లలు అమ్మే దుకాణాల్లో అమ్మాలని ప్రయత్నించాడు. ఈ ప్రయోగం విజయవంతం అవడంతో విపరీతమైన ప్రేరణ పొందడు. దానితో గమ్‌స్టిక్స్‌ వ్యాపారం మొదలైంది. వేలాదిగా వీటిని తయారుచేసే యంత్రాన్ని కనిపెట్టి, తన ఉత్పత్తికి చూయింగ్‌ గమ్‌ అని పేరు పెట్టాడు.

 

చూయింగ్ గమ్ మింగితే ? తిప్పలు తప్పవా ?

చాలా మంది పొరబాటుగా చూయింగ్ గమ్ మింగేసి ఉంటారు ...ఐతే అది రబ్బరు పదార్ధం తో చేసింది ఉండటం వలన అది మన పొట్టలో అరగదు

కొందరు చూయింగ్ గమ్ మింగింతే, అది తమ పొట్టలోనే ఉంటది అంటూ బయపెడతారు ..ఐతే ఇది ఉండటం కాదు అరగక పోవటం వలన....ఓహ్ చూయింగ్ గమ్ మన పొట్టలో అరగడానికి సుమారు ఏడు సంవత్సరాలు పడుతుంది, ఐతే సాదారణంగా మన ప్రక్రియ ప్రకారం ఇరవై నాలుగు గంటలకల్లా అది వచ్చేయాలి జీర్ణాశయం నుండి లేని యడల అది మనకి పోట్టనోప్పిని ఇస్తుంది అరగక పోవడం వలన. అందుకే మనము చూయింగ్ గమ్ మింగిన కుడా కొందరికి ఏమి కాదు మరి కొందరికి తిప్పలు తప్పవు రబ్బరు పదార్ధం వలన. తస్మాత్ జాగర్త.@ భారతీయులం | www.facebook.com/bharatiyulam


Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

నృత్య కళాకారులను ఏకం చేయడానికి యునెస్కో 1982వ సంవత్సరలో అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని ప్రకటించింది.నాట్యంతో చైతన్యాన్ని కల్గించవచ్చు, కళాకారులు మన సాంస్కృతిని కాపాడాలి.@ భారతీయులం

నృత్యాల ద్వారా తెలుగు భాష, సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పాలి. నృత్య కళాకారులను ఏకం చేయడానికి యునెస్కో 1982వ సంవత్సరలో అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని ప్రకటించింది. నాట్యంతో చైతన్యాన్ని కల్గించవచ్చు, కళాకారులు మన సాంస్కృతిని కాపాడాలి. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన తెలుగు జాతిని మరవరాదు.

భారతీయ నాట్యరీతులు అనేక విధాలు. వీటిని ప్రధానంగా రెండు విధాలుగా వర్గీకరించవచ్చు...
సంప్రదాయ నృత్యాలు లేదా శాస్త్రీయ నృత్యాలు
జానపద, గిరిజన నృత్యాలు.

భరతదేశం శాస్త్రీయ నాట్యాలకు పుట్టినిల్లు, అలాగే ఇక్కడ అనేక రకాల నాట్య కళలు తొ కళకళలాడుతోంది,భారత దేశం లొ అనేక శాస్త్రీయ నృత్యం సంస్కృతి లొ ఒక భాగం. బిన్న సంస్కృతు లతొ నిండిన భారత దేశం లొ సంస్కృతికి అనుగుణంగా బిన్న శాస్త్రీయ నృత్య కళళతొ నిండింది, ప్రతి శాస్త్రీయ నృత్యం సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. నాట్యం శాస్త్రీయ నృత్యం కావాలంటే భరతముని బొదించిన నాట్యశాస్త్ర విధంగా అభినయం మరియు నాట్యం కలిసిన విధంగా వుంటుంది.

నాట్యము (ఆంగ్లం :Dance) (ఫ్రెంచి పదము డాన్సెర్ నుండి ఉద్భవించింది): సాధారణంగా సంగీతానికి పారవశ్యమై శరీరంలో ఏర్పడే కదలికలు, లేదా "లయబద్ధ సంగీతానికి, శరీరం లయబద్ధంగా కదలడం" అని చెప్పుకోవచ్చు.
భరతవాట్యం దక్షిణ భారతదేశం లో నాట్య శాస్త్రం రచించిన భరతమువి పేరుతో పుట్టి, ప్రసిద్ధి గాంచిన ఒక శాస్త్రీయ నృత్య విధానం. దక్షిణ భారతదేశం లోని పురాతవ దేవాలయాలలో శిల్పాలు భరతనాట్య భంగిమలలో అప్సరలు వాట్యం చేస్తున్నట్లుగా తీర్చిదిద్దబడి ఉంటాయి. పూర్వకాలంలో దేవదాసీలు దేవాలయాలలో భరతనాట్యాన్ని ప్రదర్శించేవారు. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలోని "తంజావూరు" లొ 'నట్టువన్నులు' మరియు దేవదాసీలు ఈ కళకు పోషకులు. భావం, రాగం, తాళం - ఈ మూడు ప్రాధమిక నృత్య కళాంశాలనూ భరతనాట్యం చక్కగా మేళవిస్తుంది. ఇందులో పలు నృత్య భంగిమలతో పాటు 64 ముఖ, హస్త, పాద కదలికలు ఉన్నాయి. సాధారణంగా భరతనాట్యంలో నియమాలు అత్యంత కఠినంగా ఉంటాయి. కట్టుబాట్లు మరీ ఎక్కువ.@ భారతీయులం | www.facebook.com/bharatiyulam 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

ఒక ముస్లిం దంపతులు తమ చిన్నారికి క్రిష్ణుని వేషాన్ని వేసి స్కూలుకు తీసుకెలుతున్నారు ! కుల మతాలూ అన్ని ఒక్కటే...మనము భారతీయులం.@ భారతీయులం

కుల మతాలూ అన్ని ఒక్కటే...మనము భారతీయులం.
ఇదిగో మా క్రిష్ణయ్యను చూసారా ? ఎలా వెళ్తున్నాడో ? ఎలా ఉన్నాడు ?
ఒక ముస్లిం దంపతులు తమ చిన్నారికి క్రిష్ణుని వేషాన్ని వేసి స్కూలుకు తీసుకెలుతున్నప్పుడు ఒక ఫొటోగ్రాఫర్ ఫోటో తీసారు.@ భారతీయులం | www.facebook.com/bharatiyulam 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

ప్రపంచ పశు వైద్య దినోత్సవం ఏప్రిల్ 28న జరుపుకుంటున్నది.పశువుల నుంచి మానవులకు సంక్రమించు కొన్ని వ్యాధుల పట్ల అప్రమత్తత ఉండాలి.@ భారతీయులం

ప్రపంచ పశు వైద్య దినోత్సవం ఏప్రిల్ 28న జరుపుకుంటున్నది. ఈ సందర్భంగా పశువుల నుంచి మానవులకు సంక్రమించు కొన్ని వ్యాధుల పట్ల అప్రమత్తత ఉండాలని పశు సంవర్ధశాఖ ప్రచారం చేస్తున్నది.

