Is this blog?

భారతీయులం

భారతీయులం |protest of indians, we are indians
Home » May 2012
చరిత్ర లో ఈరోజు june 1,అంతర్జాతీయ బాలల దినోత్సవం (జూన్‌ 1), ఈస్టిండియా కంపెనీ రద్దు అమలులోకి వచ్చినది., భారత్‌లో మొదటి డీలక్స్‌ రైలు (దక్కన్‌ క్వీన్‌) బొంబాయి - పూణేల మధ్య ప్రారంభమైంది. etc.,

చరిత్ర లో ఈరోజు june 1
అంతర్జాతీయ బాలల దినోత్సవం (జూన్‌ 1): 1948వ సంవత్సరంలో ప్రపంచ మహిళా సమాఖ్య ప్రతి సంవత్సరం జూన్‌ 1వ తేదీన అంతర్జాతీయ బాలల దినోత్సవం జరపాలని నిర్ణయించింది. నాటి నుండి వంద దేశాలకు పైగా.. ఈ తేదీన బాలల దినోత్స వాన్ని జరుపుకుంటున్నాయి. అయితే.. కొన్ని దేశాల్లో బాలల దినోత్సవానికి కొన్ని ప్రత్యేక రోజులున్నాయి. ఉదాహరణకు మనదేశంలో భారత తొలి ప్రధాని పండిట్‌ జవహరాల్‌ జన్మదినమైన నవంబర్‌ 14న బాలల దినోత్సవాన్ని జరుపుకుంటాం.
1874: ఈస్టిండియా కంపెనీ రద్దు అమలులోకి వచ్చినది.
1930: భారత్‌లో మొదటి డీలక్స్‌ రైలు (దక్కన్‌ క్వీన్‌) బొంబాయి - పూణేల మధ్య ప్రారంభమైంది.
1955: అస్పృశ్యతను (అంటరానితనం) నేరంగా పరిగణించే చట్టం అమలులోకి వచ్చింది.
1964: నయాపైసా, పైసాగా మార్చబడింది.
1968: హెలెన్‌ కెల్లర్‌ మరణించింది.
1975: ఒలంపిక్‌ క్రీడలలో పతకం సాధించి న తొలి భారతీయ మహిళ కరణం మల్లీశ్వరి జన్మించింది.
1979: విజయనగరం జిల్లా యేర్పాటు. 
1996: భారత మాజీ రాష్టప్రతి, ఆంధ్రప్రదేశ్‌ తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి మరణం.
2001: నేపాల్‌ రాజ ప్రాసాదంలో రాకుమా రుడి మారణకాండ.@ భారతీయులం  

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

పొగత్రాగటం ఇప్పుడొక ఫ్యాషన్‌గా మారి పోయింది, రోడ్డు మీదకు వచ్చి చూస్తే నూటికి తొంభెై మంది మగవారి చేతుల్లో ఒక సిగరెట్టో.....ధూమపానం - దుష్ర్పభావాలు...పిల్లలపెై ప్రభావం...భారత దేశ నేపథ్యం...సిగరెట్‌ వల్ల కలిగే హానీ..

పొగత్రాగటం ఇప్పుడొక ఫ్యాషన్‌గా మారి పోయింది, రోడ్డు మీదకు వచ్చి చూస్తే నూటికి తొంభెై మంది మగవారి చేతుల్లో ఒక సిగరెట్టో, బీడీనో, లేక ఏదో ఒక పొగాకు ఉత్పత్తి చూడవచ్చు. కొన్ని అభివృద్ధి చెందిన నగరాలలో అయితే ఆడవారు కుడా ధూమ పానం చేస్తున్నారనుకోండి. రోజుకొకసారి ధూమపానం చేసేవారికి, వారి ఆయువు ప్రతి ఐదు సంవత్సరాలకి ఒక సంవత్సరం ఆయు వు తగ్గుతుందని, ప్రపంచ ఆరోగ్యసంస్థ ఎప్పు డో వెల్లడించిన సంగతి అందరికి తెలిసిందే. అయినా ఎవ్వరూ ధూమపానం మానకుండా, వారి ఆరోగ్యమే కాకుండా పక్కవారి ఆరోగ్యా న్ని కూడా నాశనం చేస్తున్నారు. ప్రపంచమం తా ఈరోజు పొగాకు వ్యతిరేకదినం అని తెలి సినా, మన వాళ్ళెవరికీ పట్టనట్లు గుప్పుగుప్పు మంటూ దమ్ము కొడుతున్నారు.

 ప్రభుత్వం బహి రంగ ప్రదేశాల్లో పొగాకు వాడకాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం 2002 సంవత్సరంలో ఓ చట్టాన్ని చేసింది. 'ఆంధ్రప్రదేశ్‌ ప్రొహిబిషన్‌ ఆఫ్‌ స్మో కింగ్‌ అండ్‌ హెల్‌‌త ప్రొటెక్షన్‌ యాక్ట్‌' కింద బ హిరంగ ప్రదేశాలు, ప్రజలు సాధారణంగా తిరిగే ప్రదేశాల్లో పొగతాగరాదు.

పొగాకు వ్యతిరేక దినం...
1987లో ప్రపంచ ఆరోగ్య సంస్థ సభ్యదేశా లు ప్రజలలో పొగాకు వినియోగం వల్ల కలిగే హాని పట్ల అవగాహన పెంచి, అప్రమత్తుల్ని చేసే లక్ష్యంతో ధూమపాన వ్యతిరేక దినోత్స వాన్ని పాటించాలని భావించాయి. తదనుగు ణంగా 1988 నుంచి ప్రతి సంవత్సరం మే 31న ఈ దినోత్సవాన్ని జరిపి ప్రజలకు పొగ త్రాగడం వలన వచ్చే అనారోగ్యం గురించి తెలియ జెప్పడమే ముఖ్య ఉద్దే్యశంగా పెట్టుకు న్నాయి. సమాజంలో స్వచ్ఛంద సంస్థలు, ప్ర భుత్వ ఉద్యోగ సంఘాలు, అన్ని పాఠశాలలు ఈ రోజు స్వచ్ఛందంగా ర్యాలీలు, సభలు, స మావేశాలు జరిపి ధూమపానం వలన జరిగే నష్టాలను ప్రజలకు తెలియజేస్తున్నాయి.

ధూమపానం - దుష్ర్పభావాలు...
మన దేశంలో సంవత్సరానికి దాదాపు 90 వేల మంది ప్రజలు పొగాకు వల్ల సంభవించే రోగాలతోనే మరణిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. పురుషులలో 56.4 శాతం, స్ర్తీలలో 44.9 శాతం కాన్సర్లకు కారణం పొ గాకు వాడకం వల్లే. ప్రపంచంలో ఎక్కడా లే నంత ఎక్కువగా గొంతు కాన్సర్‌ భారత దేశం లో వ్యాపిస్తోందనే ఆందోళన సర్వత్రా నెలకొంది. సిగరేట్‌ తాగగానే నికోటిన్‌, ఇతర రసాయ నాలు శరీరంలోకి వెళ్లి తీవ్ర ప్రభావాన్ని చూ పుతాయని నిపుణులు చెబుతున్నారు. ఒకసా రి సిగరెట్‌ తాగితే చాలా రకరకాల రసాయ నాలు శరీరంలోకి వెళ్తాయి. శరీంలోకి ప్రవే శించిన రసాయనాల్లో దాదాపు 40 నుండి 50 క్యాన్సర్లను కలిగించేవే. వాటితో పాటు తారు, కార్బన్‌ మోనాక్సైడ్‌ వంటివి శరీరం లోకి ప్రవేశిస్తాయి. మాములుగా ఊపిరి తి త్తుల్లో తమను తాము శుభ్రం చేసుకునే యం త్రాంగం ఉంటుంది. ఈ అలవాటు వలన అవి తమ సామార్థ్యాన్ని కోల్పోతాయి. ఆ కా లుష్యాన్ని బయటికి తీసుకురావడానికి పొడి దగ్గు మొదలవుతుంది.
                                 దీనినే స్మోకర్స్‌ కాఫ్‌ అని అంటారు. ప్రపం చంలో పొగాకు వాడకం వల్ల నోటి క్యాన్సర్‌ కేసుల సంఖ్య భారతదేశంలోనే ఎక్కువగా ఉన్నట్లు సర్వేలు వెల్లడించాయి. భారతదేశంలో పురుషుల్లో క్యాన్సర్‌ వ్యాధికి 56.4% కారణం కాగా మహిళల్లో 44.9% కారణమయ్యింది. ఊపిరితిత్తులకు వచ్చే క్యా న్సర్‌ 82%, ఇతర వ్యాధులకు 90% కార ణం పొగాకు వాడకం మాత్రమే. పొగాకు వా డకం గుండె రక్తనాళాల వ్యాధికి దారితీస్తుంది. ఇంకా గుండెపోటు, ఛాతిలో నొప్పి, హృద్రో గంతో ఆకస్మిక మరణం, మెదడుకు పక్షవా తం, నాడి సంబంధ వ్యాధులకు కూడ పోగా కు ద్రోహదం అవుతున్నట్లు తెలుస్తుంది.

పిల్లలపెై ప్రభావం...
సెకండ్‌ హ్యాండ్‌ స్మోకింగ్‌ కారణంగా పిల్లల్లో అస్తమా రోగుల సంఖ్య నానాటికి పెరుగు తోంది. ధూమాపానం ద్వారా వచ్చే పొగ వలన న్యుమోనియా లేదా శ్వాసతో పాటు వచ్చే దగ్గు (పల్మోనరీ బ్రాంకైటిస్‌) ఉత్పన్న మవుతుంది. పిల్లలో వినికిడి, వాచక సమ స్యలు తలెత్తుతాయి. ధూమాపానం చేసే వారి ఇండ్లలో పిల్లలకు ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తుతాయి. దీంతో వారిలో వ్యాధినిరోధక సమస్యలు ఉత్పన్న మవుతాయి. ఈ కారణం గా పిల్లలు యువావస్థలోకి వచ్చే ముందు ఇతరులకన్నా బలహీనంగా తయారవుతారు.
ప్రతి 8 సెకండ్లకు పొగాకు కారణంతో ఒక రు మృతి చెందుతున్నట్లు తెలుస్తుంది. అందు లో భాగంగా భారతదేశంలో పొగాకు వాడకం వల్ల మృతి చెందుతున్న వారి సంఖ్య ప్రతి ఏటా 8 నుంచి 9 లక్షల మధ్య ఉంటుంది. పురుషుల్లో నపుంసకత్వానికి కారణమవుతుం ది. అలాగే మహిళల్లో ఈస్ట్రోజోన్‌ హర్మోన్ల సంఖ్య తగ్గుతుంది. అరగంటసేపు పొగాకును నమిలితే 4 సిగరెట్లు తాగడంతో సమానమైన నికోటిన్‌ను మింగినట్లవుతుంది. పొగాకు నమిలేవారిలో నోరు, గొంతు క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఆరోగ్యవంతులకంటే 50 రెట్లు ఎక్కువగా ఉంటుందని వెైద్యులు చెబు తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలకు కారణమవుతున్న ప్రధాన 8 వ్యా ధులలో 6 వ్యాధులకు పొగాకు ఉమ్మడి రిస్క్‌ గా ఉంటుంది. మొత్తంగా 20వ దశాబ్దంలో 100 మిలియన్ల మరణాలు కేవలం పొగాకు సంబంధితంగా సంభవించినట్లు సర్వేలు తెలుపుతున్నాయి

భారత దేశ నేపథ్యం...
* మనదేశంలో సాలీనా 8 నుండి 9 లక్షల మరణాలు పొగాకు సంబంధమైనవిగా ఉంటున్నాయి.
* రోజూ 2200 మందికిపెైగా భారతీయులు పొగాకు వాడకం సంబంధిత మరణాలకు గురవుతున్నారు.
* రోజూ కొత్తగా 5500 మంది యువత పొగతాగేవారి జాబితాలో చేరుతున్నారు.
* ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో 
నోటి క్యాన్సర్‌ కేసులు భారతదేశంలో నమోదవు తున్నాయి. వీటిలో 90 శాతం పొగాకు వాడకం ఫలితంగా సంభవిస్తున్నాయి.
* భారతదేశంలో నమోదవుతున్న 
మొత్తం క్యాన్సర్‌ కేసుల్లో దాదాపు సగం కేసులు వివిధ రూపాల్లో పొగాకు వాడకం ఫలితంగా సంభవిస్తున్నవే.

