చరిత్రలో ఈ రోజు/మే 12
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం:మే 12, 1820న ఫ్లొరెన్స్‌ నైటింగేల్‌.. ఇటలీలోని ఫ్లొరె న్స్‌ నగరంలో జన్మించింది. 1853లో లండన్‌ లోని ఓ స్ర్తీల ఆసుపత్రిలో సూపరిం టెండెంట్‌ గా చేరింది. 1854లో క్రిమియా యుద్ధంలో టర్కీలో గాయపడిన సైనికులకు సేవలు చేయ డానికి నర్సుల బృందాన్ని వెంటబెట్టుకొని వె ళ్లింది. నర్సుల వృత్తికే మార్గదర్శకమైన ఆమె సేవలను గురిస్తూ.. చేతిలో.. వెలిగించిన లాం తరు పట్టుకుని ఉన్న ఓ స్ర్తీ బొమ్మను నర్సుకు ప్రతీగా పేర్కొంటున్నాయి చరిత్ర గ్రంథాలు. 1959లో 'నోట్స్‌ ఆఫ్‌ నర్సింగ్‌' అనే పుస్తకాన్ని ప్రచురించింది. ప్రపంచంలోనే తొలి నర్సుల శిక్షణా కళాశాలను స్థాపిం చింది. ఆమె జన్మదినమైన మే 12వ తేదీన 'అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా జరుపు కుంటున్నారు. నైటింగేల్‌ 'లేడ్‌ విత్‌ ద లాంప్‌' అనే బిరుదు పొందింది. ఆగస్ట్‌ 13, 1910న నైటింగేల్‌ మరణించింది.మాతృ దినోత్సవం (మదర్స్‌ డే): 'మదర్‌ ఆఫ్‌ గాడ్స్‌' రియాకు నివాళులర్పించే నేపథ్యం లో ఈ ఉత్సవాన్ని తొలిసారిగా గ్రీసు దేశంలో నిర్వహించారు. 17వ శతాబ్దంలో ఇంగ్లాండ్‌ లో తల్లులకు గౌరవపూర్వకంగా.. 'మదరింగ్‌ సండే' పేరిట ఉత్సవాలు జరిపినట్టు తెలుస్తోం ది. సివిల్‌ వార్‌ గాయాల స్మృతులు చెరిగిపో యేలా చేసేందుకు 'మదర్స్‌ ఫ్రెండ్‌షిప్‌ డే' నిర్వ హించింది జర్విస్‌. 1905లో జర్విస్‌ చనిపో గా.. ఆమె జ్ఞాపకార్ధం.. ఆమె కూతురు అన్నా జర్విస్‌ 'మదర్స్‌ డే' నిర్వహించాలని ప్రచారం చేసింది. 1910లో అమెరికాలోని వర్జీనియా రాష్ట్రం 'మదర్స్‌ డే' గుర్తించిన మొదటి రాష్ట్రం. 1914లో అమెరికా అధ్యక్షుడు ఉడ్రోవిల్సన్‌ 'మదర్స్‌ డే'ను అధికారికంగా గుర్తించాడు. ప్రపంచవ్యాప్తంగా మే నెల రెండవ ఆదివారం నాడు 'మదర్స్‌ డే' జరుపుకుంటున్నారు.1895: ప్రసిద్ధ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి జన్మించారు.@ భారతీయులం  

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam
URL: HTML link code: BB (forum) link code:
ధన్యవాదనములు | ®“భారతీయులం”®