ప్రపంచంలో ఏటా దాదాపు యాభై వేలమంది రేబీస్ వ్యాధితో చనిపోతున్నారు. ఆస్ట్రేలియా, అంటార్కిటికా మరికొన్ని ద్వీపాలలో తప్ప ఈ వ్యాధి అంతటా వ్యాపించి ఉన్నది. అన్ని క్షీరదాలు ఈ వ్యాధికి గురవుతాయి. కానీ కుక్కజాతికి చెందిన జంతువులు నక్కలు, పిల్లులు, ముంగీస, గబ్బిలాలు ఈ వైరస్‌కు రిజర్వాయర్స్‌గా ఉంటాయి. రేబీస్ వైరస్ వ్యాధి బహిర్గతం కాకుండా జంతువుల ఉమ్మిలో ఉంటుంది.

మనదేశంలో సంవత్సరానికి 1.5 కోట్లమంది జంతు కాట్లకు గురవుతుండగా, దీనివల్ల వేలాది మంది చనిపోతున్నారు. కుక్కకాటు గురవుతున్న వారి లో దాదాపు అరవై శాతం మంది 15 ఏళ్ల లోపు వారే. జంతుకాటుకు గురైన తర్వాత జరిగే చికిత్సకు సంత్స రానికి 25 మిలియన్ల డాలర్లు ఖర్చు అవుతున్నది. రాష్ట్రంలో గత ఏడాది అత్యధికంగా 13,000 మంది ఒక వారంలో కుక్క కాటుకు గురయ్యారు. తూర్పుగోదావరి,రంగాడ్డి, వరంగల్, ఆదిలాబాద్‌లో కుక్కకాటు కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.

ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ రేబీస్‌వ్యాధి పిచ్చికుక్కకాటు వల్ల వస్తుంది. ఈ వ్యాధి ఉష్ణరక్త జీవులలో కనిపించే మెదడును దెబ్బతీసే లిస్సావైరస్ వల్ల వస్తుం ది.ఈ వ్యాధి జంతువు కాటు ద్వారా, వాటి ఉమ్మి, చర్మం గీసుకపోవడం వల్ల ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. కుక్కల్లో ఈ వ్యాధి బయట పడడానికి 2-12 వారాలలోపు, కొన్నింటిలో రెండేళ్ల సమయం కూడా పట్టవచ్చును. ఈ వ్యాధి మనుషులకు సోకితే చిరాకు పడడం, తలనొప్పి, జ్వరం కాటుకు గురైన ప్రాంతంలో దురద నొప్పిగా ఉండటం వంటి లక్షణా లు కనిపిస్తాయి. పక్షవాతం, మెదడు సరిగా పనిచేయకపోవడం, నిద్రపట్టకపోవడం ఆత్రుత అసాధారణమైన ప్రవర్తన, చొంగ ఎక్కువగా కారడం, కళ్ళనుంచి నీరు కారడం మాట్లాడలేకపోవడం, మింగలేకపోవ డం,చివరిదశలో నీటిని చూసి భయపడడం వంటి లక్షణాలు కూడా ఉంటాయి. 
రేబీస్ వ్యాధి సోకిన కుక్కలు కోపం, చిరాకుగానూ ఉండి యాజమాని గుర్తుపట్టకపోవడం, కనిపించినా జంతువులను, మనుషులను కొరకుతాయి. నోటి నుంచి చొంగ కారడం,నాలుక బయట పెట్టడం మతి లేకుండా తిరుగుతాయి. దవడ వేలాడడం అరుపులో కూడా మార్పు వస్తుంది.ఈ లక్షణాలు కనిపించిన కుక్కలు 10 రోజుల్లో చనిపోతాయి. కుక్కకాటుకు గురై తే గాయాన్ని శుభ్రంగా సబ్బునీటితో (కార్పాలక్ సబ్బు) కడగాలి. తర్వాత 10-15 నిమిషాల పాటు నీటితో కడగాలి. కుక్క కరచిన ప్రదేశాన్ని అంటిసెప్టిక్ / అల్కహాల్‌తో కడగాలి. గాయాన్ని కట్టుతో కప్పరా దు. వైద్యున్ని సంప్రదించి కుక్కకాటు టీకా మందు లు వేయించుకోవాలి. అవసరమైతే ఇమ్యునోగ్లోబ్యులిన్స్ ఇంజెక్షన్ వేయించాలి. రేబీస్ వ్యాధి ప్రాణాంతకమైనది. జంతుకాటుకు గురైతే తప్పకుండా వైద్యుని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. 

పెంపుడు కుక్కలను ఈ వ్యాధి సోకకుండా వ్యాధినిరోధక టీకాలు క్రమం తప్పకుండా వేయించాలి. వ్యాధి సోకిన,అనుమానం ఉన్న కుక్కలను వేరు చేయాలి. అసాధారణ ప్రవర్తన కలిగిన జంతువులు ముఖ్యంగా వన్యవూపాణులకు దూరం గా ఉండాలి. వీధి కుక్కలకు జనాభా నియంవూతణ ఆపరేషన్ చేయించడం ద్వారా వీధి కుక్కల సంఖ్యను నియంవూతివచ్చును.  @ భారతీయులం | www.facebook.com/bharatiyulam 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

మనకు అందరికి తెలుసు కూల్ డ్రింక్స్ ఎంత మంచివో ? అవి ఏంటో ? కానీ కొందరు హీరోలు మరియు హీరోయిన్ లు కూల్ డ్రింక్స్ మంచివి కాదు అని తెలిసిన వాటిని ప్రోత్సహించడం ఏమాత్రం సరి కాదు.@ భారతీయులం

మనకు అందరికి తెలుసు కూల్ డ్రింక్స్ ఎంత మంచివో ? అవి ఏంటో ?
కానీ కొందరు  హీరోలు మరియు హీరోయిన్ లు కూల్ డ్రింక్స్ మంచివి కాదు అని తెలిసిన వాటిని ప్రోత్సహించడం ఏమాత్రం సరి కాదు.
ఐతే ఇందులో చెప్పుకో దగ్గ హీరోలు లేక పోరు...
పవన్ కళ్యాణ్ - ఆది లో పెప్సి వారికీ బ్రాండ్ హీరో గ చేసారు కానీ తరువాత నిజా నిజాలు తెలుసుకొనే లేక మరేదైనా కారణం చేతనో తను ఆ కూల్ డ్రింక్ కి యాడ్ చేయడం మానేసారు. తనకి చేతనైతే సాయం చేస్తాడు లేక పోతే తన ప్రపంచం లో తానూ బతుకుతాడు.
నాగార్జున - అసలే మన్మదుడు ..తన కి ఎటు వంటి సంబంధం లేదు అసలు ఈ ప్రకటనల వల్ల.
వెంకటేష్ - ఈయన అన్నిటికి చాలా దూరం ... కాని జనానికి మరియు స్త్రీలకు చెప్పలేని అభిమానం అయినంటే.
బాల కృష్ణ & యన్ టి ఆర్ - మొదట నుండి ఎ ఇతర యాడ్స్ కు దొరక కుండ ప్రజాదరణ పొందాడు. రామా రావు గారిని తనలో చూసుకుంటున్న అభిమానులకు మంచి తప్ప చెడు ఎప్పుడు చెప్పలేదు. అదే సగం బలం అతనికి. నవరసాలు కలబోసి నిండు గా నటించడం లో వాళ్ళకి సాటి లేరు అని చాటి చెప్పగలిగారు.
రవితేజ - వీడు చంటి గాడు...చంటిగాడికి నచ్చలేదు అనుకున్నాడేమో ప్రకటనలకు చాల దూరం మన చంటి గాడు.
ఇలా తెలియకుండా,లేదా తెలిసో కొంత మంచిని తమ అభిమానులకు చేస్తున్నారు. నేటి అభిమానం ఎంత పిచ్చి గా మారింది అంటే తమ హీరోల కోసం దేనికైనా తెగించ డానికి ఆలోచించట్లేదు. తమ హీరో ని అనుసరించే వాళ్ళు ఎక్కువైపోయారు...తెర మీద బొమ్మలను చూసి అనుసరించకండి. చిత్రంకి నిజ జీవితం కి తేడా తెలుసుకోలేకుండా ఉంది కొందరి అభిమానం.
కాని మిగతా హీరోలు అందరు ఒకటే ఆలోచనలో ఉన్నటున్నారు...కూల్ డ్రింక్స్ కంపెనీలు ఇచ్చే బోలెడు సంపద కోసం ఆలోచించరే కాని మీ అభిమానుల్ని గురుంచి ఆలోచించ లేక పోయారెందుకు ?
తెర పైన మీ నటనను చూసి మెచ్చుకునే, ఆనందపడే మీ అభిమానుల ప్రాణాలు గురుంచి ఎందుకు ఆలోచించరు ? 
ఒక మనిషికి చేతనైతే మంచి చెప్పండి లేకపోతే మౌనంగా ఉండచ్చు కదా ఇలా చిన్న పిల్లల నుండి ముసలి వారి సైతం ఉన్న మీ అభిమానుల్ని తప్పు దారి లో నడిపించకండి దయచేసి.@ భారతీయులం | www.facebook.com/bharatiyulam 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

