హైదరాబాద్: బాయ్ ఫ్రెండ్ పట్టించుకోవడం లేదని మనస్తాపానికి గురైన ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్ చేస్తున్న 20 ఏళ్ల అమ్మాయి సోమవారం ఆత్మహత్య చేసుకుంది. విశ్వవిద్యాలయంలోని హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆ అమ్మాయి మరణించింది.
మృతురాలిని కరీంనగర్ జిల్లా చింతగుడాకు చెందన కె. స్వాతి రాణిగా గుర్తించారు.
సోమవారం ఉదయం బ్రేక్ ఫాస్ట్ కోసం మెస్‌కు వెళ్లినప్పుడు మిత్రులు చివరి సారి ఆమెను చూశారు. సంఘటనా స్థలంలో పోలీసులకు సూసైడ్ నోట్ దొరికింది.
తన బాయ్ ఫ్రెండ్ ప్రవీణ్ తనను నిర్లక్ష్యం చేయడం వల్ల తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆమె ఆ సూసైడ్ నోట్‌లో రాసినట్లు పోలీసులు తెలిపారు. స్వాతి చదువుతున్న తరగతిలోనే చదువుతున్న ప్రవీణ్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
తెలిసి తెలియని ప్రేమ ? ప్రాణాలను సైత్యం లెక్క చేయని వెర్రి ఈ పిచ్చి ప్రేమ ది.
ప్రేమ అంటే ప్రాణాలు తీసుకోవడం కాదు, ప్రాణాలు కోరుకోవడం అంతకన్నా కాదు.
ప్రేమ విలువను దిగజార్చకండి...ఇలా చేసి. ప్రేమ విలువకు సరైన ఉదాహరణ కన్నతల్లి. తనకు పుట్టిన పిల్లలు ఎలా ఉన్నా ప్రేమ లో మాత్రం ఏమి లోటు ఉండదు. మద్యలో వచ్చి మద్యలో పోయే ప్రేమ శాశ్వతం కాదు.
మీ సమస్యను మాతో పంచుకోగలరు...మాకు ఒక్క ఈమెయిలు రాయండి.
@ భారతీయులం | www.facebook.com/bharatiyulam