త్రికోణాసనం
త్రికోణ అనగా త్రిభుజం. ఆసన స్థితిలో శరీరం త్రిభుజమును పోలి ఉంటుంది. అందుకే దీనికి త్రికోణాసనం అని పేరు వచ్చింది.

పద్ధతి :
ముందు నిటారుగా నిలబడాలి. ఇప్పుడు రెండు పాదాలు వీలున్నంత దూరంగా ( ఒక మీటరు ) జరపాలి. రెండు చేతులను భూమికి సమాంతరంగా ఉంచాలి. ఇప్పుడు దీర్ఘంగా గాలి పీల్చుకోవాలి. తరువాత గాలి వదులుతూ కుడి చేతిని కుడి పాదానికి ఆన్చాలి. ఎడమచేతిని తలమీదుగా నిలువుగా ఉంచాలి. తలను ఎడమచేతివైపు తిప్పాలి. ఇదే స్థితిలో 5 సెకన్ల నుంచి ప్రారంభించి నెమ్మదిగా సమయం పెంచుతూ పోవాలి. తిరిగి గాలి పీల్చుకుంటూ మామూలు స్థితికి రావాలి. ఎడమవైపు కూడా ఇదే విధంగా చేయాలి.

ఉపయోగాలు :
నడుము నుంచి కింది భాగంలో ఉన్న కొవ్వును కరిగిస్తుంది.
చేతులు, కాళ్లు, భుజాలకు మంచి షేప్‌ను ఇస్తుంది.
వెన్నెముకకు బలం చేకూరుస్తుంది.
పునరుత్పత్తి అవయవాలను ఉత్తేజితం చేస్తుంది.@ భారతీయులం | www.facebook.com/bharatiyulam 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam
URL: HTML link code: BB (forum) link code:
ధన్యవాదనములు | ®“భారతీయులం”®