కూల్‌డ్రింక్స్‌. ఈ కార్బొనేటేడ్‌ కూల్‌డ్రింక్స్‌ తాగే ముందు మానవ ఆరోగ్యంపై ఎంత ప్రభావం కలుగజేస్తాయో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.తీయని పానీయాల గురించి కొన్ని చేదు వాస్తవాలు మీకు తెలుసా?@ భారతీయులం

వేసవి ముదురుతోంది... మండు తున్న ఎండల్లో చెమటలు కారుతు ంటే అలసిన శరీరా నికి చల్లగా, స్వాంతన కోసం చూస్తే ప్రతి గల్లీలోనూ పెద్ద ఎత్తున హౌర్డింగ్స్‌, డిజిటల్‌ బోర్డులతో మన మనసుల్ని లాగేస్తుం టాయి. కూల్‌డ్రింక్స్‌. ఈ కార్బొనేటేడ్‌ కూల్‌డ్రింక్స్‌ తాగే ముందు మానవ ఆరోగ్యంపై ఎంత ప్రభావం కలుగజేస్తాయో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఇటువంటి కార్బొనేటెడ్‌ కూల్‌డ్రింక్స్‌ ప్రజల ఆరోగ్యాన్ని కూడా పెద్ద ఎత్తున కొల్లగొడుతున్నాయని శాస్త్రీయంగా నిరూపితమైంది.

మీకు తెలుసా?
తీయని పానీయాల గురించి కొన్ని చేదు వాస్తవాలు:
* కూల్‌డ్రింకుల్లో శుష్కకేలరీలు కల్గివుండడం తప్పించి, పోషక విలువల రీత్యా ప్రయోజనం శూన్యం. అంతే కాక ఇవి తాగడం వల్ల అదే సమయంలో తాగగల్గిన సహజ, పోషక విలువలున్న పానీయాలకు దూరంగా ఉంటాం. ఫలితంగా పోషక విలువల లోపం ఏర్పడుతుంది.

* వీటిలోని అదనపు కేలరీలు స్థూలకాయానికి దారితీస్తాయి. పైగా కూల్‌డ్రింక్స్‌లో ఉండే కేలరీలతోపాటు ఇంకోరకంగా కూడా అదనపు కేలరీలు చేరుతాయి. కూల్‌డ్రింక్స్‌ తాగినప్పుడు ఇవి వేగంగాకడుపు దాటి జీర్ణవ్యవస్థలోకి చేరతాయి. రిజర్వాయర్‌ లాంటి కడుపులో ఎక్కువసేపు ఉండవు గనుక, కడుపు నిండుగా ఉన్నట్లు మెదడుకు సంకేతాలు వెళ్లవు. కాబట్టి మరలా ఏదో ఒక ఆహారం తింటునే ఉండడం వల్ల స్థూలకాయానికి దారితీస్తుంది.

* కూల్‌డ్రింక్స్‌ హైగ్లైసిమిక్‌ ఇండెక్స్‌ కల్గిఉండడం వల్ల, వేగంగా రక్తంలో గ్లూకోజ్‌ స్థాయి పెరిగి ఇన్సులిన్‌ విడుదల అవుతుంది. దీంతో క్లోమగ్రంథిపై ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా దీర్ఘకాలంగా మధుమేహం వచ్చే అవకాశం పెరుగుతుంది.

* కూల్‌డ్రింక్స్‌ రూపంలో తీసుకునే అధిక ఫ్రక్టోజ్‌ వినిమయం వల్ల అధిక రక్తపోటు వస్తుందని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.

* కూల్‌డ్రింక్స్‌ వినియోగం వల్ల ఎముకలలో కాల్షియం మెటబాలిజం ప్రభావితమై, శరీరంలోని కాల్షియం- ఫాస్పరస్‌ నిష్పత్తి దెబ్బతిని బలహీనపడి ఆస్టియోపోరోసిస్‌ వచ్చే అవకాశముంది.

* కూల్‌డ్రింక్స్‌లో ఉండే యాసిడ్‌ (సిట్రిక్‌ ఆమ్లం లేదా ఫాస్పారిక్‌ ఆమ్లం) వల్ల పంటిపై ఉండే ఎనామిల్‌ పొర కరిగిపోయి పిప్పి పళ్లు ఏర్పడతాయి.

* కూల్‌డ్రింక్స్‌ వాడకం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. ఎలా అంటే వీటిలో ఉండే యాసిడ్‌ను ఎముకల్లో ఉండే కాల్షియాన్ని తటస్థం (బఫరింగ్‌) చేస్తుంది. ఈ క్రమంలో ఏర్పడే మినరల్స్‌ అసమతుల్యత వల్ల దీర్ఘకాలంగా కిడ్నీలో రాళ్లుఏర్పడతాయి.

* కూల్‌డ్రింక్‌లో ఉండే యాసిడ్‌ ఎదలో మంట (హార్ట్‌బర్న్‌) కలుగజేస్తుంది.

* కూల్‌డ్రింక్స్‌ రెగ్యులర్‌గా వాడడం వల్ల అధిక రక్తపోటు, కొలెస్టారాల్‌, ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ వంటి వ్యాధుల సముదాయమైన 'మెటబాలిక్‌ సిండ్రోం' సంభవిస్తుంది.

* దీర్ఘకాల కూల్‌డ్రింక్స్‌ వినియోగించిన వారిలో లివర్‌ సిర్రోసిస్‌ మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

* కూల్‌డ్రింక్స్‌లోని అసిడిక్‌ పిహెచ్‌ వల్ల జీర్ణవ్యవస్థలో ఎంజైముల పనివిధానం ప్రభావితమై పలురకాల జీర్ణవ్యవస్థ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.

* కూల్‌డ్రింక్స్‌లో ఉండే కార్బన్‌డయాక్సైడ్‌, పాస్ఫారిక్‌ ఆమ్లాలు శరీర కణాల్లోని ఆక్సిజన్‌ నిల్వలను తగ్గించడం ద్వారా క్యాన్సర్‌ దారితీయవచ్చని ఇంగ్లండ్‌లోని న్యూకాజిల్‌ విశ్వవిద్యాలయం జరిపిన అధ్యయనంలో వెల్లడైంది.

