చరిత్రలో ఈ రోజు - May 4
1905 కాంగ్రా భూకంపం లో 20,000 మంది ప్రజలు మరణించారు.
1979 ప్రముక భావకవి అబ్బూరి రామకృష్ణారావు మరణించారు
ప్రపంచ అగ్నిమాపక దళం దినోత్సవం
త్యాగరాజు జయంతి:మే 4, 1767వ సంవత్సరం.. వైశాఖ శుద్ధ షష్టి నాడు ప్రముఖ వాగ్గేయకారుడు త్యాగయ్య జన్మించారు. తల్లిదండ్రులు సీతయ్య, రామబ్రహ్మం. గురువు శొంఠి వెంకట రమణయ్య. 72 మేళకర్త రాగాలలో త్యాగయ్య కృతులను రచించాడు. 2400 కీర్తనలు రచించారని పరిశోధకుల ఉవాచ. జగనానందకారక (నాటరాగం), దుడుకుగల నన్నే దొర కొడుకు బ్రోచురా (గౌళ), సాధించనే మనసా (అరభి), కనకన రుచినా (వరాళి), ఎందరో మహానుభావులు (శ్రీరాగం) అనే అయిదు కీర్తనలు 'ఘనరాగ పంచరత్న కీర్తనలు'గా ప్రసిద్ధిగాంచాయి.
@ భారతీయులం | www.facebook.com/bharatiyulam