నేడు ప్రపంచ నవ్వుల దినోత్సవం, మే నెలలో వచ్చే మొదటి ఆదివారం ని ఇలా జరుపుకుంటాం.
నవ్వు అనేక రోగాలను దూరం చేసే మంచి టానిక్ అని, దీనికి మించిన వ్యాయామం లేదు.శారీరకంగానూ, మానసికంగానూ ఎంతో ఆరోగ్యాన్నిచ్చి, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండేలా చేసేది నవ్వు. నిజానికి ఇది ఒక గొప్ప ఔషధ పువ్వు. ప్రపంచంలో ఎక్కడైనా, ఎవరికైనా ఇది ఇచ్చే ఫలితం మాత్రం మారదు.
నవ్వు శరీరంలోని కొటికోల్ అయాన్ హార్మోన్లను విడుదల చేస్తుంది. నవ్వు వల్ల ఎండార్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఇవన్నీ బాధను మరిపిస్తాయి, అనేక శారీరక, మానసిక రుగ్మతలను దూరంచేసి ప్రశాంతతను ఇవ్వడంలో ఈ హార్మోన్లు ప్రధానపాత్రను పోషిస్తాయి. అంతేకాదు నవ్వు పిరికితనాన్ని కూడా పోగొడుతుంది.
ప్రతి మనిషికీ - ఎక్కడ పుట్టినా, మరెక్కడ పెరిగినా... అర్థం అయ్యే భాష నవ్వు. బహుశా ప్రతి ఒక్కరి నవ్వులోనూ అర్థం కూడా ఒకటే. నవ్వడం మనం నేర్చుకోనక్కరలేని భాష. పుట్టుక నుండే మనకు నవ్వు వస్తుంది. మరో విశేషం ఏంటంటే, నవ్వు మనకు తెలీకుండానే వస్తుంది. వచ్చిన నవ్వును బలవంతంగా మనం ఆపగలమే కానీ, బలవంతంగా నవ్వలేం (ఇప్పుడు చాలా మంది తంటాలుపడి పడీ పడీ నవ్వుతుంటారనుకోండి, రాకపోయినా).@ భారతీయులం | www.facebook.com/bharatiyulam