మిత్రులారా ఈ రోజున ప్రపంచంలో దేశాల పేరుతో, రాష్రాల పేరుతో, ప్రాంతాల పేరుతో, కులాల పేరుతో, 
వర్గాల పేరుతో, మతాల పేరుతో మనిషి మనిషికి మద్య వివాదాలు ఎన్ని రకాలుగా జరగాడానికి అవకాశం ఉందో అన్ని రకాలుగా జరుగుతుంది. ప్రపంచంలో ఏ మనిషి ఐనా ఒకేలా జన్మిస్తాడు. పాకిస్తాన్ లో 
ముస్లిం కుటుంబంలో పుట్టిన పిల్లవాడిని ఇండియాలో హిందూ కుటుంభంలో పెంచితె వాడు 
హిందువులానె పెరుగుతాడు అలానే  లండన్ లో క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వాడిని తాలిబన్ లో పెంచితే వాడు తాలిబన్ లానె పెరుగుతాడు. దేవుడు ప్రతి మానవుడిని ఒక తెల్లని కాగితం వలె ఈ భూమి మీదకు 
పంపిస్తాడు. కాని మనం దాని మీద పిచ్చిరాతలు రాస్తున్నాం. ఎవరి వయసు, లింగం, జాతి, మతం, 
సంస్కృతి, ఏవైనప్పటికి వారందరి మీద గురుత్వాకర్షణ సూత్రం ఒకే విదంగా పని చెస్తుంది. వర్షాలు 
రాజకీయ లేదా మత సరిహద్దులననుసరించి కురవవు. గాలి వీస్తే సరిహద్దుల దగ్గర ఆగిపోదు. 
ప్రకృతిమాత మహాశక్తులు మానవుల అబిప్రాయాల ప్రకారంగాని, వారి కుల, వర్గాది, పక్షపాత బుద్దుల 
ప్రకారం నడుచుకోవు కదా. ఎవరు నన్ను ఏ రూపంలో పూజిస్తే వారికి ఆ రూపంలో ధర్శనం ఇస్తాను అని 
గీతా వాక్యం కదా. కొందరు ఆయనను శ్రీరాముడు అని, కొందర అల్లా అని, మిగిలిన వారు వారికి నచ్చిన 
పేర్లతో పిలుచుకుంటారు. అలా పిలుచుకొనేంతవరకు బాగానే ఉంది, కాని మేము పిలిచే పేరుతోనే 
అందరు పిలవాలి లేకపోతే వారిని చంపడంమో, మీకు స్వర్గం రాదు అనడం ఎంతవరకు న్యాయం. 
మిత్రులారా ఇలాంటి వాల్ల మాటలకు ఎవరు మోసపోవద్దు. క్రైస్తవమత బోదకులు క్రైస్తవం స్వీకరించని 
వారు నరకానికి వెలతారు అని చెబుతున్నారు, మరి అలాంటప్పుడు సత్యం, అహింసలను ఆచరించి 
చూపిన గాంది కూడా నరకానికి వెలతారు కాని ఎన్నో పాపాలు చేసిన వాడు ఎవడైనా క్రైస్తవంలో 
ఉంటే వాడు స్వర్గానికి వెలతాడంట చూసారా. ఇలా దేవుడి పేరు అడ్డుపెట్టుకోని హింస చేసేవారికి, 
మోసాలు చేసేవారికి తగిన గుణపాఠం చెప్పండి. 
దేవుడు దృష్టిలో అందరూ సమానం. కొందరు అడగవచ్చు మరి ఒకే దేవుడు ఐతే ఇంత మంది దేవుళ్ళు,  విగ్రహారాదన ఎందుకు అన్న దానికి నా సమాదానం మనం గురుత్వాకర్షణ 
సిద్దాతం తెలుసుకోవాలంటే నేను తెలుగులో చదువుతా , అలానే మిగిలిన వారు వారి వారి 
మాతౄభాషలో చదువుతారు ఒకడు మిగిలిన వాళ్ళు చదివేది చూసి వాళ్ళు చదివేది తప్పు అన్నాడు 
కారణం వీడికి వాళ్ళు చదివే భాష అర్దం కాక నిజానికి అందరు చదువుతుంది ఒకే విషయం మతాలు 
కూడా ఇలాంటివే. కాబట్టి మిత్రులారా ఏ మతంలో వున్నా సత్యం, అహింస,ప్రేమ ముఖ్యం ఇవి లేని వాడు 
ఏ మతంలో వున్నా ఖచ్చితంగా భగవంతుని చేరలేడు. ఈ విషయం ప్రతి ఒక్కరు మీ మిత్రులకు 
తెలియజేయాలని కోరుకుంటున్నాను.@ భారతీయులం 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam
URL: HTML link code: BB (forum) link code:
ధన్యవాదనములు | ®“భారతీయులం”®