భారత ప్రణాళికా సంఘం కొన్ని నిజాలను సుప్రీం కోర్టుకి తెలిపింది. భారత ప్రణాళిక సంఘం ఎవరిని దరిద్రులుగా లెక్కిస్తున్నదో కూడా వెల్లడించింది. ప్రణాళిక సంఘం దారిద్ర్య ప్రమాణాలను చూస్తే ముక్కు వేలు వేసుకోవలసిందే. మొత్తం 120 కోట్ల జనాభాలో 40.74 కోట్ల మంది దరిద్రంలో బతుకుతున్నారని ప్రణాళికా సంఘం సుప్రీం కోర్టుకి తెలిపింది. ఎవరిని దరిద్రులుగా భావిస్తున్నారన్న ప్రశ్నకు సమాధానం చూస్తే, పట్టణాలలో నెలకు రు.965/- (రోజుకి 32/-)కు తక్కువ సంపాదిస్తున్నవారు దరిద్రులు కాగా, గ్రామాల్లో నెలకు రు. 781/- (రు. రోజుకు 26/-) కంటే తక్కువ సంపాదిస్తున్నవారు దరిద్రులను ప్రణాళికా సంఘం తెలిపింది.
2011-12 జనాభా సర్వే పూర్తయితే తప్ప అంతిమ లెక్కలు ఇవ్వలేమని ప్లానింగ్ కమిషన్ కోర్టుకి తెలిపింది. సుప్రీం కోర్టు ఆదేశాల్లో మనిషికి రోజుకి 2100 కేలరీలు అవసరమని తెలిపింది. అది రోజుకి పట్టణాల్లో ఇరవై రూపాయలతో (గ్రామాల్లొ పదిహేను రూపాయలు) దొరకదని మళ్ళీ లెక్కించి సరిగ్గా ఎంతవుందో లెక్కించమని ప్లానింగ్ కమిషన్ ను కోరింది. వాళ్ళు మళ్ళీ లెక్కించి రోజుకు తలకి పట్టణాల్లో రు.32/- (గ్రామాల్లో రు.26/-) అవసరమని ఆ డబ్బుతో మనిషికి 2100 కేలరీలు తినొచ్చని కమిషన్ చెప్పిందన్నమాట.@ భారతీయులం | www.facebook.com/bharatiyulam