* కూల్‌డ్రింక్స్‌లో తీయదనం కోసం వాడే 'ఆస్పర్టేమ్‌' అనే కృత్రిమ తీపిపదార్థం చక్కెర కంటే 200 రెట్లు తియ్యగా ఉంటుంది. దీని రసాయనిక నిర్మాణంలో ఉండే ఆస్పర్టిక్‌, ఫినైల్‌ అలనిన్‌, మిథైల్‌ ఆల్కహాలు శరీరంలో విచ్చిన్నం చెందినప్పుడు దీర్ఘకాలిక పరిణామంగా క్యాన్సర్‌కు దారితీయవచ్చు.

* బ్రిటీష్‌ యూనివర్శిటీ జరిపిన అధ్యయనాల ప్రకారం ఫాంటా, పెప్సిమాక్స్‌ డ్రింక్స్‌లో కలిపే 'సోడియం బెంజోయేట్‌' అనే ప్రిజర్వేటివ్‌ రసాయనం కణాల్లోని డిఎన్‌ఎపై ప్రభావం చూపడం ద్వాఆర కణవ్యవస్థకు నష్టం కలుగుతుంది.

* ఢిల్లీలోని సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ జరిపిన అధ్యయనం వెల్లడి చేసి ప్రకారం కూల్‌డ్రింక్స్‌లో మానవశరీరానికి హానికరమైన స్థాయిలో పురుగు మందు అవశేషాలు ఉన్నాయని తేలింది. వీటి దుష్ఫలితాలు అనేకం.

* ఇవిగాక కేరళలోని ప్లాచిమాడ ప్రాంతంలోనూ, రాజస్థాన్‌లోని కాలా-డేరా ప్రాంతంలోనూ కోకోకోలా ప్లాంట్‌ వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయి వ్యవసాయం తీవ్రంగా దెబ్బతిన్నది. వ్యర్ధపదార్థాలు విసర్జన వల్ల ఆ ప్రాంత ప్రజలు తీవ్ర అనారోగ్యా పాలవడం, అందుకు ప్రతిగా ఆ ప్రాంతాల్లో ప్రజలుపెద్ద ఎత్తున కోలా కంపెనీలకు వ్యతిరేకంగా ఉద్యమించడం మనం చూస్తున్నాం.
................................................................................................
కొన్ని చేదు వాస్తవాలు:
* కోకోకోలాను టాయలెట్స్‌ శుభ్రం చేయడానికి ఉపయోగించవచ్చు. టారులెట్‌లోని విట్రియన్‌పైన మరకలను కోకోకోలా ఉండే యాసిడ్‌ ఒకే ఒక గంటలో మటుమాయం చేస్తుంది.

* పాశ్యాత్య దేశాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు రక్తం మరకలును శుభ్రం చేయడానికి క్రూడ్‌కోక్‌ను హైవే పెట్రోలింగ్‌ వ్యాన్స్‌లో ముందస్తుంగా ఉంచుతారు.

* బాటరి టెర్మినల్స్‌పై ఏర్పడిన తుప్పును శుభ్రం చేసేందుకు కోకోకోలాను ఉపయోగించొచ్చు.

* మన ఇళ్లల్లో తుప్పు పట్టిన బోల్టు ఏదైనా వదులు చేయాలంటే కోకోకోలాలో ముంచిన గుడ్డతో కొద్ది నిమిషాలు తుడిస్తే సరి. ఇట్టే పరిష్కారం లభిస్తుంది.

* మనిషి మరణించాక కూడా దేహంలో చెక్కుచెదరకుండా కొన్ని ఏళ్లపాటు ఉండేవి శరీరంలోని ఎముకుల, దంతాలు. అటువంటి మన నోట్లో ఉండే పన్నును కోలాడ్రింక్స్‌లో వేస్తే 48గంటల్లో మెత్తగా అయిపోతుంది. మొత్తం 10 రోజుల్లో కనపడకుండా కరిగిపోతుంది.

* ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఒక తమాషా పోటీ పెట్టుకున్నారు. ఎవరు అతి ఎక్కువ కోక్‌ తాగగలరు? అనేది ఆ పోటి. ఒక్క పెట్టున 8 సీసాల కోక్‌ తాగి విజేతగా నిలిచిన అతడు మరునిమిషంలోనే కుప్పకూలి మరణించాడు. శరీరంలో ఒక్కసారిగా కార్బన్‌డయాక్సైడ్‌నిల్వలు అనూహ్యంగా పెరిగిపోతాయి. ఆక్సిజన్‌ అందకపోవడం వల్ల (హైపాక్సీమియా)తో మరణించాడు. తదనంతరం ఢిల్లీ యూనివర్శిటీ క్యాంపస్‌లో కోకోకోలాల వాడకాన్ని నిషేధించారు..@ భారతీయులం | www.facebook.com/bharatiyulam 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

ఆకలి చావుల గురుంచి తెలుసా మీకు...?నిమిషానికి ఐదుగురు చనిపోతున్నారు మన దేశం లో. ఆకలి చావులు మన దేశం వి మూడవ వంతు ప్రపంచంలో.@ భారతీయులం

ఆకలి చావుల గురుంచి తెలుసా మీకు...?
నిమిషానికి ఐదుగురు చనిపోతున్నారు మన దేశం లో.
ఆకలి చావులు మన దేశం వి మూడవ వంతు ప్రపంచం లో. ఇరవై ఐదు లక్షల మంది చనిపోతున్నారు ప్రతి సంవత్సరం.
ఐతే కొందరు మానవ మాత్రులు ఈ ఆకలి చావులకు ఎదురుగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు ..! 
దీనికి ప్రతి ఒక్కరు తమ వంతు సాయం చేయచ్చు ....అది చాలా సులువైన పని తెలుసా. !
భూఖ్ అని వారు చేసే ప్రయత్నం ని మెచ్చుకొని కొన్ని సంస్థ లు వారి ప్రకటనలు క్లిక్ చేసి నందుకు వారికి తగిన మూలం చెల్లిస్తున్నారు.
మనము చేయాల్సిందల్లా ఒక క్లిక్ మాత్రమే...! ఆ క్లిక్ ఒక పొట్ట కూటికి సాయం పడుతుంది.@ భారతీయులం | www.facebook.com/bharatiyulam 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

వివాహం అంటే స్వార్థజీవితం కాదని, జీవితాన్ని ఆనందంగా గడపడమని మహర్షులు చెబుతారు.ఒకరితో ఒకరు సఖ్యంగా, చనువుగా, ప్రేమగా ఉండటమే దీని మూలమని పెద్దలు వివాహాన్ని నిర్వచించారు.@ భారతీయులం

