అసలెందుకిలా ?
--
( జై తెలంగాణా జై సమైక్యాంద్ర జై రాయలసీమ )
రోజు రోజుకి మన రాష్ట్రంలో పరిస్థితి అయోమయం గా మారింది.
ఏది సరైన నిర్ణయం తెలియక సతమత మవుతున్న జనాలు..మరియు మాటలు చెప్పే నాయకులు.
కాని ఎ నిర్ణయం తేసుకున్నా ఏంటి నష్టం ఏంటి లాబం ?
అసలెందుకిలా ? ఎందుకు ఏమిటి ఎలా ?
ఎన్నో సందేహాలు ఎన్నో ఆలోచనలు...వకరి తరుపు వారిని మరొకరు దుషించకుండా ..
అని అలోచించి తెలుసుకుందాం తెలుపుదాం అందరికి.
ఇది ఏ ప్రాంతీయవారిని ఉద్దేశించింది కాదు...కేవలం వ్యక్తి గత బావం తెలుసుకుందాం అని మాత్రమే.
Please, Be an Optimist and let's know each other what we know about the situation and place of living.
అసలెందుకు ఈ సమైక్యాంద్ర వాదన ?
అసలెందుకు ఈ తెలంగాణా వాదన ?
అసలెందుకు ఈ రాయలసీమ వాదన ? ఇతర వాదనల్లని.
అసలు మనకి అభివృద్ధి ఎలా వస్తుంది ? అసలు ఈ రాజకీయనాయకులు చెప్పే మాటల్లో నిజం ఎంత ?
ఎంతవరకు మీ వాదన లో స్పష్టత ఉందొ చెప్పగలరా ? ప్రజలకి ఎంతవరకు తెలుసు ? ఎంత చెప్పారు మీరు.
నిజానికి సమైక్యాంద్ర ఎందుకు అంటున్నారో ? తెలంగాణా ఎందుకు అంటున్నారో ? రాయలసీమ ఎందుకు అంటున్నారో ? అయోమయ పరిస్థితి.
తప్పులు వొప్పులు అందరు తెలుసుకోవడం చాలా ముక్యం. మనకు తెలిసింది నలుగురితో పంచుకోవడం మరియు తెలియజేయడం లో తప్పు లేదు.
ఒక్కసారి నిజంగా మీకు ఎంతవరకు తెలుసు ఈ వాదనల గురుంచి ? ఆలోచించండి అసలెందుకిలా అని.
మనకి ఏం తెలుసు ? ఎంతవరకు తెలుసు ?
ఇది మన సమస్య ..మనమందరం తెలుసుకోవడం మన హక్కు.