వర్షం అంటే ఎవరికీ ఇష్టం ఉండదు..
కన్నీళ్లను కనిపించకుండా
వర్షపు నీటి తో కలిసిపోయేలా చేసే
ఈ తుంటరి చిలిపి వాన.
వానా వానా వానా
నా చెంప నిమిరి పోవమ్మా
చిననాటి నేస్తం లేకున్నా
నీ తోడే నాకు చాలమ్మా
నేనేడ్చిన ప్రతిసారీ
నువ్వు నన్ను చేరాలమ్మా
నా కన్నీరెవరికి కనపడకుండా
తుడిచి వెళ్లి పోవాలమ్మా
దూరమైన చిననాటి స్నేహం
మళ్లీ చిగురించేనా
ఇన్నాళ్లకు కలిసిన నేస్తం
తిరిగి దూరమయ్యేనా
ఎలా మరచిపోనమ్మా మా నేస్తాన్నీ
ఎలా చంపుకోనమ్మా ఈ స్నేహాన్నీ
మా మథ్యన మిగిలిందొక
పెను అగాథమేనా..
విథి రాసిన రాతలో
మాదొక వింత కథయేనా.. @ "భారతీయులం"