అనవసరంగా హార్న్ మొగించకండి ! ద్వని కాలుష్యం తగ్గించేందుకు మీ వంతు సాయం చేయండి.
ధ్వని కాలుష్యం : పెద్దపెద్ద యంత్రాలు , వాహనాలు ముఖ్యం గా వంటి యంత్రాలనుండి వచ్చే హమ్మింగ్ నాయిస్ (geeee అని వస్తుంది ) ఇవన్నీ ధ్వని కాలుష్యం లోకే వస్తాయి. ధ్వని కాలుష్యం వల్ల మనుషుల్లోనూ మరియూ జంతువుల్లోను శారీరక , మానసిక అనారోగ్యం కలగవచ్చు. వినికిడి శక్తి తగ్గడం, హై బిపి , నిద్రలేక పోవడం కి గురికావడం లాంటి అనారోగ్యాలు ద్వనికాలుష్యం వల్ల కలగుతాయి . ఈ శబ్ద తీవ్రతను డేసిబెల్స్ (db) లలో కొలుస్తారు. యంత్రాలు విడుదల చేసే శబ్ద తీవ్రతకు ప్రబుత్వాలు కూడా కొన్ని లిమిట్స్ పెట్టింది. ఉదాహరణకు ఇంట్లో వాడుకునే కంప్యుటర్, ట్యూబు లైటు లాంటి డెస్క్ టాప్ ఐటమ్స్ యొక్క శబ్దతీవ్రత 45db మించి వుండకూడదు. డెస్క్ సైడ్ ఐటమ్స్ అంటే మనకి కొంత దూరం లో ఉండేవి 50 db అని , ఆరుబయట ఉపయోగించే యంత్రాలకు 75-80 db అని, పరిశ్రమల్లో ఉపయోగించే యంత్రాలు ఫలానా db level దాటకూడదని , ఎక్కువ శబ్దాలు విడుదల చేసే యంత్రాల దగ్గర పని చేసే కార్మికులు తప్పనిసరిగా చెవులు కాపాడుకునే ear plugs ధరించాలని ఇలా చాలా మార్గదర్శకాలు ఏర్పాటు చేసింది.
ధ్వని కాలుష్యం వల్ల నష్టాలు :
మైదానంలో గాలికి పచ్చగడ్డి వదిలే ధ్వని తీవ్రత జిరో డెసిబుల్స్ ఉంటుంది.
మనం మాట్లాడుకునే మాటల తీవ్రత 50 నుంచి 60 డెసిబుల్స్ వరకూ ఉంటుంది.
శబ్ద తీవ్రత 85 డెసిబుల్స్ దాటితే ఆరోగ్యానికి మంచిదికాదు.
120 డెసిబుల్స్ దాటితే చెవిలో నొప్పి మొదలవుతుంది.