వివాహం అంటే స్వార్థజీవితం కాదని, జీవితాన్ని ఆనందంగా గడపడమని మహర్షులు చెబుతారు. ఆధ్యాత్మిక, సాంఘిక జీవితాన్ని బాధ్యతగా గడుపుతూ ఒకరితో ఒకరు సఖ్యంగా, చనువుగా, ప్రేమగా ఉండటమే దీని మూలమని పెద్దలు వివాహాన్ని నిర్వచించారు.
జీవితంలో ఒకరితో ఒకరిని ఎక్కువకాలం కలిపి ఉంచేది భార్యాభర్తల బంధం. ఆ బంధం పటిష్టంగా ఉండటానికి పెద్దలు కొన్ని మంత్రాలను నిర్దేశించారు. వాటినే లౌకికంగా పెళ్లినాటి ప్రమాణాలని చెబుతారు. ఆప్రమాణాలను త్రికరణశుద్ధిగా ఆచరించిన దంపతుల సంసారం మూడుపువ్వులు, ఆరుకాయలుగా వర్థిల్లుతుంది. ఆ బంధం నిండునూరేళ్లు పవిత్రంగా, పచ్చగా ఉంటుంది.
వివాహ తంతులో మాంగల్యధారణే అతి ప్రధానమైనది. మాంగల్యానికే మంగళసూత్రం, తాళి, తాళిబొట్టు, పుస్తె, శతమానం అనే పేర్లతోబాటు వివిధ రూపాలు కూడా ఉన్నాయి. ఇవి కులం, వంశానుసారం పలురూపాల్లో ఉంటాయి. మానవులకు మనువాడటం ఎంత ముఖ్యమో, మనువాడటానికి మంగళసూత్రం అంతే ముఖ్యం. పెళ్లికోసం సమకూర్చుకున్న, ఇచ్చిపుచ్చుకున్న ఇతర వస్తువులు, ఆభరణాలు అన్నీ రూపాంతరం చెందినా చివరి వరకు వెంట ఉండేది తాళిబొట్టు మాత్రమే. 
మాంగల్యాన్ని నిత్యం పూజించే వారు ఇప్పటికీ ఎంతోమంది ఉన్నారు. అలాగే ప్రాంతాల వారీగా మంగళగౌరీ వ్రతాన్ని, గౌరీపౌర్ణమీ వ్రతాన్ని మగువలు నియమ నిష్టలతో ఆచరిస్తారు. @ భారతీయులం | www.facebook.com/bharatiyulam 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

క్లాస్ XI సంవత్సరాంత పరీక్షల్లో ఫెయిలయిన విద్యార్ధులు టీచర్లందరినీ స్కూల్ లోపల పెట్టి తాళాలు వేశారు.ప్రమోట్ చేశామని చెబితే తప్ప విడుదల చేయబోమని పట్టుపట్టారు.@ భారతీయులం

ఫెయిలయినందుకు టీచర్లందరినీ నిర్భంధించిన XI క్లాస్ విద్యార్ధులు:

పశ్చిమ బెంగాల్ లోని పశ్చిమ మిడ్నపూర్ జిల్లాలో క్లాస్ XI సంవత్సరాంత పరీక్షల్లో ఫెయిలయిన విద్యార్ధులు టీచర్లందరినీ స్కూల్ లోపల పెట్టి తాళాలు వేశారు. తమని క్లాస్ XII కు ప్రమోట్ చేశామని చెబితే తప్ప విడుదల చేయబోమని పట్టుపట్టారు. దాదాపు తొంభై మంది విద్యార్ధులు ఈ కార్యక్రమంలో ఉండడంతో జోక్యం చేసుకోవడానికి పోలీసులు వెనకాడుతున్నారు. స్కూల్ సెక్రటరీ కూడా నిర్బంధించబడివనారిలో ఉండడం విశేషం.

గోపీబల్లభ్ పూర్ లోని 'నయబాసన్ జనకళ్యాణ్ విద్యాపీఠ్' అనే పాఠశాలలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. పాఠశాల మేనేజింగ్ కమిటీ కార్యదర్శి అశోక్ పట్నాయక్ సంఘటన గురించి చెప్పినట్లు 'ది హిందూ' పత్రిక తెలిపింది. ఫెయిలయినవారందరినీ పన్నెండో తరగతికి ప్రమోట్ చేస్తే తప్ప తాళాలు తెరవబోమని విద్యార్ధులు తెగేసి చెప్పారని పట్నాయక్ ని ఉటంకిస్తూ ఆ పత్రిక తెలిపింది.

క్లాస్ XI లో మొత్తం 247 మంది విద్యార్ధులు ఉంటే అందులో 90 మంది ఫెయిలయ్యారు. 'వెస్ట్ బెంగాల్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ సెకండరీ ఎడ్యుకేషన్' క్లాస్ XI విద్యార్ధులకి పరీక్షలు నిర్వహించింది. ప్రశ్నాపత్రాలు కౌన్సిల్ రూపొందించినప్పటికీ సమాధానాలను మాత్రం స్కూల్ టీచర్లే వాల్యుయేషన్ చేశారు. ఫలితాలని ఈ నెలాఖరుకి వెల్లడిస్తారని 'ది హిందూ' తెలిపింది. ఫలితాలు వెల్లడి కాకుండానే తాము ఫెయిలయినట్లు విద్యార్ధులకి ఎలా తెలిసిందీ వివరం లేదు.

కౌన్సిల్ నిబంధనల వలన ఈ విషయంలో తామేమీ చేయలేకపోతున్నామని సెక్రటరీ పట్నాయక్ తెలిపాడు. సెక్రటరీ  తో సహా స్కూల్ అధికారులతో ఉదయం 9 గంటలకి చర్చలు జరిగినా అవి విఫలం అయ్యాయని తెలుస్తోంది. పాఠశాల ముగిసిన 10.30 గంటలవరకూ సమస్య పరిష్కారం కాలేదని ది హిందూ తెలిపింది. ఇతర క్లాసుల విద్యార్ధులందరూ ఇళ్లకు వెళ్లిపోగా తొంభై మంది విద్యార్ధులు పాఠశాల సిబ్బంది 52 మందీ లోపల ఉండగా గేటుకి తాళాలు వేశారు. బోధనేతర సిబ్బంది కూడా లోపలే ఉన్నారని తెలుస్తోంది.

తమకు సమాచారం అందినప్పటికీ విద్యార్ధులు అధిక సంఖ్యలో ఉండడంతో జోక్య చేసుకోలేకపోతున్నామని స్ధానిక పోలీసులు తెలిపారు.@ భారతీయులం | www.facebook.com/bharatiyulam 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

విద్యుత్ ఆదా చేయాలనీ ఆలోచిస్తున్నారా ? ఏది ఎంత విద్యుత్ కర్చు చేస్తామో తెలుసా మీకు ? వన్ వ్యాట్ ప్రాజెక్ట్,ఇందులో మనము ఎంత విద్యుత్ ని ఆదా చేయగలమో తెలిపారు@ భారతీయులం

విద్యుత్ ఆదా చేయాలనీ ఆలోచిస్తున్నారా ? ఏది ఎంత విద్యుత్ కర్చు చేస్తామో తెలుసా మీకు ?
లైట్లను ఆపేయడం ద్వారా ఎంత విద్యుత్ ఆదా చేయగలము ?
బ్యాటరి లను చార్జింగ్ ఆపేయడం ద్వారా ఎంత ఆదా చేయగలము ?
ఇస్త్రి ని ఒక గంట పాటు వినియోగించకుండా ఉంటె ఎంత ఆదా చేయగలము ?
లైట్లు మరియు ఫాను లను ఎంత విద్యుత్ ఆదా చేయగలము ?
టివి మరియు ఓవెన్ ఆపేయడం వలన ఎంత ఆదా చేయగలుగుతాము ?
లిఫ్టు బదులు మెట్లు ఎక్కడం వలన ఎంత ఆదా చేయగలము ?
గోగ్రేజ్ వారు కొత్తగా వన్ వ్యాట్ ప్రాజెక్ట్ అని చేపట్ట్టారు ! ఇందులో మనము ఎంత విద్యుత్ ని ఆదా చేయగలమో తెలిపారు...మరియు దేశ పర్యాటన మొదలు పెట్టారు. మన హైదరాబాద్ కి మే ౪వ తేది న వస్తున్నారు.@ భారతీయులం | www.facebook.com/bharatiyulam 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

బాయ్ ఫ్రెండ్ పట్టించుకోవడం లేదని మనస్తాపానికి గురైన ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటు చేసుకుంది.ప్రేమ విలువను దిగజార్చకండి...ఇలా చేసి.@ భారతీయులం

హైదరాబాద్: బాయ్ ఫ్రెండ్ పట్టించుకోవడం లేదని మనస్తాపానికి గురైన ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్ చేస్తున్న 20 ఏళ్ల అమ్మాయి సోమవారం ఆత్మహత్య చేసుకుంది. విశ్వవిద్యాలయంలోని హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆ అమ్మాయి మరణించింది.
మృతురాలిని కరీంనగర్ జిల్లా చింతగుడాకు చెందన కె. స్వాతి రాణిగా గుర్తించారు.
సోమవారం ఉదయం బ్రేక్ ఫాస్ట్‌ కోసం మెస్‌కు వెళ్లినప్పుడు మిత్రులు చివరి సారి ఆమెను చూశారు. సంఘటనా స్థలంలో పోలీసులకు సూసైడ్ నోట్ దొరికింది. 