సిగరెట్‌ వల్ల కలిగే హానీ..
1. ధూమపానం వల్ల శ్వాసనాళాలు దెబ్బతింటాయి.
2. శ్వాసనాళంపెై గోడలు గట్టిపడి వదిలే గాలిలోని మలినాలు బయటకు పోవడం తగ్గిపోతుంది.
3. సంకోచ, వ్యాకోచాలు తగ్గి క్రానిక్‌ బ్రాం కైటిస్‌, ఆఫ్‌స్లైక్టివ్‌ పల్మనరీ వ్యాధులు వస్తాయి.
4. కడుపులో ఉదరకోశ పొరలు దెబ్బతిని అల్సర్‌, గ్యాస్‌ ట్రబుల్‌, సమస్యలు తలెత్తుతాయి.
5. గుండెకు సంబంధించిన రక్తనాళాలు దెబ్బతిని బిపి, గుండెపోటు సంభవిస్తాయి.
6. మెదడులోని రక్తనాళాలు చిట్లి పక్షవా తం, నరాల బలహీనత ఏర్పడుతాయి.
7. ఆయాసం పెరిగి ఇసినోఫిలిస్‌, గ్యాలినోమా అనే వ్యాధికి దారితీస్తుంది.@ భారతీయులం 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

చరిత్ర లో ఈరోజు may 28 ధూమపాన వ్యతిరేక దినం (నో స్మోకింగ్‌ డే) పొగాకు వల్ల కలిగే నష్టాలను గూర్చి ప్రజలకు అవగాహన కల్పిం చాలన్న ఉద్దేశంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూ.హెచ్‌.ఓ) మే 31వ తేదీని ధూమపాన వ్యతిరేక దినంగా ప్రకటించింది.

చరిత్ర లో ఈరోజు may 28
ధూమపాన వ్యతిరేక దినం (నో స్మోకింగ్‌ డే)    
పొగాకు వ్యతిరేక దినం (నో స్మోకింగ్‌ డే - మే 31): పొగాకు వల్ల కలిగే నష్టాలను గూర్చి ప్రజలకు అవగాహన కల్పిం చాలన్న ఉద్దేశంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూ.హెచ్‌.ఓ) మే 31వ తేదీని ధూమపాన వ్యతిరేక దినంగా ప్రకటించింది.1953 నుండి ప్రతి సంవత్సరం ఈ తేదీన ప్రపంచ మంతటా 'నో స్మోకింగ్‌ డే' నిర్వహిస్తారు.
 దక్షిణాఫ్రికా జాతీయ దినోత్సవం.
క్రీ.శ 526: టర్కీలో సంభవించిన భయంకరమైన భూకంపం 2,50,000 మందిని పొట్టనబెట్టుకుంది.
1930: సుప్రసిద్ధ అమెరికన్‌ నటుడు, దర్శకుడు క్లింట్‌ ఈస్ట్‌వుడ్‌ జననం.@ భారతీయులం 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

మీకు తెలుసా ? మన శరీరంలోని నాడీ వ్యవస్థలోని నాడులు ఒక సెకనుకు 300 అడుగుల వంతున సందేశాలు అందిస్తాయి. అతి పెద్ధ కణము విబజన ఛెన్దలెవు మానవ సరీరములొ నడీకణాలు 10 బిలియనులు.

మీకు తెలుసా ?
మన శరీరంలోని నాడీ వ్యవస్థలోని నాడులు ఒక సెకనుకు 300 అడుగుల వంతున సందేశాలు అందిస్తాయి.
అతి పెద్ధ కణము విబజన ఛెన్దలెవు మానవ సరీరములొ నడీకణాలు 10 బిలియనులు
నాడీ వ్యవస్థ (Nervous system) నిర్మాణాత్మకంగాను క్రియాత్మకంగాను క్లిష్టమైనది. ఇది జంతువులలో మాత్రమే కనిపిస్తుంది. సకసేరుకాలలో ఇది మూడు ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తుంది. 1. ప్రేరణకు ప్రతిచర్య, 2. సమన్వయం మరియు 3. అభ్యాసన.

సౌలభ్యంకోసం నాడీవ్యవస్థను మూడు భాగాలుగా విభజించడం జరిగింది.
1. కేంద్ర నాడీ వ్యవస్థ (Central nervous system:CNS) - మెదడు మరియు వెన్నుపాము.
2. పరిధీయ నాడీ వ్యవస్థ (Peripheral nervous system:PNS) - కపాల నాడులు మరియు కశేరు నాడులు.
3. స్వయంచోదిత నాడీ వ్యవస్థ (Autonomous nervous system:ANS).

గ్రాహకాల నుండి కేంద్ర నాడీ వ్యవస్థకు కలిపే నాడులను జ్ఞాన నాడులు లేదా అభివాహి నాడులనీ (Sensory or afferent nerves), కేంద్ర నాడీ వ్యవస్థ నుండి కండరాలు వంటి అపసారి భాగాలకు కలిపే నాడులను చాలక నాడులు.

నాడీ వ్యవస్థ ప్రధానంగా రెండు రకాల కణాలతో నిర్మితమై ఉంటుంది.
నాడీ కణాలు (Neurons) : నాడీ కణంలో మూడు భాగాలుంటాయి. నాడీ కణదేహం, డెండ్రైట్లు మరియు ఏక్సాన్.
నాడీ కణదేహం (Cell body) లో పెద్ద కేంద్రకం ఉంటుంది. దీని జీవపదార్ధంలో ఆర్.ఎన్.ఎ., ప్రోటీన్లతో ఏర్పడిన నిస్సల్ కణికలు (Nissle substance) ఉంటాయి.
డెండ్రైట్లు (Dendrites) చెట్లలో కొమ్మల వలె నాడీ కణదేహం నుండి ఏర్పడిన నిర్మాణాలు. ఇవి ఇతర నాడీకణాల నుంచి సమాచారాన్ని గ్రహించి కణదేహానికి అందిస్తాయి.
ఏక్సాన్ (Axon) ప్రతి కణదేహం నుండి బయలుదేరే ఒక పొడవైన అక్షీయ తంతువు. దీనిని ఆవరించి పలుచని ప్లాస్మాత్వచం మయెలిన్ తొడుగు (Myelin sheath) ఉంటుంది. ఈ ఏక్సాన్ చివరిభాగం నాడీ అంత్యంతో అంతమవుతుంది. నాడీఅంత్యం మరో నాడీకణ డెండ్రైట్ లేదా ఏక్సాన్ లేదా నిర్వాహక అంగాలైన కండరాలు, గ్రంథులతో సంబంధం కలిగివుంటుంది. నాడీకణ ఏక్సాన్లు నిర్వాహక అంగాలతో సంబంధం కలిగి ఉండే ప్రదేశాన్ని సైనాప్స్ (Synapse) అంటారు. మయెలిన్ తొడుగులో అక్కడక్కడ కనిపించే ఖాళీ ప్రదేశాలను రాన్వియర్ కణుపులు (Nodes of Ranvier) అంటారు. మయెలిన్ తొడుగున్న ఏక్సాన్లు వార్తలను వేగంగా తీసుకొని వెళతాయి.
గ్లియల్ కణాలు (Glial cells) : ఇవి నాడీ కణాలకు పోషక పదార్ధాలను అందజేయడంలో, వాటి చర్యలను విస్తరించడంలో సహాయపడతాయి.@ భారతీయులం 

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

బలవంతుడ నాకేమని పలువురతో విగ్రహించి పలుకుటమేలా? (సుమతీ శతకము) @ భారతీయులం

కం|| బలవంతుడ నాకేమని
పలువురతో విగ్రహించి పలుకుటమేలా?
బలవంతమైన సర్పము
చలిచీమల చేత జిక్కి చావదె సుమతీ! (సుమతీ శతకము) @ భారతీయులం 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Telugu basha vayasentha ? తెలుగు భాష వయస్సెంత ? తమిళంలో క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుండీ సాహిత్యం లభిస్తోంది. క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో ప్రత్యేక భాషగా ఏర్పడి ఉండవచ్చు.

"తెలుగు భాష వయస్సెంత?"
సురేష్ కొలిచాల "తెలుగు భాష వయస్సెంత?" అనే వ్యాసంలో తెలుగు భాష ఎంత పాతదో నిర్ణయించే ప్రయత్నం చేసారు !
తమిళంలో క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుండీ సాహిత్యం లభిస్తోంది. తమిళం లోనూ కన్నడలోనూ తాలవ్యీకరణ (palatalization) లో వ్యత్యాసం కనబడుతోంది కాబట్టి, అవి రెండు కనీసం మూడు నాలుగు వందల యేండ్ల ముందుగా విడివడి ఉండాలి. ఆ రకంగా పూర్వ-తమిళం క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో ప్రత్యేక భాషగా ఏర్పడి ఉండవచ్చు. కానీ దక్షిణ ద్రావిడ భాషలకూ, దక్షిణ-మధ్య ద్రావిడ భాషలకూ శబ్ద నిర్మాణంలోనూ, వాక్య నిర్మాణంలోనూ అనేక వ్యత్యాసాలు కనిపిస్తాయి. దక్షిణ ద్రావిడ భాషలైన తమిళ‌-కన్నడ లతో పోలిస్తే తెలుగు-కువి-గోండీ లలో కనిపించే వ్యత్యాసాలో కొన్ని--
1. వర్ణవ్యత్యయం (metathesis): తెలుగు-కువి-గోండి భాషలలో మూల ద్రావిడ ధాతువులోని అచ్చు తరువాతి హల్లు పరస్పరం స్థానం మార్చుకుంటాయి. (ఉదా: వాడు < *అవన్ఱు, వీడు <*ఇవన్ఱు, రోలు < ఒరళ్ <*ఉరళ్)
2. తెలుగులో బహువచన ప్రత్యయం- లు. తమిళాది దక్షిణ భాషల్లో ఇది -కళ్‌, -గళు.
3. క్త్వార్థక క్రియలు తమిళాదుల్లో -తు -ఇ చేరటం వల్ల ఏర్పడుతాయి. తెలుగు-కువి-గోండి భాషలలో -చి, -సి చేరటం వల్ల ఏర్పడుతాయి. ఉదా: వచ్చి, చేసి, తెచ్చి, నిలిచి వరుసగా తమిళంలో వన్దు , కెయ్దు, తన్దు, నిన్ఱు.
పైన పేర్కొన్న లక్షణాలన్నీ దక్షిణ మధ్య ద్రావిడ భాషలన్నిటిలో ఉండి దక్షిణ ద్రావిడ భాషలో లేనివి. అంటే ఈ మార్పులన్నీ తెలుగు-కువి-గోండి ఒకే భాషగా కలిసి ఉన్న రోజులలో మూల దక్షిణ ద్రావిడ భాషనుండి విడిపోయిన తరువాత వచ్చిన మార్పులన్న మాట. అన్ని ముఖ్యమైన మార్పులు రావటానికి కనీసం 400-500 సంవత్సరాలు పట్టవచ్చు. అంటే తెలుగు-కువి-గోండి భాషలు దక్షిణ మధ్య ద్రావిడ ఉప శాఖగా క్రీస్తు పూర్వం 1100 సంవత్సరంలో మూల దక్షిణ ద్రావిడం నుండి విడిపోవచ్చు. ఇదే నిజమైతే క్రీస్తు పూర్వం 700-600 వరకే తెలుగు ఒక ప్రత్యేక భాషగా స్వయంప్రతిపత్తిని కలిగి ఉండవచ్చునని మనం ఊహించవచ్చు. క్రీస్తు పూర్వం ఏడవ శతాబ్దానికి చెందిన ఐతరేయ బ్రహ్మణం ఆంధ్ర జాతిని ప్రత్యేక జాతిగా పేర్కొనడం ఈ లెక్కతో సరిపోతుంది కూడా!

ఈ రకమైన కాలనిర్ణయం సాపేక్ష కాలమానాల (relative chronology) మీద ఆధారపడ్డదే కానీ పద, ధాతు వ్యాప్తి గణాంకాల (lexicostatistics) మీద ఆధారపడ్డది కాదు. ద్రావిడ భాషల పూర్వచరిత్ర పై ఇంకా పరిశోధనలు ఇతోధికంగా జరిగితే గాని తెలుగు భాషా జనన కాలనిర్ణయాన్ని నిష్కర్షగా చెప్పలేం.@ భారతీయులం  

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

చరిత్ర లో ఈరోజు may 28,వినాయక దామోదర్‌ సావర్కర్‌ జన్మించాడు.,సురవరం ప్రతాపరెడ్డి జన్మించాడు. ,జేమ్స్‌బాండ్‌ జయంతి,ఎన్టీరామారావు జయంతి

చరిత్ర లో ఈరోజు may 28
1883: వినాయక దామోదర్‌ సావర్కర్‌ జన్మించాడు.

