చరిత్ర లో ఈరోజు may 28
1883: వినాయక దామోదర్ సావర్కర్ జన్మించాడు.
1896: సురవరం ప్రతాపరెడ్డి జన్మించాడు.
ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఏర్పాటు: ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల కోసం పోరాడేందుకు మే 28, 1961న 'ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్' పునాదులు పడ్డాయి. బ్రిటీష్ న్యాయవాది పీటర్ బెనెన్సన్ రాసిన 'ది ఫర్గా టెన్ ప్రిజనర్స్' అనే ఆర్టికల్ ఈ రోజున అన్ని ప్రముఖ పత్రికల్లో ప్రచురితమయ్యింది. తరువాత ఇదే ఆయనను ఆమ్నెస్టీ ఇంటేర్న షనల్‌ను ఏర్పాటు చేసేందుకు పురికొల్పింది. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం లండన్‌లో ఉంది. 150 దేశాల నుంచి 11 లక్షల మంది ఇందులో సభ్యులుగా ఉన్నారు. మానవ హక్కుల అణిచివేత, మానవహక్కుల దుర్వి నియోగానికి వ్యతిరేకంగా జరిగే పోరాటా లకు మద్దతునివ్వడం, మానవహక్కుల దుర్వినియోగాన్ని ప్రపంచం దృష్టికి తీసుకు రావడం ఈ సంస్థ ప్రధాన ఉద్దేశ్యాలు. ఈ సంస్థకు 1977లో నోబెల్ శాంతి పురస్కారం లభించింది.
జేమ్స్‌బాండ్ జయంతి: జేమ్స్‌బాండ్ పాత్ర సృష్టికర్త.. ఇయాన్ లాంకస్టర్ మే 28, 1908 లో ఇంగ్లాండ్‌లో జన్మించాడు. తొలినాళ్ళలో రాయిటర్స్, టైమ్స్, సండే టైమ్స్ పత్రికల్లో పనిచేశాడు. 'ఫీల్డ్ గైడ్ టు బర్డ్‌స ఆఫ్ వెస్టిండీస్' అనే పుస్తకాన్ని రాశాడు. అంతేకా కుండా పక్షి శాస్తవ్రేత్త కూడా అయిన జేమ్స్ బాండ్.. తన నవలలోని 'జేమ్స్‌బాండ్' పేరు డిటెక్టివ్ పాత్రకు బాగుంటుందని.. ఆ పేరే పెట్టాడు. ఈయన రచించిన నవల ఆధారంగా ఇంగ్లీష్‌లో డిటెక్టివ్ సినిమాలు తీశారు. ఇయా న్ ఫ్లెమింగ్ నవల ఆధారంగా.. 1962లో 'డాక్టర్ నో' అనే డిటెక్టివ్ సినిమా వచ్చింది. 1962 నుండి ఇప్పటివరకు దాదాపు 25 కు పైగా జేమ్స్‌బాండ్ చిత్రాలు విడుదలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ పొందిన పాత్ర 'జేమ్స్‌బాండ్'.
ఎన్టీరామారావు జయంతి: విశ్వవిఖ్యాత నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు.. కృష్ణా జిల్లా నిమ్మకూరు లో.. వెంకటరామమ్మ, లక్ష్మయ్య చౌదరి దంప తులకు తేది 28 మే 1923లో జన్మించారు. 1947లో 'మనదేశం'తో ప్రారంభించి 1982 వరకు దాదాపు 292 సినిమాల్లో నటించారు. పౌరాణిక పాత్రధారణలో ఎనలేని నైపుణ్యాన్ని ప్రదర్శించారు. మార్చి 29, 1982న 'తెలుగు దేశం' పార్టీని స్థాపించి.. తొమ్మిది నెలల కా లంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తొలి కాంగ్రేసేతర ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. ఎన్టీరామారావు తెలుగు జాతికి చేసిన సేవలకు గుర్తుగా.. నవంబర్ 1న 'తెలు గు ఆత్మగౌరవ దినోత్సవం'గా జరపాలని ఆం ధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. వీరి పేరు తో 5 లక్షల నగదు బహుమతితో ఒక స్మారక అవార్డును ప్రతి ఏటా ఒక చలనచిత్ర రంగ ప్రముఖుడి రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తోంది.
@ భారతీయులం