తన బాయ్ ఫ్రెండ్ ప్రవీణ్ తనను నిర్లక్ష్యం చేయడం వల్ల తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆమె ఆ సూసైడ్ నోట్‌లో రాసినట్లు పోలీసులు తెలిపారు. స్వాతి చదువుతున్న తరగతిలోనే చదువుతున్న ప్రవీణ్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.

తెలిసి తెలియని ప్రేమ ? ప్రాణాలను సైత్యం లెక్క చేయని వెర్రి ఈ పిచ్చి ప్రేమ ది.
ప్రేమ అంటే ప్రాణాలు తీసుకోవడం కాదు, ప్రాణాలు కోరుకోవడం అంతకన్నా కాదు.
ప్రేమ విలువను దిగజార్చకండి...ఇలా చేసి. ప్రేమ విలువకు సరైన ఉదాహరణ కన్నతల్లి. తనకు పుట్టిన పిల్లలు ఎలా ఉన్నా ప్రేమ లో మాత్రం ఏమి లోటు ఉండదు. మద్యలో వచ్చి మద్యలో పోయే ప్రేమ శాశ్వతం కాదు.
మీ సమస్యను మాతో పంచుకోగలరు...మాకు ఒక్క ఈమెయిలు రాయండి.
@ భారతీయులం | www.facebook.com/bharatiyulam 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

మీకు తెలుసా మన ప్రపంచ జనాబా లెక్క వివరాలు ? ఇప్పటికి మన జనాబా ఎంత ? అందులో మనము ఎన్నో వారమో ? వీటన్నిటికి జవాబు కొంతవరకు తెలుసుకోవచ్చు ఇలా .! @ భారతీయులం

మన జనాబా లేక్కింత నిజమేనా ? ఐతే అందులో నేను ఎన్నో వాడిని ?
మీకు తెలుసా మన ప్రపంచ జనాబా లెక్క వివరాలు ? ఇప్పటికి మన జనాబా ఎంత ? ఎంత మంది పుడుతున్నారు ? ఎంత మంది పోతున్నారు ?
వీటన్నిటికి జవాబు కొంతవరకు తెలుసుకోవచ్చు ఇలా ....!

పాపులేషన్ యాక్షన్ సంస్థ ద్వారా, మనము మన జనాబా ఎంతో తెలుసుకోవచ్చు. మరియు అందులో మనము ఎన్నో వారమో తెలుసుకోవచ్చు...మనము పుట్టిన తేది,నెల,సంవత్సరము ఇస్తే మన వివరాలు ఇస్తారు..! తేది ప్రకారం.
ప్రపంచ జనాబా ౭౦౦ కోట్లును దాటింది.
ప్రపంచవ్యాప్తంగా జనాభా విస్ఫోటం వేగం తగ్గలేదు. గత రెండు దశాబ్దాలుగా జనాభా నియంత్రణ పథకాల్ని ప్రపంచ దేశాలు ఎంత సమర్ధమంతంగా అమలు చేస్తున్నా ఈ ఫలితాలింకా అందుబాటులోకి రాలేదు. కొన్ని వర్ధమాన దేశాలతోపాటు పేద దేశాలు కూడా జనాభా నియంత్రణలో వెనుకబడ్డాయి. అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతున్న దేశాలు మాత్రమే జనాభా నియంత్రణలో కాస్త మెరుగైన ఫలితాలు సాధించాయి.

యుఎస్‌ సెన్సెస్‌ బ్యూరో ఇంటర్‌నేషనల్‌ ప్రోగ్రామ్స్‌ సెంటర్‌ రూపొందించిన గణాంకాల మేరకు ప్రపంచంలో ప్రతివెయ్యిమంది జనాభాకు జనన రేటు 19గా ఉంటే మరణాల రేటు 8గా ఉంది. ప్రపంచంలో ప్రతినిమిషానికి 250మంది పుడుతుంటే 105 మంది మరణిస్తున్నారు. ప్రతిగంటకు 15వేల మంది పుడుతుంటే 6,316 మంది చనిపోతున్నారు. ప్రతిరోజు 3.60 లక్షల జననాలు, 1,51,600 మరణాలు సంభవిస్తున్నాయి. ప్రతిఏటా 13.13కోట్లమంది పుడుతున్నారు. 5.53కోట్లమంది మరణిస్తున్నారు. కాగా ప్రస్తుతం ప్రపంచ జనాభా సగటు వయసు 67ఏళ్ళుగా లెక్కించారు. ప్రపంచ జనాభాలో 26శాతం 180కోట్లమంది 15ఏళ్ళ లోపు పిల్లలున్నారు. 66శాతం 440కోట్లమంది 15నుంచి 64ఏళ్ళ వయస్కులున్నారు. 8శాతం మంది 51.60కోట్లమంది 65ఏళ్ళకు పైబడ్డవారున్నారు.
ఇప్పటికే భూమికి మానవుడు భారంగా తయారయ్యాడు. జనసంఖ్యపరంగానే కాక భూమికీ, ప్రకృతికీ చేటును కొనితెస్తున్నాడు. ఈ పరిస్థితి మారకపోతే ప్రకృతి సృష్టించే విలయానికి బలికాక తప్పదు.@ భారతీయులం | www.facebook.com/bharatiyulam 
http://populationaction.org To know the world population and the current rate of birth. You can know what is your number in that population just by giving the date,month,year details.

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

త్రికోణాసనం,పద్ధతి,ఉపయోగాలు:త్రికోణ అనగా త్రిభుజం. ఆసన స్థితిలో శరీరం త్రిభుజమును పోలి ఉంటుంది. అందుకే దీనికి త్రికోణాసనం అని పేరు వచ్చింది.@ భారతీయులం

త్రికోణాసనం
త్రికోణ అనగా త్రిభుజం. ఆసన స్థితిలో శరీరం త్రిభుజమును పోలి ఉంటుంది. అందుకే దీనికి త్రికోణాసనం అని పేరు వచ్చింది.

పద్ధతి :
ముందు నిటారుగా నిలబడాలి. ఇప్పుడు రెండు పాదాలు వీలున్నంత దూరంగా ( ఒక మీటరు ) జరపాలి. రెండు చేతులను భూమికి సమాంతరంగా ఉంచాలి. ఇప్పుడు దీర్ఘంగా గాలి పీల్చుకోవాలి. తరువాత గాలి వదులుతూ కుడి చేతిని కుడి పాదానికి ఆన్చాలి. ఎడమచేతిని తలమీదుగా నిలువుగా ఉంచాలి. తలను ఎడమచేతివైపు తిప్పాలి. ఇదే స్థితిలో 5 సెకన్ల నుంచి ప్రారంభించి నెమ్మదిగా సమయం పెంచుతూ పోవాలి. తిరిగి గాలి పీల్చుకుంటూ మామూలు స్థితికి రావాలి. ఎడమవైపు కూడా ఇదే విధంగా చేయాలి.

