మనిషికి మనిషే సాయం.... ఏదో యాక్సిడెంట్ ఐంది మనకెందుకు లే అనే వైకరిని మాకుకోండి.
ఎక్కడైనా సరె చేత నైన సాయం చేయండి.
మనలో మానవత్వాన్ని తెలుసుకోండి....!
...........
మనిషి చేసిన రాయి రప్పకి మహిమ గలదని సాగి మొక్కుతు
మనుషులంటే రాయిరప్పలకన్న కనిష్టం గానూ చూస్తావేల బేలా? దేవుడెక్కడో దాగెనంటూ కొండకోనల వెతుకులాడేవేలా? కన్ను తెరచిన కానబడడో? మనిషి మాత్రుడియందు లేడో? యెరిగి కోరిన కరిగి యీడో ముక్తి?--గురజాడ
'మానవాళికి నిజంగానే మంచి కాలం రహిస్తుందా? దారుణ ద్వేషాన్ని పెంచే దానవత్వం నశిస్తుందా? సాధుసత్వపు సోదరత్వపు స్వాదుతత్వం జయిస్తుందా-- (శ్రీశ్రీ)
మానవతా మందిరాన మంటలు రగిలించకూడదు -- గంగినేని
'ఏ కులము వెన్నెలది? తెమ్మెద లెట్టి జాతికి చెందినట్టివి అట్టిదే కద మానవత్వము అన్నిటికి ఎత్త్తెన సత్వము -- సి.నారాయణరెడ్డి
మీ ధ్వంస మనస్తత్వం లోంచే మిమ్ము సర్వనాశనం చేసే మహోగ్ర మానవతా విప్లవ శక్తి జనిస్తుంది' --దేవిప్రియ
మానవత్వం మాత్రం ప్రతిరోజూ ప్రతిక్షణం పుట్టిచచ్చే వెలుగుకిరణం
మానవత లేని లోకాన్ని స్తుతింపలేను మానవునిగా శిరసెత్తుకు తిరగలేను ఈ నాగరికతారణ్యవాసం భరించలేను..'--చెరబండరాజు'