1896: సురవరం ప్రతాపరెడ్డి జన్మించాడు. 
ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఏర్పాటు: ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల కోసం పోరాడేందుకు మే 28, 1961న 'ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌' పునాదులు పడ్డాయి. బ్రిటీష్‌ న్యాయవాది పీటర్‌ బెనెన్సన్‌ రాసిన 'ది ఫర్గా టెన్‌ ప్రిజనర్స్‌' అనే ఆర్టికల్‌ ఈ రోజున అన్ని ప్రముఖ పత్రికల్లో ప్రచురితమయ్యింది. తరువాత ఇదే ఆయనను ఆమ్నెస్టీ ఇంటేర్న షనల్‌ను ఏర్పాటు చేసేందుకు పురికొల్పింది. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం లండన్‌లో ఉంది. 150 దేశాల నుంచి 11 లక్షల మంది ఇందులో సభ్యులుగా ఉన్నారు. మానవ హక్కుల అణిచివేత, మానవహక్కుల దుర్వి నియోగానికి వ్యతిరేకంగా జరిగే పోరాటా లకు మద్దతునివ్వడం, మానవహక్కుల దుర్వినియోగాన్ని ప్రపంచం దృష్టికి తీసుకు రావడం ఈ సంస్థ ప్రధాన ఉద్దేశ్యాలు. ఈ సంస్థకు 1977లో నోబెల్‌ శాంతి పురస్కారం లభించింది.

జేమ్స్‌బాండ్‌ జయంతి: జేమ్స్‌బాండ్‌ పాత్ర సృష్టికర్త.. ఇయాన్‌ లాంకస్టర్‌ మే 28, 1908 లో ఇంగ్లాండ్‌లో జన్మించాడు. తొలినాళ్ళలో రాయిటర్స్‌, టైమ్స్‌, సండే టైమ్స్‌ పత్రికల్లో పనిచేశాడు. 'ఫీల్డ్‌ గైడ్‌ టు బర్డ్‌‌స ఆఫ్‌ వెస్టిండీస్‌' అనే పుస్తకాన్ని రాశాడు. అంతేకా కుండా పక్షి శాస్తవ్రేత్త కూడా అయిన జేమ్స్‌ బాండ్‌.. తన నవలలోని 'జేమ్స్‌బాండ్‌' పేరు డిటెక్టివ్‌ పాత్రకు బాగుంటుందని.. ఆ పేరే పెట్టాడు. ఈయన రచించిన నవల ఆధారంగా ఇంగ్లీష్‌లో డిటెక్టివ్‌ సినిమాలు తీశారు. ఇయా న్‌ ఫ్లెమింగ్‌ నవల ఆధారంగా.. 1962లో 'డాక్టర్‌ నో' అనే డిటెక్టివ్‌ సినిమా వచ్చింది. 1962 నుండి ఇప్పటివరకు దాదాపు 25 కు పైగా జేమ్స్‌బాండ్‌ చిత్రాలు విడుదలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ పొందిన పాత్ర 'జేమ్స్‌బాండ్‌'.

ఎన్టీరామారావు జయంతి: విశ్వవిఖ్యాత నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు.. కృష్ణా జిల్లా నిమ్మకూరు లో.. వెంకటరామమ్మ, లక్ష్మయ్య చౌదరి దంప తులకు తేది 28 మే 1923లో జన్మించారు. 1947లో 'మనదేశం'తో ప్రారంభించి 1982 వరకు దాదాపు 292 సినిమాల్లో నటించారు. పౌరాణిక పాత్రధారణలో ఎనలేని నైపుణ్యాన్ని ప్రదర్శించారు. మార్చి 29, 1982న 'తెలుగు దేశం' పార్టీని స్థాపించి.. తొమ్మిది నెలల కా లంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తొలి కాంగ్రేసేతర ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. ఎన్టీరామారావు తెలుగు జాతికి చేసిన సేవలకు గుర్తుగా.. నవంబర్‌ 1న 'తెలు గు ఆత్మగౌరవ దినోత్సవం'గా జరపాలని ఆం ధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. వీరి పేరు తో 5 లక్షల నగదు బహుమతితో ఒక స్మారక అవార్డును ప్రతి ఏటా ఒక చలనచిత్ర రంగ ప్రముఖుడి రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తోంది.
@ భారతీయులం 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

పొట్ట కూటి కోసం ఏపనైనా చేస్తాము అనేలా చేయిస్తున్న ఆకలి బాద మరియు బయం.ఓహ్ పోలీసు ఆ అవయాలను తీయమని కోరాడు అలా చేసి నందుకు వంద రూపాయిలు ఇస్తానన్నాడు.

ఖాకి బట్టలు వేసుకుంటే చాలు ఏదైనా చేయగలము, చేయించ గలము.
పొట్ట కూటి కోసం ఏపనైనా చేస్తాము అనేలా చేయిస్తున్న ఆకలి బాద మరియు బయం.

వాడి పేరు ఫిరోజ్, వయసు ౧౨.ఓహ్ పోలీసు ఆ అవయాలను తీయమని కోరాడు అలా చేసి నందుకు వంద రూపాయిలు ఇస్తానన్నాడు.
వంద రూపాయిలకి మృతి చెందిన వ్యక్తీ శరీర అవయవాలను ఎరుతున్న ఫిరోజ్. ఆ అవయవాలను ఏరి ఒక చోట చేర్చిన ఫిరోజ్ ఆ తర్వాత చాల అస్వస్థత కి గురి అయ్యాడు.
ఫిరోజ్ రైల్వే స్టేషన్ లో చెత్త కాగితాలు ఏరేవాడు ఐతే సంబందిత రైల్వే పోలీసు అలా చేయమని బెదిరించడం తో చేయక తప్పలేదు.అలా చేసినదుకు వంద కుడా ఇచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న చైల్డ్ రైట్స్ వాలు కేసు బుక్ చేసారు అండ్ డాక్టర్ కి చూపించారు ఫిరోజ్ ని కానీ అపటికే ట్రౌమా లో ఉన్నాడు డాక్టర్ తన ని చూసి పర్మనెంట్ ఫోబిక్ రి-ఆక్షన్ అని అన్నాడు.@ భారతీయులం 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

సిగరేట్ తాగటం బలే షోకు కదా. ! షోకులకు పోయి చావును కోరుకోకండి. అసలు పొగ తాగడం ఎందుకు మానేయమని అంటారు ఎందుకోసం ? తాగడం వలనా ఎం కోల్పోతునాము ? ఎలా మానాలి ?

సిగరేట్ తాగటం బలే షోకు కదా. ! షోకులకు పోయి చావును కోరుకోకండి. 

అసలు పొగ తాగడం ఎందుకు మానేయమని అంటారు ఎందుకోసం ? తాగడం వలనా ఎం కోల్పోతునాము ? ఎలా మానాలి ?

చాలా మంది యువత మరియు తెలిసి తెలియని వయసు లో ఈ అలవాటు నేర్చుకుంటున్నారు పలానా హీరో లేదా,వాడు ఎవడో తాగాడు నేను తాగుతా....ఇలా ఎన్నో కారణాలు వ్యసనానికి.

శరీరంలోని అణువణువుకూ ప్రాణవాయువైన ఆక్సిజన్‌ని అందించే కీలక అవయవాలు ఊపిరితిత్తులు. వీటిలో ఉండే వాయునాళాల నుంచి గాలి బయటకు వస్తుంది. ఈ వాయునాళాల్లో అవరోధం ఏర్పడం వల్ల కలిగే వ్యాధే క్రానిక్ అబ్‌వూస్టక్టివ్ డిసీజ్ (సీవోపీడీ). గాలి పీల్చుకున్నప్పుడు వాయునాళాల్లో ఉండే మార్గాల ద్వారా గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. ఈ నాళాలు ముక్కు, నోటి నుంచి గాలిని తీసుకెళతాయి. సీవోపీడీ వచ్చినప్పుడు ఈ వాయుమార్గాలు కుంచించుకుపోతాయి. వీటి ద్వారా ప్రయాణించే గాలి తక్కువ అవుతుంది. ఊపిరితిత్తుల్లోకి వెళ్లిన గాలి మళ్లీ బయటకు రాలేదు. తద్వారా ఊపిరితిత్తులు బరువుగా, నిండుగా ఉన్నట్టు అనిపిస్తాయి. ఛాతీ మొత్తం పట్టేసినట్టు ఉండడానికి కూడా కారణం ఇదే. 
సీవోపీడీకి పొగతాగడం (బీడీలు, సిగరేట్లు, హుక్కా) అన్నింటి కన్నా ముఖ్య కారణం. చాలామంది సీవోపీడీ ఉన్నవాళ్లు వారు ప్రస్తుతం ఆ అలవాటును మానుకున్నా, గతంలో పొగతాగే అలవాటున్నవాళ్లే అయివుంటారు. కొద్దిరోజులు ఆ అలవాటు కొనసాగినా ఊపిరితిత్తులకు నష్టం జరిగిపోతుంది. ఒక్కొక్కప్పుడు పొగతాగనివాళ్లకు కూడా సీవోపీడీ రావచ్చు. ఊపిరితిత్తులకు నష్టం కలిగించే వాతావరణంలో ఉండడం వల్ల వీళ్లకు సీవోపీడీ రావచ్చు. వంటపొయ్యిల నుంచి వచ్చే పొగ, గదిని వెచ్చబరిచేందుకు పెట్టుకునే హీటర్ల నుంచి వచ్చే పొగ పీల్చినా సీవోపీడీ రావచ్చు. స్త్రీలలో సీవోపీడీ రావడానికి ప్రధాన కారణం ఇదే. బొగ్గుగనులు, సిమెంటు, టెక్స్‌టైల్స్, రసాయన పరిక్షిశమలు, ఆభరణాలకు పూతపూసే (ఎలక్షిక్టోప్లేటింగ్) చోట దుమ్ముతో కూడిన గాలి ఉన్నచోట, ధూళి, దుమ్ము ఎక్కువగా ఉండేచోట పనిచేసే వ్యక్తులు కూడా సీవోపీడీ బారినపడవచ్చు. ఆస్తమా ఉన్నవాళ్లకు సీవోపీడీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

పొగ మానేయడమే చికిత్స
సీవోపీడీకి అందించే ప్రధానమైన చికిత్స, నివారణ పొగతాగడం మానేయడమే. రోజుకి రెండు సిగరేట్లు తాగుతున్నా పరిస్థితి దిగజారిపోతుంది. సిగట్టు లోని పొగ ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. వాయునాళాలు కుంచించుకుపోవడానికి కారణం ఈ పొగే. దీని ఫలితంగా ఎక్కువ శ్లేష్మం ఉత్పత్తి అవుతుంది. ఈ శ్లేష్మం అంతో ఇంతో తెరుచుకుని ఉన్న నాళాలను మరింత మూసేస్తుంది. ఫలితంగా శరీరానికి అత్యవసరమైన ఆక్సిజన్‌ను ప్రసరింపజేసే శక్తి తగ్గిపోతుంది. 

సీవోపీడీ నిర్ధారణ..
సీవోపీడీగా ఏమాత్రం అనుమానం కలిగినా వెంటనే డాక్టర్‌ను కలవాలి. ఎంత త్వరగా చికిత్స ప్రారంభిస్తే అంత వేగంగా సీవోపీడీని అదుపులో ఉంచడం సాధ్యమవుతుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఇల్లు, పనిచేసే వాతావరణం లాంటి అంశాల ఆధారంగా వ్యాధి తీవ్రతను అంచనా వేస్తారు. సై్పరోమీటర్ అనే ప్రత్యేక పరికరం ద్వారా కొన్ని రకాల శ్వాస పరీక్షలు చేస్తారు. వీటి ఆధారంగా సీవోపీడీ తక్కువగా ఉందా.. ఓ మోస్తరుగా ఉందా... చాలా తీవ్రంగా ఉందా... అన్న విషయాలను నిర్ధారించవచ్చు. 

సీవోపీడీ... దశలు...
దగ్గు, దానితో పాటు శ్లేష్మం రావడం, కాస్త వేగంగా పనిచేసినా, వేగంగా నడిచినా ఊపిరి తగ్గుతున్నట్లు అనిపించడం లాంటి లక్షణాలుంటే సీవోపీడీ అప్పుడప్పుడే ప్రారంభమయిందనుకోవచ్చు.
విపరీతమైన శ్లేష్మంతో దగ్గు ఎక్కువగా రావడం, కాస్త పనిచేసినా, నడిచినా ఊపిరి తగ్గినట్టు అనిపించడంతో పాటు ఎటువంటి శారీరక శ్రమ ఉన్న పనయిగా కష్టంగా ఉండటం, ఇతరుల మాదిరిగా వేగంగా పనిచేయలేకపోవడం, ఏమాత్రం జలుబు చేసినా, ఇన్‌ఫెక్షన్ కలిగినా కోలుకోవడానికి వారాల తరబడి సమయం పడితే మధ్యరకం సీవోపీడీగా పరిగణించవచ్చు. 

విపరీతంగా ఎడతెరిపి లేకుండా శ్లేష్మంతో కూడిన దగ్గు, చిన్న పనికే ఊపిరాడకపోవడం, పగలూ రాత్రీ తేడా లేకుండా ఈ సమస్యతో ఊపిరి పీల్చడం కూడా కష్టంగా ఉండటం, వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం, విపరీతంగా అలసిపోవడం, నీరసం, ఒక గదిలో అటూ ఇటూ నడవడం కూడా కష్టంగా ఉంటుంది. మెట్లు ఎక్కలేరు. కొంచెం పనికే విపరీతంగా అలసిపోతారు. విశ్రాంతి తీసుకున్నా అలసట తగ్గదు. ఇలాంటి లక్షణాలుంటే తీవ్రమైన సీవోపీడీ ఉన్నట్టే. 

