నిద్ర అవసరం
రోజంతా పనిచేయడం వల్ల కలిగే అలసట, వృత్తిపరంగాను, ఇతరత్రా మనం ఎదుర్కొనే సమస్యల కారణంగా కలిగే మానసిక ఒత్తిడి నుండి కోలుకోవడానికి నిద్ర అవసరం. ప్రతీ ఉదయం మనల్ని చక్కగా రిఫ్రెష్ చేసి ఆరోజు మన కార్యక్రమాల కోసం ఉత్సాహంగా ఉండేలా సన్నద్ధం చేసేదే నిద్ర. సెల్‌ఫోన్ బ్యాటరీని ఎలా రీచార్జ్ చేస్తామో, అలసిపోయిన మన శరీరానికి రీచార్జ్ చేయడమే నిద్ర.
నిద్రలో రకాలు
నిద్రలోనూ రెండు రకాలున్నాయి. అవి సుఖ నిద్ర, కలత నిద్ర. నిద్రలో సుఖనిద్ర 75 శాతం, కలత నిద్ర 25 శాతం ఉంటుంది. కలత నిద్రలో కలలు ఎక్కువగా వస్తాయి. మెదడు, శరీరం పనితీరు అధికంగా ఉంటుంది. మనిషి 8 గంటలు నిద్రపోవాలి. ఇందులో ఆరు నుంచి ఆరున్నర గంటలు సుఖనిద్ర ఉంటుంది. మిగతా ఒకటిన్నర నుంచి రెండు గంటలు కలత నిద్ర ఉంటుంది. చాలా మందికి నిద్రాభంగం జరిగితే నిద్రరాకపోవడమే కాక, కలత నిద్ర ఎక్కువైతుంది. బయటి వారికి నిద్రపోతున్నట్లు అనిపిస్తుంది. కానీ నిద్రపోతున్నట్టు తృప్తి ఉండదు. తొమ్మిదిగంటల కన్నా ఎక్కువ నిద్రపోయే వారిని అతి నిద్రాపరులం టారు. ఆరుగంటల కన్నా తక్కువ నిద్రపోయే వారిని కొద్దిగా నిద్ర పోయేవారంటారు.
ఎంత నిద్ర అవసరం?
కనీసం ఏడు నుండి ఎనిమిది గంటలు నిద్రపోవాలి. ఇలా చేస్తే మనిషి శారీరక, మానసిక జబ్బుల బారినపడే అవకాశం తక్కువ. నిద్ర సమయం వయసుతోపాటు మారుతుంది. 0 నుంచి ఒక సంవత్సరం వయసున్న నవజాత శిశువులు 18 నుండి 20 గంటలు నిద్రపోతారు. 1 నుండి 3 సంవత్సరాల పిల్లలు 12 నుండి 18 గంటలు, 3 నుండి 12 సంవత్సరాలు 10 గంటలు, 12 నుండి 50 సంవత్సరాలు, 7 ఉండి 9 గంటలు నిద్రపోవాలివృద్ధాప్యంలో ఆరుగంటల కంటే తక్కువ నిద్రపోతారు.
అతినిద్ర
ప్రతీరోజూ అవసరానికి మించి కనీసం నెలరోజులపాటు, పగలు- రాత్రి నిద్రపోవడాన్ని అతినిద్ర అంటారు. చాలా మంది ఎక్కువ రోజులు బలవంతంగా మేల్కొనే ఉంటారు. కొన్ని రకాల రుతుస్రావ సమస్యలున్న వారిలో అతినిద్ర ఉంటుంది. గురక సమస్యతో బాధపడేవారు. దీర్ఘకాల సమస్యలున్నవారు. తలకు బలమైన గాయాలైనవారికి. చిన్న మెదడులో కణితులు ఏర్పడినప్పుడు, స్థూలకాయుల్లో అతినిద్ర సమస్య ఉంటుంది.