ఉపయోగాలు :
నడుము నుంచి కింది భాగంలో ఉన్న కొవ్వును కరిగిస్తుంది.
చేతులు, కాళ్లు, భుజాలకు మంచి షేప్‌ను ఇస్తుంది.
వెన్నెముకకు బలం చేకూరుస్తుంది.
పునరుత్పత్తి అవయవాలను ఉత్తేజితం చేస్తుంది.@ భారతీయులం | www.facebook.com/bharatiyulam 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

ప్రతి ఒక్కరికి ఫ్రెండ్ అవసరేమేరా ..! ఇదేదో ఎయిర్ టెల్ యాడ్ అనకుంటే కాదు.ఇలా ఫోటోలు తీయడం మంచిదేనా, పోస్ట్ చేయడం ?

ప్రతి ఒక్కరికి ఫ్రెండ్ అవసరేమేరా ..! ఇదేదో ఎయిర్ టెల్ యాడ్ అనకుంటే కాదు.
ఇది ఇద్దరు సరదాగా పాటలు వింటుంటే తీసిన ఫోటో ఇది...ద హిందూ లో పోస్ట్ చేసారు.@ భారతీయులం | www.facebook.com/bharatiyulam 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

బరువు తగ్గాలని ఆలోచిస్తున్నారా ? ఇది ముందు తెలుసు కొండి తరువాత మీ నిర్ణయం తెసుకోండి.క్యాలరీలు తగ్గాలంటే ...ఎం చేయాలో మీకు తెలుసా ? @ భారతీయులం

౧౦౦ (100) క్యాలరీలు తగ్గాలంటే ...ఎం చేయాలో మీకు తెలుసా ?
బరువు తగ్గాలని ఆలోచిస్తున్నారా ? ఇది ముందు తెలుసు కొండి తరువాత మీ నిర్ణయం తెసుకోండి.
నడక ఓ వ్యాయామం కన్నా ఓ రిలాక్సేషను టెక్నిక్కు గానే నాకు ఎక్కువ ఇష్టం.  నడకకి ఉదయం వెళ్ళాలా..సాయంత్రం వెళ్ళాలా .... ఉదయం వెళితే  ఎన్ని గంటలకి వెళ్ళాలి అనేది మన తీరికని బట్టి ..వీలుని బట్టి !!@ భారతీయులం  

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

నీ ప్రియ వదనం వికసిత జలజం...నీ శుభ చరణం నీ శుభ చరణం ఈ రాధకు శరణం..! @ భారతీయులం

నీ ప్రియ వదనం వికసిత జలజం
నీ దరహాసం జాబిలి కిరణం
నీ ప్రియ వదనం వికసిత జలజం
నీ దరహాసం జాబిలి కిరణం
నీ శుభ చరణం నీ శుభ చరణం ఈ రాధకు శరణం..! @ భారతీయులం 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

రేకుల షెడ్ లో చదివి ౯వ ర్యాంకు తెచ్చుకున్నాడు మన సాయి ప్రసాద్. ఓహ్ పేద వాడి విజయం.@ భారతీయులం

రేకుల షెడ్ లో చదివి ౯వ ర్యాంకు తెచ్చుకున్నాడు మన సాయి ప్రసాద్. ఓహ్ పేద వాడి విజయం.@ భారతీయులం 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

సత్తా చాటిన ప్రభుత్వ కళాశాల విద్యార్ధిని ....౯౬౭ 967 మార్కులతో.@ భారతీయులం

సత్తా చాటిన ప్రభుత్వ కళాశాల విద్యార్ధిని ....౯౬౭ 967 మార్కులతో.@ భారతీయులం  

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

నోరూరించే ముదురు ఎరుపు రంగుతో ఉండే బీట్‌రూట్‌తో అధిక ఒత్తిడికి గుడ్‌బై చెప్పవచ్చు.రోజుకు రెండు కప్పుల బీట్‌ రూట్‌ రసం గనుక తీసుకున్న ట్లయితే ఈ సమస్యను అధిగ మించవచ్చు.@ భారతీయులం

నోరూరించే ముదురు ఎరుపు రంగుతో ఉండే బీట్‌రూట్‌తో అధిక ఒత్తిడికి గుడ్‌బై చెప్పవచ్చు. విపరీతమైన పనివేళలతో సతమత మవుతూ అధిక ఒత్తిడికి గురయ్యే వారు. రోజుకు రెండు కప్పుల బీట్‌ రూట్‌ రసం గనుక తీసుకున్న ట్లయితే ఈ సమస్యను అధిగ మించవచ్చు. బీట్‌రూట్‌లో విటమిన్‌ ఏ,బీ,సీలు, క్యాల్షియం, పాస్ఫరస్‌, పొటాషియం, మెగ్నీషియం, ఇనుము, ఫోలిక్‌ ఆమ్లం, బీటా కెరోటిన్‌, పీచు పోషకా లు సమృద్ధిగా లభిస్తాయి. ఈ దుంపలో సహజ ఆక్సిడెంట్లుగా పనిచేసే ఆంథోసైనడిన్లు పుష్కళంగా లభిస్తాయి. రక్తహీనతతో బాధపడేవారికి బీట్‌రూట్‌ చక్కని ఔషధంగా పని చేస్తుంది.@ భారతీయులం 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

ఎవరైనా సరే తమ సమయాన్ని ఎక్కువ ఉపయోగపడే విషయాలకు వినియోగించడం వివేకవంతమైన పని.@ భారతీయులం