ఎలా మానాలి?
పొగతాగడం మానేయడానికి ప్రధానంగా కావలసింది మనోబలం. మీకంత బలం లేదని అనిపిస్తే డీఅడిక్షన్ కౌన్సెలింగ్ తీసుకోవచ్చు. ఇందుకు సహాయపడే మాత్రలను కూడా డాక్టర్ సలహాతో వాడవచ్చు. 
మానేసేముందు ఏ రోజు అన్నది కచ్చితంగా నిర్ణయించుకోండి. మానడానికి ప్రయత్నిస్తున్నట్టు కుటుంబసభ్యులకు, స్నేహితులకు ముందుగానే తెలియజెయ్యండి. సిగరేట్లు మీ దరిదాపుల్లో ఉండకుండా చూసుకోండి. పొగ తాగాలన్న కోరిక కలిగించే ప్రదేశాలు, వ్యక్తుల నుంచి దూరంగా ఉండండి. 
ఎప్పుడూ బిజీగా ఉండండి. చేతుల్ని బిజీగా ఉంచండి. సిగట్టు తీసుకోవాలనిపించినప్పుడల్లా ఓ పెన్సిల్ని గానీ మరో వస్తువునైనా చేతిలోకి తీసుకోండి. తాగాలనిపించినప్పుడల్లా చూయింగ్ గమ్ నమలండి. తాజా పండ్లు, కూరగాయలు తినండి. ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉండండి.@ భారతీయులం  

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

ప్రియములేని విందు పిండివంటల చేటు .....పాత్ర మెరుగనీ వి బంగారు చేటురా విశ్వదాభిరామ వినురవేమ.

ప్రియములేని విందు పిండివంటల చేటు  
భక్తి లేని పూజ పత్రి చేటు
పాత్ర మెరుగనీ వి బంగారు చేటురా 
విశ్వదాభిరామ వినురవేమ.@ భారతీయులం  

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

చిత్తశుద్దిగల్గి చేసిన పుణ్యంబు ....విత్తనంబు మర్రి వృక్షంబున నెంత విశ్వదాభిరామ వినురవేమ.

చిత్తశుద్దిగల్గి చేసిన పుణ్యంబు 
కొంచెమయున నదియు గొదువ గాదు
విత్తనంబు మర్రి వృక్షంబున నెంత 
విశ్వదాభిరామ వినురవేమ.@ భారతీయులం  

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు....విశ్వదాభిరామ వినురవేమ.

నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు
తళ్కు బెళ్కు రాళ్ళు తట్టెడేల
చాటు పద్య మిలను చాలదా యొకటైన
విశ్వదాభిరామ వినురవేమ.@ భారతీయులం  

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

చరిత్ర లో ఈరోజు may 24, కామన్వెల్త్‌ డే: 1959లో ఈ రోజున ‘ఎంపైర్‌ డే’ ను ‘కామన్వెల్త్‌ డే’ గా మార్చారు.మొట్టమొదటి టెలీగ్రాఫ్‌

చరిత్ర లో ఈరోజు may 24
కామన్వెల్త్‌ డే: 1959లో ఈ రోజున 'ఎంపైర్‌ డే' ను 'కామన్వెల్త్‌ డే' గా మార్చారు.
1543: కోపర్నికస్‌ మరణించాడు.
1819: బ్రిటీష్‌ మహారాణి విక్టోరియా జన్మించింది.
1844: మొట్టమొదటి టెలీగ్రాఫ్‌ సందేశాన్ని మోర్స్‌ అనే శాస్తవ్రేత్త వాషింగ్టన్‌ డి.సి. నుండి బాల్టిమోర్‌కు ప్రసారం చేశాడు.
1875: సర్‌ సయ్యద్‌ అహ్మద్‌ ఖాన్‌, మహమ్మద్‌ ఆంగ్లో ఓరియెంటల్‌ స్కూల్‌ను స్థాపించాడు. ఇదే 1920లో అలీఘఢ్‌ ముస్లిం యునివర్సిటీగా అవతరించింది.
1997: నల్లమల గిరిప్రసాద్‌ మరణించాడు
1726: సారాయి (జిన్/ బ్రాంది) పై పన్ను పెంచినందుకు ప్రజలు తిరగబడి ఆందోళన చేసారు.
1954: ఐ.బి.ఎమ్. కనుగొన్న, వాక్యూం ట్యూబ్ 'ఎలెక్ట్రానిక్' బ్రెయిన్, ఓక గంటలో 10 మిలియన్ (ఒక కోటి) పనులు (ఆపరేషన్స్) చేయగలదని ప్రకటించింది
1993: మైక్రోసాఫ్ట్ 'విండోస్ ఎన్.టి' (Windows NT) విడుదల చేసింది.@ భారతీయులం  

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

ప్రపంచంలోనే మొట్ట మొదటి మానవ జీవి (మొదటి హోమో సాపిఎనస్) నిఎందేర్తాల్స్ వారు అని విజ్ఞాన పరిశోదనలు తెలుపుతున్నాయి. భారతదేశ చరిత్ర 34,000 ఏళ్ళ కిందట హోమో సెపియన్స్ కాలం నుండే ప్రారంభమయింది.

ప్రపంచంలోనే మొట్ట మొదటి మానవ జీవి (మొదటి హోమో సాపిఎనస్) నిఎందేర్తాల్స్ వారు అని విజ్ఞాన పరిశోదనలు తెలుపుతున్నాయి. మొదట  హోమో సాపిఎనస్ 200,౦౦౦ ఏళ్ల నాటి వారు మరియు ఆఫ్రికా లో ఉండేవారు. తదుపరి వారి వలస వెళ్ళటం వలన 100 ,౦౦౦ ఏళ్ళకి ప్రపంచ వివిధ దేశాలకు వ్యాపించారు.
నిఎందేర్తాల్స్ వారు ఐదు నుండి ఆరు ఫీట్ ఉండేవారు.వాళ్ళకి ఎముకులు దృడంగా మరియు స్టర్డి ఎముకులు చాలా బలంగా ఉండేవారు మరియు వారికీ మెదడు పెద్దది మాములు మానవులకన్నా.
మానవ ఉనికిని మరియు వివిధ రహస్యాలను తెలియ జెప్పే వివరాలు ప్రపంచ లో రెండో స్తానం భారత దేశం ది. ఒక్కపటి భారతదేశం ప్రపంచములోని అతిపెద్ద ఖండము మరియు అత్యంత జనాభా కలిగిన ఖండము.
ప్రాంతాల వారి గా విడదీసుకొని ఇప్పుడు ఇలా అయ్యింది ముక్కలు అవుతూ.
ఆఫ్రికా వాసులు వలస చేరి మానవ ఉనికిని భారతదేశానికి పంచినట్టు కొన్ని రుజువులు ఉన్నాయి...వారి లోని కొన్ని తెగలు మరియు జాతులు ఇలా కార్యరూపం దాల్చింది ఇప్పుడు.
భారతదేశ చరిత్ర 34,000 ఏళ్ళ కిందట హోమో సెపియన్స్ కాలం నుండే ప్రారంభమయింది. భారత దేశ చరిత్ర అంటే భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, భూటాన్లతో కూడిన సమస్త భారత ఉపఖండ చరిత్ర.@ భారతీయులం  

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

చరిత్ర లో ఈరోజు may 23,మొట్టమొదటిసారిగా భారత మహిళ బచేంద్రిపాల్‌ ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించింది

చరిత్ర లో ఈరోజు may 23
1942: ప్రముఖ సినీ దర్శకుడు కె.రాఘవేంద్ర రావు జన్మించాడు.
1984: మొట్టమొదటిసారిగా భారత మహిళ బచేంద్రిపాల్‌ ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించింది
1995: జావా ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌ మొదటి వెర్షన్‌ విడుదలైంది.
2009: ఐపిఎల్-2 విజేతగా హైదరాబాద్ దక్కన్ చార్జర్స్ నిలిచింది.@ భారతీయులం  

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

నిద్రలేస్తూనే నీరు తాగి చూడండి..! నీటి ద్వారా కలిగే ప్రయోజనాలు ఏమిటో చూద్దామా..శరీరం కోల్పోయిన ద్రవపదార్ధాలను తిరిగి సమకూర్చుకోవాలంటే నీరు అధికంగా తీసుకోవాలి.

నిద్రలేస్తూనే నీరు తాగి చూడండి..!
ప్రొద్దున్నే నిద్రలేవగానే తల దిమ్ముగా ఉన్నా, కడుపులో వికారంగా ఉన్నా, నిస్సత్తువగా ఉందనిపిస్తున్నా, తల నొప్పి వేస్తున్నా ఇవి మన శరీరం నీటిని కోరుకుంటోందనడానికి సంకేతాలు అని గుర్తించాలి. అందుకే నిద్రపోవడానికి ముందు కూడా మన పెద్దలు తలగడ పక్కనో, మంచం కిందనో రాగి లేదా సాధారణ చెంబులో నీళ్లు పట్టి ఉంచడం చేసేవారు. పొద్దున్నే నిద్రలేచి ముఖం కడుక్కున్న వెంటనే పిల్లలకు నీళ్లు తాగించేవారు. 

పొద్దుటిపూటే చెంబుడు నీళ్లు తాగితే రోజంతా చీకూ చింతా లేకుండా ఉంటారనే నమ్మకం వాళ్లది. వైద్య పరంగా కూడా దీనికి ఆధారం ఉంది. ఎందుకంటే మనం సాధారణంగా రాత్రి పూట భోంచేసింతర్వాత మరుసటి రోజు తెల్లవారే వరకూ ఏమీ పుచ్చుకోం గదా.. దీంతో శరీరం ఖర్చుపెట్టిన ద్రవపదార్థాల స్థానంలో నీరు వచ్చి చేరదు. శరీరం నీటిని కోరుకుంటున్నా మనం అందివ్వని స్థితి రాత్రిపూట ఉంటుంది కనుకే నిద్రలేచిన వెంటనే నీరు తాగాలని పెద్దలు చెబుతారు. దీనివల్ల శరీరం తిరిగి రీచార్జ్ అవుతుంది.

నీటి ద్వారా కలిగే ప్రయోజనాలు ఏమిటో చూద్దామా..
డీహైడ్రేషన్‌కు లోనుకాకుండా ఉండాలంటే సాధ్యమైనంత ఎక్కువ నీళ్లు తాగాలి. నీళ్లకు జీర్ణశక్తిని పెంచే లక్షణం ఉంది. శరీరంలోని మలినాలను విసర్జింపజేసి, మూత్రపిండాలు సమర్థంగా తమ విధులు నిర్వర్తించాలంటే మనం వీలైనంత ఎక్కువగా నీరు త్రాగాలి. 

శరీరం కోల్పోయిన ద్రవపదార్ధాలను తిరిగి సమకూర్చుకోవాలంటే నీరు అధికంగా తీసుకోవాలి. మనం చేసే ప్రతి చిన్న లేదా పెద్ద పనికి ఎంతో కొన్ని కెలోరీలు ఖర్చయిపోతుండడం ఎలా వాస్తవమో శరీరం తనలోని నీటి నిల్వను నిరంతరం ఖర్చు పెట్టుకుంటూనే ఉంటుందని గుర్చుంచుకోవాలి. రోజుకు కనీసం ఎనిమిది గ్లాసులు నీటిని తాగడం తప్పనిసరి వైద్యనిపుణులు సూచిస్తూంటారు.

అలాగే నీటిశాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయలు, కమలా పళ్లు, నారింజ, దానిమ్మ వంటి ఫలాలను ఆయా సీజన్‌లలో అధికంగా తీసుకోవాలి. అన్నిటినీమించి నిద్రలేస్తూనే నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. కానీ ఖర్చు లేకుండా మన శరీర ఆరోగ్యాన్ని మన చేతుల్లోనే ఉంచుకోవడానికి ఇదే కారుచౌక మార్గం... కాబట్టి నీరు తాగడం మానవద్దు, నీరు తాగడం మర్చిపోవద్దు. ప్రొద్దుటిపూట నీరు తాగడం అస్సలు మర్చిపోవద్దు.@ భారతీయులం  

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

aasanaalu ante enti ? అందరూ ఆసనాలు, యోగా అంటూ చేస్తుంటారు అసలు ఆసనాలు అంటే ఏంటి ? అసలు యోగాసనాలు ఎందుకు వేయాలి? ముఖ్యమైన కొన్నిఆసనాలు

అందరూ ఆసనాలు, యోగా అంటూ చేస్తుంటారు అసలు ఆసనాలు అంటే ఏంటి ?
ఒక మనిషి శారీరకంగా వ్యక్తపరిచే ఎలాంటి భంగిమనైనా సరే ఆసనం అనవచ్చు. అయితే ఆసనం పుట్టుక గురించి ఎలాంటి మూలాధారాలు మనకు అందుబాటులో లేవు. మనిషి పుట్టిన నాటినుంచీ ఇది ఉంది. ఉయ్యాలలో పడుకోబెట్టిన పసిపిల్లలు చేసే విన్యాసాలు కూడా ఆసనాల క్రిందికే వస్తాయి.
అయితే భంగిమలనేవి ఒక క్రమపద్ధతిలో ఉంటూ, తగినంత వ్యాయామం చేస్తే వాటినే యోగాసనాలు అనవచ్చు. ఒక మనిషి సంపూర్ణ ఆరోగ్యవంతుడు అవడానికి కనీసం 25 రకాల ఆసనాలనైనా వేయడం అవసరమని యోగా పండితులు చెబుతుంటారు. 
ఇక చరిత్ర విషయానికి వస్తే... భగవద్గీతలో శ్రీకృష్ణుడు, ఉపనిషత్తులలో మహర్షులు యోగ విజ్ఞానానికి సంబంధించిన పలు విషయాలను వ్యక్తపరిచారు. అవి ఏంటంటే, రాజ, హఠ, కర్మ, భక్తి, ధ్యాన, జ్ఞాన యోగము లాంటివి. వీటిలో రాజయోగం శ్రేష్టమైనది చెబుతుంటారు.

