నిద్రలేస్తూనే నీరు తాగి చూడండి..!
ప్రొద్దున్నే నిద్రలేవగానే తల దిమ్ముగా ఉన్నా, కడుపులో వికారంగా ఉన్నా, నిస్సత్తువగా ఉందనిపిస్తున్నా, తల నొప్పి వేస్తున్నా ఇవి మన శరీరం నీటిని కోరుకుంటోందనడానికి సంకేతాలు అని గుర్తించాలి. అందుకే నిద్రపోవడానికి ముందు కూడా మన పెద్దలు తలగడ పక్కనో, మంచం కిందనో రాగి లేదా సాధారణ చెంబులో నీళ్లు పట్టి ఉంచడం చేసేవారు. పొద్దున్నే నిద్రలేచి ముఖం కడుక్కున్న వెంటనే పిల్లలకు నీళ్లు తాగించేవారు. 

పొద్దుటిపూటే చెంబుడు నీళ్లు తాగితే రోజంతా చీకూ చింతా లేకుండా ఉంటారనే నమ్మకం వాళ్లది. వైద్య పరంగా కూడా దీనికి ఆధారం ఉంది. ఎందుకంటే మనం సాధారణంగా రాత్రి పూట భోంచేసింతర్వాత మరుసటి రోజు తెల్లవారే వరకూ ఏమీ పుచ్చుకోం గదా.. దీంతో శరీరం ఖర్చుపెట్టిన ద్రవపదార్థాల స్థానంలో నీరు వచ్చి చేరదు. శరీరం నీటిని కోరుకుంటున్నా మనం అందివ్వని స్థితి రాత్రిపూట ఉంటుంది కనుకే నిద్రలేచిన వెంటనే నీరు తాగాలని పెద్దలు చెబుతారు. దీనివల్ల శరీరం తిరిగి రీచార్జ్ అవుతుంది.

నీటి ద్వారా కలిగే ప్రయోజనాలు ఏమిటో చూద్దామా..
డీహైడ్రేషన్‌కు లోనుకాకుండా ఉండాలంటే సాధ్యమైనంత ఎక్కువ నీళ్లు తాగాలి. నీళ్లకు జీర్ణశక్తిని పెంచే లక్షణం ఉంది. శరీరంలోని మలినాలను విసర్జింపజేసి, మూత్రపిండాలు సమర్థంగా తమ విధులు నిర్వర్తించాలంటే మనం వీలైనంత ఎక్కువగా నీరు త్రాగాలి. 

శరీరం కోల్పోయిన ద్రవపదార్ధాలను తిరిగి సమకూర్చుకోవాలంటే నీరు అధికంగా తీసుకోవాలి. మనం చేసే ప్రతి చిన్న లేదా పెద్ద పనికి ఎంతో కొన్ని కెలోరీలు ఖర్చయిపోతుండడం ఎలా వాస్తవమో శరీరం తనలోని నీటి నిల్వను నిరంతరం ఖర్చు పెట్టుకుంటూనే ఉంటుందని గుర్చుంచుకోవాలి. రోజుకు కనీసం ఎనిమిది గ్లాసులు నీటిని తాగడం తప్పనిసరి వైద్యనిపుణులు సూచిస్తూంటారు.

అలాగే నీటిశాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయలు, కమలా పళ్లు, నారింజ, దానిమ్మ వంటి ఫలాలను ఆయా సీజన్‌లలో అధికంగా తీసుకోవాలి. అన్నిటినీమించి నిద్రలేస్తూనే నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. కానీ ఖర్చు లేకుండా మన శరీర ఆరోగ్యాన్ని మన చేతుల్లోనే ఉంచుకోవడానికి ఇదే కారుచౌక మార్గం... కాబట్టి నీరు తాగడం మానవద్దు, నీరు తాగడం మర్చిపోవద్దు. ప్రొద్దుటిపూట నీరు తాగడం అస్సలు మర్చిపోవద్దు.@ భారతీయులం  

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam
URL: HTML link code: BB (forum) link code:
ధన్యవాదనములు | ®“భారతీయులం”®