ఫలానాచోట అత్యాచారం జరిగింది. అమ్మాయే ఏదో అనుంటుంది. ఈవ్ టీజింగ్ జరిగింది. అమ్మాయి దుస్తులు కారణమై వుంటాయి. ఆయన భార్యను కొట్టాడు. ఆమే రెచ్చగొట్టి వుంటుంది. అతడు భార్యను అనుమానిస్తు న్నాడట. నిప్పులేనిదే పొగరాదుగా! ఆయన భార్యకు విడాకులిచ్చాడట. ఆమె ఎన్ని ఘనకార్యాలు వెలగబెట్టిందో? ఫలానా వాడు భార్యను నరికేశాడు. ఏ తప్పు చేసిందో, ఏం పాడో!... ఇలా అసలు కారణాలను అన్వేషించడం పోయి 'స్త్రీ'ని తప్పుపట్టే సంస్కృతి ఇంకెన్నాళ్లు?
కారణం సమాజాన్ని చుట్టుముట్టిన వెర్రి పోకడలు! ఈజీమనీ ధోరణులు, వెర్రెక్కించే సినిమాలు, అంగాంగ ప్రదర్శనలు, కుళ్లు సాహిత్యం, వరదలా పొర్లుతున్న మద్యం, ఇబ్బడిముబ్బడిగా దొరుకుతున్న నీలిచిత్రాలు, కళ్లముందే కనిపించి ప్రేరేపిస్తున్న పబ్ కల్చర్, విచ్చలవిడిగా లభ్యమవుతున్న మత్తుమందులు, పాశ్చాత్య విశృంఖలత్వం... ఇవన్నీ కారణాలే!