అసలు యోగాసనాలు ఎందుకు వేయాలి?
అంటే.. మానవ శరీరం పలురకాల మాలిన్యాలతో పేరుకుంటూ ఉంటుంది. శరీరంలో కలిగే అనారోగాలకు ఈ మాలిన్యాలే కారణం కాబట్టి, వాటిని ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలి. ఈ మాలిన్యాల నిర్మూలకు యోగా ఒక చక్కటి పరిష్కారం. యోగా వలన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అందువల్ల పెద్దగా కష్టపడనవసరంలేని ఈ ఆసనాలను వేయటం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలి.

ఆసనాలు అంటే ఒక వ్యక్తి ఒక ప్రత్యేక ప్రయోజనములు సాధించే నిమిత్తము కూర్చుండే, పరుండే శరీర స్థితిలో శరీరారోగ్యాన్ని రక్షించు కొనుట, మానసికంగా శారీరకంగాను అభివృద్ధి, రోగములనుండి కాపాడు కొనుటకు, తగ్గించు కొనుటకు, మందులతో పాటు ఆసనాలను వేసిన తొందరగా ఫలితములు పొందుదురు. శరీర బరువును తగ్గించు కొనుటకు మరియు పెంచు కొనుటకు చాలా ఉపయోగ కరంగా ఉండును. ఈ ఆసనాలను ఉదయము 4 గం || నుండి 6 గం || వరకు వేసిన చాలా మంచి ఫలితములు పొందుదురు.

ముఖ్యమైన కొన్ని రోగములకు ఆసనములను తెల్పుచున్నాము:

సిద్దాసనము : ఈ ఆసనము వేయుట వలన శరీరములోని 72 వేల నాడులు శుద్ధి అవుతాయి. 12 సం || లు వేసిన ముక్తిని ఆనందమును పొందవచ్చును.

బద్ధ పద్మాసనము : దీనివలన గర్భాశయ రోగములు, గ్యాస్ ట్రబుల్ ,కడుపునొప్పి ,అజీర్ణము వంటివి, గూని రాకుండాను, స్వప్న స్కలనాలను అరికట్టును.

కుక్కుటాసనము : దీనివలన నాడీ ప్రసారము బాగా జరుగును. చేతులకు కాళ్ళ కండరాలకు బలము కలుగును.

గోముఖాసనము : దీనివలన ఆర్శ మొలలు తగ్గును.కాళ్ళకు భుజకీళ్ళు, వెన్నెముక ,తొడలలోని వాతము వాపులు నివారించును.

వజ్రాసనము : జీర్ణశక్తికి బొర్ర తగ్గుటకు గర్భ దోషములకు మంచిది. సర్వాంగాసనము: దీనివలన తల, కండ్లు, చెవి, ముక్కు, గొంతు రోగములను తగ్గించు కొనుటకు, థైరాయిడ్ గ్లాండ్ ను పోషించును. ఈ ఆసనము అభ్యాసము వలన అన్ని రోగములను నివారించు కొనవచ్చును.స్త్రీలకు కూడా అనువైనది.వివాహితులకు ఈ ఆసనము మంచిది

మత్స్యాసనము : దీనివలన దీర్ఘ శ్వాస నిశ్వాసలు క్రమబద్దము అయి ముక్కు కండరాల వాపు, ముక్కు దిబ్బడ, జలుబు, తగ్గును. ముఖ రోగములు తగ్గును.మల విసర్జన జరిగి ప్రేవులు శుబ్రపడి మలబద్దకము తొలగి హుషారుగా యుండును.

హలాసనము : దీనివలన గర్భ కోశము, తొడల వాత నొప్పులు, నడుము నొప్పులు, బొజ్జ, లివర్ వ్యాధులు తొలగి పోవును.మధు మేహానికి చాలా మంచిది. భుజంగాసనము : దీనివలన స్త్రీలకు చాలా ఉపయోగకరము. గర్భాశయ బాధలు, నొప్పి, వెన్ను, నడుము నొప్పులకు, ముట్టుశూలకు, ఋతు దోష నివారణలకు చాలా ముఖ్యము.

ధనురాసనము : దీనివలన కాళ్ళు, చేతులు, కీళ్ళలోను, నొప్పులు నివారణ అగును.జీర్ణాశయము, బాగుగా పని చేయును. ఆకలిని పెంచును.కడుపులో నున్న అనవసర కొవ్వును తగ్గించును.

పశ్చిమోత్తాసనము : దీనివలన ఆర్శ మొలలున్న వారికి, మధు మేహంతో బాధ పడేవారికి మంచిది. సుషుమ్నలో ఉత్తెజము కలుగును. బుర్ర పెరిగిన వారికి కూడా ఉపయోగము.

మయూరాసనము : ఈ ఆసనము వేయుట కొంత కష్టము కాని, ఫలితములు అమోఘము. లావుగా యున్నవారు సన్నగా అగుటకు మరియు గర్భ రోగములు, మధు మేహాన్ని (డయాబెటిస్ ) తగ్గించును.@ భారతీయులం  

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

యోగ విద్య & యోగాభ్యాసము చేయాలనుకునే వాళ్ళు పాటించవలసిన నిబంధనలు yoga vidya and yoghabhasamu

యోగ విద్య నభ్యసించుటకు వయో పరిమితి లేదు. ఏ వయస్సు వారైనను యోగ విద్య నభ్యసించ వచ్చును. కాన స్త్రీ, పురుషులెల్లరు వయోభేదము లేక, యోగ విద్య నభ్యసించి తమ ఆరోగ్యమును కాపాడు కొనుచూ శత వత్సరములు వర్దిల్ల గలరు. ముఖ్యముగా ఉద్యోగము, వ్యాపారము చేయు వారిలో ఎక్కువమంది శరీర శ్రమ లేకుండా ఉదయం నుండి సాయంత్రం వరకు తమ విధులను నిర్వర్తించుచుందురు. అట్టి వారు తప్పక యోగ, వ్యాయామము నభ్యసించవలెను. వారు యోగ విద్య నభ్యసించని యెడల వారి శరీరమునకు శ్రమ లేక, భుజించిన ఆహారము సరిగా జీర్ణము కాక క్రమముగా అజీర్ణవ్యాది ప్రారంబించును.అజీర్ణ వ్యాధి కారణముగా మధుమేహ వ్యాధి (షుగరు వ్యాధి )కి గురియగుదురు. మధుమేహ వ్యాధి ఇతర వ్యాదులన్నింటికి మూల కారణ మని (diabities is the root cause of all diseases ) శాస్త్రజ్ఞులు చెప్పుచున్నారు కనుక ప్రతివారు మధు మెహ వ్యాధి నుండి కాపాడ బడవలయునంటే యోగ, వ్యాయామము తప్పక అభ్యసించవలెను. ప్రతి వారు

ఆరోగ్యవంతులై దీర్ఘాయుష్మంతులగుటకు తప్పక యోగాభ్యాసము చేయవలెను.

పాటించవలసిన నిబంధనలు:

1 . మితాహారమును సేవిన్చావలయును.అనగా ఎంత ఇష్టమైన పదార్ధమైనను అతిగా భుజించరాదు .
2 . మద్యపానము చేయరాదు .
3 . ధూమపానము చేయరాదు (పొగ త్రాగరాదు )
4 . కాఫీ, టీ, మొదలగు వుత్తేజకాలను అతిగా వాడరాదు.
5 . ఘాటైన పదార్ధములను అనగా సుగంధ ద్రవ్యములు, కూరలలో వాడుకొను మిరియాలు, జీలకర్ర, యాలుకలు, లవంగాలు మొదలగునవి తగ్గించి వాడు కొనవలయును. అనగా మషాలా దినుసులు తగ్గించి వాడు కొనవలయును.
6 . మాంసాహారము విసర్జించుట మంచిది.మానలేనివారు వారమున కొకసారి లేక పది రోజులకొకసారి వాడు కొనవలయును.
7 . అతి చల్లని, అతి వేడి పదార్దములు వాడరాదు.
8 .గాలి వెలుతురు దారాళముగా ప్రసరించు ఇంటిలో నివసించవలయును .
9 . ప్రతి రోజు ఉదయం 4 .30 గం || లకు లేచి తన దినచర్యలు ప్రారంబించ వలయు
10 .మంచి వాతావరణము ఉన్నచోట నివాసయోగ్యము.
11 . ప్రతి రోజు కనీసము 6 గం || లు నిద్రించవలెను.
12 . పగటి నిదుర పనికి రాదు, రేయి నిదుర కాయరాదు.
13 . ప్రతి దినము ఉదయము 4 .30 గం ||ల నుండి 8 గం || ల మధ్య యోగ వ్యాయాయము చేయవలెను.
14 . చంటి పిల్లలు ప్రతి రోజు 8 గంటల నుండి 10 గంటలు, 12 గంటలు నిదురించవలయును.
15 . యోగ విద్య నభ్యసించు పురుషులు కట్ డ్రాయరు గాని, లంగోటా కాని వాడ రాదు. ప్రత్యేకముగా గోచీ గుడ్డ కుట్టించుకొని వాడవలయును .
16 .స్త్రీలు గర్భము దాల్చిన మూడు మాసముల తరువాత, ప్రసవించిన మూడు మాసముల వరకు యోగ విద్య నభ్యసించ రాదు. ఉదయము నడక మాత్రము చేయవలయును.
17 . మనిషికి రెండు ప్రక్కలు అనగా ఎడమ ప్రక్క, కుడి ప్రక్క. అందువల్ల ప్రతి భంగిమను రెండు ప్రక్కలు తప్పక చేయవలయును.
18 . యోగ భంగిమల నభ్యసించు నపుడు, కాళ్ళ నొప్పులు గాని, బెణుకులు గాని జరుగవచ్చును.అలాంటప్పుడు అభ్యసించుట మానరాదు. నెమ్మదిగా సమయము తగ్గించి అభ్యసిస్తే తొందరలో నివారణ యగును.@ భారతీయులం 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

చరిత్ర లో ఈరోజు may 22 International Day for Biological Diversity భారత 13వ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది

చరిత్ర లో ఈరోజు may 22
యెమెన్‌ జాతీయ దినోత్సవం.
1772: సంఘసంస్కర్త రాజారామ్‌ మోహన్‌ రాయ్‌ జన్మించాడు.
1972: రిపబ్లిక్‌ ఆఫ్‌ శ్రీలంక అవతరించింది.
2004: భారత 13వ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ నియమితుడైనాడు. (14వ లోక్ సభ)
2008: నెల్లూరు జిల్లాను పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చుటకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది
2009: భారత 13వ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ నియమితుడైనాడు. (15వ లోక్ సభ). ఎక్కువకాలం, ప్రధాని పదవిలో ఉన్న మూడవ ప్రధాని 2639 రోజులు). (మొదటి ప్రధాని 6130 రోజులు. రెండవ ప్రధాని 5829 రోజులు).
2010: మంగళూరు విమానాశ్రయంలొ విమానం కూలి 158 మంది మృతిచెందారు.
1822 - పరవస్తు వెంకట రంగాచార్యులు సంస్కృతాంధ్ర పండితుడు జన్మించారు.
2010: సుప్రసిద్ధ తెలుగు సిసిమా పాటల రచయిత వేటూరి సుందరరామ్మూర్తి మరణించారు.
International Day for Biological Diversity @ భారతీయులం  

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

చరిత్ర లో ఈరోజు may 20,బిపిన్‌ చంద్ర పాల్‌ మరణించాడు.ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు మరణించాడు.రాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి

