కారు మబ్బులు కురులు
కలువ తామరలు కనులు
పున్నమి వెన్నెల మోము
పురివిప్పిన నెమలి నడక
నెలవంకనే విరిమల్లెలుగా 
తన కురులలో నిలుపుకుందేమో
ఆ రవినే కుంకుమబొట్టుగా
తన నుదుట దాచిందేమో

ఏ కవి భావనకు 
అంతుబట్టని కావ్యం ఆమె
ఏ చిత్రకారుని కుంచెకు
అంతుచిక్కని చిత్రం ఆమె.@ "భారతీయులం"-శ్రీనివాస్ 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam
URL: HTML link code: BB (forum) link code:
ధన్యవాదనములు | ®“భారతీయులం”®