సిగరేట్ తాగటం బలే షోకు కదా. ! షోకులకు పోయి చావును కోరుకోకండి. 

అసలు పొగ తాగడం ఎందుకు మానేయమని అంటారు ఎందుకోసం ? తాగడం వలనా ఎం కోల్పోతునాము ? ఎలా మానాలి ?

చాలా మంది యువత మరియు తెలిసి తెలియని వయసు లో ఈ అలవాటు నేర్చుకుంటున్నారు పలానా హీరో లేదా,వాడు ఎవడో తాగాడు నేను తాగుతా....ఇలా ఎన్నో కారణాలు వ్యసనానికి.

శరీరంలోని అణువణువుకూ ప్రాణవాయువైన ఆక్సిజన్‌ని అందించే కీలక అవయవాలు ఊపిరితిత్తులు. వీటిలో ఉండే వాయునాళాల నుంచి గాలి బయటకు వస్తుంది. ఈ వాయునాళాల్లో అవరోధం ఏర్పడం వల్ల కలిగే వ్యాధే క్రానిక్ అబ్‌వూస్టక్టివ్ డిసీజ్ (సీవోపీడీ). గాలి పీల్చుకున్నప్పుడు వాయునాళాల్లో ఉండే మార్గాల ద్వారా గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. ఈ నాళాలు ముక్కు, నోటి నుంచి గాలిని తీసుకెళతాయి. సీవోపీడీ వచ్చినప్పుడు ఈ వాయుమార్గాలు కుంచించుకుపోతాయి. వీటి ద్వారా ప్రయాణించే గాలి తక్కువ అవుతుంది. ఊపిరితిత్తుల్లోకి వెళ్లిన గాలి మళ్లీ బయటకు రాలేదు. తద్వారా ఊపిరితిత్తులు బరువుగా, నిండుగా ఉన్నట్టు అనిపిస్తాయి. ఛాతీ మొత్తం పట్టేసినట్టు ఉండడానికి కూడా కారణం ఇదే. 
సీవోపీడీకి పొగతాగడం (బీడీలు, సిగరేట్లు, హుక్కా) అన్నింటి కన్నా ముఖ్య కారణం. చాలామంది సీవోపీడీ ఉన్నవాళ్లు వారు ప్రస్తుతం ఆ అలవాటును మానుకున్నా, గతంలో పొగతాగే అలవాటున్నవాళ్లే అయివుంటారు. కొద్దిరోజులు ఆ అలవాటు కొనసాగినా ఊపిరితిత్తులకు నష్టం జరిగిపోతుంది. ఒక్కొక్కప్పుడు పొగతాగనివాళ్లకు కూడా సీవోపీడీ రావచ్చు. ఊపిరితిత్తులకు నష్టం కలిగించే వాతావరణంలో ఉండడం వల్ల వీళ్లకు సీవోపీడీ రావచ్చు. వంటపొయ్యిల నుంచి వచ్చే పొగ, గదిని వెచ్చబరిచేందుకు పెట్టుకునే హీటర్ల నుంచి వచ్చే పొగ పీల్చినా సీవోపీడీ రావచ్చు. స్త్రీలలో సీవోపీడీ రావడానికి ప్రధాన కారణం ఇదే. బొగ్గుగనులు, సిమెంటు, టెక్స్‌టైల్స్, రసాయన పరిక్షిశమలు, ఆభరణాలకు పూతపూసే (ఎలక్షిక్టోప్లేటింగ్) చోట దుమ్ముతో కూడిన గాలి ఉన్నచోట, ధూళి, దుమ్ము ఎక్కువగా ఉండేచోట పనిచేసే వ్యక్తులు కూడా సీవోపీడీ బారినపడవచ్చు. ఆస్తమా ఉన్నవాళ్లకు సీవోపీడీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

పొగ మానేయడమే చికిత్స
సీవోపీడీకి అందించే ప్రధానమైన చికిత్స, నివారణ పొగతాగడం మానేయడమే. రోజుకి రెండు సిగరేట్లు తాగుతున్నా పరిస్థితి దిగజారిపోతుంది. సిగట్టు లోని పొగ ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. వాయునాళాలు కుంచించుకుపోవడానికి కారణం ఈ పొగే. దీని ఫలితంగా ఎక్కువ శ్లేష్మం ఉత్పత్తి అవుతుంది. ఈ శ్లేష్మం అంతో ఇంతో తెరుచుకుని ఉన్న నాళాలను మరింత మూసేస్తుంది. ఫలితంగా శరీరానికి అత్యవసరమైన ఆక్సిజన్‌ను ప్రసరింపజేసే శక్తి తగ్గిపోతుంది. 