చరిత్ర లో ఈరోజు may 20
1506: అమెరికాను కనిపెట్టిన యాత్రికుడు క్రిస్టొఫర్‌ కొలంబస్‌ మరణించాడు.
1932: బిపిన్‌ చంద్ర పాల్‌ మరణించాడు.
1957: ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు మరణించాడు.
1994: ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మరణించాడు.వాస్కో డ గామా భారత్‌ చేరిన రోజు (మే 20): ఆసియాకు సముద్ర మార్గాన్ని కొను గొనేందుకు పోర్చుగల్‌ రాజు ఎంపిక చేసిన యాత్రా బృందానికి వాస్కో డ గామా సారథి గా నియమించబడ్డాడు. తూర్పు దేశాలతో వాణిజ్యంలో ముస్లింల ఆధిపత్యాన్ని తగ్గించా లన్నది పోర్చుగల్‌ రాజు అభిప్రాయం. 08-07-1497న పోర్చుగల్‌ రాజధాని లిస్బ న్‌ రేవు నుంచి 'సావగాబ్రియల్‌', 'సావో రాఫె ల్‌', 'బెర్రియా' అనే నౌకలలో యాత్ర జరిగిం ది. 'కేఫ్‌ ఆఫ్‌ గుడ్‌హోప్‌' మీదుగా ప్రయాణిం చి 20-05-1498న భారత్‌లోని కాలికట్‌ రేవు పట్టణం మీద కాలుమోపాడు వాస్కో డ గామా. కాలికట్‌ హిందూ రాజు జామోరిన్‌ ఆయనకు స్వాగతం పలికాడు.
కాలికట్‌ చేరి నట్టు తెలిపే శిలాఫలకాన్ని వాస్కో డగామా ప్రతిష్టించాడు. 09-07- 1499న తిరిగి పోర్చుగల్‌ చేరుకున్నాడు. రాజు అతనికి 'డోమ్‌' అనే బిరుదునిచ్చాడు. ఆ తరువాత పోర్చుగల్‌ రాజు పంపిన 13 నౌకల బృం దాన్ని కాలికట్‌ రాజు నాశనం చేశాడు. వా స్కో డ గామా అడ్మిరల్‌ గా తిరిగి భారత్‌ వచ్చాడు. కన్ననూర్‌, కొచ్చిన్‌ పాలకుల సహా యంతో కాలికట్‌పై దాడిచేశాడు. 1524లో వాస్కో డ గామా భారత్‌లో పోర్చుగీసు వైస్రా య్‌గా నియమించబడ్డాడు. 24- 12- 1524న మరణించాడు. యూరప్‌ నుండి భారత్‌కు సముద్ర మార్గాన్ని కనుగొని భారతావనిలో వలసపాలనకు నాంది పలికాడు గామా.@ భారతీయులం  

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

చరిత్ర లో ఈరోజు may 19,ఐ.ఎన్.ఎస్. వీరబాహు భారతీయ నౌకాదళం లో చేరిన తేది

చరిత్ర లో ఈరోజు may 19
1890: వియత్నాం విప్లయయోధుడు హోచిమన్‌ జన్మదినం.
1894: ప్రముఖ స్ర్తీవాద రచయిత గుడిపాటి వెంకటాచలం జన్మించాడు.
1985: ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య మరణించాడు.
1904: జెంషెడ్ జీ నౌరోజీ టాటా మరణించాడు.
1970 - కోలవెన్ను రామకోటీశ్వరరావు  మరణించాడు,ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు మరియు సంపాదకులు .
1971 : ఐ.ఎన్.ఎస్. వీరబాహు భారతీయ నౌకాదళం లో చేరిన తేది(ఇది జలాంతర్గామి కాదు. ఒడ్డున ఉండే విశాఖపట్నంలోని కార్యాలయం) @ భారతీయులం  

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

వెలయాలివలనఁ గూరిమి...బులు మొలవదు మొలిచెనేని బొదలదు సుమతీ !

వెలయాలివలనఁ గూరిమి
గలుగదు మరి గలిగెనేని కడతేరదుగా
పలువురు నడిచెడి తెరుపునఁ
బులు మొలవదు మొలిచెనేని బొదలదు సుమతీ ! @ భారతీయులం 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

వినదగు నెవ్వరుచెప్పిన.....మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతీ !

వినదగు నెవ్వరుచెప్పిన
వినినంతనె వేగపడక వివరింపదగున్‌
కనికల్ల నిజము దెలిసిన
మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతీ ! @ భారతీయులం 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

మిరపగింజచూడ మీద నల్లగనుండు....విశ్వదాభిరామ వినురవేమ.@ భారతీయులం

మిరపగింజచూడ మీద నల్లగనుండు
గొరికిచూడ లోనజురుకు మనును
సజ్జనులగువారి సారమిట్లుండురా!
విశ్వదాభిరామ వినురవేమ.@ భారతీయులం 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

నిండునదులు పారు నిలచి గంభీరమై....విశ్వదాభిరామ వినురవేమా.

నిండునదులు పారు నిలచి గంభీరమై
వెఱ్రివాగు పారు వేగఁబొర్లి
అల్పుడాడురీతి నధికుండు నాడునా?
విశ్వదాభిరామ వినురవేమా.@ భారతీయులం 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

చరిత్ర లో ఈరోజు may 18,అంతర్జాతీయ వస్తు ప్రదర్శనశాల దినోత్సవం.International Museum Day,World AIDS Vaccine Day,ఆరవ భారత రాష్ట్రపతి, నీలం సంజీవరెడ్డి జన్మించాడు.

చరిత్ర లో ఈరోజు may 18
1830 : కాశీయాత్ర చరిత్ర ఏనుగుల వీరాస్వామయ్య రచించిన కాశీ యాత్ర చరిత్ర విశేషాల మీద సమగ్రమైన రచన. తెలుగులో యాత్రాసాహిత్వానికి ఈ పుస్తకమే ఆద్యమని భావిస్తారు. ఈతని యాత్ర 18 మే, 1830 నుండి 3 సెప్టెంబరు, 1831 వరకు అనగా "15 నెలల 15 రోజుల కాలం" నడిచింది. రచయితగా, విద్వాంసుడుగా, త్యాగమూర్తిగా పేరుమోసిన ఏనుగుల వీరాస్వామయ్య తన వెంట రెండు వందల మందికి యాత్రావకాశం కల్పించాడు.
1877: మొట్టమొదటి తెలుగు విజ్ఞాన సర్వస్వం నిర్మాత కొమర్రాజు వెంకట లక్ష్మణరావు జన్మించాడు.  
1913: ఆరవ భారత రాష్ట్రపతి, నీలం సంజీవరెడ్డి  జన్మించాడు.  
అంతర్జాతీయ వస్తు ప్రదర్శనశాల దినోత్సవం.
The International Museum Day is a celebration that is held each year on or about 18 May.
World AIDS Vaccine Day, also known as HIV Vaccine Awareness Day, is observed annually on May 18.@ భారతీయులం 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

నర్సింగ్ వృత్తి ఉద్యోగం కాదు...@ భారతీయులం

నర్సింగ్ వృత్తి ఉద్యోగం కాదు...@ భారతీయులం 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

చరిత్రలో ఈ రోజు/మే 12: అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ‘నోట్స్‌ ఆఫ్‌ నర్సింగ్‌’ ప్రసిద్ధ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి జన్మించారు. @ భారతీయులం

చరిత్రలో ఈ రోజు/మే 12
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం:మే 12, 1820న ఫ్లొరెన్స్‌ నైటింగేల్‌.. ఇటలీలోని ఫ్లొరె న్స్‌ నగరంలో జన్మించింది. 1853లో లండన్‌ లోని ఓ స్ర్తీల ఆసుపత్రిలో సూపరిం టెండెంట్‌ గా చేరింది. 1854లో క్రిమియా యుద్ధంలో టర్కీలో గాయపడిన సైనికులకు సేవలు చేయ డానికి నర్సుల బృందాన్ని వెంటబెట్టుకొని వె ళ్లింది. నర్సుల వృత్తికే మార్గదర్శకమైన ఆమె సేవలను గురిస్తూ.. చేతిలో.. వెలిగించిన లాం తరు పట్టుకుని ఉన్న ఓ స్ర్తీ బొమ్మను నర్సుకు ప్రతీగా పేర్కొంటున్నాయి చరిత్ర గ్రంథాలు. 1959లో 'నోట్స్‌ ఆఫ్‌ నర్సింగ్‌' అనే పుస్తకాన్ని ప్రచురించింది. ప్రపంచంలోనే తొలి నర్సుల శిక్షణా కళాశాలను స్థాపిం చింది. ఆమె జన్మదినమైన మే 12వ తేదీన 'అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా జరుపు కుంటున్నారు. నైటింగేల్‌ 'లేడ్‌ విత్‌ ద లాంప్‌' అనే బిరుదు పొందింది. ఆగస్ట్‌ 13, 1910న నైటింగేల్‌ మరణించింది.మాతృ దినోత్సవం (మదర్స్‌ డే): 'మదర్‌ ఆఫ్‌ గాడ్స్‌' రియాకు నివాళులర్పించే నేపథ్యం లో ఈ ఉత్సవాన్ని తొలిసారిగా గ్రీసు దేశంలో నిర్వహించారు. 17వ శతాబ్దంలో ఇంగ్లాండ్‌ లో తల్లులకు గౌరవపూర్వకంగా.. 'మదరింగ్‌ సండే' పేరిట ఉత్సవాలు జరిపినట్టు తెలుస్తోం ది. సివిల్‌ వార్‌ గాయాల స్మృతులు చెరిగిపో యేలా చేసేందుకు 'మదర్స్‌ ఫ్రెండ్‌షిప్‌ డే' నిర్వ హించింది జర్విస్‌. 1905లో జర్విస్‌ చనిపో గా.. ఆమె జ్ఞాపకార్ధం.. ఆమె కూతురు అన్నా జర్విస్‌ 'మదర్స్‌ డే' నిర్వహించాలని ప్రచారం చేసింది. 1910లో అమెరికాలోని వర్జీనియా రాష్ట్రం 'మదర్స్‌ డే' గుర్తించిన మొదటి రాష్ట్రం. 1914లో అమెరికా అధ్యక్షుడు ఉడ్రోవిల్సన్‌ 'మదర్స్‌ డే'ను అధికారికంగా గుర్తించాడు. ప్రపంచవ్యాప్తంగా మే నెల రెండవ ఆదివారం నాడు 'మదర్స్‌ డే' జరుపుకుంటున్నారు.1895: ప్రసిద్ధ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి జన్మించారు.@ భారతీయులం  

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

ఏ కారణం చేతనైనా ఒక వ్యక్తి స్రృహ లేని పరిస్థితిలో ఉంటే ఎం చేయాలి ? మీకు DRABCR పద్దతి తెలుసా ? Download free in Telugu & English @ భారతీయులం

ఏ కారణం చేతనైనా ఒక వ్యక్తి స్రృహ లేని పరిస్థితిలో ఉంటే ఎం చేయాలి ?  మీకు DRABCR పద్దతి తెలుసా ?
 
ఏ కారణం చేతనైనా ఒక వ్యక్తి స్రృహ లేని పరిస్థితిలో ఉంటే అతనికి DRABCR పద్దతిని పాటించాలి.
(DRABCR = Danger Response Airway Breathing Circulation Recovery)
1. D అనగా Danger - అతనిని మనకు ప్రమాదాన్నుంచి  తప్పించాలి. ఉదా, అతనిని విషవాయువున్న ప్రదేశాన్నుంచి  తప్పించాలి.
2. R అనగా Response - అతనిని పలుకరించాలి - అతను  పలుకకునప్పుడు
3 . A అనగా Airway  అతని శ్వాస నాళాన్ని సరి చేయాలి. అందుకు 
నొసలు వెనక్కువంచి గడ్డాన్ని పైకి ఎత్తి పట్టాలి. నోరు పరీక్ష చేసిన తర్వాత.
4. B అనగా Breathing శ్వాస ఉన్నది లేనిది గమనించి, శ్వాస      
లేకుంటే కల్పిత శ్వాస  కలిగించాలి. రెండు సార్లు నాల్గు  సెకన్లకు    
 ఒకసారి శ్వాస కలిగించాలి.
5.C. అనగా Circulation అంటే రక్త ప్రసారము కొరకు నాడిని పరీక్షించాలి.  
నాడి తెలియకుంటే గుండె ఆగినట్లు కాబట్టి కార్డియాక్ మసాజ్ చేయాలి.
6.R. అనగా Recovery అతనిని రికవరీ పద్దతిలో పరుండబెట్టాలి.
సాధారణంగా ఈ సందర్బలలో మనిషి  స్రృహ లేకుండా ఉంటాడు.
 1. తలకు దెబ్బ - ప్రధమ చికిత్స DRABCR
2. పక్షవాతము వచ్చినప్పుడు - ప్రధమచికిత్స DRABCR
3. ఫిట్స్ - ప్రధమచికిత్స DRABCR
4. చిన్న పిల్లలు ఫిట్స్ సాధారణముగా చిన్న పిల్లలకు ఫిట్స్ జ్వర తీవ్రత వలన రావచ్చును. ప్రధమచికిత్సలో DRABCR కాక జ్వరమును తగ్గించుటకు తడిగుడ్డతో ఒళ్ళంతా తుడవాలి. (Cold Sponging) అయితే జ్వరం 102ºF వచ్చినట్లయితే తుడవటాన్ని ఆపాలి.
5. వడదెబ్బకు గురైతే DRABCR పద్దతి  అవలంబిస్తు అతనిని చల్లని ప్రదేశాలకు తరలించాలి.
       1. శరీర ఉష్ణోగ్రత తగ్గించేందుకు అతని అవలంబిస్తు  అతని శరీరమంతా తడి గుడ్డతో తుడవాలి .
       2. స్రృహ వచ్చిన తరువాత అతనికి ఉప్పు కలిపిన నీళ్ళు (అనగా ఒక గ్లాసు నీళ్ళల్లో ¼ చంచాడు ఉప్పు కలిపి )  త్రాగించాలి.
6. కళ్లు తిరిగి పడిపోవుట (Fainting)  ప్ర.చి. DRABCR
7. హిస్టీరియా - మానసిక బలహీనత వల్ల తెలిసి, తెలియక స్రృహ కోల్పోవుట.
8. రక్త స్రావమువలన స్రృహ కోల్పోవుట.
9. విషపదార్థములు సేవించినందువలన స్రృహ కోల్పోవుట.
10. గుండె పోటు వలన స్రృహ కోల్పోవుట. తదితర కారణాల వల్ల పై సందర్బాలలో పైన వివరించినట్లుగా  DRABCR పద్దతిని పాటించినట్లయితే రోగికి ఉపశమనం కలుగుతుంది.@ భారతీయులం | www.facebook.com/bharatiyulam

