అల్పుడెపుడు పల్కు నాడంబరముగాను
సజ్జనుండుఁ బల్కుఁ జల్లగాను
కంచుమ్రోగునట్లు కనకంబు మ్రోగునా
విశ్వదాభిరామ వినురవేమ.

తాత్పర్యము : నీచుడు డంబములు చెప్పుచుండును. మంచివారు మెల్లగా మాటలాడుచుందురు. తక్కువ ఖరీదైన లోహము అయిన కంచు దడదడమని మ్రోగునట్లు, యెక్కువ ఖరీదైన బంగారము అను లోహము మ్రోగదుకదా.
@ భారతీయులం | www.facebook.com/bharatiyulam 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam
URL: HTML link code: BB (forum) link code:
ధన్యవాదనములు | ®“భారతీయులం”®