పాపకి రెండు చేతులూ ఫ్రాక్చర్ అయ్యాయి, ఒక్క చోట కాదు, అనేక చోట్ల. ఒంటి నిండా కొరికిన గాట్లు ఉన్నాయి. మొత్తం నోట్లో ఉన్న అన్ని పళ్ళనూ వినియోగించి కొరికిన ఆ గాయాల్ని చూస్తే పాషాణుడైనా ద్రవించక మానడు. కపాలం చిట్లిపోయింది. మెదడుకి గాయాలయ్యాయి. గోడ కేసి బాదడం వల్లనో, బరువైన వస్తువుతో కొట్టడం వల్లనో కపాలం చిట్లి ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. కుడి వైపు మెదడులో కొన్ని చోట్ల రక్తం గడ్డ కట్టి ఉంది. కుడి చేయి బాగా వాచి ఉంది. ముఖంపైనా, నుదుటి పైనా, కాలిపైనా, తీవ్రంగా కొరికిన గుర్తులు లోతుగా ఉన్నాయి. ఇది చేసినవాడు మనిషై ఉండడు. జంతువులకి అది చేయడం సాధ్యం కాదు. 'మానవ మృగం' అనవచ్చునేమో. 
పాప బ్రతికే అవకాశాలు చాలా తక్కువ అని డాక్టర్లు చెబుతున్నారు. తలకి ఇంత బలమైన గాయం తగిలినవారు బతికి ఉండే అవకాశాలు ముప్ఫై శాతమేననీ, ఒక వేళ బతికినా సాధారణ స్ధాయికి రాగల అవకాశాలు యాభై శాతమేననీ వారు తెలిపారు. ఫాలక్ బతికి బట్టకడితే జీవితాంతం మరొకరిపై ఆధారపడి బతకవలసిందేననీ వారు తెలిపారు. ఈ పది రోజుల్లో పాపకి రెండు సార్లు గుండె నొప్పి వచ్చిందనీ, ఇప్పటికి పరిస్ధితి స్ధిరంగా ఉన్నప్పటికీ, క్లిష్టంగానే ఉందని తెలిపారు. వెంటిలేటర్ సౌకర్యం తొలగించే స్ధాయికి పరిస్ధితి మెరుగుపడిందని వారు తెలిపారు. 
పాపను అడ్మిట్ చేస్తూ 'మహి గుప్త' తాను తన భర్త 'రాజ్ కుమార్ గుప్త' తో కలిసి మహీపాల్ పురి (దక్షిణ ఢిల్లీ) లోని వేరొకరి ఇంటిలో పేయింగ్ గెస్ట్ గా ఉంటున్నట్లు తెలిపింది. ఢిల్లీ డిప్యుటి కమిషనర్ ఛాయా శర్మ ప్రకారం దక్షిణ ఢిల్లీలోని స్వంత ఇంటినుండి మహి గత సంవత్సరం తప్పిపోయినట్లుగా ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఐతే, మహి ఒక వ్యక్తితో కలిసి వెళ్లిపోయినట్లుగా పోలీసులు తమ ఎంక్వైరీలో తెలుసుకున్నారు. గత ఇరవై రోజులుగా పాప తన వద్దనే ఉంటోందని మహి చెప్పింది. @ భారతీయులం |www.facebook.com/bharatiyulam
పూర్తీ వివరాలు :http://bit.ly/chantipaapapaihimsa   

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam
URL: HTML link code: BB (forum) link code:
ధన్యవాదనములు | ®“భారతీయులం”®