You can Download the File for free: 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

మీరు చాలా సమయం కూర్చొనే పని చేస్తున్నారా? అయితే తగిన వ్యవధిలో విరామాలు తీసుకోవాల్సిందే. ఎందుకంటే నిరంతరం కూర్చోవడం, అస్తవ్యస్థంగా కూర్చోవడం వల్ల 'రిపిటేటివ్‌ స్ట్రెయిన్‌ ఇంజ్యురీస్‌'@ భారతీయులం

మీరు చాలా సమయం కూర్చొనే పని చేస్తున్నారా? అయితే తగిన వ్యవధిలో విరామాలు తీసుకోవాల్సిందే. ఎందుకంటే నిరంతరం కూర్చోవడం, అస్తవ్యస్థంగా కూర్చోవడం వల్ల కళ్లకు ఇబ్బందే కాకుండా 'రిపిటేటివ్‌ స్ట్రెయిన్‌ ఇంజ్యురీస్‌' కలుగుతాయి. రిపిటేటివ్‌ స్ట్రెయిన్‌ ఇంజ్యురీస్‌ అంటే శరీర అవయవాలను అతిగా ఉపయోగించడం వల్ల కలిగే జబ్బు గ్రూపునకు చెందినవి. దీని వల్ల కండరాలు, టెండాన్లు, మెదడులోని నరాలు, నడుం పైభాగం, కింది భాగం, ఛాతి, భుజాలు, చేతులు ప్రభావితం అవుతాయి. చాలా సమయం పనిచేసి మెడ తిప్పడంలో ఇబ్బందిగా ఉన్నా, చేతి వేళ్లు, చేతుల్లో తరచూ నొప్పి కలుగుతున్నా తక్షణం వైద్యసహాయం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చిన్న నొప్పుల్లాగా పెరిగి ఇవి క్రమంగా మన జీవనశైలిపై ప్రభావం చూపుతాయి. రిపిటేటివ్‌ స్ట్రెయిన్‌ ఇంజ్యురీస్‌ లక్షణాలు ఇలా ఉంటాయి. 
35 వేల మందిని సర్వే చేశారు. ఇందులో 75 శాతం మంది రిపిటేటివ్‌ స్ట్రెయిన్‌ ఇంజ్యూరీస్‌తో బాధపడుతున్నవారే ఉన్నారని వెల్లడించారు. రిపిటేటివ్‌ స్ట్రెయిన్‌ ఇంజ్యురీస్‌ వల్ల మెడ, నడుం పైభాగంతో 60 శాతం మంది బాధపడుతున్నారు. నడుం కింది భాగం నొప్పితో 40 శాతం మంది బాధపడుతున్నారు. సర్వే చేసిన 20 శాతం మందిలో ఇవి సాధారణ జబ్బుల్లా మారాయి. నిరంతరం నొప్పి, మొద్దిబారిపోవడం వంటివి వీరిలో కనిపించాయి. అధ్యయనంలో పాల్గొన్నవారి వయసు 27 ఏళ్లు. ఈ సమస్య గుర్తించిన వారిలో చాలా మంది పురుషులే ఉన్నారు. అంతేకాక వీరు రెగ్యులర్‌గా పనిచేసే వారే. ఈ సమస్యలు కేవలం కంప్యూటర్‌పై కూర్చొని ఉద్యోగాలు చేసే వారికే కాదు, చాలా సమయం విరామం లేకుండా కుర్చీలో కూర్చోవడం వల్ల .
సరైన భంగిమలో కూర్చోకపోవడం, విరామాలు లేకుండా కూర్చోవడం, తరచూ పనిచేయడం, పనిచేసే చోట, ఇంట్లో మానసిక ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌, చేస్తున్న ఉద్యోగం పట్ల అసంతృప్తి కూడా దీనికి కారణాలు. ఇలాంటి సమస్యలను టీచర్లు, జర్నలిస్టులు, రేడియో జాకీలు, దంతవైద్యనిపుణులు, నర్సులు, శస్త్రచికిత్స నిపుణులు, మసాజ్‌ చేసేవారు, పిల్లలు, గృహిణుల్లో ఈ వైద్యులు గుర్తించారు. ' అన్ని సంస్థలు పెద్దవి, చిన్నవి కూడా ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలి. అంటే కంప్యూటర్‌ లేదా టేబుల్‌కు వారి ఎత్తుకు సరిపోయేటట్లు కుర్చీ, టేబుల్‌ను అమర్చడం, కూర్చునే భంగిమను నిర్దేశించే శిక్షణ ఇవ్వడం. పని మధ్యలో విరామాలు తీసుకునేలా వారిని ప్రోత్సహించడం చేయాలి' అని శరణ్‌ సూచించారు. 'ప్రతి 5 నిమిషాలకు ఐదు సెకన్లు, ప్రతి 30 నిమిషాలకు రెండు నిమిషాలు తప్పనిసరిగా బ్రేక్‌ తీసుకోవాలని' తెలిపారు. @ భారతీయులం  

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

మృదువైన పెదవుల వల్ల ముఖం మరింత అందంగా కనిపిస్తుంది.....పెదవులు రోజంతా తగినంత తేమతో ఉంటాయి.@ భారతీయులం

మృదువైన పెదవుల వల్ల ముఖం మరింత అందంగా కనిపిస్తుంది.
        నాజూకుగా, మడతలు లేని పెదవుల వల్ల ముఖం మరింత అందంగా కనిపిస్తుంది. చక్కని మాయిశ్చరైజర్‌ వాడకంతో పెదవులు కూడా లేతగా కనిపిస్తాయి. పొడిపొడిగా, పగిలిన గీతతో ఉండే పెదవులకు, జెల్లీ బేస్‌ మాయిశ్చరైజర్‌ లేదా వ్యాజలిన్‌ రాస్తే సరిపోతుంది. నీరు సరిగ్గా తాగకపోవటం వల్ల పెదవులు ఎండిపోయినట్లుగా ఉంటే, వాటికి ఫ్రూట్‌ బేస్‌ లిప్‌ బామ్‌ రాయటం మేలైన పని. పెదవులు నల్లగానూ, ఎప్పుడూ శుష్కతతోనూ ఉంటే నిమ్మరసం, పన్నీరు, గ్లిజరిన్‌లతో ఒకటి రెండు పూతలు, రోజులో రెండు మూడుసార్లు పూయాలి. పెదవులు పగలకుండా ఉండేందుకు, రాత్రి పడుకునేటప్పుడు పెదవులకు, హైడ్రేటింగ్‌ లిప్‌ బామ్‌ రాసుకోవాలి. దీన్ని పగటి పూట రాసుకునే పని లేదు. లిప్‌స్టిక్‌ ఉపయోగించని వారు కూడా లిప్‌ గ్లాస్‌ వాడకం అలవాటు చేసుకోవచ్చు. దీని వల్ల పెదవులు రోజంతా తగినంత తేమతో ఉంటాయి.@ భారతీయులం

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

చరిత్రలో ఈ రోజు/మే 11:జాతీయ వైజ్ఞానిక దినోత్సవం (టెక్నాలజీ డే),మొదటి అణు పరీక్షలు,భారతదేశ జనాభా 100 కోట్లకు చేరింది.

చరిత్రలో ఈ రోజు/మే 11
జాతీయ వైజ్ఞానిక దినోత్సవం (టెక్నాలజీ డే) 1998 మే 11వ తేదీన భారత్‌ రెండవసారి (మొదటి అణు పరీక్షలు మే 18, 1974లో జరిగాయి) రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌ వద్ద అణుపరీక్షలు నిర్వహించింది. అప్పటి నుండి ఈ తేదీన.. జాతీయ వైజ్ఞానిక దినోత్సవం జరుపబడుతుందని భారత ప్రభు త్వం ప్రకటించింది. ఈ అణుపరీక్షలకు 'ఆపరేషన్‌ శక్తి' అని పేరుపెట్టారు. ఈ అణు పరీక్షలతో భారత్‌ అణ్వస్త్ర దేశంగా అవతరించింది.
1961: హైదరాబాదులో ప్రముఖ సమావేశ మందిరం, రవీంద్రభారతి ప్రారంభమైంది.
1784 : టిప్పు సుల్తాను ఇంగ్లాండు తో మైసూరు శాంతి ఒప్పందం చేసుకున్నాడు.  1850: మొదటి సారిగా ఇటుకలతో భవనాలు కట్టడం శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో మొదలైంది.
1929: రోజువారీ టెలివిజన్ ప్రసారాలు మొదటిసారిగా ప్రసారమయ్యాయి (వారానికి 3 రాత్రులు).
1965: భారత దేశంలో, 1965 లో, ఒక్క నెలలోపే వచ్చిన 2 తుఫానులలో, మొదటి తుఫానుకి 35,000 మంది మరణించారు.
1991: కళాభారతి ఆడిటోరియము విశాఖపట్నంలోని పిఠాపురం కాలనీలో ప్రారంభించారు.3 మార్చి 1991 విశాఖపట్నం లో సాంస్కృతిక కార్యక్రమాలకు, సంప్రదాయ కళలకు కాణాచి అయిన కళాభారతి వ్యవస్థాపక దినోత్సవము.
2000: భారతదేశ జనాభా 100 కోట్లకు చేరింది.
1895 :జిడ్డు కృష్ణమూర్తి భారత దేశపు తత్త్వవేత్త (సాంగ్స్ ఆఫ్ లైఫ్) జన్మించాడు.@ భారతీయులం  

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

చరిత్రలో ఈ రోజు/మే 10:తొలి డే/నైట్‌ వన్డే మ్యాచ్‌,మొదటి స్వాతంత్ర్య యుద్ధం మొదలైన రోజు,అపోలో-10 వ్యోమ నౌక,ఎవరెస్టు పర్వతాన్నెక్కిన మొదటి స్త్రీ.@ భారతీయులం

చరిత్రలో ఈ రోజు/మే 10
1981: భారత్‌లో (బొంబాయిలో) తొలి డే/నైట్‌ వన్డే మ్యాచ్‌ జరిగింది.
1857: భారత స్వాతంత్ర్యోద్యమము:ఢిల్లీ దగ్గర ఉన్న మీరట్‌కాజెర్న్ సిపాయిల తిరుగుబాటు తో మొదటి స్వాతంత్ర్య యుద్ధం మొదలైన రోజు.
1857: భారత స్వాతంత్ర్యోద్యమము: 10న 11వ, 20వ అశ్వదళం సమావేశమై అధికారులను ధిక్కరించి 3వ పటాలాన్ని విడిపించారు. మే 11న ఇతర భారతీయులతో కలసి సిపాయిలు ఢిల్లీ చేరుకొని చివరి మొగలు చక్రవర్తి బహదూర్‌షా 2 నివాసమైన ఎర్రకోటని ఆక్రమించి చక్రవర్తిని ఢిల్లీసుల్తాన్ గా తిరిగి అధికారాన్ని స్వీకరించాల్సిందిగా వత్తిడి చేసారు. బహదూర్‌షా మొదట అంగీకరించకపోయినా, తరువాత ఒప్పుకొని తిరుగుబాటుకు నాయకత్వాన్ని వహించాడు.
1969 : అపోలో-10 వ్యోమ నౌక, రోదసీ నుంచి భూమి ఎలా కనిపిస్తోందో చూసి, మొట్టమొదటి సారిగా, రంగుల చిత్రాలను, తీసి పంపింది.
1993: రెండుసార్లు ఎవరెస్టు పర్వతాన్నెక్కిన మొదటి స్త్రీ సంతోషి యాదవ్ రెండోసారి ఎక్కిన రోజు.@ భారతీయులం 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

