ప్రపంచ పశు వైద్య దినోత్సవం ఏప్రిల్ 28న జరుపుకుంటున్నది. ఈ సందర్భంగా పశువుల నుంచి మానవులకు సంక్రమించు కొన్ని వ్యాధుల పట్ల అప్రమత్తత ఉండాలని పశు సంవర్ధశాఖ ప్రచారం చేస్తున్నది.

ప్రపంచంలో ఏటా దాదాపు యాభై వేలమంది రేబీస్ వ్యాధితో చనిపోతున్నారు. ఆస్ట్రేలియా, అంటార్కిటికా మరికొన్ని ద్వీపాలలో తప్ప ఈ వ్యాధి అంతటా వ్యాపించి ఉన్నది. అన్ని క్షీరదాలు ఈ వ్యాధికి గురవుతాయి. కానీ కుక్కజాతికి చెందిన జంతువులు నక్కలు, పిల్లులు, ముంగీస, గబ్బిలాలు ఈ వైరస్‌కు రిజర్వాయర్స్‌గా ఉంటాయి. రేబీస్ వైరస్ వ్యాధి బహిర్గతం కాకుండా జంతువుల ఉమ్మిలో ఉంటుంది.

మనదేశంలో సంవత్సరానికి 1.5 కోట్లమంది జంతు కాట్లకు గురవుతుండగా, దీనివల్ల వేలాది మంది చనిపోతున్నారు. కుక్కకాటు గురవుతున్న వారి లో దాదాపు అరవై శాతం మంది 15 ఏళ్ల లోపు వారే. జంతుకాటుకు గురైన తర్వాత జరిగే చికిత్సకు సంత్స రానికి 25 మిలియన్ల డాలర్లు ఖర్చు అవుతున్నది. రాష్ట్రంలో గత ఏడాది అత్యధికంగా 13,000 మంది ఒక వారంలో కుక్క కాటుకు గురయ్యారు. తూర్పుగోదావరి,రంగాడ్డి, వరంగల్, ఆదిలాబాద్‌లో కుక్కకాటు కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.

ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ రేబీస్‌వ్యాధి పిచ్చికుక్కకాటు వల్ల వస్తుంది. ఈ వ్యాధి ఉష్ణరక్త జీవులలో కనిపించే మెదడును దెబ్బతీసే లిస్సావైరస్ వల్ల వస్తుం ది.ఈ వ్యాధి జంతువు కాటు ద్వారా, వాటి ఉమ్మి, చర్మం గీసుకపోవడం వల్ల ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. కుక్కల్లో ఈ వ్యాధి బయట పడడానికి 2-12 వారాలలోపు, కొన్నింటిలో రెండేళ్ల సమయం కూడా పట్టవచ్చును. ఈ వ్యాధి మనుషులకు సోకితే చిరాకు పడడం, తలనొప్పి, జ్వరం కాటుకు గురైన ప్రాంతంలో దురద నొప్పిగా ఉండటం వంటి లక్షణా లు కనిపిస్తాయి. పక్షవాతం, మెదడు సరిగా పనిచేయకపోవడం, నిద్రపట్టకపోవడం ఆత్రుత అసాధారణమైన ప్రవర్తన, చొంగ ఎక్కువగా కారడం, కళ్ళనుంచి నీరు కారడం మాట్లాడలేకపోవడం, మింగలేకపోవ డం,చివరిదశలో నీటిని చూసి భయపడడం వంటి లక్షణాలు కూడా ఉంటాయి. 
రేబీస్ వ్యాధి సోకిన కుక్కలు కోపం, చిరాకుగానూ ఉండి యాజమాని గుర్తుపట్టకపోవడం, కనిపించినా జంతువులను, మనుషులను కొరకుతాయి. నోటి నుంచి చొంగ కారడం,నాలుక బయట పెట్టడం మతి లేకుండా తిరుగుతాయి. దవడ వేలాడడం అరుపులో కూడా మార్పు వస్తుంది.ఈ లక్షణాలు కనిపించిన కుక్కలు 10 రోజుల్లో చనిపోతాయి. కుక్కకాటుకు గురై తే గాయాన్ని శుభ్రంగా సబ్బునీటితో (కార్పాలక్ సబ్బు) కడగాలి. తర్వాత 10-15 నిమిషాల పాటు నీటితో కడగాలి. కుక్క కరచిన ప్రదేశాన్ని అంటిసెప్టిక్ / అల్కహాల్‌తో కడగాలి. గాయాన్ని కట్టుతో కప్పరా దు. వైద్యున్ని సంప్రదించి కుక్కకాటు టీకా మందు లు వేయించుకోవాలి. అవసరమైతే ఇమ్యునోగ్లోబ్యులిన్స్ ఇంజెక్షన్ వేయించాలి. రేబీస్ వ్యాధి ప్రాణాంతకమైనది. జంతుకాటుకు గురైతే తప్పకుండా వైద్యుని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. 

పెంపుడు కుక్కలను ఈ వ్యాధి సోకకుండా వ్యాధినిరోధక టీకాలు క్రమం తప్పకుండా వేయించాలి. వ్యాధి సోకిన,అనుమానం ఉన్న కుక్కలను వేరు చేయాలి. అసాధారణ ప్రవర్తన కలిగిన జంతువులు ముఖ్యంగా వన్యవూపాణులకు దూరం గా ఉండాలి. వీధి కుక్కలకు జనాభా నియంవూతణ ఆపరేషన్ చేయించడం ద్వారా వీధి కుక్కల సంఖ్యను నియంవూతివచ్చును.  @ భారతీయులం | www.facebook.com/bharatiyulam 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam
URL: HTML link code: BB (forum) link code:
ధన్యవాదనములు | ®“భారతీయులం”®