సీవోపీడీ నిర్ధారణ..
సీవోపీడీగా ఏమాత్రం అనుమానం కలిగినా వెంటనే డాక్టర్‌ను కలవాలి. ఎంత త్వరగా చికిత్స ప్రారంభిస్తే అంత వేగంగా సీవోపీడీని అదుపులో ఉంచడం సాధ్యమవుతుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఇల్లు, పనిచేసే వాతావరణం లాంటి అంశాల ఆధారంగా వ్యాధి తీవ్రతను అంచనా వేస్తారు. సై్పరోమీటర్ అనే ప్రత్యేక పరికరం ద్వారా కొన్ని రకాల శ్వాస పరీక్షలు చేస్తారు. వీటి ఆధారంగా సీవోపీడీ తక్కువగా ఉందా.. ఓ మోస్తరుగా ఉందా... చాలా తీవ్రంగా ఉందా... అన్న విషయాలను నిర్ధారించవచ్చు. 

సీవోపీడీ... దశలు...
దగ్గు, దానితో పాటు శ్లేష్మం రావడం, కాస్త వేగంగా పనిచేసినా, వేగంగా నడిచినా ఊపిరి తగ్గుతున్నట్లు అనిపించడం లాంటి లక్షణాలుంటే సీవోపీడీ అప్పుడప్పుడే ప్రారంభమయిందనుకోవచ్చు.
విపరీతమైన శ్లేష్మంతో దగ్గు ఎక్కువగా రావడం, కాస్త పనిచేసినా, నడిచినా ఊపిరి తగ్గినట్టు అనిపించడంతో పాటు ఎటువంటి శారీరక శ్రమ ఉన్న పనయిగా కష్టంగా ఉండటం, ఇతరుల మాదిరిగా వేగంగా పనిచేయలేకపోవడం, ఏమాత్రం జలుబు చేసినా, ఇన్‌ఫెక్షన్ కలిగినా కోలుకోవడానికి వారాల తరబడి సమయం పడితే మధ్యరకం సీవోపీడీగా పరిగణించవచ్చు. 

విపరీతంగా ఎడతెరిపి లేకుండా శ్లేష్మంతో కూడిన దగ్గు, చిన్న పనికే ఊపిరాడకపోవడం, పగలూ రాత్రీ తేడా లేకుండా ఈ సమస్యతో ఊపిరి పీల్చడం కూడా కష్టంగా ఉండటం, వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం, విపరీతంగా అలసిపోవడం, నీరసం, ఒక గదిలో అటూ ఇటూ నడవడం కూడా కష్టంగా ఉంటుంది. మెట్లు ఎక్కలేరు. కొంచెం పనికే విపరీతంగా అలసిపోతారు. విశ్రాంతి తీసుకున్నా అలసట తగ్గదు. ఇలాంటి లక్షణాలుంటే తీవ్రమైన సీవోపీడీ ఉన్నట్టే. 

ఎలా మానాలి?
పొగతాగడం మానేయడానికి ప్రధానంగా కావలసింది మనోబలం. మీకంత బలం లేదని అనిపిస్తే డీఅడిక్షన్ కౌన్సెలింగ్ తీసుకోవచ్చు. ఇందుకు సహాయపడే మాత్రలను కూడా డాక్టర్ సలహాతో వాడవచ్చు. 
మానేసేముందు ఏ రోజు అన్నది కచ్చితంగా నిర్ణయించుకోండి. మానడానికి ప్రయత్నిస్తున్నట్టు కుటుంబసభ్యులకు, స్నేహితులకు ముందుగానే తెలియజెయ్యండి. సిగరేట్లు మీ దరిదాపుల్లో ఉండకుండా చూసుకోండి. పొగ తాగాలన్న కోరిక కలిగించే ప్రదేశాలు, వ్యక్తుల నుంచి దూరంగా ఉండండి. 
ఎప్పుడూ బిజీగా ఉండండి. చేతుల్ని బిజీగా ఉంచండి. సిగట్టు తీసుకోవాలనిపించినప్పుడల్లా ఓ పెన్సిల్ని గానీ మరో వస్తువునైనా చేతిలోకి తీసుకోండి. తాగాలనిపించినప్పుడల్లా చూయింగ్ గమ్ నమలండి. తాజా పండ్లు, కూరగాయలు తినండి. ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉండండి.@ భారతీయులం  

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam
URL: HTML link code: BB (forum) link code:
ధన్యవాదనములు | ®“భారతీయులం”®