చరిత్రలో ఈ రోజు/మే 9

చరిత్రలో ఈ రోజు/మే 9
1866: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు గోపాలకృష్ణ గోఖలే జన్మించారు.
1981: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధురాలు దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ మరణించారు.
1986: ఎవరెస్టు పర్వతం ఎక్కిన మొదటి విజేత టెన్సింగ్‌ నార్కే మరణించారు.@ భారతీయులం  

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

౧౯౩౩ 1933 - గాంధీజీ బ్రిటీష్ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ౨౧ 21 రోజులు నిరాహార దీక్ష ప్రారంభించారు.@ భారతీయులం

చరిత్రలో ఈ రోజు/మే 8 :
౧౯౩౩ 1933 - గాంధీజీ బ్రిటీష్ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ౨౧ 21 రోజులు నిరాహార దీక్ష ప్రారంభించారు.
ప్రపంచ రెడ్‌క్రాస్‌ దినోత్సవం (1863: రెడ్‌క్రాస్‌ సంస్థ స్థాపించబడింది)
1973: ఆంధ్రవిశారద తాపీ ధర్మారావు మరణించారు@ భారతీయులం 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

జనం కోసం రోజుకో డాలరుతో బతికాడు.@ భారతీయులం

జనం కోసం రోజుకో డాలరుతో బతికాడు.@ భారతీయులం 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

రిక్షావాలా కూతురికి డాక్టరేట్. కృషి ఉంటే మనుషులు రుషులవుతారు. మహా మహిళలవుతారు.@ భారతీయులం

రిక్షావాలా కూతురికి డాక్టరేట్. కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.
మహా మహిళలవుతారు.@ భారతీయులం 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

వడదెబ్బకు బెదరద్దు...జడవోద్దు..! వడదెబ్బ లక్షణాలు ఇవి...! జాగ్రత్తలు ఇవి...!@ భారతీయులం

వడదెబ్బకు బెదరద్దు...జడవోద్దు..!
వడదెబ్బ లక్షణాలు ఇవి...!
ఉపశమనం ఇలా...!
జాగ్రత్తలు ఇవి...!@ భారతీయులం 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

చరిత్రలో ఈ రోజు/మే 7 - విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ జన్మదినం,అల్లూరి సీతారామరాజు జమేదారు కంచూమీనన్‌చే బంధించబడ్డాడు....@ భారతీయులం

చరిత్రలో ఈ రోజు/మే 7
1861: విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ జన్మదినం
1924: స్వాతంత్ర్య సమర యోధుడు అల్లూరి సీతారామ రాజు మరణించాడు.అల్లూరి సీతారామరాజు జమేదారు కంచూమీనన్‌చే బంధించబడ్డాడు.
1964: ప్రసిద్ద రంగస్థల నటి, గాయని, చలనచిత్ర కళాకారిణి పసుపులేటి కన్నాంబ మరణించారు.
1972: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య మరణించారు.
1983: 7 వ అలీన దేశాల శిఖరాగ్ర సమావేశం ఢిల్లీలో ఇందిరా గాంధీ అద్యక్షతన ప్రారంభం.@ భారతీయులం 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

నేడు ప్రపంచ నవ్వుల దినోత్సవం, మే నెలలో వచ్చే మొదటి ఆదివారం ని ఇలా జరుపుకుంటాం.నవ్వు అనేక రోగాలను దూరం చేసే మంచి టానిక్‌ అని, దీనికి మించిన వ్యాయామం లేదు.@ భారతీయులం

నేడు ప్రపంచ నవ్వుల దినోత్సవం, మే నెలలో వచ్చే మొదటి ఆదివారం ని ఇలా జరుపుకుంటాం.
నవ్వు అనేక రోగాలను దూరం చేసే మంచి టానిక్‌ అని, దీనికి మించిన వ్యాయామం లేదు.శారీరకంగానూ, మానసికంగానూ ఎంతో ఆరోగ్యాన్నిచ్చి, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండేలా చేసేది నవ్వు. నిజానికి ఇది ఒక గొప్ప ఔషధ పువ్వు. ప్రపంచంలో ఎక్కడైనా, ఎవరికైనా ఇది ఇచ్చే ఫలితం మాత్రం మారదు.
నవ్వు శరీరంలోని కొటికోల్‌ అయాన్‌ హార్మోన్లను విడుదల చేస్తుంది. నవ్వు వల్ల ఎండార్సిన్‌ అనే హార్మోన్‌ ఉత్పత్తి అవుతుంది. ఇవన్నీ బాధను మరిపిస్తాయి, అనేక శారీరక, మానసిక రుగ్మతలను దూరంచేసి ప్రశాంతతను ఇవ్వడంలో ఈ హార్మోన్లు ప్రధానపాత్రను పోషిస్తాయి. అంతేకాదు నవ్వు పిరికితనాన్ని కూడా పోగొడుతుంది.
ప్రతి మనిషికీ - ఎక్కడ పుట్టినా, మరెక్కడ పెరిగినా... అర్థం అయ్యే భాష నవ్వు. బహుశా ప్రతి ఒక్కరి నవ్వులోనూ అర్థం కూడా ఒకటే. నవ్వడం మనం నేర్చుకోనక్కరలేని భాష. పుట్టుక నుండే మనకు నవ్వు వస్తుంది. మరో విశేషం ఏంటంటే, నవ్వు మనకు తెలీకుండానే వస్తుంది. వచ్చిన నవ్వును బలవంతంగా మనం ఆపగలమే కానీ, బలవంతంగా నవ్వలేం (ఇప్పుడు చాలా మంది తంటాలుపడి పడీ పడీ నవ్వుతుంటారనుకోండి, రాకపోయినా).@ భారతీయులం | www.facebook.com/bharatiyulam 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

కారణమేదైనా పర్యవసానం ఒక్కటే ..ఒత్తిడి. ఇవిగో కొన్ని సలహాలు...ఒత్తిడి దూరం చేసుకోవాలంటే.@ భారతీయులం

ఒత్తిడి దూరం.
కారణమేదైనా పర్యవసానం ఒక్కటే ..ఒత్తిడి.
ఇవిగో కొన్ని సలహాలు...ఒత్తిడి దూరం చేసుకోవాలంటే.@ భారతీయులం | www.facebook.com/bharatiyulam 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

అల్పుడెపుడు పల్కు నాడంబరముగాను...విశ్వదాభిరామ వినురవేమ.@ భారతీయులం

అల్పుడెపుడు పల్కు నాడంబరముగాను
సజ్జనుండుఁ బల్కుఁ జల్లగాను
కంచుమ్రోగునట్లు కనకంబు మ్రోగునా
విశ్వదాభిరామ వినురవేమ.

తాత్పర్యము : నీచుడు డంబములు చెప్పుచుండును. మంచివారు మెల్లగా మాటలాడుచుందురు. తక్కువ ఖరీదైన లోహము అయిన కంచు దడదడమని మ్రోగునట్లు, యెక్కువ ఖరీదైన బంగారము అను లోహము మ్రోగదుకదా.
@ భారతీయులం | www.facebook.com/bharatiyulam 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

మీ ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ చేస్తున్నారా ? చాల మిగిలిపోయి ఉంటాయి కదా. ! వృధాగా పడేసే బదులు వేరొకరికి కడుపు నింపండి.@ భారతీయులం

మీ ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ చేస్తున్నారా ? చాల మిగిలిపోయి ఉంటాయి కదా. !
వృధాగా పడేసే బదులు వేరొకరికి కడుపు నింపండి.
ఇదిగో ఈ ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి.
ర్హీద్. 9948203208 @ భారతీయులం | www.facebook.com/bharatiyulam 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

రక్తపోటు (బిపి):రక్తం గుండె నుండి రక్త నాళాల లోనికి వేగంగా వత్తిడితో ప్రవహిస్తుంది.అధిక రక్తపోటు,అధిక రక్తపోటు లక్షణాలు;లో - బిపి,లోబిపి లక్షణాలు@ భారతీయులం

రక్తపోటు (బిపి):
గుండె అనుక్షణము సంకోచ, వ్యాకోచాలు చేస్తూ రక్తాన్ని శరీర భాగాలకు సరఫరా చేస్తుంటుంది.ఇలా సంకోచించినప్పుడు (కుచించుకొన్నప్పుడు) రక్తం గుండె నుండి రక్త నాళాల లోనికి వేగంగా వత్తిడితో ప్రవహిస్తుంది.ఈ వత్తిడిని సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ (Systolic Blood pressure) అని అంటారు.

గుండె మరల వ్యాకోచించి సాధారణ స్ధితికి వచ్చినప్ఫుడు,రక్తనాళాలలో వున్న వత్తిడిని డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అని అంటారు.ఈ రక్త పోటును గాజు గొట్టము లోని పాదరసపు మిల్లీ మీటర్లలో కొలుస్తారు.

సాధారణంగా ఆరోగ్యవంతుల రక్త పోటు సిస్టోలిక్ ప్రెషర్ 90 నుండి 120 మి.మీ గాను,డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ 60 నుండి 80 మి.మీ గాను నమోదు కావచ్చు.

అయితే ఈ బి.పి మనిషి నుండి మనిషికి వయస్సు పెరుగుతున్నకొద్దీ మార్పు చెందుతుంది.

అలాగే సాధారణ వ్యక్తిలో రక్తపోటు ఉదయం నుండి సాయంత్రానికి కొన్ని మార్పులు చెందుతుంటుంది.మానసిక వత్తిడులు కూడా బి.పి ని ప్రభావితం చేస్తాయి.

అధిక రక్తపోటు:
అసాధారణంగా రక్త పోటు 130/90 మి.మీ.అంతకన్నా అధికంగా వున్నప్ఫుడు ఎక్కువ రక్తపోటు (హైపర్ టెన్షన్) అని అంటారు.

120/80 నుండి 139/89 మి.మీ స్ధాయిని అధిక రక్తపోటు ముందు స్ధాయిగాను, 140/90 మి.మీ.స్ధాయిని అధిక రక్త పోటుగాను గుర్తించాలి.

అధిక రక్తపోటు లక్షణాలు: -
తలనొప్పి.
తల తిరుగుతున్నట్లు, తూలుతున్నట్లు అనిపించడం.
కూర్చున్న స్ధితి నుండి నిలుచోగానే కళ్ళు బైర్లు కమ్మడం.
సాధారణంగా శ్వాస తీసుకోలేకపోవడం.

లో - బిపి:
సాధారణంగా ఉండవలసిన రక్త పోటు (బి.పి) కన్నా తక్కువ స్ధాయిలో బి.పి ఉండటాన్ని లోబిపి అంటారు.వైద్యభాషలో దీనినే హైపోటెస్షన్ అని అంటారు.దీని వలన ప్రధాన అవయవాలైన గుండె,మెదడు,మూత్రపిండాలకు,ప్రాణ వాయువు (ఆక్సిజన్) ఆహారము సరఫరా తగు పాళ్ళలో జరగదు.

సాధారణంగా కొందరిలో 90/60 మి.మీ. ఉన్నప్పటికి ఆరోగ్యంగానే వుంటారు.కాని బి.పి.సుమారు 160/90 ఉండి, 110/70 కి తగ్గితే అది లోబిపి గా పరిగణించాలి.బిపి రీడింగ్ లో తేడా 40 మి.మీ. కు మించింది  అంటే అది లోబిపి గా పరిగణించాలి.

లోబిపి లక్షణాలు : -
నీరసం,అలసట.
మానసికంగా కృంగిపోవుట.
సరిగ నిద్ర లేక పోవుట.
తలనొప్పి.
గుండె వేగంగా పని చేయుట.
నాడి అధికంగా వుండుట.
కళ్ళు బైర్లు కమ్ముట.
కళ్ళు తిరుగుట.
శరీరం పాలి పోవుట.
అరికాళ్ళు,అరిచేతులు చల్లగా వుండి చెమటలు పట్టుట.
ఛాతి నొప్పి.
కొన్ని సందర్భాలలో గుండె పోటు వచ్చే అవకాశం వుంది.
మూత్ర పిండాలు సరిగా పనిచేయక పోవడం వలన యూరియా,క్రియాటినిక్ లాంటి పదార్ధాలు రక్తములో అధికమై ప్రాణాపాయం కలిగిస్తాయి.
ప్రమాదకరమైన లోబిపి లో షాక్ వచ్చి ప్రాణాపాయం కావచ్చు.@ భారతీయులం | www.facebook.com/bharatiyulam 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

భారతీయులం |bharatiyulam, bharatiyulam.blogspot.com
Related Posts Plugin for WordPress, Blogger...