రక్తపోటు (బిపి):
గుండె అనుక్షణము సంకోచ, వ్యాకోచాలు చేస్తూ రక్తాన్ని శరీర భాగాలకు సరఫరా చేస్తుంటుంది.ఇలా సంకోచించినప్పుడు (కుచించుకొన్నప్పుడు) రక్తం గుండె నుండి రక్త నాళాల లోనికి వేగంగా వత్తిడితో ప్రవహిస్తుంది.ఈ వత్తిడిని సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ (Systolic Blood pressure) అని అంటారు.

గుండె మరల వ్యాకోచించి సాధారణ స్ధితికి వచ్చినప్ఫుడు,రక్తనాళాలలో వున్న వత్తిడిని డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అని అంటారు.ఈ రక్త పోటును గాజు గొట్టము లోని పాదరసపు మిల్లీ మీటర్లలో కొలుస్తారు.

సాధారణంగా ఆరోగ్యవంతుల రక్త పోటు సిస్టోలిక్ ప్రెషర్ 90 నుండి 120 మి.మీ గాను,డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ 60 నుండి 80 మి.మీ గాను నమోదు కావచ్చు.

అయితే ఈ బి.పి మనిషి నుండి మనిషికి వయస్సు పెరుగుతున్నకొద్దీ మార్పు చెందుతుంది.

అలాగే సాధారణ వ్యక్తిలో రక్తపోటు ఉదయం నుండి సాయంత్రానికి కొన్ని మార్పులు చెందుతుంటుంది.మానసిక వత్తిడులు కూడా బి.పి ని ప్రభావితం చేస్తాయి.

అధిక రక్తపోటు:
అసాధారణంగా రక్త పోటు 130/90 మి.మీ.అంతకన్నా అధికంగా వున్నప్ఫుడు ఎక్కువ రక్తపోటు (హైపర్ టెన్షన్) అని అంటారు.

120/80 నుండి 139/89 మి.మీ స్ధాయిని అధిక రక్తపోటు ముందు స్ధాయిగాను, 140/90 మి.మీ.స్ధాయిని అధిక రక్త పోటుగాను గుర్తించాలి.

అధిక రక్తపోటు లక్షణాలు: -
తలనొప్పి.
తల తిరుగుతున్నట్లు, తూలుతున్నట్లు అనిపించడం.
కూర్చున్న స్ధితి నుండి నిలుచోగానే కళ్ళు బైర్లు కమ్మడం.
సాధారణంగా శ్వాస తీసుకోలేకపోవడం.

లో - బిపి:
సాధారణంగా ఉండవలసిన రక్త పోటు (బి.పి) కన్నా తక్కువ స్ధాయిలో బి.పి ఉండటాన్ని లోబిపి అంటారు.వైద్యభాషలో దీనినే హైపోటెస్షన్ అని అంటారు.దీని వలన ప్రధాన అవయవాలైన గుండె,మెదడు,మూత్రపిండాలకు,ప్రాణ వాయువు (ఆక్సిజన్) ఆహారము సరఫరా తగు పాళ్ళలో జరగదు.

సాధారణంగా కొందరిలో 90/60 మి.మీ. ఉన్నప్పటికి ఆరోగ్యంగానే వుంటారు.కాని బి.పి.సుమారు 160/90 ఉండి, 110/70 కి తగ్గితే అది లోబిపి గా పరిగణించాలి.బిపి రీడింగ్ లో తేడా 40 మి.మీ. కు మించింది  అంటే అది లోబిపి గా పరిగణించాలి.

లోబిపి లక్షణాలు : -
నీరసం,అలసట.
మానసికంగా కృంగిపోవుట.
సరిగ నిద్ర లేక పోవుట.
తలనొప్పి.
గుండె వేగంగా పని చేయుట.
నాడి అధికంగా వుండుట.
కళ్ళు బైర్లు కమ్ముట.
కళ్ళు తిరుగుట.
శరీరం పాలి పోవుట.
అరికాళ్ళు,అరిచేతులు చల్లగా వుండి చెమటలు పట్టుట.
ఛాతి నొప్పి.
కొన్ని సందర్భాలలో గుండె పోటు వచ్చే అవకాశం వుంది.
మూత్ర పిండాలు సరిగా పనిచేయక పోవడం వలన యూరియా,క్రియాటినిక్ లాంటి పదార్ధాలు రక్తములో అధికమై ప్రాణాపాయం కలిగిస్తాయి.
ప్రమాదకరమైన లోబిపి లో షాక్ వచ్చి ప్రాణాపాయం కావచ్చు.@ భారతీయులం | www.facebook.com/bharatiyulam 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam
URL: HTML link code: BB (forum) link code:
ధన్యవాదనములు | ®“భారతీయులం”®