నేను మెచ్చినది...!
ఎవరైనా సరే తమ సమయాన్ని ఎక్కువ ఉపయోగపడే విషయాలకు వినియోగించడం వివేకవంతమైన పని. అంటే చేసే పని ఎక్కువ మందికి ఎక్కువ కాలం ఉపయోగపడాలి. ఇది వాస్తవిక అంచనాలపై ఆధారపడి వుంటుంది. రాయిని పొదిగితే ఫలితం లేదని గుడ్డును పొదిగితేనే పిల్ల వస్తుందని తెలుసుకోవడం లాంటిదే ఇది. తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు, దవిలి మృగతృష్ణలో నీరు తాగవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు, చేరి మూర్ఖుని మనము రంజింపలేము' అన్న పద్యంలో మాదిరిగా అనవసరమైన పనులలో శక్తి వృథా చేసుకోవడం గాక సత్ఫలితాలిచ్చే అంశాలను ఎంచుకోవాలి. గతం కన్నా భవిష్యత్తుకేసి చూడాలి. రాలిపోయే దానికన్నా చిగురించే దానిపై కృషి చేయాలి. ఏ ఒక్కరికో ఉపయోగపడే వాటికంటే పది మందికి పనికి వచ్చే అంశాలపై కష్టపడాలి. ఆలోచనలు ఘనీభవించిన వ్యక్తులతో గంటల తరబడి వాదించడం కంటే గ్రహణ శక్తి గల కొత్త శక్తులను ప్రోత్సహించడం మెరుగు. బలవంతుల చుట్టూ ప్రదక్షిణలు చేసే బదులు బలహీనులను బలోపేతం చేయడం మెరుగు. తెలిసిన వారికి మన తెలివిని చూపి మెప్పు పొందే బదులు తెలియని వారికి చెప్పడానికి శ్రద్ధ పెట్టడం మెరుగు.సరిగ్గా రాని దానికోసం అదే పనిగా సమయం వెచ్చించే బదులు వచ్చిన దాన్ని మెరుగు పెట్టుకోవడం మెరుగు. కేవలం విమర్శలకు గంటలు కేటాయించే బదులు మనంగా మెరుగుపర్చడానికి సమయం కేటాయించడం మెరుగు. అవసరమైన పనలు, ఆసక్తికరమైన పనులు చేయడం వల్ల సామర్థ్యం పెరగడమే గాక సమాజానికి కూడా మేలు కలుగుతుంది. సంతృప్తి కూడా మిగులుతుంది. ఫలితం లేని పనులు, పెద్ద ప్రాధాన్యం లేని వ్యవహారాలలో మునిగితేలితే వ్యక్తులకూ సమాజానికి కూడా నష్టమే. పొదుపు గురించి ప్రతి పైసా జాగ్రత్తగా వినియోగించడం గురించి చెబుతుంటారు గాని వాస్తవంలో ప్రతి నిముషం ఎలా వినియోగించుకోవాలన్నది మరింత కీలకం. ఎందుకంటే డబ్బు ఎలాగోలా సంపాదించుకోవచ్చునేమో గాని పోయిన సమయాన్ని తిరిగి పొందలేము. ఒక చిల్లిని మరమ్మతు చేయించే బదులు రోజూ అలాగే వాడుతుంటే సమయం శ్రమ కూడా దండగ. మీ సమయంపైన ఇతరులకు గౌరవం వుంటుందో లేదో గాని కనీసం మీకైనా వుండాలి. మీకు ఎంత గొప్ప ఆలోచనలున్నా వాటిని సకాలంలో సవ్యంగా అమలు చేస్తేనే ఫలితం. కనక సమయం మిగుల్చుకోవాలి.@ భారతీయులం 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

ముర్ఖులచే ప్రశంసేలు పొందడం కన్నా..బుధిమంతులచే తిట్లు తినడం మిన్న...! @ భారతీయులం

ముర్ఖులచే ప్రశంసేలు పొందడం కన్నా..
బుధిమంతులచే తిట్లు తినడం మిన్న...! @ భారతీయులం

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

స్పామ్ ఈమెయిలు పంపడం లో మనదే అగ్రస్థానం.మీకు తెలుసా.. అమెరికా ని సైతం వెనక్కి నెట్టేసి మనం ముందుకి వెళ్తున్న వైనం.

స్పామ్ ఈమెయిలు పంపడం లో మనదే అగ్రస్థానం.మీకు తెలుసా.. అమెరికా ని సైతం వెనక్కి నెట్టేసి మనం ముందుకి వెళ్తున్న వైనం.

'స్పామ్ మెయిల్స్' పంపడంలో భారత దేశం అగ్ర స్ధానం ఆక్రమించిందని కంప్యూటర్ సెక్యూరిటీ సంస్ధ 'సోఫోస్' తెలిపింది. అమెరికాని రెండో స్ధానంలోకి నెట్టి భారత దేశం అగ్ర స్ధానానికి చేరిందని సంస్ధ తెలిపింది. అయితే ఇందులో భారతీయుల తప్పేమీ లేదు. మొదటిసారి ఇంటర్నెట్ వినియోగిస్తున్న భారతీయులకు మెయిల్ వినియోగంలో అనుభవం లేకపోవడమే దీనికి కారణమని 'సోఫోస్' తెలిపింది. సోఫోస్ సంస్ధ స్పామ్ మెయిళ్ళు అధికంగా వచ్చే కంప్యూటర్ల సంఖ్య ఆధారంగా వివిధ దేశాలకి ర్యాంకులు ఇస్తుంది. ఒక్కో దేశంలోని కంప్యూటర్ల ద్వారా ప్రసారం అయ్యే స్పామ్ మెయిళ్ల సంఖ్యను అది లెక్కించి ర్యాంకులు ఇస్తుంది. దానర్ధం స్పామ్ మెయిళ్ళు కంప్యూటర్ల నుండి బయలు దేరకపోవచ్చు. కంప్యూటర్లను స్వార్ధప్రయోజనాలకు ఉపయోగించే నిపుణులు ఇతర దేశాల్లో ఉండే కంప్యూటర్లను తమ అదుపులోకి తెచ్చుకుని వాటి ద్వారా స్పామ్ మెయిళ్ళు పంపవచ్చు. ఇంటర్నెట్ మొత్తం మీద వస్తున్న స్పామ్ ఈమెయిళ్లలో 10 శాతం భారతీయుల కంప్యూటర్లనుండి వస్తున్నాయని సోఫోస్ తెలిపింది. 8.3 శాతంతో అమెరికా అగ్ర స్ధానంలో ఉండగా చిన్న దేశం అయిన దక్షిణ కొరియా కంప్యూటర్ల ద్వారా 5.7 శాతం స్పామ్ ఈమెయిళ్ళు వస్తున్నాయని తెలిపింది. భారత దేశం అగ్ర స్ధానం ఆక్రమించడానికి ప్రధాన కారణం భారితీయుల అనుభవ రాహిత్యమేనని సంస్ధ తెలియజేసింది. స్పామర్లు సెలవు రోజుల్లో అధికంగా స్పామ్ లను సృష్టించి పంపుతారని సోఫోస్ నివేదిక వివరించింది. సెలవుల సీజన్లలో వారి కార్యకలాపాలు తీవ్ర స్ధాయిలో ఉంటాయని తెలిపింది. కంప్యూటర్ వినియోగదారులు తప్పని సరిగా వైరస్ నుండి కాపాడుకోవడానికి యాంటీ వైరస్ ప్రోగ్రాంలు వినియోగించాలని సోఫోస్ నివేదిక సలహా ఇచ్చింది. యాంటీ వైరస్ ప్రోగ్రాంలను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకోవాలని కూడా తెలిపింది.

తమకు వచ్చే మెయిళ్లను అలవాటుగా ఫార్వర్డ్ చేయడం మానుకోవాలని బ్రిటిష్ యాంటీ వైరస్ ప్రోగ్రామ్ తయారీ సంస్ధ 'కాస్పరస్కీ ల్యాబ్' ప్రతినిధి కోరాడు. మెయిళ్లలో ఉండే విషయం ఎంత సకారణంగా కనపడినప్పటికీ జాగ్రత్తగా గమనించాలని సంస్ధ కోరింది.

'జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ' బ్లాగ్ లో కూడా మధ్యలో స్పామ్ కామెంట్లు బాగా పెరిగాయి. సోఫోస్ చెప్పినట్లు ఫేస్ బుక్, ట్విట్టర్ లో ఖాతాలు ఉన్న వినియోగదారుల వద్ద నుండి వ్యాఖ్యలు వచ్చినట్లుగా అవి ఉంటున్నాయి. ఫేస్ బుక్ పేజీలకి వెళ్ళినపుడు ఎవరో ఒకరి ఫోటో తో పేజీలు ఉంటున్నాయి. సోఫోస్ నివేదిక ను బట్టి అటువంటి ఖాతాలన్నీ ఉత్తుత్తివేననీ, కంప్యూటర్లను హైజాక్ చేసి సృష్టించినవేననీ అర్ధం అవుతోంది. 


Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

భారతీయులం |bharatiyulam, bharatiyulam.blogspot.com
Related Posts Plugin for WordPress, Blogger...