నేరనన్నవాఁడు నెరజాణ మహిలోన
నేర్తునన్నవాఁడు నిందజెందు
ఊరకున్నవాఁడె యుత్తమయోగిరా!
విశ్వదాభిరామ వినురవేమ.
తాత్పర్యము : ఓవేమా! ఈ ప్రపంచములో తనకు అన్నియు తెలుసునని డంబములు చెప్పువాడు తుదకు నిందలపాలగును. తనకు ఏమియు తెలియదని చెప్పువాడు మంచి తెలివితేటలు గలవాడు. అనవసరముగ ఏమియు చెప్పక మౌనముగ నుండువాడే గొప్ప బుద్ధిమంతుడు.@ భారతీయులం | www.facebook.com/bharatiyulam